Telugu Politics
Trending

వైసీపీకి మరోసారి అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేయడం ఖాయం: టీడీపీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే రాష్ట్రాన్ని అధఃపాతాళానికి  నెట్టేసినట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా అప్పులు తేవడం సహజం. కానీ ఇంతలా ఘోరాతి, ఘోరంగా సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తేవడం అత్యంత దారుణం. ఈ విధంగా అప్పులు తేవడం ఎక్కడా, ఎన్నడూ చూడలేదని ఆర్థిక నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. జగన్ తన ఆర్థిక అరాచకత్వాన్ని విశృంఖలంగా ప్రదర్శించారు. 

అనధికారంగా అప్పులు తెచ్చేందుకు రెవెన్యూ రాబడిలో 90 శాతం వున్నగ్యారంటీల నిబంధనను 180 శాతానికి పెంచారు.కొత్త, కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఆర్బీఐ నుంచి తెచ్చే వేల కోట్లు అప్పులు కాకుండా కార్పొరేషన్లు, బ్యాంకుల నుంచి తెచ్చుకున్న అప్పులు కూడా సరిపోక చివరికి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి రూ.370 కోట్ల అప్పు తేవడం జగన్ దిగజారుడు పరిపాలనకు నిదర్శనం అంటున్నారు.

ఒక రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చి పాలన చేస్తున్న రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారా? ఏకంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారన్న వార్త విన్న ప్రజలు షాక్ గురి అయ్యారు అవుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరోసారి అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మెయ్యడం ఖాయమని అని కూడా అంటున్నారు. 

ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంక వలే ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకోబోతుందని ప్రతిపక్షాలు, మీడియా, ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తే ఎదురు దాడి చేసిన సీఎం, వైసీపీ నాయకులు సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడం పై ఏం సమాధానం చెబుతారు? అని టీడీపీ నాయకులు అంటున్నారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కానీ పాలనా భవనాలను మాత్రం తాకట్టు పెట్టలేదు. రాష్ట్రాన్ని 1956 నుండి అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు.

కానీ ఏ ముఖ్యమంత్రి ఇంత బరితెగించి సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన దాఖలాలు లేవు. అమరావతి పైకాల కూట విషం విరజిమ్మిన జగన్ రెడ్డి అమరావతిలో నిర్మించిన సచివాలయాన్ని ఎలా తాకట్టు పెడతారు? ఒకవేళ అంత అవసరం ఉంటే జగన్మోహన్ రెడ్డి తానూ నిర్మించుకున్న అనేక రాజప్రసాదాలను తాకట్టు పెట్టవచ్చు కదా అని కూడా అడుగుతున్నారు. 

ఒక ప్రక్కన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పడిపోతుంటే, మరో పక్క జగన్ ఆదాయం ఎందుకు పెరుగుతుందో ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలి. దీనిపై రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని, త్వరలో సీఎం జగన్‌కి ఓటు ద్వారా బుద్ది చెబుతారని టీడీపీ నాయకులు అంటున్నారు.

Show More
Back to top button