
మెక్లియోడ్‌గంజ్ పేరు ఎప్పుడైనా విన్నారా..? అయితే ఈ హిల్‌స్టేషన్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న ఈ చిన్న పట్టణాన్ని “లిటిల్ లాహాసా” అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడే దలైలామా ఆశ్రమం ఉంది. టిబెటన్ సంస్కృతి, బౌద్ధ మఠాలు, చల్లటి వాతావరణం, అద్భుతమైన పర్వతాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. సముద్ర మట్టానికి 2,082 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి ఒడిలో ఒక అందమైన స్వర్గంలా అనిపిస్తుంది.
మెక్లియోడ్‌గంజ్‌లో చూడాల్సిన ప్రదేశాలు:
*నామ్‌గ్యాల్ మఠం (Dalai Lama Temple Complex)
*భగ్సునాథ్ ఆలయం & జలపాతం
*దలై లామా నివాసం (Tsuglagkhang Complex)
*త్రియుంద్ ట్రెక్ (Triund Trek)
*దల లేక్
*టిబెటన్ మ్యూజియం
మెక్లియోడ్‌గంజ్ ఎలా చేరుకోవాలి:
బస్సు మార్గం: ఢిల్లీ, చండీగఢ్, అమృత్‌సర్ వంటి ప్రధాన నగరాల నుండి ధర్మశాలకు డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ధర్మశాల నుండి మెక్లియోడ్‌గంజ్ కేవలం 10 కి.మీ. దూరంలో ఉంటుంది.
రైలు మార్గం: సమీప రైల్వే స్టేషన్ పఠాన్‌కోట్. అక్కడి నుండి టాక్సీ లేదా బస్సులో మెక్లియోడ్‌గంజ్ చేరుకోవచ్చు.
ఎయిర్ మార్గం: సమీప విమానాశ్రయం గగ్గల్ ఎయిర్‌పోర్ట్ (ధర్మశాల), సుమారు 15 కి.మీ. దూరంలో ఉంటుంది.
టూర్ బడ్జెట్:
మెక్లియోడ్‌గంజ్‌కి రానుపోను ఖర్చులు సుమారు రూ.3000 నుంచి రూ.5000 వరకు ఉంటాయి. రూమ్ అద్దె రోజుకు రూ.1200 నుంచి రూ.2000 వరకు, ఫుడ్‌కి రోజుకు రూ.700, గైడ్‌కి రూ.800, లోకల్ ట్రిప్స్‌కి జీప్ లేదా టాక్సీకి రూ.700 ఖర్చవుతుంది.












