
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. విద్యార్థులు పాఠశాలల్లోకి ఫోన్లు తేవడాన్ని నిషేధించిన ప్రభుత్వం..
ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా తరగతి గదుల్లోకి మొబైల్స్ తీసుకురావొద్దని ఆదేశాలు జారీ చేసింది.
టీచర్లు తమ ఫోన్లను ప్రిన్సిపల్స్కి అప్పగించాలని సూచించింది.
ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కూడా ఫోన్ల వాడకంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.