Telugu News

మరో గజనీమహ్మద్.. ఈ రంజితశర్మ

చిన్నప్పుడు స్కూళ్లో గజనీ మహ్మద్ గురించి చదివే ఉంటారు. 17సార్లు దండయాత్ర చేసి ఓడినా.. వెనుదిరగకుండా 18వ సారి కూడా ప్రయత్నించి విజయం సాధించాడు. అచ్చం అలాగే.. లక్ష్యాన్ని చేరుకుందో యువతి. ఆమె పేరే.. రంజితశర్మ. హరియాణాలోని ఫరీదాబాద్‌ జిల్లా ధైనా గ్రామం సతీశ్‌కుమార్‌ శర్మ-సవిత దంపతుల కుమార్తె. తండ్రి చిరు వ్యాపారి.. అయినా.. తానిప్పుడు ఈ స్థానంలో ఉండటానికి కారణం తన తండ్రే అని చెబుతోంది. ఇంతకీ ఈ రంజితశర్మ ఏం సాధించింది..? ఆమె కథేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

పీజీ పూర్తయ్యాక కుటుంబ పోషణ కోసం 8ఏళ్ల పాటు ప్రైవేట్‌ కంపెనీల్లో పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా చేశా. కానీ మ‌దిలో ఏదో అసంతృప్తి ఉండేది. ప్రజలకేదో చేయాలనిపించేది. ప్రైవేట్‌ ఉద్యోగాలతో అది సాధ్యం కాదనిపించేది.

నాన్నే.. సివిల్స్ఎంచుకోమన్నారు

నా అసంత‌ృప్తిని నాన్న దగ్గర వ్యక్తం చేస్తే.. సివిల్స్‌ ఎంచుకోమన్నారు. జాబ్ వదిలేసి ఉత్సాహంతో సివిల్స్ వైపు అడుగులేశా. కానీ, నేను అనుకున్నంత ఈజీగా సివిల్స్ ఛేదించలేమని అర్థమైంది. ఒకటి, రెండుసార్లు కాదు.. ఏకంగా ఆరు సార్లు ఓటమి ఎదురైంది. అయినా నిరుత్సాహపడలేదు.

విజయమే ఊపిరిగా.. ఉద్యోగ మాల వేసినట్టు ప్రిపేర్ అయ్యాను.

మ‌న లక్ష్యంపై మనకు స్పష్టత ఉంటే సివిల్స్‌ సాధించడం కష్టమైన పని కాదనే నమ్మకం వచ్చింది.

చివరికి ఏడో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 130వ ర్యాంకు సాధించా. ఆ తర్వాత IPSని ఎంచుకున్నా.

దీంతో అప్పటివరకు పడ్డ కష్టానికి ఈ విజయం చెప్పలేనంత సంతోషాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నేను జోధ్‌పూర్‌లో అసిస్టెంట్ ఎస్పి సెంట్రల్ సర్కిల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పుస్తకాలకు అతుక్కుపోవాల్సిన పని లేదు పోటీ పరీక్షలపై స్పష్టత లేకుండా, గాలివాటంలా ప్రయత్నిస్తే లాభం ఉండదు. ముందు మీకు ఏ లక్ష్యం ఉందో నిర్ణయించుకోండి. దాన్ని బట్టి ప్రణాళిక వేసుకోండి. ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నం చేసినా విజయం రాకపోవచ్చు.

అలాగని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా యూట్యూబ్‌ వీడియోలు, సినిమా వ్యామోహంలో పడి కాలాన్ని వృథా చేసుకోవద్దు.

రెండు రోజులు చదివి విశ్రాంతి తీసుకుంటానంటే కుదరదు. అలాగని రోజంతా పుస్తకాలకు అతుక్కుపోవాల్సిన పని లేదు.

పక్కా ప్రణాళికతో క్రమం తప్పకుండా ప్రిపరేషన్‌ కొనసాగేలా చూసుకోవాలి. ప్రిపరేషన్‌ సమయంలో ఫోకస్‌ దారి తప్పకుండా చూసుకోవాలి.

మాక్ టెస్టులు రాయడం మాత్రం మర్చిపోవద్దు. వాటి ద్వారానే మీ బలాలు, బలహీనతలు తెలుస్తాయి.

Show More
Back to top button