
ఈ కాలంలో సీజన్ ఫ్రూట్ ద్రాక్ష ప్రస్తుత పరిస్థితుల్లో ద్రాక్షపండ్లు తినడం మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. జీర్ణవ్యవస్థతో పాటు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలను రాకుండా దాక్షపండ్లు ఉపయోగపడతాయి. ఒకవేళ నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అదేవిధంగా మానసిక కార్యకలాపాలను నయం చేసుకోవచ్చు. మైగ్రేన్ వంటి వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు.
కొంతమంది శాస్త్రవేత్తలు కొందరికి మూడు పూటలా 2వారాల పాటు ద్రాక్షపళ్లను ఆహారంగా ఇచ్చి పరిశీలించారు. వారి చర్మం అనేక సమస్యల నుంచి కోలుకున్నట్టు పరిశోధనలో వెల్లడయ్యింది. ద్రాక్ష పండ్లను తిన్న వారిలో సూర్యుడి నుంచి విడుదలైన UV కిరణాలు ప్రభావాన్ని తగ్గిస్తాయని రుజువైంది.
ద్రాక్షపండ్లల్లో అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణ కలిగించే ఫైటో కెమికల్స్‌తో పాటు రెస్వెరాట్రాల్ అనే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పని చేసి, చర్మానికి రక్షణ కల్పిస్తుంది. చర్మరక్షణతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ద్రాక్షపండ్లు తినడం వల్ల పొందవచ్చు. ప్రతి రోజు గ్రేప్స్ తింటే ఎండ వల్ల కందిన చర్మం త్వరగా మాములు స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.