సెన్సేషనల్ డైరక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ ఈరోజు(జనవరి 10) విడుదలైంది. RRR సినిమా బ్లాక్‌బస్టర్ తర్వాత మూడేళ్ల విరామం తీసుకున్న చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో హిట్ కొట్టాడా? డైరెక్టర్‌గా శంకర్ కమ్ బ్యాక్ ఇచ్చాడా? అనేది తెలియాలింటే మూవీ రివ్యూ చూసేయాల్సిందే.
కథ
అభ్యుదయం పార్టీ పేరిట ప్రస్తుత ఏపీలో బొబ్బిలి సత్య మూర్తి(శ్రీకాంత్) ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవి(ఎస్ జే సూర్య) కి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీ పై కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్‌గా రామ్ నందన్(రామ్ చరణ్) వస్తాడు. మరి తనకి మోపిదేవికి జరిగిన యుద్ధం ఏంటి? తర్వాత ఏమైందనేదే కథ నేపథ్యం ఉంటుంది.
ప్లస్ పాయింట్స్
సినిమాలో రామ్ చరణ్, ఎస్ జే సూర్య యాక్టింగ్ ప్లస్ పాయింట్స్‌గా చెప్పవచ్చు. దీంతోపాటు ఎలివేషన్స్, కొన్ని ట్విస్ట్ బాగా ఎగ్జైట్ చేస్తాయి. శంకర్ మార్క్ కొన్ని కొత్త ఆలోచనలు, తన పొలిటికల్ రిలేటెడ్ సినిమాల్లో కనిపించే మాస్ సన్నివేశాలు తరహాలో ఇందులో కూడా ఉన్నాయి. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఉండే పవర్స్ ఇంకా పొలిటికల్ గా పలు సీన్స్ ఫస్టాఫ్, సెకండాఫ్ లో చప్పట్లు కొట్టిస్తాయి.
మైనస్ పాయింట్స్
ఈ మూవీలో సాలిడ్ నరేషన్ ఉంది కానీ ఈ తరహా కథలు కొత్తేమి కాదు. ఫస్టాఫ్ లో మొదటి పది పదిహేను నిమిషాలు కొంచెం సో సో గానే ఉంటుంది. ఇంకా శంకర్ మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్ కూడా సినిమాలో మిస్ అయ్యినట్టు తన ఫ్యాన్స్‌కి అనిపించవచ్చు. కామిడీ అంతగా లేకపోవడం కూడా సినిమాకు పెద్ద మైనస్ పాయింట్‌గా చెప్పవచ్చు.
రేటింగ్: 2.5/5