Telugu News

CROCS విజయం వెనకాల ఓ విషాద గాథ..!

మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఫుట్ బిజినెస్‌లో రాణించిన కంపెనీ ఏదైన ఉందంటే.. క్రాక్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే ఇంట్లో ఒకరైన ఈ బ్రాండ్ ఫుట్‌వేర్‌ వాడుతున్నారు. ఇది ఇంతల ఎలా విజయం సాధించింది..? చూడడానికి బాగొలేకపోయినా..? ఇంతలా ఎలా అమ్ముడు పోయింది..? దీని క్రేజ్ రోజు రోజుకు ఎలా పెరిగింది..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కథ ఒక విషాదంతో ప్రారంభమైంది. అది 2002 సంవత్సరంలో ప్రారంభం అయిన కథ. అప్పుడు లెండన్ అనే వ్యక్తి తన ఉద్యోగం కోల్పోయి, భార్యతో విడాకులు తీసుకుని ఉన్న సమయంలో తన తల్లి కూడా మరణించింది. వింటుంటే ప్రపంచంలోని విషాదం అంత తన దగ్గరనే ఉన్నట్టు ఉంది కదా..? ఇలాంటి సమయంలో తనకు ఊరట కల్గించాలనే ఉద్దేశంతో తన చిన్ననాటి స్నేహితులైన జార్జ్, స్కాట్ లు లెండన్‌ను షిప్‌లో అలా సముద్రంలోకి తీసుకెళ్లారు. అయితే, స్కాట్ ఒక ఇన్వెంటర్. అంటే తను పరిశోధనలు చేసి వస్తువులను తయారు చేసి వాటి మీద పేటెంట్ తీసుకుంటాడు. అలాగే జార్జ్ ఒక చిరు వ్యాపారవేత్త. ఈ సమయంలో స్కాట్‌కి వచ్చిన ఆలోచననే క్రాక్స్‌.

 క్రాక్స్ చూడడానికి అంత బాగోవు.. మరి ప్రజలు వీటిని ఎలా తీసుకుంటారు..? అని  జార్జ్, లెండ్ అడిగిన ప్రశ్నకు ‘వాటిని ధరించి చెప్పు ఎలా ఉన్నాయో’ అని సమాధానం ఇచ్చాడు స్కాట్. తన మాటలు విని ఆ ఇద్దరు అలానే క్రాక్స్ ను ధరించారు. అవి చాలా సౌకర్యంగా ఉండటంతో వాటిని తయారు చేసి వ్యాపారం చేస్తే లాభాలు వస్తుందనే నమ్మకం వారికి వచ్చింది. దీంతో ఈ ప్రదేశంలో జరగనున్న ఫెస్ట్‌లో వాటిని ప్రజలకు చూపించి అమ్మారు. ప్రజలు వాటిని ధరించాక కలిగిన సౌకర్యానికి.. ఇవి వాళ్లకు నచ్చాయి. దీంతో ఆ ఒక్కరోజే 200 క్రాక్స్‌ జతలు అమ్ముడు పోయాయి. ఇంతేకాదు, ఆ తర్వాత కేవలం ఒక సంవత్సరంలో అంటే 2002 నుంచి 2003 సంవత్సరం నాటికి 80 వేల క్రాక్స్ జతలను అమ్మగలిగారు. అతి తక్కువ సమయంలోనే వీరు ఇంత లాభాలు పొందడానికి కారణం కేవలం క్రాక్స్ ఇచ్చే సౌకర్యం. దీనివల్ల ఈ బ్రాండ్ అమెరికా మొత్తం విస్తరించింది. 2006లో ఇది స్టాక్ మార్కెట్‌లో 239 మిలియన్ డాలర్ వాల్యుయేషన్‌తో లిస్ట్ అయింది. అది 2007 నాటికి ఒక బిలియన్ డాలర్  వాల్యుయేషన్‌‌ని సాధించింది.

కంపెనీ లాభాల్లో సాగుతున్న సమయంలో క్రాక్స్ ఫౌండర్‌లలో ఒకరైన జార్జ్ ‌పైనా తన మేనల్లుడు హత్యప్రయత్నం చేశాడని కేస్ పెట్టాడు. దీంతోపాటు జార్జ్ అప్పటికే తాగి వాహనం నడిపించి.. యాక్సిడెంట్ చేయడం, రోడ్ల మీద వింతగా ప్రవర్తించడం చేశాడు. దీంతో క్రాక్స్ కంపెనీ మీద తీవ్ర ప్రభావం పడింది. దీంతో తనను పదవీ నుంచి తొలగించి లెండన్ స్నేహితుడైన రాన్ సైడర్‌ని సిఈఓగా ప్రకటించింది క్రాక్స్ కంపెనీ. అప్పటి వరకు కేవలం రెండు రకాలుగా ఉన్న క్రాక్స్ షూ మోడల్స్‌లను.. 250 రకాలుగా తీసుకువచ్చి వ్యాపారాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లాడు. ఇది కూడా ఎక్కువ రోజులు నిలవలేదు.

2008లో వచ్చిన రేసిషన్ గురించి అందరికీ తెల్సిందే. ఆ సమయంలో కొనుగోలు శక్తి లేక ప్రజలు క్రాక్స్ కొనడం తగ్గించారు. దీంతో కంపెనీకి లాభాలు తగ్గాయి. దీనికి తోడు ఇటాలియన్ కంపెనీ అయిన సెలెక్ట్ కంపెనీ క్రాక్స్ షూ ముందుగా తయారు చేసింది తాము అని.. అది క్రాక్స్ కంపెనీ కాపీ కొట్టిందని కేసు వేసింది. బిలియన్ డాలర్ వ్యాపారం చేరుకున్న క్రాక్స్ కంపెనీ కాపీ కొట్టిందని తెలుసుకున్న ప్రజలు ఆ కంపెనీ షేర్లను అమ్మడం ప్రారంభించారు. దీంతో 68 డాలర్‌గా ఉన్న కంపెనీ షేర్ 1 డాలర్‌గా మారింది. ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు ఈ కంపెనీ నిలబడడానికి ఎంతో కష్టపడింది. పెద్ద సెలబ్రెటిలతో ప్రకటనలు ఇప్పించి, క్రాక్స్ కేవలం షూస్ మాత్రమే కాదు. అవి యాటిట్యూడ్‌కి నిదర్శనం అని ప్రకటనలు ఇవ్వడంతో మళ్లీ కంపెనీ లాభాలు పుంజుకుంది. ప్రస్తుతం దీన్ని క్యాపిటలైజేషన్ 5.73 బిలియన్ డాలర్‌గా ఉంది. ఇదండి క్రాక్స్ కంపెనీ విజయ కథ. 

Show More
Back to top button