HEALTH & LIFESTYLE

జామలో దాగి ఉన్న ఆరోగ్యం

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేది జామపండు. కమల, ఉసిరి కన్నా అధికంగా సి-విటమిన్ జామలో ఉంటుంది. ఇందులో ఉండే కాపర్, ఇతర మినరల్స్.. థైరాయిడ్, జీవక్రియలను క్రమబద్ధం చేయడంతో పాటు హార్మోన్ల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. జామకాయ బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్(కండరం) ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఉండే పోషకాలు సంతానోత్పత్తిని పెంచే హార్మోన్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. షుగర్ పేషెంట్స్ తప్పక తినవలసిన పండ్ల లిస్ట్‌లో జామ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది షుగర్ వ్యాధికి ఔషధం లాంటిది. కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం చేసే పెక్టిన్ ఈ జామలో ఉంటుంది.

జామకాయలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తినడం మంచిది. ఇందులో కెరోటినాయిడ్స్, ఐసోఫావో, పాలి ఫినాల్స్ మెదడు కణాలు చురుగ్గా పనిచేయడానికి తోడ్పడతాయి. బాగా పండిన జామ పండుపై మిరియాల పొడిని చేర్చి, నిమ్మ రసం పిండి తింటే మలబద్ధకం రాదు. రుతుస్రావ సమస్యలు దూరం చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో, గుండె పనితీరును మెరుగుపరచడంలో, స్కర్వీ వ్యాధి దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. వృద్ధాప్య ఛాయలను అరికట్టడంలో కూడా జామ పండు ఉపయోగపడుతుంది. ఈ పండు తింటే చర్మ సౌందర్యానికి, మొటిమలు తగ్గిపోతాయి.అయితే, జామకాయ తింటే జలుబు చేస్తుందని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ, జామ.. జలుబుకు మంచి విరుగుడు.  

Show More
Back to top button