
కల్కి 2898 AD ప్రజెంట్ ఇండియా మొత్తం షేక్ అవుతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందంటే? మహాభారతాన్ని, మార్వెల్ లాంటి సూపర్ హీరోస్‌కు కనెక్ట్ చేస్తూ కల్కి సినిమాతో మరో ప్రపంచాన్ని సృష్టించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు నాగశ్విన్. కురుక్షేత్రం జరిగిన 6వేల సంవత్సరాల తర్వాతి కథ ఇది.
ఎలా ఉంది అంటే..
డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడనే చెప్పవచ్చు. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి. కాంప్లెక్స్, శంబాల ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. అయితే ఈ మూవీ కురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాలతో ప్రారంభమవుతుంది. కథా ప్రపంచాన్ని, పాత్రల్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకెళుతుంది సినిమా.
అక్కడక్కడా సన్నివేశాల్లో కొంత వేగం తగ్గినట్టు అనిపించినా ప్రభాస్, అమితాబ్ బచ్చమధ్య సన్నివేశాలు మొదలైనప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందనే కుతూహలం మొదలవుతుంది. ప్రభాస్ చేసే తొలి ఫైట్, కాంప్లెక్స్‌లో దిశా పటానీతో కలిసి చేసే సందడి, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మూవీకి హైలైట్‌గా నిలిచాయని చెప్పవచ్చు. కొన్ని సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా ఉన్నా.. తెరపై మాత్రం మరో ప్రపంచాన్ని తీసుకుని రావడంలో డైరెక్టర్ విజయవంతం అయ్యారు. మహాభారతంతో ముడిపడిన కథ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు, విజువల్స్, సంగీతం ప్లస్ పాయింట్ కాగా… అక్కడక్కడా నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు సినిమాకి కొంచెం మైనస్‌గా చెప్పవచ్చు.
రేటింగ్: 3.5/5
గమనిక: ఈ రివ్వూ… ఓ ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే.