Telugu Politics

వైసీపీ మేనిఫెస్టో విడుదల

సీఎం జగన్ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసారు. 2019లో ఇచ్చిన హామీలను నిష్టగా అమలు చేసామని చెప్పారు. అయితే ప్రస్తుతం అమలు చేసేవే చెబుతున్నామని..చెబితే ఖచ్చితంగా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మరో సారి తన మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. కీలక హామీలు ప్రకటించారు.

* వైస్సార్‌ రైతు భరోసా రూ.16 వేలు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు

* అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి ఇంటి పట్టాలు అందిస్తా

* వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం

* లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10లక్షల వరకు ప్రమాద బీమా

* వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కొనసాగింపు

* అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు

* పెన్షన్ 2029 ఏడాది నాటికి రూ.3500 పెంపు

* అమ్మఒడిని రూ.17,000లకు పెంపు

* నాలుగు దఫాల్లో వైఎస్సార్ చేయూత పథకాన్ని రూ.75 వేల నుంచి రూ.లక్షా 50వేలకు పెంపు.

* కాపునేస్తం పథకాన్ని రూ.60వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు.

* పింఛన్ రూ.3500కు పెంపు.

* అలాగే రూ.లక్షా 70వేల ఈబీసీ నేస్తం సాయాన్ని ప్రకటించారు.

* ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్

Show More
Back to top button