HEALTH & LIFESTYLE

భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగొద్దు.. ఎందుకో తెలుసా?

మనం రోజూ చేసే పనులు కొన్ని ఆరోగ్యాన్ని హాని కలిగిస్తాయి. అందరూ చేస్తున్నారుగా అన్నట్లుగా మనం చూసి చూడనట్లుగా ఉంటాం. అన్నం తినేటప్పుడు నీళ్లు తాగడం మంచిది కాదు. తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ కలవాలి. ఈ యాసిడ్ బాత్రూం క్లీన్ చేయడానికి వాడే యాసిడ్ అంత ఘాటుగా ఉంటుంది. కడుపు కొన్ని ఎంజమ్స్, జిగురు పదార్థాలు విడుదలై ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌‌తో కలిసి ఘాఢతను తగ్గించి 0.8-1.2  మధ్య ఉండేట్లు చేస్తుంది.

మన జీర్ణాశయంలో PH విలువ 1.2 నుంచి 1.5 ఉన్న యాసిడ్ తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం, ఆహారంతో లోనికి ప్రవేశించిన క్రిముల్ని చంపి, జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. తినేటప్పుడు పావు లీటర్ నీళ్లు తాగితే జీర్ణక్రియ 20 నిమిషాలు ఆగిపోతుందని సైంటిఫిక్‌గా నిర్థారించబడింది.

భోజనం చేసేప్పుడు నీళ్లు తాగడం వల్ల ఆ యాసిడ్ ఘాడత మరింత తగ్గుతుంది. పొట్టలో వాటర్ కలిసిన యాసిడ్ PH విలువ 1.5 నుంచి 2.5 దాకా పెరిగితే యాసిడ్ ఘాడత తగ్గుతుంది. యాసిడ్ ఘాడత తగ్గే కొద్ది జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. పలుచబడ్డ యాసిడ్‌ను బ్యాలెన్స్ చేయడానికి 20 నిమిషాల టైం పడుతుంది. అయితే ఏంటి.. 20 నిమిషాలు లేట్ అంతే కదా అనుకుంటున్నారేమో..

యాసిడ్ ప్రొటెక్షన్ ఎక్కువయ్యేకొద్ది.. మీకు పొట్టలో ఇరిటేషన్ ఎక్కువై అల్సర్లు, యాసిడ్ రిఫక్స్ వచ్చి, తిన్న తర్వాత అసౌకర్యంగా ఉంటుంది. అందుకని నీళ్లు ఎక్కువ తాగటం మంచిది కాదు. వెళ్లిన ఆహారం డైజెషన్ ప్రాసెస్‌లో పడకపోతే.. పులుస్తుంది. దానివల్ల గ్యాస్, తేన్పులు వస్తాయి. నీళ్లు తాగే అవసరం రాకూడదంటే నెమ్మదిగా కొంచెం కొంచె బాగా నమిలి తినాలి.

Show More
Back to top button