CINEMATelugu Cinema

భార‌తీయుడు 2 రివ్యూ..! శంక‌ర్ మార్కు ఎలా ఉంది?

ఎట్ట‌కేల‌కు భార‌తీయుడు 2 సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. కమల్ హాసన్, సిద్దార్థ్, సముద్రఖని, బాబీ సింహా, ఎస్ జే సూర్య, రకుల్ ప్రీత్, ప్రియా భవానీ శంకర్ ఇలా భారీ తారాగణంతో శంకర్ తీసిన భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2. ఈ మూవీని లైకా, రెడ్ జెయింట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. సినిమాని ప్ర‌క‌టించిన రోజు నుంచే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి, అంచ‌నాలు రేకెత్తించిన ఈ చిత్రం ఎలా ఉంది? రెండోసారి సేనాపతి దేని కోసం పోరాటం చేశాడో తెలుసుకుందాం.

కథ ఏంటంటే..

అరవింద్ (సిద్దార్థ్) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియా వేదిక అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు. ఒక త‌ప్పు చేసినా దాన్నుంచి త‌ప్పించుకోలేమ‌న్న భ‌యం రావాల‌ని, అందుకు భార‌తీయుడు అలియాస్‌ సేనాపతి (క‌మ‌ల్‌హాస‌న్‌) రావాల్సిందేనని అనుకుంటారు. అరవింద్ తండ్రి వరదరాజన్ (సముద్రఖని) అవినీతి నిరోధక శాఖలో పని చేస్తుంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదురించాలని అరవింద్ ఆరాటపడుతుంటాడు. కానీ తిరిగి అరవింద్‌కే సమస్యలు వస్తాయి.

అరవింద్ అండ్ గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చివరకు ఈ అవినీతిని అరికట్టాలంటే ఇండియన్ (కమల్ హాసన్) రావాల్సిందే అని ఈ నలుగురూ కలిసి కమ్ బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తారు. చివరకు సేనాపతి (కమల్ హాసన్) రంగంలోకి దిగుతాడు. తిరిగొచ్చిన తర్వాత ఆయ‌న స‌మాజంలో కుళ్లుని క‌డిగేయ‌డం కోసం ఏం చేశాడు? ఆ క్ర‌మంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లేమిటి? ఆయ‌న కోసం కాపు కాసిన సీబీఐ అధికారి ప్ర‌మోద్ (బాబీ సింహా) భార‌తీయుడిని అరెస్ట్ చేశాడా?  త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

ఈ మూవీలో శంకర్ స్థాయిలో గ్రాండియర్, ఆ విజువల్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ప్రధానమైన ఎమోషన్, ఆ కనెక్టివిటీ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది. లంచగొండితనం, అవినీతి అనేవి ఇప్పుడు చాలా రొటీన్‌గా మారాయి. వాటిని తెరపై అంత ఆసక్తిగా చూపించలేదనిపిస్తుంది. మూడు గంటల సేపు ఆడియెన్స్‌ను థియేటర్లో కూర్చోబెట్టాలంటే ఇలాంటి కథ, కథనం సరిపోదనిపిస్తుంది. పెద్దగా మ్యాజిక్‌ను చూపించలేకపోయాడు. భావోద్వేగాలూ పండ‌లేదు. ప‌తాక స‌న్నివేశాల్లో మూడో భాగం అంటూ చూపించిన కొన్ని స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.

బ‌లాలు

+ క‌మ‌ల్‌హాస‌న్ న‌ట‌న

బ‌ల‌హీన‌త‌లు

– క‌థ‌, క‌థ‌నం

– పండ‌ని ఎమోషన్

– సంగీతం

* రేటింగ్: 3.5/5

గమనిక: ఈ రివ్వూ… ఓ ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే.

Show More
Back to top button