మారిన జీవనశైలి వల్ల ఈరోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య దుర్వాసన. ఈ సమస్య ఉన్నవారు మాట్లాడితే ఎదుటి వారికి ఇబ్బందిగా ఉంటుంది. అసాధారణమైన ఈ నోటి దుర్వాసనకు కారణాలు అనేకం. అసలు నోటి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలను తెలుసుకుందాం.
దంతాల చిగుళ్ల పై ఏర్పడిన బాక్టీరియా విడుదల చేయడమే దీనికి కారణం. పొగ తాగడం, వెల్లుల్లు, ఉల్లి తిన్నప్పుడు ఈ సమస్య ఎక్కువ. అంతేకాకుండా ఉదర సంబంధ వ్యాధులు ఉన్నవారికి ఈ సమస్య ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా ఆహారం తిన్నప్పుడు నోటిని శుభ్రం చేసుకోకపోతే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. అంతేకాదు మసాలా ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య వస్తున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ఈ సమస్య నివారణకు ముఖ్యంగా రోజుకు రెండుసార్లు బ్రేష్ చేయడం, ఆహార పదార్థాలను తీసుకున్న తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవడం చేస్తే ఫలితం ఉంటుంది. దీంతోపాటు రోజూ నాలుగు తులసి ఆకులు గాని, పొదీన ఆకుల గాని తింటే..నోటి దుర్వాసన మీ దరికి కూడా చేరదు.
ధూమపానం గుట్కా వాటికి దూరంగా ఉండటం చాలా మేలు.. మరీ ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్ ఉన్న పోషకాలు తృణధాన్యాలు, పండ్లు, క్యారెట్లు, పుచ్చకాయలు, సిట్రస్ ఆహారాలు తినాలి. త్వరగా ఆహారం జీర్ణమయ్యే ఫైబర్ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా మౌత్ వాష్‌లు వాడడం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు.