GREAT PERSONALITIESHISTORY CULTURE AND LITERATURETelugu Special Stories

చాణిక్యుని జీవిత చరిత్ర

భారతదేశం కీర్తించదగ్గ ముద్దుబిడ్డ, గొప్ప దేశ భక్తుడు, మహావీరుడు, జ్ఞాని, అపర మేధావి, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త చాణిక్యుడు. ఈ పేరు వినగానే స్త్రీలు అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని చెప్పే వ్యక్తిగానే మనకు తెలుసు. కానీ ఇతను భారత జాతికోసం చేసిన త్యాగం, ధర్మనీతి ఇప్పటికి చరిత్ర పుటల్లోనే సాక్ష్యాలుగా నిలిచిపోయింది. మనం చాణిక్యుడి లాంటి గొప్ప పనులు చేయకపోయినా.. అతని గురించి తెలుసుకొని భారతదేశ గొప్పతనాన్ని, వీరుల గురించి తెలుసుకుందాం. చాణిక్యుని గురించిమేము చేసిన అన్వేషణ.. ఇంటర్ నెట్ లో కూడా సరిగ్గా లేదు. అనేక విషయాలను తెలుసుకొని పరిశీలించిన మీదట ఈ మహత్తర జ్ఞానాన్ని భావితరాల కోసం అత్యంత సుదీర్ఘంగా, భావితరాలకు అందజేయాలన్న లక్ష్యంతో ఈ కథనాన్ని చాలా సుదీర్ఘంగా అందించండం జరుగుతుంది.

క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దం, మూడో శతాబ్దం మధ్యకాలంలో జీవించిన రాజనీతిజ్ఞుడు, రాజగురువు చాణిక్యుడు. అపారమైన రాజనీతిజ్ఞత వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి మగధ సింహాసనంపై చంద్రగుప్తు మౌర్యుడిని కూర్చోబెట్టిన గొప్ప మేధావి. ఈయన గురించి తెలుసుకుంటే శరీరం రోమాంచితమవుతుంది. మరో ‘మహాభారతం’ లాంటి గొప్ప చరిత్ర ఈయనది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా ఏ మాత్రం చలించకుండా దేశం కోసం తాను అనుకున్నది నెరవేర్చాడు. అఖండ భారతదేశాన్ని ఏకం చేసి, ధర్మం.. రాజ్యం చేసే ఆర్థిక విధానాలను అనేక వేద గ్రంథాలను పటించి.. విశ్లేషించి నేటి జీవితానికి ఉపయోగపడే విధంగా చరిత్ర పుటల్లో నిలిచే విధంగా ‘అర్థశాస్త్రం’ అనే గ్రంథాన్ని రచించాడు. ఈ మహావీరుడి వీర గాధను ఈ కథనంలో తెలుసుకుందాం.

భారత దేశం ఏర్పడక పూర్వం.. వేర్వేరుగా ఒక్కొక్క రాజ్యాలుగా ఉండేది. అప్పుటి కాలంలో మౌర్య సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైన రాజ్యం. మొదటి మౌర్య చక్రవర్తి అయిన చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్దశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు చాణిక్యుడు. ఇతన్ని కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు, అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. చాణక్యుడు చతుర్విధపురుషార్దాలలో రెండవదైన ‘అర్ధ’ పురుషార్ధము గురించి అర్దశాస్త్రాన్ని రచించి యావత్తు భారతదేశానికే ఒక గొప్ప జ్ఞానాన్ని బోధించాడు. చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా తన విద్యా పటిమను కనబర్చాడు. ఇతడు తన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పిన విధానం విశాఖదత్తుని ముద్రారాక్షసం అనే సంస్కృత నాటకంలో వివరింపబడింది. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రం చాణక్య నీతి పేరుతో ప్రసిద్ధి చెందింది.

మగధ రాజ్య ప్రశస్తం:
ప్రాచీన భారతదేశానికి చెందిన పదహారు మహాజనపదాలలో మగధరాజ్యం ఒకటి. ఈ రాజ్యం బీహారు, గంగానదికి దక్షిణాన గల ప్రాంతాలలో వ్యాపించి ఉండేది. దేశంలోని రాజ్యాల అన్నిటిలో మగధ రాజ్యం (దాదాపు 350 BCలో) ప్రసిద్ధమైనది. దీని రాజధానిగా పాటలీపుత్రం ఉండేది. పాటలీపుత్రమును రాజధానిగా చేసుకొని రాజు అయిన మహాపద్మనందుడు తన 8 మంది కుమారుల సాయముతో రాజ్యాన్ని పాలించేవాడు. ఇందులో పెద్దవాడు ఘణానందుడు. మహాపద్మునికి ఇళ, ముర అను ఇద్దరు రాణులు ఉండేవారు. ఇళకు 8 మంది కుమారులు జన్మించారు. మహాపద్మునితో గలిపి వీరిని నవనందులని అనేవారు. రెండవ భార్యయగు మురకు జన్మించినవాడు చంద్రగుప్తుడు. బుద్ధిమంతుడైన చంద్రగుప్తుని తన సోదరుడిగా భావించకుండా.. సవతి సోదరులు 8మంది పగ బట్టి వానికి ఏనాడైనా రాజ్యం వస్తుందని భావించి ఎలాగైనా వానిని చంపాలనుకున్నారు. మహాపద్ముడు ముసలివాడు కావడంతో చంద్రగుప్తుడు అందరికన్నా చిన్నవాజవటం వలన, రాజ్యభారమంతా 8 మందికి చేజిక్కింది. వీరు చంద్రగుప్తుణ్ణి హింసించేవారు.

రోమాంచితమయ్యే చాణిక్యుడు బాల్యం, విద్యాబ్యాసం:
ఇలా నందులు మౌర్య సామ్రాజ్యాన్ని పాలిస్తున్నారు. ఈ సామ్రాజ్యానికి రాక్షసుడు అనే ప్రధానమంత్రి ఉండేవారు. ఇతని సూచనలతోనే రాజ్యం చేసేవారు. ఈ రాజ్యంలోనే పేద బ్రాహ్మణుడైన చనకుడు మరియు అతని తల్లి పేరు చనేశ్వరికి విష్ణుగుప్తుడు జన్మించాడు. చనకుడు ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. నందులలో పెద్దవాడైన ఘననందుడు రాజ్యానికి రాజుగా చేస్తున్నాడు. కేవలం సుఖం కోసం రాజ్యాన్ని ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడు. రాజ్యంలోని అందమైన 1000 మంది అమ్మాయిలతో కామక్రీడలు చేసేవాడు. మద్యం సేవిస్తూ రాజసింహనంపై కూర్చిని రాజ్యాన్ని నాశనం చేసే దిశగా చేసేవాడు. ఒకానొక సమయంలో కోపోద్రిక్తుడైన చనకుడు.. ఘననందుని అతని అరాచకాలను ప్రశ్నిస్తాడు. దీంతో ఘనానందుడు చనకుణ్ణి దారుణంగా చంపేస్తారు. అలాగే అతని భార్యను కూడా చంపడానికి ఇంటికి భటుల్ని పంపిస్తాడు. ఆ సమయంలో అక్కడ ఆడుకుంటున్న విష్ణుగుప్తుని వెనకనుండి నోరుమూసి శబ్దం చేయకుండా ఒక వ్యక్తి ఆపుతాడు. అతనెవరో కాదు చనకుడి స్నేహితుడు కాత్యాయనుడు. నన్ను ఎందుకు నోరుమూసి అపావు అని విష్ణుగుప్తుడు ప్రశ్నిస్తారు. అప్పుడు అతను విష్ణుగుప్తా.. మీ తండ్రిని నందులు ఘోరంగా చంపేశారు. నిన్ను మీ అమ్మను కూడా చంపడానికి ఇక్కడకు వచ్చారు. ఇంట్లో ఉన్న మీ అమ్మ చనేశ్వరిని కూడా ఇప్పుడు చంపేశారు అని చెప్తాడు. దీంతో విష్ణుగుప్తునికి ప్రపంచం అంతా ఒక్కసారిగా శూన్యం అయిపోయినట్లు అనిపిస్తుంది. కళ్ళనుండి నీళ్లు ధారలుగా ప్రవహిస్తున్నాయి. వెంటనే మా నాన్నని చూడాలి అని విష్ణుగుప్తుడు అంటాడు. మీ నాన్న శవం ఒక్కటిగా లేదు.. ముక్కలు చేశారు. తలను ఊరిబయట ఉన్న మర్రి చెట్టుకు వేలాడ దీశారు అని కాత్యాయనుడు చెప్తాడు.

దీంతో పుట్టెడు శోకంతో విష్ణుగుప్తుడు.. వాళ్ళ నాన్నను చూడటానికి అక్కడికి వెళ్తాడు. అక్కడ కాపలాగా నలుగురు రాజభటులు ఉంటారు. దీనికి గమనించిన విష్ణుగుప్తుడు చెట్ల పొదల్లోనే దాక్కుంటాడు. రాత్రి అయ్యేంతవరకు చెట్టుకు వేలాడుతున్న తండ్రి తలను చూస్తూ.. ఒంటరిగా రోదిస్తూ తీవ్రమైన మనోవేధనతో ఎలాంటి శబ్దం చేయకుండా భటులకు కన్పించకుండా దాచుకుంటాడు. రాత్రి భటులు అక్కడినుండి వెళ్ళిపోయాక.. చెట్టు ఎక్కి తండ్రి తలను దించుతారు. అక్కడే ఉన్న కర్రలను పోగేస్తాడు. చనకుడు సోదరుడు కాత్యాయనుడు మీ తండ్రి తలకు నిప్పు పెట్టు అని కాగడా ఇవ్వగా.. దుఃఖంతో మునిగిపోయిన విష్ణుగుప్తుడు తన తండ్రి చనకుడి తలను దహనం చేస్తాడు. హిందూ సంప్రదాయం తర్వాత దహనం తర్వాత గంగా స్నానం చేయాలి. అక్కడి ఉన్న నదిలో స్నానం చేద్దామని మునగగా.. అందులో ఆడవాళ్ళ మృతదేహాలు కనబడ్డాయి. రాయికి ఆడవాళ్లను కట్టి ముంచి చంపేశాడు. మాకు న్యాయం చేయు విష్ణుగుప్తా అన్నట్లు ఆ మహిళలు రోధిస్తున్నట్లు అతనికి అనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి నదిలో నుండి బయటకు వచ్చాడు. ఈ విషయం కాత్యాయనుడు చెప్పి.. బాబాయి మృతదేహాలు ఇలా ఘోషిస్తున్నాయి అని చెప్పాడు. ఇదంతా నవనందుల కిరాతక చేష్టలు అని వివరిస్తాడు. అయితే నందులు సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికే ఇంతటి దారుణాలకు పూనుకుంటున్నారా అని మండిపడుతాడు.

అప్పుడు కాత్యాయనుడు.. విష్ణుగుప్తా నీవు ఇప్పడు బాలుడివి. వీరిని ఏమి చేయలేవు. నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను కూడా చంపేస్తారు. నీకోసమే భటులు గాలిస్తున్నారు. నువ్వు వెంటనే ఇక్కడినుంచి వెళ్ళాలి అని చెప్పి.. ఒక లేఖను కాస్త డబ్బును అతనికి ఇస్తాడు. నీవు ఇక్కడికి దూరంగా ఉన్న తక్షశిల అనే విశ్వ విద్యాలయానికి వెళ్లి అక్కడే నీ విద్యాబ్యాసం చేసి నీ జీవితాన్ని చూసుకో.. నువ్వు ఎప్పటికి ఇక్కడికి రాకు అను చెప్పి పంపిస్తాడు. విష్ణుగుప్తుడు ఆ సంచిని తీసుకొని బాబాయి నాకు ఒక మాటిస్తావా అని అడిగాడు. చెప్పు నాన్న ఏదైనా నీకోసం చేస్తాను అని అన్నాడు. దానికి విష్ణుగుప్తుడు నేను మరల ఈ ఊరికి వచ్చే సరికి ఘనానందుడికి అంగరక్షకుడివై అతనిపై ఈగ కూడా వాలనివ్వకుండా అతని ప్రాణాలకు ఏ మాత్రం హాని కలుగకుండా తన శత్రువులు ఎవరూ తనమీద దాడి చేయకుండా నీవు రక్షించాలి అని కోరతాడు. ఆ మాటలకూ ఆశ్చర్యపోయిన కాత్యాయనుడు చంద్రగుప్తుని కళ్ళలో ఆవేశం చూసి.. ప్రక్కా ప్రణాళికతోనే చంద్రగుప్తుడు చెప్తున్నాడని గ్రహించి సరే అని చెప్తాడు. విష్ణుగుప్తా ఈ పగలు, ప్రతీకారాలు వద్దు నీ జీవితం నువ్వు చూసుకో అని కాత్యాయనుడు చెప్తాడు. అప్పడు ఆ బాలుడు విష్ణుగుప్తుడు కాదు బాబాయి.. “చాణిక్యుడు”. ఈ రోజు నుంచి నాపేరు చాణిక్యుడు. ఈరోజు విష్ణుగుప్తుడిగా వెళ్లిన నేను ఏదో ఒకరోజు చాణిక్యునిగా వస్తాను. ఘనానందుడిని అంతం చేస్తాను అని బయల్దేరుతాడు.

అక్కడినుంచి బయల్దేరిన విష్ణుగుప్తుడు కొండలు, కోనలు, వాగులు, వంకలు, ఎండనక వాన అనక ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. పాదరక్షలు కూడా లేకుండా అలా అడవిలో నడుస్తూ ఆకలికి అలమటిస్తూ తన గమ్యానికై అన్వేషిస్తూ 10 నెలలుగా ప్రయాణం చేస్తున్నాడు. మార్గమధ్యంలో ఎన్నో సార్లు చావు చివరి అంచులదాకా చేరుకున్నాడు. అలా నడుస్తూ నడుస్తూ అతి ప్రాచీనమైన విశ్వవిద్యాలయమైన తక్షశిలకు చేరుకున్నాడు. ఆ విద్యాలయాన్ని చూడగానే విష్ణుగుప్తునికి పట్టరాని సంతోషం కలుగుతుంది. విధ్యంటూ నేర్చుకుంటే ఇక్కడే నేర్చుకోవాలి అనుకున్నాడు. విద్యాలయం లోపలోకి వెళ్లి ఆచార్య పుండరీకాక్షునికి కాత్యాయనుడు ఇచ్చిన లేఖను చూపించాడు. ఎవరు బాబు నువ్వు అని అడగగా.. నేను మగధ సామ్రాజ్యంలోని చనకుడి కుమారుణ్ణి. నా పేరు చాణిక్యుడు అని చెప్పాడు. అక్కడి మంత్రిమండలిలో సభ్యుడైన కాత్యాయనుడు ఈ లేఖను మీకు ఇవ్వమన్నారు అని చెప్పారు. మా కాత్యాయయనుడు లేఖను పంపించారా అని ఆప్యాయంగా లేఖను చదివాడు పుండరీకాక్షుడు. అసలు విషయం అర్ధం చేసుకొని చాణిక్యుని చేరదీశాడు. నువ్వు ఇక్కడ విద్యను అభ్యసించాలంటే.. సిఫార్స్ తో నిన్ను చేర్చుకోలేము. నీకు అంగీకరమైతే నిన్ను అధ్యాపకుల ముందు ఒక పరీక్ష పెడుతాము. అందులో సమాధానం చెప్తే నిన్ను చేరుకుంటానని అన్నారు. దానికి క్షణమాత్రం కూడా ఆలోచించకుండా.. నేను సిద్ధం అని సమాధానమిస్తాడు చాణిక్యుడు. ఇక 10 నెలల ప్రయాణంలో సరైన నిద్రపోని చాణిక్యుడు.. ఆరోజు రాత్రి ప్రశాంతంగా నిద్ర పోయాడు.

మరుసటి రోజు ఉదయం పరీక్ష మండపానికి వచ్చాడు చాణిక్యుడు. ఎదురుగా పరీక్షాధికారి కుర్చీలో కూర్చోని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. చాణిక్యుడిని వెనక ఆచార్య పుండరీకాక్షుడు ఉన్నాడు. పరీక్షను చాణిక్యుడు ఎలా ఎదుర్కొంటాడు అని అందరూ ఆసక్తిగా చూస్తున్నాడు. పరీక్షా అధికారి ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు.


అధికారి ప్రశ్న: సుపరిపాలన అంటే ఏమిటి?
చాణిక్యుని సమాధానం: ఏ రాజైతే ప్రజల సంతోషమే తన సంతోషంగా భావించి ప్రజల సంక్షేమమే తన సంక్షేమంగా భావిస్తాడో ఆ రాజు యొక్క పాలనే సుపరిపాలన అంటారు.


అధికారి ప్రశ్న: రాజు నిర్వర్తించాల్సిన విధులేంటి?
చాణిక్యుని సమాధానం: రాజు మూడు విధులను నిర్వర్తించాలి. మొదటిది రక్ష. పొరుగు రాజ్యాలనుంచి రక్షించాలి. రెండవది పాలన. ఇక మూడవది యోగక్షేమం.


అధికారి ప్రశ్న: రాజ్యం, దేశం, ప్రజల మధ్య తేడా ఏంటి?
చాణిక్యుని సమాధానం: ప్రజలు లేకుండా దేశం లేదు. దేశం లేకుండా రాజ్యం లేదు. ప్రజలే రాజ్యాన్ని నిర్మిస్తారు.


అధికారి ప్రశ్న: ఏ రాకుమారుడు దేశ భక్తుడు కాడు
చాణిక్యుని సమాధానం: ఏ రాజు అయితే పరాయి దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం కలిగితే.. ఆ పిల్లవాడు మన దేశ భక్తుడు కాలేదు.


అధికారి ప్రశ్న: ప్రభుత్వం అంటే ఏమిటి?
చాణిక్యుని సమాధానం: ప్రభుత్వం అనేది ఒక శరీరం అయితే దానికి 8 అంగాలు ఉంటాయి. అవి: రాజు, మంత్రి మండలి, ప్రదేశము, ప్రజలు, ఆర్థిక పట్టణాలు, ధనాగారం, సైనికులు, స్నేహితులు. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా ఆ రాజ్యానికి అంగవైకల్యం వచ్చినట్లే.

పరీక్షాదికారి చాణిక్యుడి సమాధానాలకు ఆశ్చర్యపోయాడు. ఇంతచిన్న వయసులో ఈ పిల్లవాడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయాడు. బాలుడు జ్ఞానాన్ని మెచ్చుకొని విద్యాలయంలో చేరుకున్నాడు. అలా చాణిక్యుడు విద్యను అభ్యసిస్తున్నాడు. చాణిక్యుడు చేస్తున్న ఒక్కొక్క పనితో విద్యార్థులంతా అతన్ని మెచ్చుకుంటున్నారు. అనేక గ్రంథాలను పఠిస్తూ.. తోటి విద్యార్థులకు నేర్పిస్తూ మహా జ్ఞానాన్ని సముపార్జన చేశాడు. మేధావి చాణిక్యుని గురించి తక్షశిలలోనే కాదు. అనేక రాజ్యాలలో అతని ప్రస్తావన మొదలయింది. ఇలా ఒక దండయోగి చాణిక్యుని కలవానికి ఒక ప్రదేశానికి రావాలని పిలిపిస్తారు. చాణిక్యుడు అక్కడికి వచ్చేసరికి ఆ యోగి శీర్షాసనం వేసుకొని కూర్చొంటాడు. అక్కడికి వచ్చిన చాణిక్యుని చూసి శీర్షాసనం నుంచి లేచాడు. చాణిక్యున్ని చూసి.. సముద్రంలో నిత్యం కెరటాలు రావడానికి స్ఫూర్తి చంద్రుడు, మరి నీలో నిత్యం ఉప్పెంగో ఆవేశానికి స్ఫూర్తి ఏంటి అని ప్రశ్నించాడు.

దానికి చాణిక్యుడు ఒక్కటే సమాధానం ఇచ్చాడు. మన భారత దేశంలో ప్రజలు ఎవరికి వారు మేము మగధ, మత్స, అస్మక, అవంతి, కోసల, అంగ ఇలా ఎవరి రాజ్యం వారు అనుకుంటున్నారే తప్ప.. ఎవ్వరు నేను భారతీయున్ని అని అనుకోవట్లేదు. మనమందరం పాటించేది సనాతన ధర్మమే. ఒకటే ధర్మాన్ని పాటించే మనమందరం ఎందుకని ఒక తాటిపైన నిలబడట్లేదు. ఎందుకని భారతీయులం అని చెప్పుకోవట్లేదు అని సమాధానం ఇచ్చారు. దీనికి ఉప్పొంగిన యోగి ఇక నీవు వెళ్ళు చాణిక్య అని అన్నారు. చాణిక్య నాలుగు అడుగులు ముందు వేసి.. మరల వెనకకు చూసి నా ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది అని అడుగుతాడు. దీనికి ఆ యోగి.. ఆ సమాధానం నువ్వే చాణిక్య అని చెబుతాడు. చాణిక్య ఒక విషయం గుర్తుంచుకో సూర్యుడు తూర్పును ఉదయించి పడమరన అస్తమిస్తాడు. కానీ మేసిడోనియా అనే ప్రాంతంలో పుట్టిన ఒక గ్రీకు దేశపు తార ప్రపంచం మొత్తానికి జయించడానికి ప్రయత్నిస్తుంది. అతను మన దేశానికి రానిదే తన జైత్ర యాత్ర పూర్తి అవ్వదు. అతన్ని ఎదుర్కోవడానికి మన దేశం సిద్ధంగా ఉండాలి. అదే నీ లక్ష్యం కావలి అని సెలవిస్తాడు. ఆ దేశపు తార ఎవరో కాదు.. అతనే అలెగ్జాండర్.

ఇక అక్కడినుంచి బయలుదేరిన చాణిక్యుడు తక్షశిలకు చేరుకుంటాడు. ఇంతలో చాణిక్యుడినికి ఒక లేఖ వస్తుంది. చాణిక్య నీవు ఇకనుండి విద్యార్థులకు ఉపాచార్యుడిగా పాఠాలు చెప్పాలి అని. దీంతో దండయోగి వల్లే తనకు ఆ పదవి వచ్చిందని చాణిక్యుడికి అర్ధం అవుతుంది. ఆ రోజు నుంచి కొత్త విద్యార్థులకు పాఠాలు చెప్తూ జ్ఞానబోధ చేసేవాడు. ఈ సమయంలోనే చాణిక్యుడు గురించి తెలుసుకున్న ఒక మహా వ్యక్తి, ధర్మజ్ఞాని ధర్మానందుల వారు.. తన స్థాయిని అంతస్తును వదిలేసి దేశాలు రాజ్యాలు తిరుగుతూ ఉత్తమైన విద్యార్థులను అన్వేషించి వారు భావి తరాలకు అవసరమయ్యే మహా వీరులును తయారు చేస్తున్నారు. అలా తాను వెళ్తున్న చోట చాణిక్యుని పేరు వినిపిస్తుంది. దీంతో అతను చాణిక్యుని కలుసుకోవడానికి తక్షశిలకు వచ్చాడు. చాణిక్యుడు విద్యార్థులకు పాఠాలు చెబుతున్న తీరును చూసి చాణిక్యుని అభినందిస్తాడు. దానికి సంతోషించిన చాణిక్యుడు.. మీరు ఎవరండీ? అని అడుగుతారు. దానికి అతని పక్కనే ఉన్న శిష్యుడు వినయుడు.. ఈయన ఈ తక్షశిలకే ప్రధాన పీఠాధిపతి అయిన ధర్మానందుల వారు అని చెప్పాడు. సంతోషించిన చాణిక్యుడు.. అతని పాదాలకు నమస్కరిస్తాడు. నీ జ్ఞానం చూసి నాకు గర్వంగా ఉంది. నీకు సహాయం చేయగలనా చాణిక్య అని ధర్మనందులవారు అడుగుతారు.

దానికి చాణిక్యుడు నేను ఒక గ్రంథం రాయాలని అనుకుంటున్నాను. కానీ దానికి నా వయసు తక్కువగా ఉండటం వలన అనుమతి లభించడం లేదు అని అన్నారు. దానికి ధర్మానందుల వారు అనుమతి తీసుకొని రాసేది చట్టం అవుతుంది కానీ గ్రంథం కాదు. ఎవరు ఏమన్నా ఎవరు ఆపమన్న చివరికి నేనే ఆపమన్నా.. నువ్వు ఆపకు. నీవు అనుకున్న గ్రంథం పూర్తి చేయి. నీకు కావలసిన సహాయం నేను చేస్తాను అని అయన చెప్పారు. ఇంతకీ ఆ గ్రంథం పేరు ఏమిటి? అని ఆయన అడిగారు. దానికి చాణిక్యుడు.. అది చాణిక్యుడి అర్థశాస్త్రం అని బదులిచ్చారు. ఆ గ్రంథం కచ్చితంగా శాస్త్రంగా మారుతుంది.. ప్రపంచ దేశాలన్నీ ఆ గ్రంథాన్ని ఖచ్చితంగా పాటిస్తారు అని ధర్మనందుల వారు.. నీకు శుభం కలగాలి అని దీవించి వెళ్లారు.

చాణిక్యుడు అర్థశాస్త్రాన్ని రాయడం మొదలు పెట్టారు. దీంతో ఒకరోజు చాణిక్యుడినికి ఆచార్య పుండరీకాక్షుని దగ్గరనుండి కబురు వచ్చింది. అనారోగ్యంగా ఉన్న పుండరీకాక్షుని చూసి చాణిక్యుడు చాలా చింతించాడు. దీంతో నీవు చింతించవద్దని.. విశ్వవిద్యాలయంలో నువ్వు చేరిన రోజు నాకు గురుదక్షిణ ఇస్తానని అన్నావు. ఇప్పుడు అది ఇస్తావా అని అడిగాడు. దీంతో చాణిక్యుడు చెప్పండి గురుదేవ.. నేనునేను మీరు అడిగింది ఏదైనా.. చివరికి నా ప్రాణమైన ఇస్తాను ఏం చేయాలి అని అడిగాడు. చాణిక్య నీలాంటి వాడు శతాబ్దానికి ఒక్కడు పుడతాడు.. వాడివల్లే దేశభవిష్యత్తు మారుతుంది. దేశమంతా జానపదహాలుగా మారింది. ఒక్కొక్క రాజ్యాలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ రాజ్యాలన్నీ ఏకం చేసి భారత దేశం అయ్యేలా.. ఒకే పాలన ఉండేలా నువ్వే చేయాలి. అది నీవల్లే అవుతుంది. చేస్తావా? అని అడిగాడు. దానికి చాణిక్యుడు గురువర్యా.. మీకు మాటిస్తున్నాను. ముక్కలు ముక్కలుగా ఉన్న భారతదేశ సామ్రాజ్యాలు ఏకం చేసి అఖండ భారత దేశాన్ని స్థాపిస్తానని నేను మీకు మాటిస్తున్నాను. ఇదే నా శపథం అని అన్నాడు. ఆ తరువాత పుండరీకాక్షుడు మరణించాడు. అతని దహన సంస్కారాలకు దేశం నలుమూలన నుండి విద్యార్థులు వచ్చారు.

వారిలో ఒక వేద పండితుడు చాణిక్యుడు అంటే మీరేనా.. నేను మగధ సామ్రాజ్యం నుండి వచ్చాను. ఇప్పుడు దేశం అంత మీ గురించే మాట్లాడుకుంటుంది అని అన్నారు. ఇన్నేళ్లు మీ అమ్మ పడిన కష్టానికి త్యాగఫలం ఇప్పుడు మీ రూపంలో కనిపిస్తుంది అని అన్నాడు. దీంతో ఆ మాటలకు ఆశ్చర్యపోయిన చాణిక్యుడు.. మా అమ్మ బ్రతికే ఉందా? అని షాక్ అయ్యాడు. అతనిని అడగగా.. నేను పోయిన సంవత్సరమే మీ అమ్మను చూశాను అని చెప్పాడు. దీంతో అమ్మను చూడాలన్న కుతూహలం చాణిక్యుడిలో మొదలయింది. అమ్మ ఒంటరిగా ఎలా ఉంటుంది.. ఎలా ఉంది అని అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి. క్షణమాత్రం కూడా ఆలోచించకుండా అమ్మను చూడాలని గుర్రంపై మగధ సామ్రాజ్యానికిచాణిక్యుడు ప్రయాణం కట్టాడు.

గుర్రం పరుగెడుతోంది. గుఱ్ఱంకంటే వేగంగా తన ఆలోచనలు పరుగెడుతున్నాయి. ఇంతలో చాణక్యుడి ముఖం మీద చిన్న చిరునవ్వు వచ్చింది. ఈ చిరునవ్వుకు కారణం సుహాసిని. సుహాసిని ఎవరో కాదు. ఘనానందుడు బంధించిన షత్తర్ కూతురే ఈ సుహాసిని. ఈమెను కలుసుకోవాలని ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అనుకున్న విధంగా మగధ లోని తన ఊరికి చాణిక్యుడు చేరుకున్నాడు. తన ఇంటివద్దకు చేరుకున్నాడు. పాతబడ్డ తన ఇంట్లోకి వెళ్లి అమ్మ.. అమ్మా ఎక్కడున్నావు అని వెతికాడు. ఎక్కడా కనబడకపోవడంతో బయటికివచ్చాడు. అప్పడు తన బాబాయి కాత్యాయనుడు వస్తాడు. బాబాయిని చూసిన సంతోషంలో అమ్మెక్కడ అని అడుగుతాడు. దానికి తనకు మీ అమ్మ సంవత్సరం క్రితమే చనిపోయింది అని చెప్తాడు. దీంతో ఒక్కసారిగా చాణిక్యుడు కుప్పకూలిపోతాడు. అమ్మను చూడాలన్న ఆశతో వచ్చిన చాణిక్యునికి నిరాశే ఎదురౌతుంది.

అమ్మ ఎలా బ్రతికింది బాబాయ్ అని చాణిక్యుడు అడుగుతాడు. అప్పుడు గణానందుని భటులు చంపినపుడు.. అమ్మ కొనఊపిరితో కొట్టు మిట్టాడుతుంటే చుట్టుపక్కల వారు ప్రాణం పోశారు. నాకు నిన్ను పంపించిన 4 నెలల తర్వాత తెలిసింది. అప్పుడు మీ అమ్మను కలిశాను. నీ కొడుకుని తక్షశిలకు పంపించాను అని చెప్పానని కాత్యాయనుడు వివరించాడు. అప్పుడు ఆమె వాణ్ణి అక్కడే ఉండనివ్వు. నా జాడ చెప్పకు. నాకంటూ మిగిలింది నా కొడుకు మాత్రమే. నేను బ్రతికున్నానని తెలిస్తే వాడు ఇక్కడికి వస్తాడు. మళ్ళీ ఘనానందుడు వాణ్ణి చంపేస్తాడు. ఈ విషయం చెప్పకు అని నాతో చెప్పిందని అన్నాడు. అందుకే నీకు ఈ విషయం చెప్పలేదని తెలిపాడు.

నువ్వు ఇక్కడినుంచి వెళ్లిపోయిన తర్వాత ఇక్కడి పరిస్థితులు అన్ని తారుమారు అయిపోయాయి. సుహాసిని వాళ్ళ నాన్న శత్తర్ ను నందుల నరకంలో పడవేసిన తర్వాత రాక్షసుడు ప్రధానమంత్రి అయ్యాడు. ఘనానందునికి మద్యం, మగువల్ని ఇంకా ఎక్కువగా అలవాటు చేసి రాజ్యం మొత్తాన్ని రాక్షసుడు తన అదుపులోకి తెచుకున్నాడు. ఘనానందుడు పేరుకుమాత్రమే రాజు కానీ రాజ్యాన్ని పాలించేది మాత్రం రాక్షసుడే. ఇప్పటికి షత్తర్ ఆ నందుల నరకంలోనే తన జీవితాన్ని గడుపుతున్నాడు అని చెప్పాడు. మరి షత్తర్ కూతరు సుహాసిని ఎక్కడుంది అని అడిగాడు చాణిక్యుడు. దానికి కాత్యాయనుడు ఆమె జీవితం ఇప్పుడు చావు కన్నా దుర్లభంగా మారింది. రాక్షసుడు షత్తర్ ను ఏనాడో చంపేసేవాడు కానీ అతను చంపకుండా ఉండటానికి లంచం కావాలని సుహాసినిని అడిగాడు. ఆ లంచం ఏంటో కాదు. ఆమె శరీరమే. తన తండ్రిని బ్రతికించుకోవడానికి వేరే మార్గం లేక ఆమె రాక్షసుడికి వేశ్యగా మారిపోయింది. వాడికి కావలసినప్పుడల్లా ఆమె వెళ్లి వాడితో పడుకోవలసిందే. లేదంటే ఆరోజే షత్తర్ కు చివరి రోజు అవుతుంది అని చెప్పాడు.

అది విన్న చాణిక్యుడి గుండె పగిలిపోయింది. రక్తం మరిగిపోయింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. నా తండ్రిని తల నరికి చంపేశారు. నా తల్లికి నన్ను దూరం చేశారు. చివరికి అభం శుభం తెలియని సుహాసినిని వేశ్యగా మార్చేశారు. అసలేం జరుగుతుంది ఈ రాజ్యంలో. అసలిక్కడ న్యాయానికి చోటుందా? ధర్మం అనే పదానికి తావుందా? ప్రజలు ఇంకెంతకాలం సిగ్గులేకుండా బ్రతుకుతారు. అని కుమిలిపోయాడు. ఆసమయంలో నందుల సభ ప్రాంగణం వద్ద దాన ధర్మాలు చేయబడును అని ప్రకటించారు. ఇదేంటి అని అడగగా.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేందుకు శిస్తు రూపంలో ఎక్కువగా వసూలు చేసి.. ఇలా దాన ధర్మాలు చేస్తారు. మంచిపేరు కోసం అని చెప్ప్పాడు. ప్రజలు ఇంత పిచ్చోళ్లా ఇది కూడా అర్ధం కావడం లేదా అని చాణిక్యుడు అడిగాడు. న్యాయం కోసం కొట్లాడిన మీ నాన్న, షట్టర్ పరిస్థితి ఏమైందో నువ్వు చూశావు కదా? అని చెప్పాడు. ఇక లాభం లేదు. అలచించకుండా చాణిక్యుడు తాను కూడా సభకు వెళ్ళాలి అనుకున్నాడు.

మరుసటి రోజు ఉదయం సభ ప్రాంగణానికి చాణిక్యుడు వెళ్ళాడు. అక్కడ అమ్మాయిలతో మత్తులో తేలుతూ సరిగ్గా నడవకుండా ఉన్న ఘణానందుడు సింహాసనంపై కూర్చున్నాడు. వాణ్ణి చూస్తే చాణిక్యుడు కళ్ళు ఎర్రబడ్డాయి. పిడికిలి బిగుసుకుంది. దాన దర్మాల కార్యక్రమాలు మొదలయ్యాయి. అంతోలోపే రాక్షసుడు.. ప్రజలారా..!! తక్షశిలలో జ్ఞానం నేర్చిన మగధ పుత్రుడు, అపరమేధావి చాణిక్యుడు ఇక్కడే ఉన్నాడు. అతను దానం తీసుకోవాలని మేము కోరుతున్నాం అని వ్యంగ్యంగా అనౌన్స్ చేశాడు. రాక్షసుని నోటివెంట చాణిక్యుడు అన్న పదం వినగానే భగ్గున మండిపోయాడు చాణిక్యుడు.

చాణిక్యుడు మాత్రం భయపడకుండా, దైర్యంగా అడుగులు వేస్తున్నాడు. ఘననందుకుని అర్ధం కాలేదు. ఈ తేజో మూర్తి ఎవరు అని అలా చూస్తుండిపోయాడు. ఇతను చనకుడి కుమారుడు అని పిలిస్తే అర్ధం అయ్యేది.. చాణిక్యుడు అని పిలవడంతో ఎవరో అనుకున్నాడు ఘణానందుడు. వేదికవైపు వచ్చిన చాణిక్యుడుని చూసి ఒక నవ్వు నవ్వి ప్రజలారా ఈరోజు చాణిక్యుల వారు మనందరికి కొన్ని మంచి విషయాలు.. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారు అని అంటారు. ఆచార్యా.. రాజు శ్రేయస్సు కోసం సమాజంలో ప్రజలు ఎలా సామరస్యంగా ఉండాలో చెప్పండి అని అడుగుతాడు. ఈ ప్రశ్నలో రాక్షసుడి ఉద్దేశ్యం.. ఈ రాజ్యంలో రాజు, రాజు సిబ్బంది సక్రమంగానే ఉన్నారు. ప్రజలే సక్రమంగా లేరు. కాబట్టి ప్రజలు ఎలా సక్రమంగా ఉండాలో ప్రజలకు చెప్పమని చాణిక్యుడిని అడిగాడు. దానికి చాణిక్యుడు.. ప్రజలు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడం ద్వారా అని చెప్పాడు. చదవటం, బోధించడం, దేవుణ్ణి ప్రార్థించడం బ్రాహ్మణుడి కర్తవ్యం. ఆయుదాలు ధరించి అందరి ప్రాణాలు రక్షించడం క్షత్రియుడి కర్తవ్యం. వ్యాపారం చేసి సంపద సృష్టించడం వైశ్యుడి కర్తవ్యం. పై మూడు వర్ణాల అవసరాలు తీర్చడం శూద్రుని కర్తవ్యం అని చెప్తూ.. అంతే కాకుండా పదవి గర్వంతో కళ్ళు నెత్తికెక్కి దేశ ప్రజలను హింసిస్తూ రాజ్య సంక్షేమాన్ని గంగలో తొక్కి మద్యం మత్తులో కామ క్రీడల్లో తేలే ఆంబోతుని ప్రజలందరూ మెడ పట్టుకొని నడి వీధికీడ్చి పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టి రాజ్యపొలిమేర వరకు తరిమి తరిమి కొట్టాలి అని చాణిక్యుడు అనగానే ఘనానందునికి ఒక్కసారిగా మత్తు అంటా ఒదిలిపోయింది. వీడు తిడుతుంది నన్నే అన్ని అతనికి తెలిసిపోయింది. దీంతో అంతటితో… ఘనానందుకు ఒక్కసారి గట్టిగా అరుస్తూ నోరు మూయిరా అని గట్టిగ అరిచాడు. నువ్వెవరు నాముందు పొగరుతో మాట్లాడుతున్నావ్ అని మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న ప్రధానమంత్రి రాక్షసుడు.. వీడు చనిపోయిన చనకుడి కుమారుడు. విష్ణుగుప్తుడు.. అన్ని విద్యల్లో ఆరితేరి ఇప్పుడు చాణిక్యుడి రూపంలో వచ్చాడు అని చెప్తాడు. అప్పుడు మిగిల్చిన శత్రుశేషం ఇప్పుడు ఇలా తిరిగొచ్చిందా అని ఘణానందుడు ఒక్కసారి గుర్తుతెచ్చుకున్నాడు.

చాణిక్యుడి కోపమంతా కట్టలు తెంచుకొని…నువ్వు ఆరోజు నన్ను విడిచిపెట్టినట్లు నేను నిన్ను వదలను ఘనానంద అని ఒక్కసారిగా అంటాడు. ఆ మాటలకూ నన్నే పేరుపెట్టి పిలుస్తావా అని.. వీడిని బందించి నందుల నరకంలో వేసి చిత్ర హింసలకు గురించేయండి. చచ్చేదాకా దారుణంగా కొట్టండి అని ఆజ్ఞాపిస్తాడు. దీంతో భటులు ఆయన్ను బందించదానికి పిలక పట్టుకుంటాడు. ఒక్కసారిగా చాణిక్యుడు ఆ బటున్ని కాలుతో తంతాడు. ఓరి ఘనానంద.. నన్ను ఇంతలా అవమానిస్తావా? ఈ దేశ చరిత్రలోనే లేకుండా చేస్తాను అని అప్పటి వరకు తన పిలక ముడివేయనని శపథం చేస్తాడు. స్ట్రీకి వస్తాం ఎలాగో బ్రాహ్మణులకు పిలక అలాగే. దానిని ఎవరైనా అవమానిస్తే ఊరుకోరు. చాణిక్యుని కొందరు భటులు వచ్చి తాళ్లతో కట్టి అక్కడినుంచి తీసుకెళ్తున్నారు. నందుల నరకంలో పడేశారు.

ఘననందుడు ఘోరంగా కుమిలిపోతున్నారు. ఆ చాణిక్యుని ప్రాణం కుంగిపోయి చంపాలి. ఎలా అని రాక్షసున్నీ ప్రశ్నిస్తాడు. ఒక ఉపాయము ఉంది. షత్తర్ కూతురు సుహాసినిపై చాణిక్యునికి ప్రేమ ఉంది. ఆమెను వాడి ఎదుట బాధ పెడితే అంతకు మించిన నరకం వాడికి ఏది ఉండదు అని చెప్తాడు. ఆ ఒక్కమాటలో ఘానందుడిని ఆనందం వెళ్లి వెరిసింది. ఇప్పుడు దొరికాడు ఆ చాణిక్యుడు అని భటులరా ఆ సుహాసిని అలంకరించి తీసుకురండి అని చెప్తాడు. సుహాసినిని చూసిన ఘనానందుడు.. నీవు చాలా అదృష్టవంతురాలివి. ఈ నందుల నరకంలో శిక్ష అనుభవించేవారు ఉన్నారు కానీ.. సుఖ పడ్డవారు లేరు. నిన్ను నీ ప్రియుడి ముందే నా కామవాంఛ తీర్చుకుంటా. చాణిక్యుడి ముందే నీ మానం, ప్రాణం హరిస్తాను అని అన్నాడు. ఆ మాటలకు బాధ అనిపించినా చాణిక్యుడు పేరు వినగానే సుహాసిని ముఖంపై చిరునవ్వు వచ్చింది. చాణిక్యుడు వచ్చాడా అని సంతోషించింది.

సుహాసిని తీసుకొని రాక్షసుడు, ఘనానందుడు నందుల నరకంలోకి వచ్చారు. చాణిక్యుని బంధించిన గదికి వెళ్లి చూడగా.. చాణిక్యుడు అక్కడినుంచి తప్పించుకు వెళ్ళాడు. దీంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక్కసారి ఫక్కున నవ్వినా సుహాసిని ముందు నువ్వు నీ మరణం నుంచి రక్షించుకో.. తర్వాత నన్ను అనుభవిస్తువు గాని అని అంది. దీంతో పట్టరానంత కోపంతో ఈమెను రాజకోటలో ఉన్న ఒక గదిలో ఉంచండి. ప్రతీరోజు ఇలాగే అలంకరించండి. ఏరోజయితే చాణిక్యుడు దొరుకుతాడో ఆరోజే.. వాడిముంది ఈమెను బలాత్కారం చేసి ఇద్దరిని చంపేస్తాను అని క్రూరంగా అంటాడు. రాజభటులు తీసుకొని వెళ్తుండగా.. నీవల్ల నాకు విముక్తి దొరికింది చాణిక్య అని సుహాసిని మనసులో అనుకుంది.

చాణిక్యున్ని మరుగుజ్జులు చిన్న సొరంగం ద్వారా తప్పించాడు. చాణిక్యుడు బయటికి వచ్చాక.. ఆ సొరంగాన్ని రాళ్లతో పూడ్చేశాడు. ఆ మరుగుజ్జులు చాణిక్యుని ఓ రాజ్యానికి తీసుకెళ్లారు. ఆ రాజ్యంలోకి ప్రవేశించి రాజప్రాసాదంలోకి మరుగుజ్జులు తీసుకెళ్తాడు. అక్కడ ఒక రాణి చాణిక్యుని చూసి.. ఆచార్యుల వారికీ ఈ మురాదేవి నమస్కరిస్తుంది అని అంది. మీకు జరిగిందానికి బాధపడుతున్నాం. మాతృ దేశాన్ని జలగలా పట్టిపీడిస్తున్న వాన్ని అంతం చేయడానికి మీలాంటి మహానుభావుడి సహాయం కావాలని అంది. చాణిక్యునికి ఆమెను చూడగానే ఎంతో గౌరవ భావం కలిగింది. ఆమె చూడటానికి 35 ఏళ్ళ వయసున్న స్తీని చూసి నివ్వెరపోయాడు. నుదుటున బొట్టులేకుండా ఉండటాన్ని గమనించి ఆమె భర్త కోల్పోయింది అని గ్రహించాడు.

అప్పుడు చాణిక్యుడు.. మురాదేవి. నేను కూడా ఆ సమయంకోసమే ఎదురు చూస్తున్నాను దేశ శ్రేయస్సు కోసం నా సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది. మనం చేయబోయే మహత్తర లక్ష్య సాధన చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నాడు. గాయాలైన చాణిక్యునికి వైద్యం చేయాలని వైద్యులను ఆదేశించింది. వైద్యం చేస్తుండగా అక్కడికి మురాదేవి వచ్చింది. తనతో పాటు 15 ఏళ్ళ కుర్రవాణ్ణి తీసుకువచ్చింది. చంద్ర ఆచార్యులు కోలుకునేంతవరకు సేవలు చూసుకో అని చెప్పి వెళ్ళిపోయింది. అలా ఆ బాలుడు కాళ్ళు ఒత్తుతుండగా హాయిగా నిద్రలోకి జారుకున్నాడు చాణిక్యుడు. తెల్లవారు లేచేసరికి మరుగుజ్జులు ఉన్నారు. దీంతో చాణిక్యుడు నన్ను కాపాడినట్లు గానే షత్తర్ కూడా నరకంలో ఉన్నాడు అంతని కాపాడండి అని అడిగారు. దీంతో నీతోపాటు షత్తర్ ను కూడా కాపాడాము. అసలు మేము షత్తర్ ను విడిపించాలని వచ్చాము. మీరు అక్కడ ఉండటంతో ఇద్దరిని కాపాడాము. షత్తర్ పక్క గదిలో ఉన్నాడు అని చెప్పాడు. పట్టరాని సంతోషంతో షత్తర్ ను చూసి.. చాణిక్య కన్నీటి పర్యంతం అయ్యాడు. షత్తర్ కోలుకున్నాక వీరు మనల్ని ఎందుకు కాపాడారు అని అడిగాడు.

దీంతో షత్తర్.. చాణిక్య నీ పుట్టుకకు ముందు నీవు తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చరిత్ర చెబుతాడు. కొన్ని దశాబ్దాలకు ముందు శిశునాగ వంశస్తుడైన మహానందుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. పెద్ద భార్య కుమారుడు పద్మనందుడు. చిన్నభార్య కుమారుడు సర్వదసిద్ధమౌర్య. మహానందుని తర్వాత పద్మానందుడు రాజు అయ్యాడు. తన తమ్ముడైన సర్వదసిద్దమౌర్యను సేనాపతిని చేశాడు. అన్నతమ్ములు ఇద్దరు కలిసి ఎన్నో యుద్ధాలు చేసి మగధ సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరింపజేశాడు. పద్మనందుని పెద్ద కొడుకే ఈ ఘనానందుడు. పద్మనందుకు చనిపోయిన తర్వాత ఘనానందుడు రాజు అయ్యాడు. తన బాబాయి అయిన సర్వదసిద్దమౌర్య.. ఘనానందుడు చేస్తున్న నీచ పరిపాలన గురించి అతన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాడు. ఇతను ఎప్పటికైనా తన స్వేచ్ఛకు అడ్డు వస్తాడని భావించి తన బాబాయి సర్వదసిద్దమౌర్యను కుట్ర పన్ని చంపించేస్తాడు. సర్వదసిద్దమౌర్య భార్యపేరే మురాదేవి. తన భర్త చనిపోయిన సమయానికి ఆమె నిండు గర్భిణీ. తనను కూడా చంపేస్తారని భావించి అక్కడినుంచి తప్పించుకొని తన పూర్వీకుల రాజ్యమైన ఈ పీప్లీవనానికి తిరిగివచ్చారు. అప్పడు ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. అతనే చంద్రగుప్త మౌర్యుడు అని చాణిక్యునికి వివరిస్తాడు.

అయితే నిన్న రాత్రి తన కాళ్ళు పట్టింది చంద్రగుప్త మౌర్య అని చాణిక్యుడు తెలుసుకున్నాడు. ఒక రాజకుమారుడు.. నా కాళ్ళు పట్టాడా అని భావించి, ఎలాంటి అహంకారం లేకుండా నాకు సేవ చేశాడు. ఎంత గొప్ప గుణము అని మనసులో అనుకున్నాడు. అక్కడే ఉన్న క్రీడాంగణం వద్దకు చాణిక్యుడు వెళ్ళాడు. అక్కడ ఒక 12 మంది కుర్రవాళ్ళు ఒక బాలుడిపై ఒక్కసారిగా బాణాలు వదిలాడు. ఆ బాణాలను ఒకే ఒక్క క్షణంలో తన ఖడ్గంతో ముక్కలు చేస్తాడు ఆ బాలుడు. ఇలాంటి సీన్ ఒకటి బాహుబలి సినిమాలో ఉంది. బాణాలను ఛేదించిన ఆ బాలుడే చంద్రగుప్తుడు. ఇక అప్పుడే చాణిక్యుడు నిశ్చయించుకున్నాడు. నందులను సమూలంగా నాశనం చేసి రాజకుమారుడైన చంద్ర గుప్తుణ్ణి రాజుగా చేయాలని అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా.. ఈ విషయాన్ని మురా దేవికి చెప్తాడు. అప్పుడు ఆమె ఆచార్య.. మేము దీని కోసమే ఏళ్ళ తరబడి చూస్తున్నాము. ఘనానందుని వికృత చేష్టల వల్ల రాజ్యం నాశనం అవుతుంది. అందుకే చంద్రగుప్తుడు రాజు కావాలని ఆ రోజు నుంచి కలలు కంటున్నాను. నీ ఆశయంతో ఆ కల నెరవేరబోతోంది అన్ని మురాదేవి బదులిచ్చింది. దీంతో మనం ఏం చేయాలన్నా మనకు ఇప్పుడు ధనం కావాలి. ఇది సాధించడానికి మనం ఘనానందుడు దాచిపెట్టిన ధనాగారాన్ని నిధిని వేటాడి మన స్వంతం చేసుకోవాలి అని మరుగుజ్జులు, చంద్రగుప్తుడితో కలిసి నిదివేటకు వెళ్తాడు. అత్యంత శత్రు దుర్బేధ్యమైన ఆ ప్రాంతంలో చాకచక్యంతో అడుగులో అడుగేస్తూ చివరికి నిధివద్దకు చేరుకొని.. రాత్రికి రాత్రే అక్కడున్న నిధిలో బంగారం మాత్రేమే తీసుకెళ్తాడు. ఇదంతా సహాసం సినిమాలో నిదివేటలా ఉంటుంది. మనం బంగారం మాత్రమే ధనంగా సులువుగా మార్చగలం. ఒకవేళ వజ్రాలు దొంగిలిస్తే.. ఈ వజ్రం అమ్మినప్పుడు మీకు ఎక్కడిదని డౌట్ రావచ్చు అని భావించి కేవలం బంగారం మాత్రమే దొంగతనం చేస్తారు. ఆ ధనానంత గుర్రాలపై కట్టి మురాదేవి కోటకు తీసుకెళ్తాడు. తెల్లవారి మురాదేవితో.. అమ్మా! ఈ బంగారాన్ని అంత ధనంగా మర్చి సైన్యాన్ని, యుద్ధ బలగాల్ని పెంచండి. యుద్ధం చేయాల్సి వచ్చినపుడు అవసరం అవుతుంది అని చాణిక్యుడు చెప్తాడు. ఇంతకు మనం ఎవరిపైన యుద్ధం చేస్తున్నాము అని మురా అడిగినది. మనం యుద్ధం చేసేది మగధ సామ్రాజ్య రాజు అయిన ఘనానందునిపైన అని చాణిక్యుడు చెప్తాడు. దీంతో అందరిలో దైర్యం పెరుగుతుంది.

ఇక చంద్రగుప్తుణ్ణి రాజుగా చేయాలనే జీవన ప్రయాణంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. చంద్రగుప్తుణ్ణి సకల విద్యల యందు ఆరితేర్చి తీర్చిదిద్దడానికి చాణిక్యుడు తక్షశిలకు తీసుకెళ్తాడు. అక్కడే అన్ని విద్యలు, శాస్త్రాలు నేర్చించసాగాడు. చంద్రగుప్తుడు ఈ విద్యాలయంలో వేరు వేరు వస్త్రాలంకరణతో ఉన్నారు ఎవరు వీరు? అని అడిగారు. దీనికి చాణిక్యుడు సమాధానం ఇస్తూ.. వీరంతా ప్రపంచంలోని దేశాలలోని వారు. విద్య చేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్తాడు. దీంతో చంద్రగుప్తుడు.. ప్రపంచం మొత్తానికి మన దేశం విద్యను నేర్పుతుందా? అయితే మన దేశమే కదా అన్నింటిని ముందంజలో ఉండాలి. కానీ అలా లేదు ఎందుకు అని అడుగుతాడు. దీనికి చాణిక్యుడు సమాధానం ఇస్తూ.. చంద్ర! భారత రాజ్యాలు విడివిడిగా ఉంటూ.. అందరూ పాటించేది సనాతన ధర్మమే అయినా ఏ రాజ్యానికి వారు వేరుగా ఉంటూ స్వార్థం కోసం చూసుకుంటున్నారు. అందుకే మన దేశం వెనకంజలో ఉంది. ఏ దేశమైతే ఐకమత్యంతో ఒక్కరిగా ఉంటుందో ఆ దేశం శక్తివంతమౌతుంది అని చెప్తాడు.

ఇదివిన్న చంద్రగుప్తుడు ఆలోచనలో పడ్డాడు. మరో రోజు చాణిక్యుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు కనిపించాడు. దీంతో తోటి విద్యార్థితో గురువుగారు ఎందుకు ఇలా ఉన్నారు అని అడుగుతాడు. దీంతో పక్కనున్న విద్యార్థి ఇవాళ చాణిక్యుడు రాసిన అర్థశాస్త్రం ఆమోదించే రోజు. దానిగురించి చాణిక్యుల వారు ఆలోచిస్తున్నారు అనిచెప్తాడు. ఇంతలో చాణిక్యుడికి కబురు వచ్చింది. వెంటనే అయన అధర్వణ వేద విభాగంలోని ముఖ్య సభకు బయల్దేరారు. ఆ సభలో ప్రధాన అధ్యక్షుడు కల్యాణ స్వామి. చాణిక్యుడు సభలోని చేరుకోగానే.. అర్థశాస్త్ర గ్రంథ కర్త చాణిక్యునికి స్వాగతం అని వెటకారంగా అన్నాడు. అక్కడికి వచ్చిన చాణిక్యునితో.. ఆచార్య! మీరు రాసిన ఈ అర్థశాస్త్రంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలను వక్రీకరించినట్లు నాకు అనిపించింది. దీనికి సమాధానం ఏమిటి? అని అడిగాడు.

దీనిపై చాణిక్యుడు స్పందిస్తూ.. పురుషార్ధాలు నాలుగు. ధర్మం, అర్థం కామం, మోక్షం. వీటిలో మోక్షం గురించి మన పూర్తికులు ఎప్పుడో చెప్పారు. కామం గురించి వాత్సాయన తదితర గ్రంథ కర్తలు వివరించారు. ఈ రెండింటి గురించి నేను కొత్తగా చెప్పేది ఏమి లేదు. మార్చాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక మిగిలింది ధర్మం, అర్ధం. ధర్మం దీన్ని మనం అనుసరిస్తున్నామని భ్రమ పడుతున్నాం. అర్ధం దాన్ని మనం సంపాదించడానికి పుట్టామని భావిస్తున్నాం. ఈ రెండింటి విషయంలోనే నేను మార్పులు చేశాను. ఈ చతుర్విధ పురుషార్ధాలలో ధర్మాన్ని రెండవ స్థానంలో పెట్టి.. అర్ధాన్ని మొదటి స్థానంలో పెట్టాను. నేను రాసిన ఈ ‘అర్థశాస్త్రం’ ముఖ్యంగా రాజనీతికి సంబంధించింది. అర్ధం అంటే ధనం. అర్ధం లేకుండా ఏ రాజు తన ధర్మాన్ని నిలబెట్టలేడు. రాజ్య సుపరిపాలన చేయడం కాదు కదా.. రాజుకి ప్రజల నుంచి ఇసుమంత గౌరవం కూడా లభించదు. అందుకే నేను ధర్మాన్ని నిలబెట్టేందుకు అర్థాన్ని మొదటిస్థానంలో పెట్టాను అని సమాధానం ఇస్తాడు.

కాలం మారింది, మనుషులు మారారు, రాజకీయ సమీకరణాలు మారాయి అప్పటి ధర్మసూత్రాలు ఇప్పడు ఆచరణీయం కావు. ఆ ధర్మ సూక్ష్మలను ఇప్పడు ప్రజలు పాటిస్త్తే.. ఆ రాజుని చూసి నవ్వే పరిస్తితి వస్తుంది. అందుకే నేను మార్పు చేసి.. నేటి సమాజానికి అనుగుణంగా అర్ధశాస్త్రాన్ని రచించాను అని బదులిస్తాడు. ఇంకా అనేక ప్రశ్నలకు చాణిక్యుడు సమాధానం ఇస్తాడు. న్యాయాన్ని కాపాడటం కోసం ఎలాంటి పని చేసిన అది ధర్మమే. అది కుటిల మార్గమైన సరే. న్యాయమే నా ధర్మము. ధర్మమే నా అభిమతము. అదే నేను ధర్మానికి చెప్పిన గోప్ప భాష్యం అని సమాధానం ఇస్తాడు. చాణిక్యుడి సమాధానానికి ప్రసన్నులైన అక్కడివారంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతారు. అప్పుడు కల్యాణ స్వామి.. చాణిక్యా!! నీ అర్ధశాస్త్రాన్ని నేను ఆమోదిస్తున్నాను. ఈ గ్రంథం లోకహితమై ధర్మాన్ని, న్యాయాన్ని పరిరక్షిస్తూ అందరికి మార్గదర్శనం చేస్తూ అఖండ భారతావని ఉన్నంత వరకు నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఘంటాపధంగా చెబుతున్నానని కల్యాణ స్వామి అంటాడు. ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం తరువాత చాణిక్యుని అర్థశాస్త్రం ఆమోదించబడుతుంది. చాణిక్యుడి తన కలం కౌటిల్య పేరుతో గ్రంథం రచించాడు కావున.. దీనిని కౌటిల్యుడి అర్థశాస్త్రం అనికూడా పిలుస్తారు.

అనంతరం ఉప్పోగిన చాణిక్యుడు ఎంతో సంతోషించాడు. ఇక తన మరో కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ దిశగా చంద్రగుప్తున్ని అన్ని విద్యల్లో ఆరితేరే విధంగా శిక్షణ ఇస్తున్నాడు. శిక్షణ పూర్తి అయింది. ఒకానొక రోజు ఉదయాన్నే చాణిక్యుడు చంద్రగుప్తుడు ఇద్దరూ మారువేషంలో అక్కడి దగ్గరలోని బజారుకు వెళ్లారు. అక్కడి వర్తక దుకాణాలన్నీ చాణిక్యుడు పరిశీలిస్తున్నారు. ఆచార్య మనం ఎందుకని ఈ మారువేషంలో ఇక్కడ తిరుగుతున్నాం అనిచంద్రగుప్తుడు అడిగాడు. దానికి చాణిక్యుడు ఒకదేశంలోని లేదా రాజ్యంలోని ఆర్థిక స్థితిగతులను కేవలం అక్కడ వర్తక ప్రదేశాన్ని గమనిస్తే చాలు మనకు తెలిసిపోతుంది. ఇక్కడికి విదేశాల నుండి వచ్చే సామాగ్రిని బట్టి వాటి ఖరీదును బట్టి పొరుగుదేశాలతో మనకున్న సంబంధాలను మనం తెలుసుకోవచ్చు. మనం గనక మారువేషంలో కాకుండా పండితుల్లా ఇక్కడికి వచ్చి ఉంటే ఇక్కడి వర్తకులు మనకు అతిథి గౌరవంతో పూర్తిగా సమాచారాన్ని ఇవ్వకపోవచ్చు అని చెప్పాడు.

పార్శీ దేశపు గుర్రాలను తక్కువ ధరకు అమ్ముతుండటాన్ని గమనించిన చాణిక్యుడు.. వాటిని కొనుగోలు చేసి అవే గుర్రాలపైన తక్షశిలా విద్యాలయానికి వెళ్లారు. వెళ్ళగానే చంద్రగుప్తునితో.. చంద్రగుప్తా! మనం వేరే ప్రదేశానికి వెళ్తున్నాం. ప్రయాణానికి సిద్ధం చేయు అని చెప్పి.. మరో ఆచార్యుడు సుఖప్ప స్వామి దగ్గరికి వెళ్తాడు. దీంతో సుఖప్ప స్వామి.. శభాష్ ఆచార్య! అర్ధశాస్త్రాన్ని రచించిన నీకు శుభాభివందనాలు అని చెబుతాడు. అయితే అర్ధశాస్త్రాన్ని అయితే రచించావు. కానీ దీనిని ఆచరించే రాజు ఉన్నడా? అని ప్రశ్నించారు. దీనికి చాణిక్యుడు.. నన్ను నా అర్ధశాస్త్రాన్ని అర్ధం చేసుకోగల రాజు ద్వారానే అది సాధ్యం. కానీ అలాంటి రాజు ప్రస్తుతం లేడు. ఇప్పుడున్న రాజులూ అందరూ స్వార్ధ పూరితులై కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే రాజ్యాలన్నింటిని ఏకం చేసి అఖండ భారతావని ఏర్పడేలా చేస్తాను అన్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న సుఖప్ప స్వామి.. ఈ ఆలోచన ఏ రాజుకు అయినా తెలిస్తే నిన్ను ఇప్పడే చంపేస్తారు అని అంటాడు. నువ్వు నా గురించి బయపడుతున్నావ్.. కానీ నేను మన దేశానికి ఆపద వస్తుందని బయపడుతున్నాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? అంటూ ఆశలు విషయం చెప్పాడు.

మనదేశానికి ఆపద.. ఏమైందో క్లారిటీగా చెప్పు అని అని అడిగాడు. దీంతో చాణిక్యుడు.. ఈ రోజు ఉదయం ఇక్కడ దగ్గరలో ఉన్న సంతకు నేను వెళ్లాను. అక్కడ ఒక పార్సీయుడు తన దగ్గరున్న మేలు జాతి గుర్రాన్ని అత్యంత తక్కువ ధరకే మాకు విక్రయించాడు. దీనిపై నేను ఆలోచించాను. మన హిందూ ఖుష్ పర్వతాలను అటువైపు ఉన్న పార్శి దేశాలపైన యుద్ధ ఛాయలు కమ్ముకున్నాయి. నా ఊహనే సరియైనది అయితే ఆ యుద్ధం చేయడానికి రాబోతున్నవాడు ఎవరో కాదు ప్రపంచాన్ని జయించడానికి వస్తున్న యవ్వన సామ్రాట్ అలెగ్జాండర్. వాళ్ళ దేశాన్ని అలెగ్జాండర్ ఎలాగైనా జయిస్తాడని భావించి ప్రజలు వేరే దేశానికి పారిపోతున్నారు. అలా వారితో తెచ్చుకున్న సామాగ్రిని గుర్రాల్ని తక్కువ ధరలకు అమ్ముకొని వాళ్ళ ప్రయాణాల్ని సాగిస్తున్నారు అని బదులిచ్చారు. పార్టీ రాజ్యం తర్వాత అలెగ్జాండర్ దండెత్తబోయేది మన రాజ్యం పైకే. కాబట్టి ఈ సమాచారం మన తక్షశిల రాజు అయిన సుబాహుకి యుద్దానికి సిద్ధం కమ్మని హెచ్చరించండి అని చెప్పాడు.

ఇక నేను వెళ్తాడు అని చాణిక్యుడు వెళ్తుండగా.. అగు చాణిక్య! నీవు సామ్రాట్టుగా తయారు చేస్తానన్న స్వామిని నీవు త్వరగా తయారు చేయాలి. మన దేశ భవిష్యత్తు అతనిపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి వ్యక్తి నీ దగ్గర ఎవరైనా ఉంటె సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. వెంటనే నేను సిద్ధం ఆచార్య అని అక్కడే ఉన్న చంద్రగుప్త మౌర్యుడు అన్నాడు. దీంతో తక్షశిలలోని ఆచార్యులను మగధతో సహా మిగితా రాజ్యాలకు గూఢచారులుగా పంపించాడు. అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని నెలల తరబడి తెలుసుకున్నాడు. ఒకరోజు తక్షశిలా రాజు అయినా సుబాహు.. ఒక పండితుల సభను ఏర్పాటు చేశారు. అక్కడికి తక్షశిల లోని పండితులు అందరూ వచ్చారు. అప్పడు సుబాహు.. పండితుల్లారా! మాకు ఇప్పుడే ఒక వర్తమానం వచ్చింది. అలెగ్జాండర్ మన పక్కన దేశమైన పార్సీ ని జయించి హిందూ ఖుష్ పర్వతాలను దాటి మన పొలిమేరలో ఉన్న కశ్యపురం వరకు తన సైన్యంతో వచ్చేశాడు. భారతావనిలో అతను దండెత్తబోయే మొదటి రాజ్యం మనదే. మనం మన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో చేర్చించడానికే ఈ సభను ఏర్పాటు చేశాను. అక్కడే ఉన్న సభలో సుబాహు పుత్రుడు అంబి.. దేవుని కుమారుడైన అలెగ్జాండర్ తో మనం పోరాడలేము. వాళ్ళతో యుద్ధం కంటే సంధి చేసుకొని ఉందాం అని అంటాడు. ఈ మాటలు విన్న చాణిక్యుడు ఆగ్రహంతో ఒక్కసారిగా లేచి.. ఏంటి? సంధి చేసుకుంటారా? మన శత్రువుకు దాసోహం అవుతారా? అలెగ్జాండర్ ను తరిమికొట్టాలి అని అనుకోకుండా సంధి చేసుకుంటాం అంటున్నారు. వెళ్ళండి చేతులకు గాజులు తొడుక్కొని అలెగ్జాండర్ దగ్గర భిక్షం ఎత్తుకొని తినండి అని గట్టిగ అన్నాడు.

అలెగ్జాండర్ ను జయించాలంటే.. ఒక్కక్కొ రాజ్యం స్వతంత్రంగా యుద్ధం చేయడం కాదు.. అన్ని రాజ్యాలు ఏకైమై యుద్ధం చేయాలి. త్వరగా రాజ్యాలన్నీ ఏకం చేయాలి అని అన్నారు. అందరూ కలిసి అతని పైన మెరుపుదాడి చేయాలి. తద్వారా మన రాజ్యాలను కాపాడుకోవచ్చు అని అంటాడు. దానికి అంబి.. కేవలం ప్రయత్నం చేయచ్చ. గెలుస్తామని కూడా చెప్పలేకపోతున్నాం. అయినా నేను మిమ్మల్ని నమ్మి నా రాజ్యాన్ని గాలిలో దీపంలాగ పెట్టలేము అని అన్నాడు. దానికి చాణిక్యుడు మీరు ఇప్పటిదాకా చేసింది అదే కదా! నేను సంవత్సరం ముందే హెచ్చరించాను. కానీ మీరు మీ రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. సైనిక బలగాన్ని కూడా పెంచుకోలేదు. ఇప్పటికి మించిపోయింది ఏం లేదు అన్ని రాజ్యాలపై రాజులు దండెత్తే పని నాకు అప్పజెప్పండి. నేను చూసుకుంటా అని ఆచార్యులతో అన్నాడు. అంబికి చాణిక్యునికి మధ్య గొడవ పెద్దదౌతుందని గ్రహించిన సుబాహు.. మేము సంధిచేసుకుంటాం అని అతని రాజ్యానికి బయల్దేరారు.

రెండు రోజుల తర్వాత సుబాహు, అంబి.. అలెగ్జాండర్ ఉంటున్న కస్యపురానికి సంధికోసం వెళ్లారు. అంబి సుబాహు.. అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి.. ప్రభు! మిమ్మల్ని దర్శనం చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు. నేను తక్షశిల రాజు సుబాహుని. ఇతను న కుమారుడు అంబి అని చెప్తాడు. యవ్వన సామ్రాట్ అలెగ్జాండర్.. మీగురించి ఎంతో విన్నాం ఇప్పుడు చూస్తున్నాం. మీరు మా రాజ్యం పైనే యుద్ధం చేయకుండానే మీకు విజయాన్ని ప్రకటిస్తున్నాం. మేము మీతో సంధి కుదుర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము. దీంతో అలెగ్జాండర్.. నవ్వుతూ మీతో సంధి కురుర్చుకోకపోయిన మీ రాజ్యం మాది అవుతుంది. అలాంటప్పుడు మీతో సంధి మాకెందుకు అని ప్రశ్నిస్తాడు. దానికి అంబి.. ప్రపంచాన్ని జయించాలన్న మీ కోరిక జయించాలంటే ఖచ్చితంగా భారత ఖండాని జయించాల్సిందే. కానీ ఇది అన్ని దేశాల్లా కాదు. ఇక్కడ వందలాది రాజ్యాలు, కోట్లాది ప్రజలు, కోట్లాది దేవుళ్ళు ఉన్నారు. ఈ ఖండాన్ని జయించండం అంత సులువైన విషయం కాదు. మేము మీ మార్గాన్ని సుగమం చేస్తాం. మీకు భారతదేశంలో ఏ రాజ్యాలకు ఏయేవి బలమో బలహీనతనో మేము చెప్తం అని అన్నాడు. మీ సైన్యానికి తోడుగా అత్యంత శక్తివంతమైన 3 రాజ్యాల సైన్యాన్ని మీకు ఇస్తాము అని అంటాడు. దీంతో సంధికి అంగీకరిస్తాడు అలెగ్జాండర్.

అలెగ్జాండర్ గ్రీకు వాడు అవడం వలన అంబి మాట్లాడిన మాటలు అతనికి అర్ధం అవ్వలేదు. అది అర్ధం చేసుకున్న అంబి తనతో తీసుకువచ్చిన ఒక దుబాసును అలెగ్జాండర్ కు అర్ధం అయ్యేక చెప్పించాడు. తనెవరో కాదు చాణిక్యుడు గుప్తంగా నియమించిన వినయుడు. ఇతనికి దేశంలోని అన్ని భాషలు వచ్చు. అంబి మాకు ఇవి మాత్రమే కాకుండా.. మాకు కావాల్సినవి వేరే ఉన్నాయి. అవి తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉన్న అన్ని గ్రంథాలు. అక్కడి శాఖాధిపతులు. మరీ ముఖంగా కౌటిల్యుని అర్ధ శాస్త్రం. దాన్ని రచించిన చాణిక్యుడు మాకు కావాలని అన్నాడు. గ్రంథాల్ని పండితుల్ని మాతోపాటు మా దేశానికి పంపించాలి అని అన్నాడు. దీనికి అంభి ఒకే చెప్పాడు. ప్రభు మీరు అగిగినవణ్ణి చేస్తున్న. మాకు మీనుండి ఒక ప్రతిఫలం కావలి. మా చిరకాల శత్రు రాజ్యాలైన అభిసారికుడి రాజ్యం, పురుషోత్తముడి పౌరురాజ్యం మీరు జయించి మాకు ఇవ్వాలి అని అడుగుతాడు. దీనికి అలెగ్జాండర్ ఒకే చెప్తాడు. ఇక సెలవు అని సుబాహు,అంబి వెళ్లబోతుంటే.. ఈ దువాసు ఇక్కడే ఉండనివ్వండి అని అలెగ్జాండర్ అనడంతో సరే అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అలెగ్జాండర్ సైన్యాధిపతి సెల్యూకస్.. దువాసుతో మీ దేశం విశిష్టత ఏంటి అని అడుగుతాడు. దానికి దువాసు వినాయుడు.. ఎన్నో రాజ్యాలు, భవనాలు, భాషలు, దేవుళ్లు, మాంత్రికులు, తాంత్రికులు, దయ్యాలు వీటన్నింటిని తలదన్నే చాణిక్యుడు ఉన్నాడు అని చెబుతాడు. ఇలా చాణిక్యుడి గురించి విశేషంగా చెబుతాడు.

అలా చాణిక్యది గురించి చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ అలెగ్జాండర్ కూడా వింటున్నాడు. రెండ్రోజులుగడిచాక ఇక్కడ తక్షశిల లోని ధర్మానందుల వారు చాణిక్యుని దగ్గరికి ఖంగారుగా వచ్చి చాణిక్య అలెగ్జాండర్ మన తక్షశిలకు వచ్చాడు. ఇప్పడు రాజ్యసభలోనే ఉన్నాడు. నిన్ను పిలిపించమన్నాడు. అదివిన్న చాణిక్యుడు ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు. ధర్మానందుల వారు చాణిక్య! ఎందుకు నవ్వుతున్నావ్ అని అడిగాడు. అలెగ్జాండర్ అతనికి అసలు భయమే ఉండదు అనుకున్నాను. కానీ నన్ను పిలిపించాడంటే.. ఎంతటి భయమో అర్ధం అవుతుంది అని అన్నాడు. చాణిక్యుడు రాజ్యసభలోకి వెళ్ళాడు. అక్కడ సింహాసనంపై అలెగ్జాండర్ ఉన్నాడు. పక్కన సుబాహు, అంబి ఉన్నాడు. ఆచార్యులు ఉన్నారు. చాణిక్యుడు ఒక్కసారి సింహ జూలుతో ఎర్రగా చూసినట్లు అందరిని ఒక్కసారి చూశాడు. భయానికి ఆచార్యులు అంతా లేచి నిలబడ్డారు. ఇది గమనించిన అలెగ్జాండర్ సింహాసనంపై లేచి.. చాణిక్యుడు అంటే నీవేనా అని ప్రశ్నించాడు. దానికి చాణిక్యుడు.. నేను రాగానే అందరూ లేచి నిలబడ్డారు నీతో సహా.. ఇంకా నీకు అర్థంకాలేదా అని సమాధానమిచ్చాడు. నీ పొగరుబోతు తనం చెప్తుంది నువ్వు చాణిక్యునివే అని అలెగ్జాండర్ అన్నాడు. దానికి చాణిక్యుడు..అలెగ్జాండర్! నువ్వు వీరుడివే.. కానీ నీ పొగరుబోతు తనానికి అహంకారానికి నిలువెత్తు తనం నువ్వు. అఖండ భారతదేశాన్ని జయించాలన్న లక్షాన్ని నువ్వు ఎప్పటికి చేరలేవు అని అన్నాడు. దీంతో ఫక్కున నవ్వుతు.. చాణిక్యా! నీ అర్ధశస్తం తీసుకొనివచ్చిన నాకు అప్పగించు. దానికి చాణిక్యుడు! తేరగా దోచుకుపోవడానికి అది బంగారం కాదు. అది కౌటిల్యుడి అర్ధశాస్తం. అది నీలాంటి పరాయి దేశపు శత్రువులకు ఎప్పటికి దక్కదు అని మండిపడ్డాడు. నాకు తేరగా వద్దు తక్షశిలలో 10 గ్రామాలూ నీకు పారేస్తా అని అన్నాడు.

ఈ మాట వినగానే చాణిక్యుని కళ్ళు ఎర్రబడ్డాయి. పట్టరాని కోపంతో అలెగ్జాండర్ వైపు చూస్తూ.. పారేస్తావా! 10 గ్రామాల భూములు ఇనాములుగా పారేస్తావా! నువ్వేవడవురా నా భూములు నాకు ఇవ్వడానికి! ఈ దేశం నాది. ఈ నేల నాది. నా రాజ్యాన్ని ఆక్రమించడానికి వచ్చిన దుర్ధుడివి నువ్వు. నేను తలుచుకుంటే నిన్ను నీ దేశం వరకు తరిమి తరిమి కొడతా! పలికే ముందు వాక్కు జాగ్రత్త అలెగ్జాండర్ అని హెచ్చరించాడు. ముందు అంబి కాకుండా పురుషోత్తముడు నీతో సంధి చేసుకుని అంబి తల కావాలంటే నువ్వు ఇస్తావా ఆని చాణిక్యుడు అడిగాడు. అటు ఎటూ సమాధానం చెప్పలేక అలెగ్జాండర్ మౌణంగా ఉన్నాడు. నువ్వు ఏం చెప్పలేవు. ఎందుకంటె నువ్వు అధర్మ పరుడివి. నీలాంటి వాడికి నా అర్ధశస్తం కావాలా? ఛీ.. ఈ దుర్మార్గపు సభలో ఒక్క క్షణం ఇక్కడ ఉన్నా నా విలువైపోతుంది అని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. చాణిక్యుడి మాటలకు చంపేద్దామన్న కోపం ఉన్నా.. ఏం చేయలేని స్థితిలో అలెగ్జాండర్ ఉండిపోయాడు.

అంతటి సభలో అలెగ్జాండర్ ను చాణిక్యులు అలా అనే సరికి సభలో ఉన్న అందరూ నిశ్ఛస్టుపై అలెగ్జాండర్ తో సహా మనసులో ఆందోళన చెందుతున్నారు. అలెగ్జాండర్ సెల్యూకస్ వైపు తలతిప్పి చాణిక్యుని చంపెయ్ అని ఆదేశించాడు. ఇంతలో అలెగ్జాండర్ పక్కన నున్న వినయుడు ప్రభు ప్రభు ఆవేశపడకండి. కొంచెం కోపాన్ని అందుపుచేసుకొండి. బ్రాహ్మణుడైన చాణిక్యుడిని చంపేస్తే.. మిగితా రాజ్యాల రాజులు అలెగ్జాండర్ కు మద్దతివ్వబోమని అంటారు. ఇలా అందరిముందు కాదు ప్రభు సరైన సమయం చూసి చంపాలని సెలవిస్తాడు. అక్కడినుండి రాజమందిరానికి అలెగ్జాండర్ వెళతాడు. అక్కడ కూడా అలెగ్జాండర్ చెవిలో చాణిక్యుని మాటలు ప్రతిధ్వనిస్తాయి.

కోపంతో రగిలిపోయిన అలెగ్జాండర్.. సెల్యూకస్ ను ఆదేశించి.. తక్షశిలలోని గ్రంథాలన్నీ మన గుడారాలలోకి తీసుకురావాలి.. చాణిక్యుడి ప్రాణం అస్తమించాలి అని ఆదేశించాడు. చిత్తం ప్రభు అని వినాయుడితోపాటు 54 మంది సైనికులతో సెల్యూకస్ తక్షశిల యూనివర్సిటీకి వెళ్తాడు. కోపంలో వెళ్లిపోయిన చాణిక్యుని దగ్గరికి ధర్మానందుల వారు వచ్చి.. ధర్మం అని నీతులు బోధించేవారినే చూశాను గాను.. పాటించిన నిన్ను చూసి గర్విస్తున్నాను. ఈ విశ్వవిద్యాలయంలో అదిపెద్దదైన ఎవరూ పొందలేని ఆర్యా! అనే బిరుదుతో నిన్ను సత్కరిస్తున్నాను అని అంటారు. స్నాతకోత్సవంలో బిరుదును అంకితం చేయలేకపోతున్న నన్ను క్షమిస్తావు కదు అని ధర్మానందుల వారు అనగ.. స్వామి అని ఒక్కసారి ఆయన కాళ్ళమీద చాణిక్యుడు పడతాడు. ఇంత పెద్ద బిరుదును నేను అలంకారంలా కాకుండా.. ఆ బిరుదుకే వన్నె తెచ్చే విధంగా ఇకపై నా ప్రయాణం ఉంటుంది అని అంటాడు.

సెల్యూకస్ యుద్ధానికి వస్తున్నాడని చాణిక్యుడు తెలుసుకుంటాడు. ధర్మానందుల వారు మీరు ఇక్కడే ఉంటె మిమ్మల్సి చంపేస్తాడు. మీరు వేరే చోటుకు వెళ్ళండి మళ్ళీ కలుసుకుందాం అని అతడు. దీనికి ధర్మానందుల వారు.. చాణిక్య! ఈ విశ్వవిద్యాలయం నాకు తల్లిలాంటిది. ఎంతో మంది నీలాంటి జ్ఞానుల్ని తయారు చేసింది. యూనివర్సిటీని కాపాడే బాధ్యత నీకు ఇస్తున్నాను అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఆరోజు రాత్రి కేవలం కొన్ని నిమిషాల తేడాతో సెల్యూకస్ దారికి అడ్డువచ్చిన అందర్నీ చంపుకుంటూ యూనివర్సిటీకి చేరుకున్నారు. లోపలి వెళ్లి చూసిన సైనికులకు ఒక్క తాటాకు ముక్క కూడా కనిపించలేదు. అన్ని గ్రంథాలను చాణిక్యుడు అప్పటికే వేరొక రహస్య చోటుకు తరలించాడు. ఈ పని చేసిందని ఎవరిని సెల్యూకస్ అంటుండగా.. చాణిక్యుడు అని వినాయుడు సమాధానం ఇస్తాడు. చాణిక్యుడిని చంపెద్ధామని నిశ్చయించుకున్న సెల్యూకస్.. యూనివర్సిటీ వెనకున్న కుటీరానికి చేరుకుంటాడు. చంపెద్ధామని సైనికులు కుటీరానికి వెళ్లగా.. చాణిక్యుడు ధ్యానంలో కూర్చొని ఉన్నాడు. పొదల్లోంచి చంద్రగుప్తుడు ఎవరికి తెలియకుండా 54 మంది సైనికులను మట్టుబెట్టాడు.

అక్కడున్న చాణిక్యుని అర్ధశాస్త్రాన్ని తీసుకొని వెళ్తామని సెల్యూకస్ ఒక అడుగు ముందుకు వేయగా.. వేగంగా ఒక అగ్ని బాణం గ్రంధాన్ని కాల్చేసింది. గ్రంథం అయితే కాలిపోయింది.. ఇంకాసేపట్లో ఇక్కడేఉంటే మనం కూడా చస్తాం. కుటీరం అగ్నితో కాలిపోతుంది అని బయటకు వచ్చారు. కుటీరం పూర్తిగా కాలిపోయాక.. చాణిక్యుడు చనిపోయాడని నిశ్చయించుకొని అక్కడినుంచి బయల్దేరి అలెగ్జాండర్ చెంతకు చేరతారు. చాణిక్యుడుతో పాటు నిప్పుల్లో గ్రంథం కూడా నిప్పులో కాలిపోయింది అని చెబుతాడు. దానికి అలెగ్జాండర్ చాణిక్యుని తల నరికావా? అని అడుగుతాడు. లేదు ప్రభు! మంటల్లో కాలిపోయాడు అని బదులిస్తాడు. చాణిక్యుడు కళ్ళతో కాలిపోయింది నువ్వు చూశావా? అని అడుగుతాడు. లేదు ప్రభు.. కుటీరం కాలి బూడిదవ్వడం చూశాను. అని సెల్యూకస్ సమాధానమిస్తాడు. దానికి కోపోద్రికుడైన అలెగ్జాండర్.. మూర్ఖుడా! నీలాంటి వాళ్ళు నా పక్కన ఉండటం వలనే నేను విశ్వవిజేతను అవ్వడానికి ఇంత కష్టపడుతున్నాను అని తిట్టి పంపిస్తాడు. చాణిక్యుడు చనిపోలేదు అని అలెగ్జాండర్ కు అర్ధం అయింది. నా లక్ష్యానికి అడ్డువచ్చినప్పుడు మళ్లీ చాణిక్యుని చూస్తాను. అప్పుడు వాడి అంతు చూస్తా అని పగ పెట్టుకుంటాడు.

సెల్యూకస్.. ఇక కాలాన్ని వృధా చేయకుండా మన దండయాత్ర మొదలు పెట్టాలి అని అలెగ్జాండర్ అంటాడు. మరుసటి రోజు ఉదయమే అలెగ్జాండర్ సేన యుద్దానికి సిద్ధం ఐయ్యింది. హిందూ కుష్ పర్వతాల దగ్గర వాళ్ళు దండెత్తిన రాజ్యం పేరు పుష్కలవతి రాజ్యం. దానికి రాజు హస్తి. యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. నెలరోజుల పోరాటం తరువాత వెన్ను పోటుతో హస్తిని చంపేస్తారు. అలాగే అక్కడి నాలుగైదు రాజ్యాలను అలెగ్జాండర్ గెలుచుకుంటాడు. ఆతర్వాత అలెగ్జాండర్ పురుషోత్తముడి పౌరు రాజ్యంపై దండెత్తుతాడు. దీనినే పాంచాల రాజ్యం అంటారు. అలెగ్జాండర్ దండెత్తుతున్నడని తెలుసుకున్న చాణిక్యుడు.. పురుషోత్తముడి దగ్గరకు వస్తాడు. పురుషోత్తమా! నీవు మాతృభూకి ప్రణాలిచ్చే గొప్ప దేశభక్తుడివి అని నాకు తెలుసు. అందుకే మన దేశాల్ని కాపాడుకోవాలని ఇక్కడికి వచ్చాను అని చాణిక్యుడు చెబుతాడు. అలెగ్జాండర్.. తనకు ఓటమి ఉండదని విర్రవీగుతున్నాడు. అతనికి నువ్వు ఓటమిని రుచిచూపించాలి అని అంటాడు. అలెగ్జాండర్ కు చావుదెబ్బ చూపిస్తా.. దేశ సరిహద్దుల్లో ఉన్న ఒక్కరాజ్యమే ఇలా ఉంటె.. ఇక దేశం ఎలా ఉంటుందో ఆ భయానికి వాడు చావాలి అని చాణిక్యునితో పురుషోత్తముడు అంటాడు.

అలెగ్జాండర్ సైన్యానికి పౌరు రాజ్యానికి మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. అలెగ్జాండర్ ను పురుషోత్తముడు చంపబోతుండగా ఒక హారం అలెగ్జాండర్ మెడలో చూసి అతని చంపకుండా ఆగిపోతాడు.
ఎదుకంటే యుద్దానికి ముందు ఒక స్త్రీ తన భర్తను కాపాడమని పురుషోత్తముడి దగ్గరకు వస్తుంది. నీ భర్త ఎలా ఉంటాడో నాకు తెలియదు ఎలా గుర్తు పట్టాలి అని అడగగా.. ఒక హారం నా భర్త మేడలో వేస్తా. ఇది ఎవరి మెడలో ఉంటె వాళ్ళను మీరు కాపాడాలి అని మాట తీసుకుంటుంది. ఆమె పేరే కళాపినిదేవి. భరత రాజ్యంలోని ఒక రాజ్యానికి రాణి అయిన కళాపిని.. అలెగ్జాండర్ ను చూసి మోహిస్తుంది. అలెగ్జాండర్ కు భార్యగా ఉంటుంది. అలెగ్జాండర్ ను కాపాడటానికే ఇంతటి పన్నాగానికి పూనుకుంది. ఇక యుద్ధంతో హరం చూసిన పురుషోత్తముడు అలెగ్జాండర్ ను చంపకుండా ఆగిపోతాడు. శత్రువు కళ్ళముందు కనబడినా ఇచ్చిన మాట కోసం ఆగిపోయిన పురుషోత్తముడి పౌరుషానికి మెచ్చుకున్న అలెగ్జాండర్ ఇద్దరు స్నేహితులవుతారు.

అక్కడినుంచి అలెగ్జాండర్ మళ్ళీ తన దండయాత్రను మొదలుపెడుతాడు. మగధ రాజ్యాన్ని జయించడానికి అలెగ్జాండర్ తన సైన్యంతో పయనమయ్యాడు. అలెగ్జాండర్ కు ఒకవైపు సెల్యూకస్, మరొకవైపు వినయుడు ఉన్నాడు. వినయ మగధ రాజ్యం రాజు గురించి చెప్పు అనగా..వినయుడు ఇలా చెప్పాడు. మగధకు రాజు ఘనానందుడు. అతన్నే ధననందుడి అని కూడా పిలుస్తారు. అసలు అతడు నంద వంశస్తుడే కాదు. కానీ అతను నంద వంశస్తుడు ఎలా అయ్యాడంటే.. దానివెనకున్న నీచమైన చేరిత్ర ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను.

కొన్ని దశాబ్దాల క్రితం మగధను మహానందడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతను చాలా మంచివాడు. ఇతర రాజ్యాలకు మగధ చాలా ఆదర్శంగా నిలిచేది. మహానందుడికి పెళ్లయి పిల్లలు లేరు. సంతానం కలుగక పోతే రాజ్యం ఏమైపోతుందా అని మొదటి భార్య అంగీకారంతో రెండవ పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యపేరు సునంద దేవి. ఆమె చాల అందగా ఉంటుంది. ఆమెకు కొంత కాలానికి ఇద్దరు కుమారులు జన్మించారు. కానీ ఆమెకు రాజుపై ప్రేమ ఉండేది కాదు. దానికి కారణం వీళ్లిద్దరి మధ్యనున్న వయసు తేడా. అదే సమయంలో ఉగ్రసేనుడు అనే వాడు రాజు దగ్గర ఉద్యోగంలో చేరాడు. అతను చాలా తెలివైనవాడు. కాలక్రమేణా అతను రాజు నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. తద్వారా అతన్ని సర్వసేనాధిపతిగా రాజు నియమించాడు. కానీ, ఉగ్రసేనుడిపై వ్యామోహంతో సునంద దేవి రాజుకు తెలియకుండా అతనితో రహస్య సంబంధం పెట్టుకుంది. అలా చాలా కాలం గడిచింది. ఒకానొక సమయంలో రక్షకభటుల ద్వారా రాజు వీరిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధన్ని తెలుసుకుంటాడు.

తెల్లవారితే విచారణ. రాత్రికి రాత్రే ఒక పెద్ద కుట్ర జరిగింది. ఉగ్రసేనుడు రాజవైద్యుణ్ని ధనం ఇచ్చి లోబరుచుకుని రాజుకు మైకం కలిగించే మందు వేసి అతనికి భయంకర మైన కుష్ఠు వ్యాధి సోకిందని రాజుని నమ్మించాడు.మహా నందుడు తన విడిదీ కోసం గంగానది తీరంలో నిర్మించిన ఏకాంత మందిరంలో రాత్రికి రాత్రే గృహ నిర్బంధం చేశారు. తనకు కుష్ఠు వ్యాధి సోకిందని మహానందుడే నమ్మేశాడు. సునంద దేవి ఇద్దరు పిల్లలు చిన్నవారు అవడం వలన ఉగ్రసేనుడే రాజై సింహనంపై కూర్చోని రాజ్యం చేస్తుండేవాడు. కొంతకాలం తరువాత సునంద దేవి ఇద్దరు పిల్లలు విష ఆహారం తిని చనిపోయారు. చంపించింది ఉగ్రసేనుడే. రాజ్యానికి అసలైన రాజు కుష్ఠు రోగంతో బాధపడుతున్నాడు. వారసులు చనిపోయారు. దీంతో ఉగ్రసేనుడు.. సునంద దేవిని పెళ్లి చేసుకుంటాడు. వీరికి 8 మంది పిల్లలు కంటాడు. రాజ్యానికి అనుకూలంగా ఉంటుందని అతని పేరు మహాపద్మనందుడిగా మార్చుకున్నాడు. ఈ ఉగ్రసేనుడు 8 మంది పిల్లలను కలిపి నవనందులు అని పిలిచేవారు. ఆ కుమారుల్లో పెద్దవాడే గణనందుడు అని చెప్తాడు. కొంత కాలానికి ఈ విషయం మహానందునికి తెలిసింది.

దీంతో మహానందుడు తన మొదటి భార్యతో మహారాణి.. నన్ను మోసం చేసి ఒక కుష్ఠు వానిగా చిత్రీకరించారు. నా వారసుణ్ణి చంపేశారు. ఇప్పుడు ఉగ్రసేనుడి వంశంపై పగతీర్చుకోవడానికి నాకు ఒకటే దారి కనిపిస్తుంది. అదే నాకు మరో వారసుడు పుట్టడం. అందుకోసం గూఢచారుల ద్వారా హిమాలయాల్లో నివసిస్తున్న ఒక వైద్యుడైన మహాముని గురించి తెల్సుకొని.. అతనిచ్చిన ఆకుపసర్ల వల్ల రాణి గర్భం దాల్చడం తెల్సుకొని ఒక శిశువుకి జన్మనిచ్చింది. కానీ ఆ శిశువుని ఉగ్రసేనుడు చంపేస్తాడేమో అని బయపడి.. మహానందుడు ఒక లేఖ రాసి దానిపై రాజముద్ర వేసి.. ఈ లేఖను శిశువుని తీసుకొని అజ్ఞాతవాసంలోకి వెళ్ళు.. సమయం వచ్చినప్పుడు అందరికి ఈ లేఖ చూపించు. నా కుమారుణ్ణి సింహాసం మీద కూర్చుడబెట్టు అని మాట తీసుకొని మహారాణిని అజ్ఞాతంలోకి పంపించేశాడు.

ఈ విషయం తెలిసిన మరుసటి రోజే రాజు ఏకాంత మందిరానికి నిప్పు పెట్టి రాజుతో సహా ఆ మందిరాన్ని బూడిత చేస్తాడు. మహానందుడు చనిపోయాడన్న వార్త విన్న సునంద దేవి ఇన్ని అనర్ధాలు జరగటం ఆమె అని గుర్తించి తన శరీరానికి నిప్పు పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. సునంద దేవి చావుని జీర్ణించుకోలేక ఉగ్రసేనుడు వైరాగ్యం చెంది హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అప్పట్నుంచి గణనందుడే మహారాజై ప్రజలందరినీ చిత్రహింసలు చేస్తున్నాడు. కొంతకాలానికి ఉగ్రసేనుడు కూడా మరణించాడు. ఇప్పడు మనము ప్రయాణం అవుతుంది ఆ ఘననందుని రాజ్యానికి ప్రభు అని వినయుడు చెప్పాడు.

దానికి అలెగ్జాండర్.. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ మహారాణి, శిశువు ఏమయ్యారు అని అడిగాడు. దానికి వినాయుడు ఆ విషయాలు ఎవరికి తెలియవు ప్రభు! వారు కేవలం పీప్లీ వనం వైపు ప్రయాణం అయ్యారు అని మాత్రమే చెప్తాడు. ఇంతకీ ఆ రాణి పేరుఏంటి అని అలెగ్జాండర్ అడిగాడు. మురా దేవి ప్రభు అని వినయుడు సమాధానమిచ్చాడు. ఈమెకు పుట్టిన ఏకైన సంతానమే చంద్రగుప్తమౌర్యుడు.

వినయుడి ద్వారా మగధ రాజ్యం గురించి తెలుసుకున్న అలెగ్జాండర్.. అఖండ భారతాన్ని జయించాలని ముందుకు కదులుతున్నారు. సెల్యూకస్.. నేను విశ్వవిజేతను అవ్వాలంటే.. భారతదేశాన్ని ఖచ్చితంగా జయించాల్సిందే. భారత దేశం అన్ని దేశాల్లా కాదు. దీన్ని జయించడం అతికష్టతరమైనదని నా గురువు అరిస్టాటిల్ అన్నాడు. నేను సింధునది దాటితే చాలు భారతదేశాన్ని గెలిచినట్టే అని పురుషోత్తముడు నాతో అన్నాడు. ఇకనా ద్యేయం భారతావనిలో గ్రీకు జండా పాతడం అని అన్నాడు. మనం సింధు నది ఎప్పటికి చేరుకుంటాం వినయ అని అన్నాడు. సింధునది దాటడానికి ముందు సౌబది, యోధేయ రాజ్యాలు ఉన్నాయి. ఈ రెండు రాజ్యాలు దాటితేనే మనం సింధు నది చేరుకుంటాం ప్రభు అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత సౌబది రాజ్యానికి అలెగ్జాండర్ సేన చేరుకుంది.

ఆ రాజ్యాన్ని చూసి అలెగ్జాండర్ ఆశ్చర్య పోయాడు. ఆ రాజ్యం అత్యంత అందంగా ప్రశాంతమైన దేవతల నగరంలా ఉంది. దాని సౌందర్యం వర్ణానాతీతం. ఆ రాజ్యం కన్నా అక్కడి మనుషులు ఇంకా అందంగా ఉన్నారు. అప్పటివరకు గ్రీకులు అందంగా ఉంటారని భావించిన అలెగ్జాండర్.. అక్కడి ప్రజలను చూసి చిన్నబోయాడు. ఎందుకంటె వారు అంత సౌదర్యవంతంగా ఉన్నారు. వినయ! వీరు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటి అని అడిగాడు. ప్రభు! వీరు శ్రీ కృష్ణుడి వారసులైన వ్రిష్ని వంశస్తులు. వీరి అందానికి, ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వీరు అందమైన అబ్బాయిలను అందమైన అమ్మాయిలకు ఇచ్చి పెళ్లి చేస్తారు. అందువల్ల వీరి సంతానం ఇంకా అందగా ఉంటుంది. ఒకవేళ అంగవైకల్యం ఉన్న శిశువు జన్మిస్తే.. నిర్దయగా ఆ శిశువుని చంపేస్తారు. అందుకే ఇక్కడి ప్రజలు ఇంత సౌదర్యంగా ఉన్నారు అని సెలవిస్తాడు.

ఇక రాజమందిరానికి వెళ్లిన అలెగ్జాండర్.. ఓ రాజా! మీరు నాకు శరణు కండి లేదా యుద్ధం చేయండి అని అంటాడు. దీంతో రాజసభలోని వారంతా ఫక్కున నవ్వారు. మా భారతదేశ సత్తా ఏంటో నీకు ఇప్పటికి తెలియలేదా? మిమ్మల్ని చాల సులువుగా మట్టి కలిపిస్తాం. కానీ అంతకంటే ముందు.. నా పక్కరాజ్యమైన యోధేయ రాజ్యపు రాజు.. మాపై అలిగి కూర్చున్నాడు. శత్రువులందరిని మీరే మట్టి కలిపిస్తున్నారు. మాకు ఒక అవకాశం ఇవ్వమని. మీరు ఆ రాజ్యం గెలిచి మా దగ్గరకు రండి.. అప్పడు చూపిస్తం మా పరాక్రమమేంటో అని సమాధానము ఇస్తాడు. దీంతో అలెగ్జాండర్ తన కళ్ళలోని ధైర్యాన్ని చూసి.. అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

యోధేయ రాజ్యానికి వెళ్లిన అలెగ్జాండర్.. అక్కడి ప్రజలతో మీ రాజు ఎక్కడ అని అడుగుతాడు. అతను ఆవులకు మేత వేస్తున్న వ్యక్తిని చూపించి ఇతనే అని చెబుతాడు. దీంతో ఖంగుతిన్న అలెగ్జాండర్.. అందరూ రాజులను మేము రాజభవనంలో సింహాసనం మీద ఉన్నప్పుడు చూశాను. కానీ ఇదేంటి అని వినయుణ్ణి అడుగుతాడు. దానికి వినాయుడు.. రాజా! ఇక్కడి ప్రజలు పుట్టుకని బట్టి కాకుండా.. ప్రజలకు చేస్తున్న మంచి చెడు, అర్హత, గుణం బట్టి ఓట్ల రూపంలో రాజును ఎన్నుకుంటారు. ఆ రాజు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొవడానికి ప్రజలతో కలిసి సాధారణ జీవితాన్ని జీవిస్తాడు. దీనినే ప్రజాస్వామ్యం అని అంటారు. భారత ఖండంలో ఇలాంటి ప్రజాస్వామ్యం చాలా చోట్ల ఇప్పుడిప్పుడే మొదలవుతుంది ప్రభు అని వినాయుడు చెప్తాడు.

అదివిన్న అలెగ్జాండర్.. భారతీయ విధివిధానాలను చూసి ఎంతో సంతోషిస్తాడు. ఇలాంటి ప్రజాస్వామ్యం ప్రపంచం అంతా ఉంటే.. అసలు బానిస సంకెళ్లు ఉండవు కదా అని మనసులో అనుకున్నాడు. యోధేయ రాజ్యం మహారాజు దగ్గరికి వెళ్లి.. మహారాజ! మీ రాజ్యంపై మేము యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం. మీ సైనికులు ఎక్కడెక్కడ ఉన్నారో పిలిపించండి అని అలెగ్జాండర్ అన్నాడు. అలెగ్జాండర్ నోటా యుద్ధం అనే శబ్దం రాగానే అక్కడున్న ప్రజలు ఆడవారు, మగవారు అని తేడాలేకుండా కత్తులు, బల్లాళ్లు, ఇంకా చేతికి దొరికిన ఏ ఆయుధంతో అయినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటిసారిగా అలెగ్జాండర్..
ఆడవాళ్ళు కత్తి పట్టడం ఈ రాజ్యంలోనే చూశారు.

ఇదేంటని వినయుణ్ణి అలెగ్జాండర్ అడగగా.. ప్రభు! ఈ రాజ్యంలో సైనికులు అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరు ఆడవారితో సహా వారికి 13వ ఏటా రాగానే 21 ఏళ్ళ వరకు అంటే 8 ఏళ్ళు కఠినమైన సైనిక శిక్షను తీసుకుంటారు. అందుకే ఈ రాజ్యాన్ని ప్రతి ఒక్కరు.. ఒక సైనికుడే అని చెప్పాడు. అలెగ్జాండర్.. ఇక యుద్ధం తప్పదు అని నిర్ణయించుకొని ఆ రాజ్యంతో యుద్ధం చేశాడు. రెండు నెలల ఘోర యుద్ధం తర్వాత అలెగ్జాండర్ ఆ రాజ్యాన్ని జయించాడు. అప్పటికే ఎంతో ప్రాణ నష్టం జరిగింది. అయితే అలెగ్జాండర్ కు భారత దేశంలో ఓటమి ఎదురౌతుందని నెమ్మదిగా అర్ధం అవుతుంది. దానికి కారణం ఈ యుద్ధంతో అలెగ్జాండర్ సేన 3వ వంతు మరణించారు.

మరుసటి రోజు ఉదయం తన సైన్యాన్ని ఉత్సాహపరచడం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేసిప్రసంగం ఇచ్చాడు. ఓ గ్రీకు సైనికులారా! నేను మీ ప్రభువైన అలెగ్జాండర్ ని. విశ్వవిజేతని. సాక్షాత్తు దేవుడైన జీయోస్ కుమారుణ్ణి. మీరు నా వారసులు. నాలాగే మీరు దైవకుమారులు. మనకు ఓటమి లేదు. ఎన్నో దేశాల్ని అతిసునాయాసంగా జయించాము. రెండేళ్లుగా భారతదేశ సరిహద్దుల్లో ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఎంతో వీరోచితంగా పోరాడి జయించాం. ఇప్పుడు అసలైన భారతదేశంలోని మనం ప్రవేశిస్తున్నాం. ఈ సింధునదికి అవతల భారత దేశపు అతిపెద్ద రాజ్యాన్ని మనం ఢీకొట్ట బోతున్నాం. ఆ రాజ్యాలతో యుద్ధం చేసి ప్రజలతో తిరిగి వెళ్ళలేమని అందరూ జోస్యం చెబుతున్నారు. కానీ అది అబద్ధం అని మనం నిరూపించాలి. యుద్దానికి సిద్ధం కండి అని పిలుపునిచ్చారు.

అలెగ్జాండర్ చేసిన ఈ ప్రసంగమే.. అతని కొంపముంచింది. సైన్యమంతా! ఒక్కసారిగా బయపడి ఇంతవరకు మనం యుద్ధం చేసింది చిన్న చిన్న రాజ్యాలతోనా. చిన్న చిన్న రాజ్యాలే మనకు చుక్కలు చూపించాయి. ఇక పెద్ద రాజ్యాలను మనం జయించగలమా! పెద్ద రాజ్యాలతో యుద్ధం చేస్తే.. మరణమే అని అందరిలో భయం మొదలయింది. అర్ధరాత్రి అయింది కొంతమంది సైనికులు.. అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి ప్రభు! సింధు నదికి అవతల కొంత మంది సైనికులు ఉన్నట్లు తెలిసింది. వారు మనతో యుధం చేయడానికే వచినట్లున్నారు అని చెప్పారు. దీంతో అలెగ్జాండర్.. సెల్యూకస్ మన సేనను అంతా సింధు నది తీరానికి తీసుకువెళదాం. మన సేనను చూసి.. భారత సైన్యం భయపడుతుంది అని చెప్పి.. ఒక్క గంటలో నది తీరానికి సైన్యంలో అలెగ్జాండర్ చేరుకున్నాడు.

సెల్యూకస్ భారతీయ సైనికులను ఉద్దేశించి.. ఓ భారతీయ సైనికులారా! చీకట్లో మీ ముఖాలు దాచుకున్నారా! లేదా మా గ్రీకు సేనను చూసి పారిపోయారా! అని అన్నాడు. సింధునది అవతల నుండి మొత్తంనిశ్శబ్దంగా ఉంది. ఇంతలో భారతీయ సైన్యం నుండి ఒక కాగడా వెలిగింది. భారతీయ సైనికుడి ఒక చేతిలో కాగడా వెలుగుతుంటే.. మరో చేతిలో ఖడ్గం పట్టుకొని యుద్ధంగా సిద్ధంగా ఉన్నాడు. అతని వీపుకు బల్లాలు, ఒక గొడ్డలి, ఒక గధ, ఒక విల్లు, బాణాలపెట్టే, ఒక అంబుల పొద.. ఇలా ఒక సైనికుడు ఎన్ని రకాలా ఆయుధాలు వాడగలడో.. అన్ని ఆయుధాలు తనకు ఉన్నాయి. పక్కనే మరొక కాగడా వెలిగింది. అతను కూడా ఇలాగే ఆయుధాలు ధరించి ఉన్నాడు. ఇలా వరుసగా కాగడాలతో 3 లక్షల సైనికులు కాగడాలు వెలిగించారు. భారత సైన్యాన్ని చూసిన అలెగ్జాండర్ సేనకు గుండెల్లో గుబులు పుట్టింది. సైన్యం చూసి ముచ్చెమటలు పడుతున్నాయి. ఆ దృశ్యం చూడటానికి ఎలా ఉందంటే.. సింధునదికి ఒకవైపున చీమల దండు ఉంటే.. మరో వైపున ఏనుగులు గుంపు ఉన్నట్లు ఉంది. అది చూసిన గ్రీకు సైనికులకు యుద్ధం చేయడం కాదు కదా.. పారిపోవడానికి కూడా దైర్యం చాలట్లేదు.

సింధు నదికి అటువైపున 3 లక్షల మంది భారతీయ సైనికులు కాగడాలు పట్టుకొని యుద్దానిని సిద్ధం ఉన్నవారిని చూసి గ్రీకు సైనికులే కాదు.. మొట్టమొదటిసారి అలెగ్జాండర్ కూడా భయపడ్డారు. భయపడిన గ్రీకు సైనికులు ప్రాణభయంతో వాళ్ళ గుడారాలకు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఆ రాత్రి అలెగ్జాండర్ సేనలో ఒక్కడికి కూడా నిద్రపట్టలేదు. అలెగ్జాండర్ తో సహా. మరుసటి రోజు తెల్లవారింది. అలెగ్జాండర్ మరల తన సేనను సమావేశమవ్వమన్నారు. అదివిన్న గ్రీకు సైనికులు యుద్ధం చేయమంటాడేమోనని భయపడుతున్నారు. ఆరోజూ ఎవ్వరూ ఊహించని ఒక విషయం జరిగింది. అదేంటంటే! ఓ గ్రీకు సైనికుల్లారా! మనం ఇకపై భారతదేశంపై యుద్ధం చేయట్లేదు. మనదేశానికి బయల్దేరుతున్నాం.. ప్రయాణానికి సిద్ధం కండి అని అన్నాడు. విశ్వవిజేతను అవ్వాలన్న నా కోరికను ఈ రోజే వదిలేస్తున్న అని ఎంతో బాధతో అలెగ్జాండర్ చెప్పాడు.

ఆ మాటలకూ గ్రీకు సైనికులు ఎంతో ఆనందించారు. త్వరలో వాళ్ళ కుటుంబాలను కలువ బోతున్నందకు వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. కానీ వాళ్ళ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. మన భారతీయ రాజ్యాలు అలెగ్జాండర్ కు చుక్కలు చూపించాయి. అలెగ్జాండర్ ప్రశాంతంగా ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు. అలెగ్జాండర్ తమ దేశానికి హిందూ కుష్ పర్వతాలపై నుండి కాకుండా.. సింధునది దాటి సముద్రమార్గం ద్వారా వెళదామని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ఆ మార్గంలో అయితే త్వరగా వాళ్ళ దేశానికి చేరుకోవచ్చు. సింధు నది గుండా వెళ్తుండగా.. చిన్నచిన్న రాజ్యాలు అలెగ్జాండర్ సేనపై దాడి చేసేవి. అక్కడి భారతీయ ప్రతిఒక్క రాజు యుద్దానికి ఆహ్వానిస్తుండగా.. వాళ్ళతో తప్పక యుద్ధం చేసి వెళ్ళిపోతున్నాడు. అలెగ్జాండర్ కు ఓపిక నశించి నశించి విసుగొచ్చేది. అయినా తనకు అడ్డువచ్చిన ప్రతి చిన్న రాజ్యానికి వచ్చి జయించుకుంటే వెళ్ళేవాడు. చిన్నరాజ్యాలు ఒంటరిగా యుద్ధం చేసి ఓడి పోవడం గమనించిన మాళవ, సూద్రక రాజ్యాలు శత్రు రాజ్యాలు అయినప్పడికి అలెగ్జాండర్ ను ఓడించాలని ఒకటై అలెగ్జాండర్ సేనతో యుద్ధం చేస్తుంది. కొన్ని రోజుల పాటు యుద్ధం జరుగుతోంది. ఒకరోజు అలెగ్జాండర్ రణభూమి మధ్యలో వీరోచితంగా యుద్ధం చేస్తున్నప్పుడు అతడికి కొద్దీ దూరంలో మాళవ రాజ్యపు విల్లుకారులు అలెగ్జాండర్ వైపు గురిపెట్టాడు. అలెగ్జాండర్ తన గుర్రంపై కూర్చొని యుద్ధం చేస్తున్నాడు.

ఈ సైనికుడు గురి అలెగ్జాండర్ గుండెపై ఉంది. ఒక్కసారిగా ఊపిరి గట్టిగ పీల్చుకొని విల్లుకు ఉన్న వింటినారిని గట్టిగ వెనక్కి లాగి బాణం వదిలాడు. అధినేరుగా యుద్ధం చేస్తున్న సైనికుల మధ్యలో నుండి, కత్తులు బల్లాల మధ్యలో నుండి, ఏనుగులు గుర్రాల మధ్యలోనుండి దూసుకుంటూ వెళ్తూ అలెగ్జాండర్ ఛాతీపై ఉన్న కవచాలని చీల్చుకుంటూ వెళ్తూ గుండెలో దిగింది. దీంతో అలెగ్జాండర్ ఒక్కసారిగా.. ఆరు అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. ఇది చూసిన గ్రీకు సైనికులు దిగ్బ్రాంతి చెందారు. వెంటనే గ్రీకు సైనికులు బల్లాలను అడ్డుగా పెట్టి అలెగ్జాండర్ శరీరాన్ని మోసుకొని వెళ్లి అక్కడి నుండి పారిపోయారు. అలెగ్జాండర్ పరిస్థితి విషమంగా మారింది. ఆ తరువాత 15 రోజుల పాటు అలెగ్జాండర్ మంచంపైనే నరకయాతన అనుభవించాడు. చనిపోవాల్సిన అలెగ్జాండర్.. వైద్యుల సహాయంతో బతికాడు. ఆ తరువాత అలెగ్జాండర్ స్వయంగా మాళవ, సూద్రక రాజులను కలిసి మీతో మేము పోరాడలేము. మా ఓటమిని అంగీకరిస్తున్నాము. దయచేసి మామ్మల్ని ఇక్కడినుంచి వెళ్లనివ్వండి అని అడిగాడు. దానికిమాళవ, సూద్రక రాజులూ ఒప్పుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత అలెగ్జాండర్ సేన మాసక రాజ్యానికి చేరుకుంది. ఓటమి బాధతో రగిలిపోతున్న అలెగ్జాండర్.. సెల్యూకస్.. మనకు ఎదురువచ్చిన రాజ్యాలను మెరుపుదాడి చేసి చంపండి. అందరిని బందించండి. వీరు అనుకున్నట్టుగానే మసాక రాజ్యంలోని 7000 మంది ప్రజల్ని బంధించాడు. అప్పుడు అలెగ్జాండర్ ఆ రాజునూ కలిసి.. మా సైన్యం తగ్గింది. మీ 7000 మంది ప్రజల్లో మగవారు మాకు సైన్యం కావాలి. ఆడవారు మాకు దాసిగా చేయాలి. లేదంటే మిమ్మలిని ఇక్కన్నే సమాధి చేస్తాం అని బెదిరించాడు. దానికి ఆరాజు.. మీ సైన్యంలో చేరడం కంటే.. మీతో పోరాడి చావడమే నయం. భారతదేశపు రాజులు ఎవ్వరికీ తలవంచరు అని సమాధానమిస్తాడు. ఆ సమాధానానికి కోపంతో ఊగిపోయిన సెల్యూకస్.. వీరినంత చంపేయండి అని గ్రీకు సైన్యాన్ని ఆదేశిస్తాడు. మాసక రాజ్య ప్రజలు వీరోచితగా పోరాడి.. వీరమరణం పొందుతారు.

అలెగ్జాండర్ కు తర్వాత ఎదురైంది. నందేయ గ్రామం. ఆగ్రామంలోని ప్రజలంతా సామాన్య ప్రజలు. వీరికి యుద్ధ విద్యలు రావు. మాసక సైన్యాన్ని చంపింది గ్రీకు సైన్యమే అని తెలుసుకున్న వీరు.. ఎవరి ఇళ్లల్లో వారే ఉండిపోయారు. ఆ గ్రామంపై మెరుపుదాడి చేసిన గ్రీకు సైనికులకు.. ఒక్కరు కూడా కనిపించలేదు. కొంతసేపటికి ‘జై హర జై హర’ అని నినాదాలు వినిపించాయి. కాసేపటికే ‘జైహార జై హర’ అని అన్ని కుటుంబాల్లో నినాదాలు చేశారు. కొన్ని నిమిషాలకే ఆ కుటీరాలు కలడం మొదలయ్యాయి. ఏం జరుగుతుందని చూస్తున్న గ్రీకు సైనికులు.. అన్ని కుటుంబాల తలుపులు తెరుచుకోవడం చూశారు. వాటి నుంచి నిప్పంటించుకొని వస్తున్న మసక రాజ్య ప్రజలు వేగంగా వస్తూ ఒక్కొక్క గ్రీకు సైనికుణ్ణి పట్టుకున్నారు. అందరూ జై హర అనుకుంటూ అక్కడున్న వందలాది గ్రీకు సైనికుల్ని వారితో పాటు అగ్నికి ఆహుతి చేశారు. వీరందరూ యుద్ధం చేయకుండానే వీరమరణం పొందారు. ఆలా మిగిలిన సేనతో సింధునది మార్గాన సముద్రతీరం చేసుకొని పర్షియా రాజధాని అయిన వెబిలోనియాకు అలెగ్జాండర్ చేరుకున్నారు. ఎప్పుడైతే అలెగ్జాండర్ భారతదేశాన్ని జయించలేక తిరిగి వచ్చిందని తెలిసిందో.. అప్ప్పుడే అలెగ్జాండర్ కు తమ రాజ్యంలోని ప్రజల దృష్టిలో గౌరవ మర్యాదలు పోయాయి.

మరుసటి రోజు అలెగ్జాండర్ తన గురువైన అరిస్టాటిల్ దగ్గరికి వెళ్ళాడు. అర్థశాస్త్రం తెచ్చావా అలెగ్జాండర్ అని అడిగాడు. లేదు అన్నట్లుగా అలెగ్జాండర్ తల అడ్డంగా ఊపాడు. పోనీ భారతీయ పండితుల్ని ముఖ్యంగా చాణిక్యుని తీసుకొని వచ్చావా? అని అడిగాడు. దానికి అలెగ్జాండర్ తలను అడ్డంగా ఊపాడు. భారత ఖండాన్ని జయించావా? అని అరిస్టాటిల్ అడగగా.. నన్ను క్షమించండి! నేను ఓడిపోయి వెనుదిరిగి వచ్చేశాను అని అలెగ్జాండర్ సమాధానమిచ్చాడు. దానికి అరిస్టాటిల్ నీ పరాభవాన్ని నేను ముందే ఊహించాను. భారత దేశాన్ని ఇక మర్చిపో.. వెళ్లి విశ్రాంతి తీసుకో. అని అరిస్టాటిల్ అన్నాడు. అలెగ్జాండర్ ఆవేదనతో గురువు మోకాళ్ళమీద పడి గట్టిగా ఏడ్చాడు. భారతదేశాన్ని జయించలేదు అని వేదనతో మద్యానికి అలవాటు అయ్యాడు. భారత దేశం నుండి వెళ్లిన ఒక్క సంవత్సరానికే క్రి. పూ. 323వ సంవత్సరం జూన్ 23వ తారీఖున అలెగ్జాండర్ అనారోగ్యంతో మరణించాడు. అప్పటివరకు అలెగ్జాండర్ ను దైవకుమారుడు అనుకున్నాడు. కానీ భారత దేశం అలెగ్జాండర్ ఒక సాధారణ మనిషి అని ప్రపంచానికి చాటి చెప్పింది.

అలెగ్జాండర్ పుట్టుక ఒక అద్భుతం కానీ.. అతని మరణం మాత్రం ఆవేదన భరితం. తాను 32ఏళ్లకే మరణించాడు. సగం జీవితాన్ని కూడా అతను చూడలేదు. అర్ధ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్.. అర్ధం లేని చావు చచ్చాడు. తాను మరణించిన 24 గంటల్లోనే తన సామ్రాజ్యం మొత్తాన్ని తన సేనాధిపతులో 4 భాగాలు చేసి పంచేసుకున్నారు. తాను చనిపోయిన 5 సంవత్సరాలకే తన తల్లి అయిన ఒలింపియస్ ని అతి కిరాతకంగా హత్య చేశారు. ఆ తరువాత 5 సంవత్సరాలకే అలెగ్జాండర్ భార్య అయిన రుక్సానాని అతని 13 ఏళ్ళ కొడుకుని కసాండ్రా అనే అలెగ్జాండర్ సేనాధిపతి విషం పెట్టి చంపించేశాడు. ఆ తరువాత అలెగ్జాండర్ వంశం కానీ.. అతని రక్తం కానీ ఈ భూమ్మీద ఇక లేదు. అర్థ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్.. కనీసం తన తల్లి, భార్య, కొడుకుని కూడా బ్రతికించుకోలేకపోయాడు.

అలెగ్జాండర్ మరణించాడు.. భారత ఖండానికి అలెగ్జాండర్ ముప్పు తప్పిపోయింది. త్వరలో భారతదేశం స్వర్ణయుగంలోకి అడుగుపెట్టనుంది. కానీ దానికి ముందే చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక సన్నివేశం జరిగింది. అది అలెగ్జాండర్ తక్షశిలపై దాడిచేసిన తర్వాత అంబి సహాయంతో హిందూ ఖుష్ పర్వత ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న రాజ్యాలను అలెగ్జాండర్ జయిస్తున్న సమయం.. అప్పుడోక రోజు 10 మంది గ్రీకు సైనికులు ఒక వ్యక్తి పట్టుకొని అలెగ్జాండర్ ఉన్న గుడారంలోకి తీసుకొని వెళ్లారు. ప్రభు ఇతనొక భారతీయ గూడాచారి మన సైన్యంలో కలిసిపోయి అనుమానాస్పదంగా తిరుగుతుంటే.. ఎంతో కష్టపడి బందించాం.

ఆ వ్యక్తిని చూస్తుంటే అలెగ్జాండర్ కు ఒక గూడాచారిలాగా అనిపించట్లేదు. తన సౌందర్యం, రాజసం, శరీర దృఢత్వం చూస్తుంటే.. అతనొక మహారాజు లాక్ అలెగ్జాండర్ కు అనిపించింది. ఎవరు నీవు, ఏ దురుద్దేశంతో మా సైన్యంతో కలిశావు అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి నా పేరు చంద్రగుప్త మౌర్య. నేను గూడాచారిని కాదు. మిమ్మల్ని చూసి కొన్ని విషయాలు నేర్చుకోవలసినవి ఉన్నాయని మిమ్మల్ని కలవమని మా గురువుగారి ఇక్కడికి పంపించారు. అందుకే ఇక్కడికి వచ్చాను అని సమాధానాం ఇచ్చారు.మీ గురువుగారి పేరేంటి? అని అలెగ్జాండర్ అడిగారు. దానికి చంద్రగుప్తుడు.. ఆర్య! చాణిక్యుల వారు అని గంబీరంగా సమాధానం ఇస్తాడు.

చాణక్య అనే పదం వినగానే అలెగ్జాండర్ ఒక్కసారిగా తన సింహాసనం పై నుండి లేచి చంద్రగుప్తునికి దగ్గరికి వచ్చాడు. వారిద్దరూ ఒకరికొక్కరు దగ్గరగా నిల్చొని ఉన్నారు. బహుశా చరిత్రలో ఇంతకంటే.. మహావీరులు కలిసి ఉన్న దృశ్యం మరొకటి లేదేమో. వీరిద్దరిని చూస్తుంటే ఒకేసారి ఆకాశానికి ఒకవైపు అస్తమించడానికి సిద్ధంగా ఉన్న సూర్యుడు.. మరో వైపు అప్పుడే ఉదయిస్తున్న మరో సూర్యుడు ఉన్నట్లు అనిపించింది. తన సైనికులందానిని గుడారం నుండి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. చాణిక్యుడు బ్రతికే ఉన్నాడా అయితే నేను ఊహించింది నిజమే అన్నమాట. అతనుఅంత సులువుగా చావడు. అర్ధం అయింది! రాజు ఎలా ఉండాలో తన గుణగణాలు, తన వీరత్వం, ఆలోచనా విధానం తన రాజసం, విశ్వవిజేత అంటే ఎలా ఉండాలో నన్ను చూసి నేర్చుకోవడానికి నన్ను చూసి చాణిక్యుడు ఇక్కడికి పంపించాడు అన్నమాట. అని అలెగ్జాండర్ అని అన్నాడు.

విశ్వవిజేత.. అసలిక్కడ ఎవరు ఉన్నారు అని అలెగ్జాండర్ ను చంద్రగుప్తుడు అడిగాడు. దానికి అలెగ్జాండర్.. అర్థ ప్రపంచాన్ని జయించాను.. త్వరలో భారత ఖండాన్ని కూడా జయించి గ్రీకు జండాను పాతబోతున్నాను. నువ్వే చెప్పు! నీ దేశాన్ని జయించిన తర్వాత నన్ను యేమని పిలుస్తావో అని అలెగ్జాండర్.. చంద్రగుప్తుణ్ణి అడిగాడు. దానికి చంద్రగుప్తుడు నిన్ను నేను పరదేశి అని పిలుస్తాను అని సమాధానమిచ్చాడు. అయినా భారత ఖండాన్ని జయించడం దైవ కుమారుడు అని చెప్పుకునే నీ తరం కాదు కదా నిన్ను పుట్టించిన దేవుని తరం కూడా కాదు అని సమాధానమిచ్చాడు. అయినా నువ్వే చెప్పు యుద్ధం చేయడం ఎవరి లక్షణం అని అడిగాడు. దానికి అలెగ్జాండర్.. ఒక రాజు లక్షణం అన్నడు. మరి ఎప్పుడు యుద్దని కోరుకోవడం ఎవరి లక్షణం అని అడిగాడు. ఒక విశ్వవిజేత లక్షణం అని అలెగ్జాండర్ అన్నాడు. యుద్ధం గెలిచి ఏం చేస్తావు అని చంద్రగుప్తుడు అడిగాడు. రాజ్యాన్ని పాలిస్తా.. ప్రజల్ని కన్నా బిడ్డలాగా చూస్తా అని అన్నాడు. దానికి చంద్రగుప్తుడు.. ఒక చిన్న నవ్వు నవ్వి.. రాజ్యాలపై దండెత్తి మా ఆస్తులు నాశనం చేసి మా సంపదను దోచుకొని మా ఆప్తులను చంపి తర్వాత మమ్మల్ని కన్న బిడ్డల్లాగా చూసుకుంటావా? ఎంత అజ్ఞానం అని అన్నాడు.

చంద్రగుప్తుని సమాధానానికి అలెగ్జాండర్ నివ్వెరపోయారు. తనని ఏం మాట్లాడాలో తెలియక ఇన్ని యుద్దాలు చేస్తుంది. చరిత్ర పుటల్లో నాపేరు చిరస్థాయిగా నిలిచేందుకు అని అన్నాడు. దానికి చంద్రగుప్తుడు.. అలెగ్జాండర్ అనే 5 అక్షరాలు చరిత్ర పుటల్లో నిలిచిపోవడానికి ఇన్ని లక్షల ప్రాణాలు బలితీసుకోవాలా? ఇది న్యాయమా నువ్వే ఆలోచించు అలెగ్జాండర్ అని అన్నాడు. ఆ మాటలు నిజంగానే అలెగ్జాండర్ ను ఆలోచింపజేశాయి. ఇప్పటివరకు అలెగ్జాండర్ తో ప్రతిఒక్కరు అయితే భయంతోనే, లేదా స్వార్థం తోనోఅందరూ యుద్ధాలు చేసే విధంగా ఆలోచించారు తప్ప ఎవ్వరు నిస్వార్ధంగా అలెగ్జాండర్ ను ఆలోచింపజేషేలా మాట్లాడలేదు. బహుశా భారతఖండంపైనా యుద్దాన్ని విరమించుకొని తన దేశానికి తిరిగిపోవాలన్న ఆలోచన మొట్టమొదటి సారిగా అలెగ్జాండర్ కు చంద్రగుప్తుని వల్లే కలిగిందేమో. ఇంతలో చంద్రగుప్తుడు నేను వచ్చిన పని అయిపోయింది అలెగ్జాండర్ ఇక నేను వెళతాను అని చెప్పి అక్కడినుంచి నడుచుకుంటూ గుడారం నుంచి వెల్లిపాయాడు.

వెంటనే అలెగ్జాండర్ తేరుకొని.. ఆ వ్యక్తిని వెళ్లనివ్వకండి అతన్ని బంధించి తీసుకురండి. అని ఆదేశించాడు. కొంత సమయం తరువాత ఒక సైనికుడు అలెగ్జాండర్ దగ్గరకు వచ్చి.. ప్రభు మేము చాలా వెతికాం. కానీ ఎలా మాయమైపోయాడో తెలియదు కానీ అతను మాకు దొరకలేదు ప్రభు. మీ దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడే మేము అతన్ని తెలివిగానే బందించాం. కానీ ఇప్పడు పట్టులేకపోయాం ప్రభు అని సైనికులు అన్నారు. అదివిన్న అలెగ్జాండర్ పిచ్చివాళ్ళరా! మీరు అతన్ని బంధించలేదు. నన్ను కలువడానికే మీకు అతను కావలనే దొరికిపోయాడు. వీడు తన గురువు చాణిక్యుని లాగే అని అన్నాడు.

కొన్ని రోజుల తరువాత చాణిక్యుడు తక్షశిల అడవుల్లో రహస్యంగా ఒక కుటీరం పైన గ్రంథాలు చదువుతున్నప్పుడు చంద్రగుప్తుడు తన గుర్రంపైన ఆ కుటీరం దగ్గరికి వచ్చాడు. గురువుగారికి నమస్కారం చేసి ముందుకు రాబోతుంటే. అక్కడే ఆగు చంద్రగుప్తా! అలెగ్జాండర్ దగ్గర నువ్వేమి నేర్చుకున్నావు చెప్పు అని అడిగాడు. ఒక రాజు ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానానికి చాణిక్యుడు సంతోషించి అతన్ని లోపలి రమ్మన్నాడు. ఒకవేళ చంద్రగుప్తుడు కనుక అలెగ్జాండర్ లాంటి వీరుణ్ణి నేను ఇప్పటివరకు చూడలేదు అని ఉంటె చంద్రగుప్తుడు కూడా మరో అలెగ్జాండర్ లా అవుతాడా కానీ.. ఎప్పటికి చాణిక్యుడు కోరుకుంటే భారతీయ చక్రవర్తి కాలేదు. అందుకే చంద్రగుప్తుడు సమాధానానికి చాణిక్యుడు ఎంతో ఆనందించాడు.

చంద్రగుప్తుడు నేరుగా వచ్చి చాణిక్యుని పాదాలకు నమస్కరించాడు. అతన్ని ఆశీర్వ దించి పైకి లేపి.. నీవు వేరొకరి పాదాల పైన పడటం ఇదే చివరిసారి. నేటి నుంచి నీవు భారతదేశానికి కాబోయే సామ్రాట్టువి. నీ మాట, నడక, నడవడిక, ఆలోచనా విధానం అన్ని ఒక చక్రవర్తిలానే ప్రవర్తన ఉండాలి అని చాణిక్యుడు అన్నాడు. దానికి చంద్రగుప్తుడు మీ నమ్మకాన్ని పొందినందుకు నేను ధన్యుణ్ణి గురుదేవ! అని ఆయనకి నమస్కరించాడు. ఆరోజునుంచే చంద్రగుప్తునికి కఠిన మైన్ యుద్ధ విద్యలు నేర్పించడం మొదలుపెట్టాడు. ఒక చక్రవర్తికి అవసరమైన అన్ని విద్యల్లో చాణిక్యుడు కఠోర శిక్షణను ఇచ్చాడు. ఇలా కొన్నేళ్ల కాలం గడిచింది. ఇంతలో అలెగ్జాండర్ భారతదేశాన్ని వదిలిపారిపోయి కొంతకాలానికి చనిపోయాడు అన్న వార్త చాణిక్యునికి తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రగుప్తా! సమయం వచ్చింది ప్రయాణానికి సిద్ధం అవ్వు. మనం నేపాల్ రాజ్యానికి వెళ్తున్నాము అని చాణిక్యుడు అన్నాడు.

ఇంతలో మగధ రాజ్యంలోని పాటలీపుత్ర రాచకోటలో ప్రధాన మంత్రి అయిన రాక్షసుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఏదో జరుగుతుంది. నంద వంశాన్ని సమూలంగా నాశనం చేస్తానని చాణిక్యుడు శపథం చేశాడు. అలెగ్జాండర్ చాణిక్యున్ని చంపేశాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ చాణిక్యుడు బ్రతికే ఉన్నట్లు రోజుకో పుకారు వినిపిస్తుంది. ఇక్కడ చూస్తే.. రాజ్యంలో కొత్త మార్పు. ముఖ్యంగా నందుల ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఘననందునితో సహా నంద సోదరులు రాక్షసునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ హటాత్తు మార్పుకు కారణం ఏంటో తెలుసుకొమ్మని గూడాచారులని పంపించారు. కొన్ని రోజుల తర్వాత ఓ గూడాచారి రాక్షసుడి దగ్గరకు వచ్చి మంత్రివర్యా పాటలీపుత్ర పొలిమేరలో ఉన్న రాజగురువు సుభుద్రుల వారి ఆశ్రమానికి జీవసిద్ధి అనే సన్యాసి వచ్చారు. ఆయనకి భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో జరిగే విషయాలన్నీ తెలుసు. ఆయన సర్వజ్ఞాని. ఈ నంద కుమారులు 8 మంది ప్రతివారం ఆయనను రహస్యంగా కలుస్తున్నారు. నందుల ప్రవర్తనలో మార్పుకు కారణం ఆయనే ప్రభు. అని సమాధానం ఇచ్చారు.

మరి ఈ విషయం రాజగురువు సుబుద్ధుల వారికి తెలుసా? అని అన్నాడు. ఆయనకు కూడా తెలియదు అని గూఢచారి అన్నాడు. అసలు ఆశ్రమంలో ఏం జరుగుతుందని రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు. సమయం రానే వచ్చింది. మరలా ఘణానందునితో పాటు నంద సోదరులు అందరూ జీవసిద్ధి ఆశ్రమానికి వెళ్లారు. చాతుర్వర్ణాలలో అగ్రవర్ణాలు ఎవరు అని జీవసిద్ధి అడిగాడు. ఇంకెవరు స్వామి బ్రాహ్మణులే అని ఘనానందుడు అన్నారు. ఎందుకు బ్రాహ్మణులూ అగ్రవర్ణం అయ్యారు అని అడిగాడు. దానికి ఘణానందుడు బ్రాహ్మణులు వేదాలన్నీ అధ్యయనం చేస్తారు. కాబట్టి వారికీ ప్రతిచోటా అంటే దేవాలయాల్లో, విద్యాలయాల్లో ఆశ్రమాల్లో చివరికి రాజమందిరంలో కూడా సలహా దారులుగా భ్రాహ్మణులదే అగ్రస్థానం అని అంటాడు. మరి మిగిలిన వర్ణాలు వేదాలు చదవట్లేదా? అని జీవసిద్ధి అడిగాడు. దీనికి ఘనానందుడు.. క్షత్రియులు కేవలం యుద్ధవిద్యలు, రాజు పరిపాలన సంబందించిన వేద భాగాన్ని మాత్రమే అధ్యయనం చేస్తారు. పూర్తిగా వేదాన్ని అధ్యయనం చేసే ఓపిక వారికీ లేదు. వైశ్యులు అధర్వణ వేదంలో ఉన్న ధన భాగానికి సంబందించిన వేద భాగాన్ని మాత్రమే అధ్యాయనం చేస్తున్నారు. పూర్తివేదాన్ని అధ్యాయనం చేసే తీరికి వారికీ లేదు. ఇక మిగిలింది శూద్రులు.. పాపం వారికీ నేర్పించేవాళ్లే లేరు అని సమాధానం ఇచ్చాడు. దానికి జీవసిద్ధి నీవన్నది అక్షర సత్యం.. చాణిక్యుడు ఏ నమ్మకంతో నంద వంశాన్ని నాశనం చేస్తాను అన్నాడో తెలుసా? అగ్రవర్ణానికి చెందిన మీ రాజగురువైన సుబుద్ధుల వారిని చూసి. ఆయనే మీ వంశ నాశనానికి కారణం అవుతాడు అని చెప్తాడు. ఇంతలోకే ఆ గుడారంలోకి సుబుద్దుల వారు వస్తారు. ఘణానంద! ఏమి జరుగుతుంది ఇక్కడ! నా ఆశ్రమంలో నా గురించే చెడుగా మాట్లాడుకుంటున్నరా? మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్ధం అవుతుందా? అని రాజగురువు సుబుద్ధుల వారు ప్రశ్నించారు.

దానికి ఘనానందుడు నాకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది. నువ్వు చాణిక్యునితో చేతులు కలిసి మమ్మల్ని ఇప్పుడిప్పుడే నాశనం చేయాలని చూస్తున్నారా? అని మండిపడ్డారు. ఇది నీఆశ్రమమా! నీవు 16 ఏళ్లుగా ఈ ఆశ్రమానికి వచ్చిందే లేదు. ఈ ఆశ్రమం యొక్క ఖర్చు అంతా 16 ఏళ్లుగా నేనే భరిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇది నా ఆస్తి. తక్షణమే బయటకిపో అని హెచ్చరించారు. ఆ అవమానాన్ని భరించలేని సుబుద్ధుల వారు నీవు ఒక ఉత్తమ వంశ బ్రాహ్మణుడితో మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోకు గణానంద అని అన్నారు. దానికి ఘనానందుడు అంటే నంద సోదరులంతా! వర్ణ సంకర జాతి వాళ్ళమనా నీ ఉద్దేశ్యం అని అడిగాడు. ఆ విషయం నేను ప్రత్యేకంగా చెప్పాలా అని అన్నాడు.

ఆ మాట పూర్తి అవ్వగానే ఘానానందుడు సుబుద్ధుల వారి చెంప చెళ్లుమని గట్టిగా కొట్టాడు. వెంటనే పక్కన ఉన్న జీవసిద్ధి.. ఘనానంద శాంతి శాంతి. అహింసే పరమధర్మం అని అన్నారు.అప్పుడు సుబుద్దుల వారికి అర్ధం అయింది. వెంటనే సుబుద్దుల వారు గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. చాణిక్యుడు శపథం చేసిన నందవంశం నాశనం మొదలైందని గట్టిగా నవ్వుకుంటూ.. సుబుద్ధాల వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. అలెగ్జాండర్ చనిపోయాడన్న వార్త విన్న చాణిక్యుడు చంద్రగుప్తుడితో కలిసి నేపాల రాజ్యానికి బయల్దేరాడు. కొన్ని రోజులకు రాజ్యం చేరుకున్నాడు. ఆ రాజ్యపు రాజు పర్వతకుడు.. ఇదివరకే అలెగ్జాండర్ తో పొత్తు కుదుర్చుకుని సంధి చేసుకున్నాడు. అందువల్ల ఆ రాజ్యంలో సగం మంది గ్రీకు సైనికులే ఉన్నారు. చాణిక్యుడు నేరుగా రాజుకోటకు వెళ్ళి.. అక్కడ మహారాజుని కలిశాడు. మహారాజు పక్కనే ఆ రాజ్యపు సేనాధి పతిగా ఒక గ్రీకు వ్యక్తి ఉన్నాడు. ముందుగా పర్వతకుడికి నమస్కరించి అక్కడే ఉన్న గ్రీకు సైన్యాధిపతిని ఉద్దెశించి మీ మహారాజు అయిన అలెగ్జాండర్ మరణ వార్త విని మేము చాలా చింతిస్తున్నాము. అతను ఒక యోధుడు. యుద్ధాన్ని కాంక్షించాడే తప్ప ఏనాడు విలువలు తగ్గి జీవించలేడు. బహుశా! అతను భారత దేశానికి వచ్చి ఉండాల్సింది కాదు అని అన్నాడు.

చాణిక్యుడి సానుభూతికి అక్కదున్న గ్రీకు సైనికులు సంతోషించారు. అతని మాటలకు పర్వతకుడు కూడా సంతోషించాడు. ఇంతకీ మీరు ఏ పని మీద మా రాజ్యానికి వచ్చారని చాణిక్యుడిని అడిగారు. దానికి చాణిక్యుడు.. మీ రాజ్యపు సైన్యం మొత్తం మాకోసం మగధ రాజ్యం కోసం యుద్ధం చేయాలి. దానికోసం మీ సహాయం కావలి అని అడిగాడు. దానికి ఆ పక్కనే ఉన్న సేనాధిపతి మేము మీకు ఎందుకు సహాయం చేయాలి అని అడిగాడు. మేము మగధను జయించచ్చు కదా అన్నాడు. దానికి చిన్నగా నవ్విన చాణిక్యుడు! మీ మహారాజు అయిన అలెగ్జాండరే సింధునది తీరంలో మగధ సైన్య బలాన్ని చూసి తిరిగి వెళ్ళిపోయాడు. మగధను జయించడం మీ వల్ల కాదు. ఈ లోకంలో మగధ రాజ్యాన్ని ఎవరైనా జయించగలరంటే.. అది ఈ చంద్రగుప్తుడు మాత్రమే అని అన్నాడు.

దానికి ఆ సేనాధిపతి ఇతను అంత యోధుడా. అలెగ్జాండర్ తానా ఖాళి సమయంలో నాతో కత్తియుద్దం చేసేవాడు. కానీ ఒక్కసారి కూడా నాపైన గెలవలేదు. మీ చంద్రగుప్తుడు నాతో కత్తి యుద్ధం చేసి గెలిస్తే.. అతను అలెగ్జాండర్ కన్నా గొప్పవాడు అని, మగధ రాజ్యాన్ని జయించే మొనగాడు అని మేము నమ్ముతాము అని అంటాడు. నాతో పోరాటానికి సిద్ధమా అని అడిగాడు. ఆ మాటలు విన్న చంద్రగుప్తుడు.. వెళ్ళమంటారా గురువుగారు అన్నట్లుగా చాణిక్యునివైపు చూశాడు. దానికి చాణిక్యుడు మహారాజైన పర్వతకుడిని చూసి మీరు అనుమతిస్తే ఈ సవాల్ కు మేము సిద్ధం అని అంటాడు. దానికి పర్వతకుడు సరే అని అన్నాడు.

చంద్రగుప్తుడు గ్రీకు సేనాధిపతి ఎదురెదురుగా నిల్చున్నారు. ఇద్దరి చేతులు వాళ్ళ ఒరలో ఉన్న కట్టి పిడులపై ఉన్నాయి. అంతా నిశ్శబ్దం ఒక్కసారిగా ఘల్ అనే కత్తులు ఢీకొన్న శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి వారిద్దరి వేగానికి ఒక్కసారిగా ఆ సభ అంటా ఉలిక్కి పడింది. వారిద్దరి మధ్య కట్టి యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. ఎవ్వరు తగ్గట్లేదు. ఆ పోరాటం కొన్ని నిమిషాల వరకు సాగింది. ఆ 45 ఏళ్ళ సేనాధిపతితో 20 ఏళ్ళ నూనూగు మీసాల బాలుడు సమఉచిగా పోరాడుతున్నాడు. ఒక పక్క చంద్రగుప్తుణ్ణి చూస్తుంటే.. మగధకు అసలైన రాజైన మహానందుణ్ణి చూస్తున్నట్లు అనిపించింది. ఒకానొక సమయం వచ్చే సరికి చంద్రగుప్తుడు తన కత్తితో గ్రీకు సేనాధిపతి కత్తిని తిప్పుతూ అతిధి కత్తి ఓరలోనే గ్రీకు సైనికుడి కత్తిని పోనిచ్చేలా చేసి అతని చేతిని విదిలించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. చంద్రగుప్తుడు కత్తి యుద్ధాన్ని చూసిన అక్కడి వారంతా చప్పట్లు కొట్టారు.

అప్పుడు ఆ గ్రీకు సేనాధిపతి చాణిక్యా! మీరు అన్నట్లుగానే ఇతను మహా యోధుడు మగధను జయించగల సమర్థుడని మేము నమ్ముతున్నాము అని అన్నాడు. చంద్రగుప్తుని వైపు చూసి మహావీరునివే. నాతొ సమానంగా బాగా పోరాడవు అని అన్నాడు. దానికి చంద్రగుప్తుడు మీతో సంధి చేసుకోవడానికి వచ్చి.. రక్తపు చుక్క చిందించడం ఎందుకు అని చాలా జాగ్రత్తగా పోరాడాను అని అన్నాడు. ఆ మాటలు విన్న సేనాధిపతి, సభలోని వారందరు.. ఇతను నెమ్మదిగా పోరాడితేనే ఇలా ఉంది అంటే.. ఇంకా వీరోచితంగా పోరాడితే ఎలా ఉంటుంది అని అనుకున్నారు.

చంద్రగుప్తుని పరాక్రమం చాణిక్యుని ఆత్మవిశ్వాసం చూసిన పర్వతకుడు.. మీరు అడిగినట్లే మేము మీకు సైనిక సహాయం చేస్తాము. దానికి ప్రతిగా మీరు మాకు ఏం చేస్తారు అని అన్నాడు. దానికి చాణిక్యుడు.. మీరు మాకు సహాయం చేయడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. మీ సహాయంలో మేము మగధను జయించిన తర్వాత మీ రాజ్యపు సైనికుల మొత్తానికి ఎప్పటికి మేమే.. రెండింతల జీత భత్యాలు చెల్లిస్తాము అని చెప్పాడు. అప్పుడు చాణిక్యుడు చంద్రగుప్తునితో మన తదుపరి ప్రయాణం పురుషోత్తముడి పౌరు రాజ్యానికి అని చెప్తాడు. ఇప్పుడు మనకు ఎంతటి శత్రువునైనా తన ఏనుగుల పాదాల కింద తొక్కి నాశనం చేయగల గజదళం ఉన్న పురుషోత్తముడి పౌరు రాజ్య సహాయం అవసరమని ఆ రాజ్యానికి బయల్దేరారు. కొన్ని రోజుల తర్వాత రాజ్యానికి చేరుకున్నారు. రాజ్యసభకు వెళ్లి పురుషోత్తముని కలిశారు. పర్వతకున్నీ అడిగినట్లే.. పురుషోత్తముడిని అడిగాడు. దానికి పురుషోత్తముడు మగధ రాజ్యాన్ని పట్టి పీడిస్తున్న నంద వంశాన్ని నాశనం చేయడానికి నా సైనిక బలాన్ని నీకు ఇస్తాను.. కానీ దానికి ప్రతిఫలంగా నాకు ఒక్క చిన్న విన్నపం ఉంది అని పురుషోత్తముడు అన్నాడు. అదేంటో అడుగు పురుషోత్తమా అని చాణిక్యుడు అడిగాడు.

అదిమీకు ఏకాంతముగా చెప్తాను. భటులరా చంద్రగుప్తుల వారిని మన ఏకాంత మందిరానికి తీసుకువెళ్లి అక్కడ ఒక చక్రవర్తికి చేయవలసిన సకల రాజమర్యాధలు చేయండి అని ఆదేశిస్తాడు. చంద్ర గుప్తుడు అక్కడినుంచి ఏకాంత మందిరానికి వెళ్లిన తర్వాత పురుషోత్తముడు చాణిక్యునితో మాట్లాడటం మొదలు పెట్టాడు. మా పౌరు రాజ్యానికి కొంత దూరంలో ఉన్న సింహపురి రాజ్యపు రాజు విజయవర్మ నాకు బావమరిది. అతని కూతరు సింహపురి యువరాణి శాంతవతి మా మేనకోడలు. ఇప్పుడు ఆమె మాతోనే ఉంది. ఆమెను కాబోయే సర్వ సామ్రాట్టు అయిన చంద్రగుప్తునికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా మా కోరిక అని పురుషోత్తముడు అన్నాడు. చాణిక్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. శుభం అని అన్నాడు. అలా కొద్దిసేపు వీరిధ్దరూ వ్యూహాల గురించి చర్చించుకుంటున్నారు. చంద్రగుప్తుణ్ణి రాజమందిరంలోకి తీసుకొనివెళ్ళి చక్రవర్తికి చేయవలసిన అన్ని గౌరవ మర్యాదలు చేస్తున్నారు. ఇంతలో ఒక స్త్రీ చంద్రగుప్తుని కోసం పళ్ళు ఫలహారాలు తీసుకొని వచ్చింది. ఆమె చూడటానికి అందరిగా కాకుండా అత్యంత సౌందర్యంగా రాజకుటుంబానికి చెందిన స్ట్రీలా అనిపించింది. ఆమెను చూసి మీరెవరు అని చంద్రగుప్తుడు అడిగాడు. దానికి సమాధానంగా ఆ స్త్రీ పక్కనే ఉన్న ఒక చెలికత్తె.. ఈమె సింహపురం యువరాణి శాంతవతి అని సమాధానం ఇచ్చింది.

అదివిన్న చంద్రగుప్తుడు ఒక్కసారిగా లేచి ఆమెకు గౌరవ ప్రదంగా నమస్కారం చేశాడు. మిమ్మల్ని చూడగానే మీరు ప్రత్యేకమైనవారు అని నాకు అనిపించింది అని చంద్రగుప్తుడు అన్నాడు. అది విన్న శాంతవతి సిగ్గుపడుతూ అక్కడినుంచి వెళ్లిపోయింది. ఈమె నను చూసి ఎందుకు సిగ్గు పడుతుంది అని చంద్రగుప్తునికి అర్ధం కాలేదు. ఇంతలో చాణిక్యుడు చంద్రగుప్తుని దగ్గరికి వచ్చి.. చంద్రగుప్త! వెంటనే మీ తల్లికి వర్తమాన లేఖ పంపించు అని అన్నాడు. ఏ వార్త పంపాలి గురుదేవ! అని చంద్రగుప్తుడు అడిగాడు. దానికి చాణిక్యుడు నీకు వివాహం నిశ్చయం అయిందని అని సమాధానం ఇచ్చాడు. నాకు వివాహమా! అని చంద్రగుప్తుడు ఆశ్చర్యపోయాడు. అవును చంద్రగుప్తా! సింహాపురి రాజ్యపు యువరాణి అయిన శాంతవతితో నీకు వివాహం చేయమని పురుషోత్తముడు అడిగాడు. ఇది ఒక రకంగా మనకు అదృష్టం. ఎందుకంటే.. మనతో సంధి కోరుకోకుండానే సింహపురి రాజ్యపు సైన్యం మనకు స్వంతం అయింది. ఇప్పడు నేపాల, పౌరు, సింహపురి రాజ్య సైన్యం మన సొత్తు అని అన్నాడు. పైగా వివాహ కానుకగా వివాహం జరిగే రోజే సింహపురి రాజుగా నీకు పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాడు. మగధ పై యుద్ధానికి కావలిసిన ధనం, సైన్యంతో మనం సిద్ధంగా ఉన్నాం. ఘనానందుని నంద వంశ నాశనానికి ఇక ముహూర్తం పెడతాను అని చాణిక్యుడు కోపంగా చంద్రగుప్తునితో అన్నాడు.

ఇక్కడ పాటలీపుత్రలో తన ఆశ్రమంలోనే సుబుద్దుల వారిని ఘననందుడు అవమానించి పంపించివేశారన్న విషయం రాక్షసుడిని తెలిసింది. మరుసటి రోజు భటులను పిలిచి నందులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయమని ప్రధాన మంత్రి రాక్షసుడు చెప్పాడు. కొంత సమయం తర్వాత ఆ భటుడు రాక్షసుని దగ్గరికి వచ్చి మంత్రివర్యా! నందులు సమావేశం అవ్వడానికి వారికి తీరిక లేదని మీరు చెప్పామన్నారు అని సమాధానం ఇచ్చాడు. నందులకు తీరికలేదా? నేనే స్వయంగా వెళ్లి మాట్లాడుతాను అని నందుల ఏకాంత మందిరానికి రాక్షసుడు వెళ్ళాడు. తీరా వెళ్లి చూస్తే.. అక్కడ నందులు 8 మంది మద్యపానం తాగుతూ వేశ్య నృత్యం చేస్తుంటే వారిని చూస్తూ. మైకంలో విళాసంగా గడుపుతున్నాడు. అది చూసిన రాక్షసుడు.. ఘనానంద! అని ఘట్టిగా అరిచాడు. ఘానానందునికి అది వినిపించినా.. వినిపించనట్టే రాక్షసుణ్ణి పట్టించుకోలేదు. అది గమనించిన రాక్షసుడు.. అవమానంతో అక్కడితో వెళ్ళిపోయాడు. రాక్షసుడికి ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు.

ఎందుకని హఠాత్తుగా నందులు అతన్ని వ్యతిరేకిస్తున్నారు అని ఆలోచనలో రాక్షసుడు పడ్డాడు. కానీ రాక్షసునికి తెలియని విషయం ఏంటంటే.. ఇదంతా చాణిక్యుని వ్యూహం అని కొన్ని నెలల క్రితం చాణిక్యుడు జీవసిద్ధిని కలిసి స్వామి! గాడి తప్పిన మగధ రాజ్యపు పాలనను దారిలో పెట్టడానికి నీకు సహాయం కావలి. ఈ సహాయం నాకోసం కాదు. నేనెను భరతమాత తరుపున అడుగుతున్నాను. నంద వంశాన్ని అంతం చేయకపోతే భరతమాత పిల్లలు అందరూ చెల్లాచెదురైన వారిలో వారే కొట్టుకొని పరాయిదేశపు వాళ్లకు తామే స్వయంగా తాకట్టు పెడతారు. కాబట్టి మనం భరతమాత ఋణం తీర్చుకునే సమయం వచ్చింది. నంద వంశాన్ని అంతం చేయాలంటే.. ఘననందుని రాజగురువైనా సుబుద్ధుల వారిని, ప్రధానమంత్రి రాక్షసుణ్ణి వారికి దూరం చేయాలి. వారి మధ్య భేదం సృష్టించాలి. అది మీ మధ్యే అవుతుంది. దయచేసి మీరు సహాయం చేయండి అడిగాడు. దానికి ఒప్పుకొని జీవసిద్ది మగధకు చేరుకొని ఘనానందుని నమ్మకాన్ని సంపాదించి నందవంశానికి సుబుద్ధుల వారిని, రాక్షసుణ్ణి దూరం చేశాడు.

చంద్రగుప్తుని వివాహానికి అన్ని రాజ్యాల ప్రముఖులు సింహపురి రాజ్యానికి వచ్చారు. అంగరంగ వైభవమగా మేళ తాళాలతో వేద మంత్రాల సాక్షిగా చంద్రగుప్తుని వివాహం జరిగింది. అదే రోజున సింహపురి రాజు విజయవర్మ తన రాజ్యాన్ని కానుకగా చంద్రగుప్తునికి ఇచ్చి చంద్రగుప్తుని సింహపురికి రాజుని చేశాడు. ఎవరూ ఊహించని విషయం ఏంటంటే.. అదే రోజున పురుషోత్తముడు కూడా తన రాజ్యాన్ని చంద్రగుప్తునికి కానుకగా ఇచ్చారు. ఇప్పడు చంద్రగుప్తుడు పురుషోత్తముడి పౌరు రాజ్యానికి, విజయవర్మ సింహపురి రాజ్యానికి రాజు. ఈ వివాహమే రాబోయే భారతదేశ స్వర్ణయుగానికి నాంది పలికింది. మరుసటి రోజు సాయంత్రం చాణిక్యుడు, చంద్రగుప్తుడు, మురాదేవి ఒక ఏకాంత మందిరంలో సమావేశమయ్యారు. అప్పుడు చాణిక్యుడు మురాదేవి! చంద్రగుప్తుని జన్మరహాస్యం ఏంటో అతను తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ నోటితోనే అతని జన్మరహస్యాని, జరిగిన అన్యాయం, మీకు జరిగిన ద్రోహం గురించి చెప్పండి అని అన్నాడు.

దానికి మురాదేవి! కన్నీళ్లతో చంద్రగుప్తుడే మగధ రాజ్యానికి అసలైన వారసుడని తన తండ్రి మహానందునికి జరిగిన వెన్నుపోటు గురించి ఇంకా ఎంత దారుణంగా మహానందుణ్ణి మంటల్లో కాల్చి చంపారు అనే విషయం చంద్రగుప్తునికి వివరించింది. జరిగిన గతం తెలుసుకున్న చంద్రగుప్తుడు.. ఆవేశంతో రగిలిపోతున్నారు. తన తండ్రిని హత్య చేసిన నందుణ్ణి ఎలాగైనా అంతం చేయాలని నిశ్చయించుకున్నాడు. నందుల తలల్ని తీసుకొని వచ్చి.. తన తల్లి కాళ్ళ దగ్గర పడేసి తన తల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఆవేశంగా అక్కడినుంచి చంద్రగుప్తుడు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు చంద్రగుప్తుడు చాణిక్యునికి తెలియకుండా 50 మంది సైనికుల్ని తీసుకొని నంధుల్ని చంపుదామని నేరుగా మగధ రాజధాని పాటలీపుత్రకు గుర్రాలమీద వెళ్లారు. కానీ అప్పటికే పాటలీపుత్ర పొలిమేరలో చాలామంది సైనికులు ఉన్నారు. చంద్రగుప్తుని సైన్యం ఎంతో వీరోచితంగా మగధ సైన్యంతో పోరాడుతుంది. కానీ, మగధ సైన్యం చంద్రగుప్తుని సైన్యం కన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల చంద్రగుప్తుడు వాళ్ళను దాటలేక పోతున్నాడు. ఇంతలో ఒక బాణం వచ్చి చంద్రగుప్తిని భుజానికి గుచ్చుకుంది.

అది గమనించిన చంద్రగుప్తుని సైనికులు రాబోయే ఓటమిని గమనించి చంద్రగుప్తుణ్ణి బలవంతంగా వెనక్కి తీసుకొని వచ్చారు. చంద్రగుప్తుడు అవమాన భారంతో సింహపురిలో తన ఏకాంత మందిరంలో బాధపడుతున్నాడు. చాణిక్యుని చూసిన చంద్రగుప్తుడు గురుదేవ! నేను ఓడిపోయాను. ఈ ఓటమి భారాన్ని నేను మోయలేక పోతున్నాను. నా తల్లికే నేను న్యాయం చేయలేకపోతున్నాను. నా తండ్రిని చంపి రాజ్యాన్ని ఆక్రమించి నా తల్లిని అడవిపాలు చేసిన వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి మగధను ఎలా జయించాలో నందుల్ని ఎలా చంపాలో నాకు మార్గం చూపించండి అని వేడుకున్నాడు. దానికి చాణిక్యుడు! చంద్రగుప్త నీవు అడిగినట్లే.. నంధుల్ని ఎలా హతమార్చాలో మగధను ఎలా జయించాలో ఇప్పుడే నేను నీకు చెప్తాను. కానీ దానికి ముందు నీవు రెండు రోజులుగా భోజనం చేయట్లేదని నీ తల్లి మురాదేవి ఎంతో బాధపడుతుంది. కావున నువ్వు ముందు అన్నం తిను.. అన్నం తిన్న వెంటనే మగధను ఎలా జయించాలో చెప్తాను అని చాణిక్యుడు అన్నాడు.

వెంటనే మొరాదేవి ఒక వెండి కంచంలో వేడివేడి అన్నాన్ని వడ్డించింది. నంధుల్ని ఎలా అంతం చేయాలో తెలియక ఆరాటపడుతున్న చంద్రగుప్తుడు త్వరగా అన్నం తినాలని అన్నం మధ్యలో చేయిపెట్టి కలపబోతుంటే.. చెయ్యి కాలింది. అయ్యో! చంద్ర అలా వేడివేడి అన్నం మధ్యలో చెయ్యి పెడితే అన్నం కాలుతుంది. ముందు నీవు ఈ పళ్లెంలో చివరగా ఉన్న అన్నాన్ని కొంచెం కొంచెం వేరు చేసి దానికి ముద్దలుగా కలిపి తిను అప్పుడు నువ్వు సులువుగా చేయి కాలకుండా అన్నం తినగలవు అని మురాదేవి చెప్పింది. చంద్రగుప్తుడు అలాగే చేసి తన భోజనం ముగించుకొని చాణిక్యుని దగ్గరికి వచ్చాడు. గురుదేవ మగధను ఎలా జయించాలో ఇప్పుడైనా చెప్పండి అని చంద్రగుప్తుడు అడిగాడు. దానికి చాణిక్యుడు మగధను ఎలా జయించాలో ఇంతకుముందే నీ తల్లి మొరాదేవి చెప్పింది కదా చంద్రగుప్త అని అన్నాడు. దానికి చంద్రగుప్తుడు ఆలోచనలో పడ్డాడు.

అధి గమనించిన చాణిక్యుడు! చంద్రగుప్త.. ఇంతకుముందు నీవు చేయి కాలకూడదని పళ్లెంలో ఉన్న అన్నంలో ముందు చివరికు ఉన్న అన్నాన్ని కొంచెం కొంచెం వేరు చేసి అన్నం అంతా ఎలా తిన్నవో అలాగే నేరుగా మగధ రాజ్యం పాటలీపుత్ర మీదికి యుద్దానికివెళ్లకుండా ముందుగా మగధ సరిహద్దుల్లో ఉన్న.. చిన్న చిన్న సామంత రాజ్యాలను జయించి మగధతో వేరు చేసి నెమ్మదిగా వేరు చేసి ఆక్రమించాలి. ఇదే మన ప్రణాళిక. మన వ్యూహం. నీవు మాకు చెప్పకుండా.. మగధపైకి యుద్దానికి వెళ్లడం చాలా పెద్ద పొరపాటు. నీకు ఏమైనా జరిగుంటే అన్యాయం జరిగేది నీ తల్లి ఒక్కదానికే కాదు. యావత్తు భారత జాతికే అన్యాయం జరిగిదే. నీవు ఎంతటి వీరుడివి అయినా యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీకు సైన్య బలగం ఎంతో అవసరం.. పాండవులు అంతటి వీరులు అయినప్పటికీ కురుక్షేత్ర యుద్ధం చేయడానికి వారితో పాటు 7 అక్షౌహినుల సైన్యాన్ని వారితో తీసుకువెళ్లారు. అప్పడే వారు జయించారు. కాబట్టి ఇప్పుడు నీవు నీ తల్లి బాధ తీర్చే కొడుకుగా ఆలోచించకు.. దేశానికి కాబోయే సర్వ సామ్రాట్టుగా ఆలోచించు. చక్రవర్తి అనేవాడు రాగద్వేషాలు లేకుండా పరిపాలించాలి. ఈ సమయంలో నీకు కావాల్సింది ఆవేదన కాదు ఆలోచన అని చాణిక్యుడు అన్నాడు.

ఈ మాటలకూ చంద్రగుప్తుడు తాను చేసిన పొరపాటు తెలుసుకొని ఇకపై ఎలాంటి తప్పటడుగు వెయ్యకుండా మీరు చెప్పిన ప్రకారమే నేను నడుచుకుంటాను గురుదేవ! అని అంటాడు. మగధపైకి ఎవరో 50 మంది వచ్చి ఓడిపోయాడు అన్న విషయం ప్రధానమంత్రి రాక్షసుడికి తెలిసింది. ఇంతలో మగధకు ఒక వర్తమాన లేఖ వచ్చింది. ఆ లేఖను చూసిన రాక్షసుడికి గుండె ఆగినంత పని అయింది. వెంటనే ఆ లేఖను పట్టుకుని రాక్షసుడు పరుగుపరుగున నందుల దగ్గరికి వెళ్ళాడు. కానీ, అప్పటికే నందుల మధ్యలో జీవసిద్ధి కూర్చొని ఉన్నాడు. అయినా రాక్షసుడు జీవసిద్ధిని పట్టించుకోకుండా. ఘనానంద! మీరెవ్వరు ప్రధానమంత్రి స్థానంలో ఉన్న నాకు విలువ ఇవ్వట్లేదు. నేను బయపడినట్లే ఒక పెద్ద విపత్తు రాబోతుంది. మొన్నటికి మొన్న ఎవరో 50 మంది సైనికులు మన పాటలీపుత్రం మీదకు దండెత్తి వచ్చారు. కానీ నాకు ఈరోజు అందిన ఈ వర్తమాన లేఖను చూస్తే.. నాకు గుండె ఆగినంత పని అయ్యింది. ఇందులో ఏముందో తెలిస్తే.. మీకు కూడా వెన్నులో వణుకు పుడుతుంది. ఈ లేఖలో ఏముందో నన్ను చదవమంటారా లేదా దీనికి కూడా నిర్లక్షము చేసి నన్ను పక్కన పడేయమంటారా అని రాక్షసుడు అంటాడు. రాక్షసుని మాటలకు నంధుల్లో తెలియని భయం మొదలైంది. చదవండి ఆ లేఖలో ఏముందో అని అన్నాడు ఘనానందుడు. దానికి రాక్షసుడు! ఆ లేఖను తెరిచి ఓరి మూర్ఖ ఘనానంద! నీది కానీ మగధ రాజ్యంలో సింహాసనం పైన కూర్చొని రాజుని అనే అహంకారంతో విర్రవీగే సమయం ముగిసింది. వస్తున్నాడు ఒక మహావీరుడు వస్తున్నాడు.. ఆ సింహాసనానికి అసలైన వారసుడు వస్తున్నాడు. మీ నందుల అందరి తలల్ని తెంచుతాడు. కానీ మీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాను. వెంటనే మీదికాని ఆ సింహాసనాన్ని వదిలి శరణు కోరి పారిపోతే అప్పుడు మీకు ప్రాణ భిక్ష వేస్తాను. లేదా మీకు మరణం తథ్యం. ఇట్లు ఆర్య! చాణిక్య అని రాసింది చదివాడు.

అదివిన్న నందులు అందరూ ఒక్కసారిగా భయంతో లేచి రాక్షసుడి దగ్గరకు వచ్చి ఇప్పుడేం చేయాలో మీరే సెలవియ్యండి అని రాక్షసున్ని అడిగాడు. దానికి రాక్షసుడు మనం ఉన్నపాటుగా మన సైనిక బలగాన్ని పెంచుకోవాలి. పాటలీపుత్రలో ఉన్న సైన్యంలోని సగ భాగాన్ని మన మగధ రాజ్యానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో ఉన్న సామంత దుర్గాలకు సైన్యం అంతటిని పంపించాలి. ఆయుధాలు, ఆహరం, సైన్య బలం కోసం వీలైనంత ఎక్కువ ఎక్కువ డబ్బును ఖర్చు చేయాలి. శత్రువుని సరిహద్దులోని అడ్డగించాలి. ఇదే నా వ్యూహం అని రాక్షసుడు అన్నాడు. వెంటనే పక్కనే ఉన్న జీవసిద్ధి హహహహహహ అని గట్టిగా నవ్వాడు. మీరు ఎందుకు నవ్వుతున్నారు గురువర్యా! అని ఘనానందుడు అడిగాడు. మీ ప్రధానమంత్రి వ్యూహం వింటుంటే నాకు హాస్యంగా అనిపించింది. ఇప్పుడు చాణిక్యుడు తన సేనతో ఏ దిక్కు నుండి వస్తాడో తెలియదు. ఏ దిక్కున వస్తాడో తెలియని దానికి మన దగ్గరున్న సైన్యాన్నీ అన్ని దిక్కులకు పంపిస్తే.. అప్పుడు చాణిక్యుడు ఏదో ఒక్క దిక్కునుండి యుద్దానికి వచ్చినప్పుడు ఆ సరిహద్దుల్లో మన సైన్యం తక్కువగా ఉంటుంది కదా! పైగా ఆ సరిహద్దును ఓడించి దాన్ని దాటుకొని నేరుగా మన నగరానికి వస్తే.. ఇక్కడ సైన్యాన్ని అన్ని దిక్కులకు పంపించాం కాబట్టి అతిసులువుగా మన నగరాన్ని ఆక్రమించుకొని మీ నందుల అందరి తలల్ని నరికేస్తాడు అని అన్నాడు.

దీనికి భయపడిన ఘణానందుడు గురువర్యా! మీరు ఏం చేయమంటే అదే చేస్తాం. సెలవివ్వండి అని అంటాడు. దానికి జీవసిద్ధి! నా సలహా ఏంటంటే.. చాణిక్యుని సైన్యం ఏ దిక్కునుండి వచ్చినా ఈ నగరానికే రావాలి కాబట్టి అన్ని దిక్కులో ఉన్న సైన్యం అంతటిని ఈ నగరానికి రప్పించు. అప్పుడు ఈ నగరానికి గట్టి కాపలా ఉంటుంది. మీ నందుల ప్రాణాలకు రక్షణ ఉంటుంది. సైన్య బలగం అంతా ఒకే చోట ఉండటం వల్ల చాణిక్యుని సైన్యం మనతో పోరాడలేక తోకముడుచుకొని వెనుదిరుగుతుంది..అలాగే ధనం కూడా మిగులుతుంది అని సలహా ఇస్తాడు. నందునికి రక్షణ, విజయం, డబ్బు మిగులుతుంది అన్న పదాలు వినగానే ఘనానందుడి గురువర్యా! మీరు చెప్పిందే సరైన వ్యూహం. మేము మీ మాట ప్రకారమే నడుచుకుంటాము అని అన్నాడు.

వెంటనే అక్కడే ఉన్న సేనాధిపతితో జీవసిద్ధి గారు చెప్పినట్లు రాజ్యం పొలిమేరల్లో ఉన్న సైన్యం అంతటిని ఈ నగరానికి రప్పించు అని ఆదేశించాడు. అదివిన్న రాక్షసుడు మారు మాట్లాడకుండా నిరాశతో తన ఏకాంత మందిరానికి వెళ్ళిపోయాడు. రాక్షసుడు.. తన ఏకాంత మందిరంలో అవమాన భారంతో రగిలిపోతున్నారు. గెలిచాడు. చాణిక్యుడు ఇప్పటికే సగం గెలిచాడు. ఎక్కడో ఉండి ఇక్కడ రాజ్యంలో చీలికలు సృష్టించాడు. సరిహద్దు రాజ్యంలో సైన్యాన్ని తప్పించి బలహీనం చేశాడు. ఇన్నాళ్లు రాజ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్న నన్ను రాజగురువు సుబుద్దుల వారిని నందుల నుండి వేరు చేశాడు. రక్తపు చుక్క రాల్చకుండానే ఇప్పటికీ చాణిక్యుడు సగం గెలిచాడు. నాకు కూడా జీవసిద్ధి లాగా నందుల భవిషత్తు కనిపిస్తుంది. చాణిక్యుడు శపథం చేసినట్లే నందుల మరణం నాకు కనిపిస్తుంది. చాణిక్యున్ని చాలా తక్కువ అంచనా వేశాను. ఇక నందుల మరణం తధ్యం అని మనసులో అనుకున్నాడు.

జీవసిద్ధి ఇచ్చిన సలహా మేరకు ఘనానందుడు రాజ్య పొలిమేరలో ఉన్న దుర్గాల్లో ఉన్న సైన్యం అంతటిని రాజధాని అయిన పాటలీపుత్రానికి తరలించాడు. మగధ సరిహద్దుల్లో దుర్గాలన్నీ సైన్యం లేక బలహీన పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న చంద్రగుప్తుడు.. చాణిక్యునితో గురుదేవ! ఇప్పడు మగధ సరిహద్దుల్లో ఉన్న దుర్గాలన్నీ బలహీన పడ్డాయి. మీరు అనుమతిస్తే ఇప్పుడే మన సైన్యంతో మగధలోనికి ప్రవేశించి నందులను అంతం చేస్తాను అని అన్నాడు. దానికి చాణిక్యుడు ఖంగారుపడకు చంద్రగుప్త ఇంకా దానికి సమయం రాలేదు. మగధ సరిహద్దులు అంతా బలహీలపడ్డాయి.. కానీ ఆ సైన్యం అంతా రాజధాని పాటలీపుత్ర చేరి అది అత్యంత బలిష్టంగా తయారైంది. అదికూడా ప్రమాదమే. ఇప్పుడు మనం చేయాల్సింది మగధపై దాడి కాదు.. మగధకు మించిన సైన్యాన్ని సమకూర్చుకోవడం అని అన్నాడు. దానికి సులువైన మార్గం ఇప్పటివరకు అలెగ్జాండర్ అడుగుపెట్టిన భారతీయ రాజ్యంతో మనం సంధి కుదుర్చుకోవడం. వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ సైన్యంతో కలుపుకోవడం. ఇప్పటికి అలెగ్జాండర్ తో పోరాడలేక సంధి కుదుర్చుకొని లేదా యుద్ధంలో ఓడిపోయి వాళ్ళ రాజ్యాలన్నీ అలెగ్జాండర్ చేతికి అప్పజెప్పడం వలన వాళ్లకు ఎంత నష్టం జరిగిందో.. కళ్లారా చూశారు. కాబట్టి వీళ్ళు మనకు మద్దతు ఇస్తారు. దీనికోసం మనం వెళ్తున్న రాజ్యం అలెగ్జాండర్ ను తన బాణపు దెబ్బతో కింద పడేసి చావును రుచిచూపించిన మాళవ రాజ్యం. అక్కడికే మన మొదటి ప్రయాణం అని చాణిక్యుడు చంద్రగుప్తునితో అంటాడు. అలా మాళవ రాజ్యానికి వెళ్లి అక్కడి రాజుతో మాకు మీ మద్దతు కావాలి అని కోరుతారు. అఖండ భారతం ఏకం చేస్తానన్న మీ ఆశయానికి మేము సంతోషిస్తున్నాము. అందుకే మీతో చేతులు కలుపుతున్నాము. మా సైన్యం మీకు అండగా ఉంటుంది అని చెప్తాడు. అలా మాళవ, సూద్రక రాజ్యాలు చాణిక్యునికి మద్దతు ఇచ్చాయి.

దాంతో సంతోషించిన చాణిక్యుడు.. తరువాత రాజ్యానికి బయల్దేరారు. అదే అశ్వక రాజ్యం. కానీ, అశ్వక రాజ్యంతో సంధి కుదుర్చుకోవడం చంద్రగుప్తునికి ఇష్టం లేదు. దానికి కారణం ఇప్పుడు అశ్వక రాజ్యాన్ని పరిపాలిస్తున్నది కళాపినిదేవి. అలెగ్జాండర్ వ్యామోహంలో పడి స్వంత భర్తకు దేశానికి ద్రోహం చేసిన ఆమెను సహాయం అడగటం నాకు ఇష్టం లేదు గురుదేవ అని అన్నాడు. దీంతో అదంతా వాస్తవమే.. కానీ ఇప్పడూ ఆమె తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పడుతుంది. తాను చేసిన తప్పు వల్ల దేశానికే నష్టం జరిగిందని గ్రహించింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. మరలా అలాంటి తప్పు చేయకూడదు అని నిర్ణయించుకుంది. అందుకే అంబి ఆమె కొడుకుని చంపేస్తానని బెదిరించి మరల పురుషోత్తముని మోసం చేయడానికి ఒప్పించాడు. అలెగ్జాండర్ ఈ దేశాన్నివదిలి వెళ్ళిపోయాక ఆమె చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నిస్వార్థంగా తన రాజ్య ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకుంటుంది. ఆమె సహాయం ఇప్పడు మనకు కావాలి. ఎందుకంటె అలెగ్జాండర్ కి మొట్టమొదటి సారిగా భారతీయ సైనికుల్ని ఓడించడం సాధ్యం కాదు అని నిరూపించిన రాజ్యం అశ్వక రాజ్యానిదే. అలా చెంద్రగుప్తుణ్ణి చాణిక్యుడు ఒప్పించాడు. చంద్రగుప్తునికి సహకరించడానికి కళాపిని దేవి ఎంతో సంతోషించింది. నేను, నా బిడ్డ నా చివరి శ్వాస కోసం ఈ దేశ భద్రత కోసం పోరాడుతాం అని మాట ఇస్తుంది.

చాణిక్య చంద్రగుప్తులు అక్కడినుంచి తర్వాత రాజ్యమైన తక్షశిలకు వెళ్లారు. ఇది తెలుసుకున్న అంబి.. రాజ్య సభలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తను మనసులో ఎంతో బయపడుతున్నాడు. అయితే చాణిక్యుడో, లేదా చంద్రగుప్తుడో నన్ను చంపేస్తారు. ఒకవేళ వీళ్ళు వదిలేసినా తమతో సంధి కురుర్చుకున్న నా శత్రువు పురుషోత్తముడు, లేదా తన కొడుకుని చంపేస్తానని బెదిరించిన కళాపిని దేవి నాపై పగ తీర్చుకుంటారు. ఇప్పుడు ఏం చేసి వీరి నుండి తప్పించుకోవాలి అని అంబి ఆలోచిస్తున్నాడు. కాసేపటి తర్వాత తన మంత్రులతో పైకి ధైర్యంగా నటిస్తూ ఇప్పుడు చాణిక్యుడు వస్తే.. మహా అయితే 2 విషయాలు అడుగుతాడు. మొదటికి వాళ్ళతో సంధి చేసుకోవడం.. దానికి మనం ఒప్పుకోమని చెప్తాము. అప్పడూ రెండవది వాళ్ళతో యుద్ధం చేయమంటాడు. యుద్ధం కోసం నిర్ణయం వృద్ధులైన మా నాన్న గారితో చర్చించమంటాము. వృద్ధుల్ని యుద్ధం చేయమని ప్రలోభ పెట్టడం రాజనీతి కాదు. కాబట్టి వాళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోతారు అని అన్నాడు.

ఇంతట్లో ఆ రాజ్య సభలోకి చాణిక్య – చంద్రగుప్తులు ప్రవేశించారు. అంతమంది మహామహులు ఉన్న రాజ్యసభలో చంద్రగుప్తుడు.. గురుదేవ! ఈ దేశ ద్రోహిని శిరచ్చేదం చేయడానికి నాకు ఆజ్ఞ ఇవ్వండి అని తన ఒరలో ఉన్న కత్తిని బయటకు తీస్తాడు. చంద్రగుప్తులోని ఆవేశం చాణిక్యుని కళ్ళలోని కోపం చూసిన అంబికి ఒక్కసారిగా గుండె జారిపోయింది. ఇక అంభి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. నన్ను క్షమించు చాణిక్యుల వారు అని ఏడ్చుకుంటూ.. చాణిక్యుని కాళ్ళను గట్టిగ పట్టుకున్నాడు. అదిచూసిన చంద్రగుఫ్తుడు.. ఇలాంటి దేశ ద్రోహిపై దయచేసి మీరు జాలి చూపించకండి గురుదేవ! అని అన్నాడు. దానికి చాణిక్యుడు! చంద్రగుప్త నీ కత్తిని ఒరలో పెట్టు అని ఆజ్ఞాపించాడు. ఒక వేళా నీవు వీణ్ణి చంపితే చంద్రగుప్తుడు అంబిని చంపాడు అని గుర్తుంచుకోరు.. దానికి బదులు అంబి చంద్రగుప్తుని లాంటి మహావీరుని చేతిలో మరణించాడు అని గుర్తుంచుకుంటారు. అలాంటి ఉత్తమమైన చావు వీనికి రావద్దు అని చెప్పాడు. చాణిక్యుడు అంబిని చూసి అంబి నేను నిన్ను క్షమించాలంటే నీ సైన్యం మొత్తం నాతో కలవాలి. నీవు కూడా మా సైన్యంతో పాటు మాతో పోరాడాలి అని అన్నాడు. ఇంకో దారి లేక అంబి ఈ ఒప్పందానికి ఒప్పుకుంటాడు. అలానే కళింగ రాజ్యం, కిరాత రాజ్యం, బహులీక రాజ్యం, ఆంధ్ర రాజ్యంతో కూడా చాణిక్యుడు సంధి కుదుర్చుకున్నాడు. అలా సైన్యాన్ని మొత్తం సిద్ధం చేసుకున్నాడు.

ఇక మగధ పై యుద్ధానికి సిద్దమై మగధ పొలిమేర్లలోకి ప్రవేశించాడు. మగధ సరిహద్దుల్లో ఉన్న మగధ సామంత దుర్గాలైన ఇంద్రప్రస్థ, హస్తినాపుర, కురుక్షేత్ర, కాశి, అయోధ్య, మధుర రాజుల్ని చాణిక్య చంద్రగుప్తుల్ని కలిశారు. ఈ రాజులందరూ ఏకమాటగా చాణిక్యుడికి మద్దతిచ్చారు. అలా సామంత దుర్గాలతో సైన్యం ఏర్పాటు చేసుకొని యావత్తు సైన్యంతో మగధ రాజధాని అయిన పాటలీపుత్ర వైపు చాణిక్య చంద్రగుప్తులు హస్తినా వైపు బయల్దేరారు. ఇంతలో హస్తినాపురం దాటుతుందగా అక్కడి ప్రజలందరూ కత్తులు బల్లేలు పట్టుకొని చాణిక్యుని సైన్యానికి అడ్డుగా నిలుచున్నారు. అదిచూసిన చాణిక్యుడు.. ప్రజలారా! దయచేసి అడ్డుతొలగండి. మేము మీకు హాని చేయడానికి రాలేదు. కేవలం నందులను చంపి.. మగధను మగధ రాజ్య ప్రజల్ని, భారత ఖండాన్ని నందుల నుండి కాపాడటానికే మా యుద్ధం. దయచేసి మాకు దారివ్వండి అని అడిగాడు. దానికి ఆ ప్రజల్లో ఒక నాయకుడు.. చాణిక్యుల వారికి నమస్కారం. మేము ఇక్కడికి వచ్చింది మీకు అడ్డుపడటానికి కాదు. మేము మీతో కలిసి మగధపై పోరాడటానికి.. నందులు చేసే రాక్షస పాలనకు వికృత చేష్టలకు అకృత్యాలకు మేము విసిగిపోయాం. వాళ్ళను అంతం చేయాలన్నదే. మా లక్ష్యం కూడా. అందుకే మేము మీతో కలిసి పోరాడుతాము. మన భారత జాతికోసం.. రాబోయే తరాల కోసం మేము మీతో కలిసి రక్తం చిందిస్తాం. దయచేసి మాకు మీతో కలిసి పోరాడేందుకు అనుమతి నివ్వండి. అని అడిగాడు.

ఆ నాయకుడి మాటలకూ చాణిక్యుని ఒళ్ళు పులకరించిపోయింది. సరే అని వాళ్ళను కూడా తన సైన్యంతో కలుపుకొని పాటలీపుత్ర వైపు బయల్దేరారు. రాతిరి అయింది. యావత్తు సైన్యం ఒకచోట విశ్రాంతి తీసుకుంటుంది. అందరూ ఘాడ నిద్రలో ఉన్నారు. చంద్రగుప్తునికి మాత్రం నిద్ర రావడం లేదు. తాను బయటకి వచ్చు తన చుట్టూ చూసుకున్నాడు. తన కళ్ళు సంబ్రమాశ్చర్యాలతో నిండిపోయాయి. ఎందుకంటె తన చుట్టూ కాగడాల వెలుతురులో తన కోసం పోరాడేందుకు మహా సైన్యం సిద్ధం అయింది. 6 లక్షల మంది కత్తి యుద్ధం చేసే సైనికులు, 30,000 గుర్రాలు కలిగిన అశ్వదళం, 2,000 ఏనుగుల గజబలం, 4,000 రథబలం.. కేవలం ఆ సైన్యం మాత్రమే ఒక మహా రాజ్యాంలా కనిపిస్తుంది. ఆ సైన్యాన్ని చూస్తేనే విజయం మన స్వంతం అయింది అన్నట్లుగా ఉంది. కొన్ని రోజుల్లో దండయాత్ర.. ఇదంతా చంద్రగుప్తిని కళ్ళలో ఒక్కసారిగా కనిపించింది.

అది అర్ధరాత్రి వేళా.. పాటలీ పుత్రలో ప్రధానమంత్రిరాక్షసునికి నిద్రపట్టడం లేదు. ఏదో తెలియని ఆందోళన అతనికి చెమటలు పడుతున్నాయి. ఊపిరి పీల్చుకోవడం కూడా భారంగా అభిపిస్తుంది. ఇది తుఫాన్ కు ముందువచ్చే నిశ్శబ్దం. మగధపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని అతనికి అర్ధం అయింది. మాహా అడవిని సైతం కాల్చి బూడిద చేయగల ఒక అగ్గిపుల్ల వేడి సెగ అతనికి తగులుతుంది. ఏదో కీడు జరుగబోతుందని నిశ్చయంగా తెలుస్తోంది. ఇలా జరగద్దంటే.. ఒకేఒక దారి ఘనానందుడు అతని మాట వినడం.ఎలాగైనా రేపు ఘనానందుని కలిసి జరుగబోయే కీడు గురించి వివరించి.. ఒప్పించి సరైన యుద్ధ వ్యూహం రచించి.. చాణిక్య చంద్రగుప్తుల్ని తిరిగి లేవలేని దెబ్బ కొట్టాలని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే రాక్షసుడు రాజసభలోకి ప్రవేశించాడు. ఆ సభలో మంత్రులు, పండితలు, సామంతులు, సేనాధిపతులు, రాజ్య సలహాదారులు, అందరూ ఉన్నారు. ఒక్క రాజు తప్ప. అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఇంతలో రాక్షసుడి దగ్గరికి సేనాధిపతి వచ్చి ప్రధానమంత్రి గారు.. వేగులద్వారా సమాచారం వచ్చింది. చాణిక్య – చంద్రగుప్తులు తమ సైన్యంతో మగధ పొలిమేర్లలో ప్రవేశించారు. వారు పాటలీ పుత్రానికి చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదు. ఇక యుద్ధం తప్ప మనకు వేరే దారి లేదు అని చెప్పాడు. వాళ్ళ సైన్యం ఎంత ఉంది అని రాక్షసుడు అన్నాడు. లెక్కలేనంత.. దాదాపు మన సైన్యానికి సమానంగా ఉంటుంది అని చెప్పాడు. దానికి రాక్షసుడు.. ఇంత తక్కువ సమయంలో ఈ చాణిక్యుడు ఇంత ఎక్కువ సైన్యాన్ని ఎలా సమకూర్చుకున్నారు అని ఆలోచనలో పడ్డాడు. ఇంతకీ నందరాజులు ఎక్కడ అని అడుగుతారు. వాళ్లెప్పుడూ ఆ జీవ సిద్ది స్వామితోనే గడుపుతున్నారు అని సెలవిచ్చారు.

ఆ సమాధానానికి రాక్షసునికి పట్టరానంత కోపం వచ్చింది. ఇంత ఆపద కాలంలో కూడా వాళ్ళు రాజసభలో ఉండకుండా.. ఏకాంత మందిరంలో ఏం చేస్తున్నారు అని ఆ మూర్ఖులు అని ఆవేశంగా రాక్షసుడు ఏకాంత మందిరానికి వెళ్తాడు. అక్కడ చూస్తే.. నందులు జీవసిద్ధితో కలిసి విందు చేస్తూ.. హాస్యంగా గట్టిగ నవ్వుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన రాక్షసుడు తన చేతిని తన కత్తి ఒరమేధ పెట్టి.. ఇప్పుడే నందుల తల నరికివేయాలి అన్నంత కోపం అతనికి వచ్చింది. కానీ, తన కోపాన్ని తగ్గించుకొని జరుగుతున్న పరిస్థితుల్ని ఘనానందునికి అర్ధం అయ్యేలా వివరించాలని అతని దగ్గరికి వెళ్ళాడు. మహారాజా! మీకొక సమాచారం. చాణిక్య చంద్రగుప్తులు తమ సైన్యంతోమగధ లోనికి ప్రవేశించారు. ఇక రేపో ఎల్లుండో వారు మనపైకి దాడి చేస్తారు. వారి సైన్యం అపారంగా ఉందని తెలిసింది. మనం యుద్దానికి సిద్ధం కావాలి అని హెచ్చరించాడు. దానికి ఘనానందుడు ఒక్క నవ్వు నవ్వి మీరేం బయపడకండి.. మేము యుద్దానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాం అని సమాధానం ఇచ్చాడు.

దానికి రాక్షసుడు ఇంతకీ మన వ్యూహం ఏంటి మహారాజ అని అడిగాడు. దానికి ఘననందుడు.. చంద్రగుప్తుని సైనికులు మన కోట గోడలు బద్దలు కొట్టి లోపలి ప్రవేశించగానే.. కోటలోపలో ఉన్న సైనికులు వారిపై మెరుపుదాడి చేసి వారిని ఓడిస్తారు అని చెప్పాడు. దానికి రాక్షసుడు.. ఇది ఒక వ్యహమేనా! ఇలా చేస్తే మనం గెలవగలం అని అనుకుంటున్నారా? ఇదే గనక పాటిస్తే.. మనకు ఓటమి తప్పదు మహారాజ అని అన్నాడు. దానికి గణానందుడు.. దానికన్నా మనదగ్గర మరో వ్యూహం ఉంది ప్రధానమంత్రి అని అంటాడు. అదే జీవసిద్ధిగారు మాతో చేయించబోయే శత్రుంజయ యాగం ఈ యాగం చేసిన వారికీ చరిత్రలో ఇప్పటివరకు ఓటమి కలుగలేదట. ఇక మన శత్రువు మనపై కనీసం దాడి కూడా చేయలేక ఉన్నచోట నుండే పారిపోతారు అని గట్టిగా నవ్వారు. ఆ సమాధానం విన్న రాక్షసునికి ఒళ్ళు మండిపోయి ఓరి మూర్ఖ ఘనానంద! మంత్రాలకు చింతకాయలు రాలవురా. ఆ జీవసిద్ధి ఒక ముసలి నక్క. వాని మాటలు విని మీ చావును నీవే కొనితెచ్చుకుంటున్నావ్. నీ రాజ్యాన్ని శత్రువులకు అప్పజెప్తున్నావ్. ఇకనైనా కళ్ళు తెరువు. లేదంటే నీకు చాణిక్యుని చేతిలో మరణం తథ్యం అని ఆవేశంగా హెచ్చరించాడు.

దానికి గణానందుడు సమాధానం ఇస్తూ.. జీవసిద్ధిగారు కాదురా! నీ వల్లే మా రాజ్యం ఈ స్థితికి వచ్చింది. ఇన్నాళ్లు మా నంద సోదరులకు పక్కలు పరిచావు అన్న ఒకేఒక్క కారణంగా నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఇక ఒక్క క్షణం నా కళ్ళ ముందు కనిపించినా.. నా కత్తి నీ నెత్తుటిని రుచి చూస్తుంది. పో ఇక్కడినుంచి అని గట్టిగ అరిచాడు. వెంటనే రాక్షసుని పక్కనే ఉన్న సేనాధిపతిఅతని చెయ్యిపట్టుకొని ఏకాంత మందిరంలో నుండి బయటికి తీసుకెళ్లిపోయారు. ప్రధాన మంత్రిగారు వీళ్ళెవ్వరూ మీ మాట వినే పరిస్థితి లేదు.. వారంతా జీవసిద్ధిగారి మాయలో ఉన్నారు. అందుకనే రాజసభలో ఉన్న మంత్రులందరూ వారికీ ఏం చేయాలో తెలియక ఆందోళనతో భయపడుతున్నారు. అని చెప్పాడు. దానికి రాక్షసుడు సేనాధిపతి! మన పతనం ఎప్పడూ శత్రువునుండి రాదు.. అది మననుండే మొదలవుతుంది. అదే మన శత్రువుకి ఆయుధం అవుతుంది. మనం అందరం యుద్ధం కోట బయటే జరుగుతుందని అనుకుంటున్నాము. కానీ, చాణిక్యుడు ఎప్పుడో కోట లోపలినుండి యుద్ధం మొదలు పెట్టాడు. జీవసిద్ధి ద్వారా కోటలోపల ఉన్న బలాలన్నీ ఘనానందునికి బలహీనతగా మార్చాడు. ఇక ఈ నంద వంశాన్ని దేవుడే కాపాడాలి అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.

ఇక్కడ ఏకాంత మందిరంలో గణానందునికి సందేహాలు మొదలయ్యాయి. అప్పటివరకు జీవసిద్ధిని బలంగా నమ్మినా.. రాక్షసుడు అన్న మాటలు గనానందుడిని ఆలోచింపజేశాయి. వెంటనే జీవసిద్ధితో మీరు అన్నట్లుగానే శత్రుంజయ యాగం వలన శత్రువులతో గెలుస్తామా అని అడుగుతాడు. దానికి జీవసిద్ధి.. ఎవరో అన్న మాటల వలన నన్ను అనుమానిస్తున్నావా ఘనానంద! సరే రేపు ఉదయమే శత్రుంజయ యాగాన్ని నేను మొదలు పెడతాను. ఆ యాగం యొక్క ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో నేను నీకు రుచిచూపిస్తాను. అది చూసిన తర్వాతైనా మరలా నువ్వు నన్ను నమ్ము అని.. ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి అని అంటాడు. ఆ మాటలకూ ఘనానందునికి కొత్త ఉత్సాహం వచ్చింది.

ఆ రాత్రి అలా గడిచిపోయింది. తెల్లవారుఝాము 6 గంటలకు ఒక్కసారిగా గట్టిగ రణ భేరులు మోగాయి. ఆ రణభేరులకు పాటలీపుత్ర నగరంలో ఉన్న అందరూ నిద్రలేచి కోట గోడలకు వచ్చి చూశారు. ఆ క్షణం గణానందుడు చూసిన దృశ్యానికి అతని నిద్రమత్తు మొత్తం వదిలిపోయింది. ఒకపక్క అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు.. ఘనానందుడి నుదుట నుంచి ఒక చెమటబొట్టు కిందకు జారింది. ఆ సూర్య కాంతిలో పాటలీపుత్రం నగర నాలుగు దిక్కుల్ని చాణిక్య- చంద్రగుప్తుని సైన్యం చుట్టుముట్టింది. పాటలీపుత్రానికి ఉత్తర దిక్కులో పర్వతకుడి నేపాల సైన్యం ఉంది. తూర్పు దిక్కుల్లో విజయవర్మ సింహపురి సైన్యం ఉంది. పడమర దిక్కుల్లో పురుషోత్తముడి పాంచాల సైన్యం ఉంది. ఇక దక్షిణ దిక్కులో ఆంధ్ర, కళింగ, పిప్పిలివనం సైన్యం ఉంది. చంద్రగుప్తుని సైన్యం అపారంగా ఉంది. అప్పటివరకు ఆత్మస్తైర్యంతో ఉన్న ఘనానందునికి ఒక్కసారిగా గుండె జారినంత పని అయ్యింది.

వెంటనే పరుగుపరుగున జీవ సిద్ది స్వామి దగ్గరకు గణానందుడు వెళ్లి అతను చూసిన విషయాన్ని గురించి చెప్పాడు. దానికి జీవసిద్ధి ఘనానంద నన్ను నమ్మి నేను చెప్పింది చేయు. వెంటనే శత్రుంజయ యాగం నేను మొదలు పెడుతాను.. ఆ యాగంలో నాతోపాటు నంద సోదరులు 8 మంది నిష్ఠగా కూర్చిని యాగం చేయాలి. ఈ యాగం జరుగుతున్నంత సేపు శత్రువు ఒక్క అడుగుకూడా మనవైపు వెయ్యలేడు. అదినేను నీకు ఈ రోజే నిరూపిస్తాను ఈలోపు పాటలీపుత్ర నాలుగు దిక్కుల్లో ఉన్న.. 64 ద్వారాలను మూసివేయించు. అని చెప్పి మృత్యుంజయ యాగాన్ని మొదలు పెట్టాడు. జీవసిద్ధి చెప్పినట్లు 64 ద్వారాల్ని మూయించి నంధ సోదరులు అందరూ యాగంలో కూర్చున్నారు. నగరంలో యాగం జరుగుతుంది. లోపల ప్రజలు అందరూ భయంతో తలుపులు వేసుకొని వారి ఇళ్లలోనే ఉన్నారు. ఘననందుని సైన్యం మొత్తం మూసి ఉన్న దుర్గలవెనుక యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు.

నగరాన్ని చుట్టుముట్టిన చాణిక్యుని సైన్యం.. ఆకలితో ఉన్న సింహంలాగా యుద్ధం చేయడానికి చాణిక్యుని ఆజ్ఞకోసం ప్రతిక్షణం ఎదురుచూస్తుంది. మధ్యాహ్నం అయింది. సాయంత్రం అయింది. రాత్రి అయింది. చాణిక్యుని నుండి ఆజ్ఞ రాలేదు. అసలు చాణిక్యుడు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇంతలో ఒక భటుడు ఘనానందుని దగ్గరికి వచ్చి మహారాజ! శత్రుగణం ఇవాళ ఎందుకనో యుద్ధం చేయలేదు అని అంటాడు. అదివిన్న ఘనానందుడు.. ఆనందంతో జీవసిద్ధి వైపు చూశాడు. అప్పుడు జీవసిద్ధి చూశావా ఘనానందా! శత్రుంజయ యాగఫలితం. నేను చెప్పను కదా! శత్రువు ఒక్క అడుగుకూడా మనవైపు వెయ్యలేడని అన్నాడు. దానికి ఘనానందుడు.. నన్ను క్షమించండి స్వామి మిమ్మల్ని అనవవసరంగా అనుమానించాను. మిమ్మల్ని నేను ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నాను. ఇకపై మీరు ఏది ఆదేశిస్తే.. అది మేము చేస్తాము అని అన్నాడు.

రెండవ రోజు తెల్లారింది. మరలా అందరూ యుద్దానికి సిద్ధం అయ్యారు. చాణిక్యుని ఆజ్ఞకోసం అందరూ ఎదురుచూస్తున్నారు. రోజంతా గడిచిపోయింది. కానీ ఆజ్ఞ రాలేదు. చాణిక్యుని జాడకూడ తెలియలేదు. ఇప్పుడు అందరిలో యుద్ధం చేయాలనే కాంక్ష కన్నా చాణిక్యుడు ఏమయ్యాడనే ఆందోళనే ఎక్కువగా కనిపిస్తుంది. రెండవ రోజుకూడా శత్రువు దాడి చేయలేదు అన్న విషయం గణానాంధునికి తెలిసింది. ఘనానందుడి ఆనందానికి అవధుల్లేవు. జీవసిద్ధిగారు నాతో ఉన్నంత వరకు నాకు ఓటమి ఉండదని అతడు బలంగా నమ్మాడు. ఇక ఆయన మాట జవదాటకూడదని నిశ్చయించుకున్నాడు. మూడవ రోజు తెల్లవారింది. అందరూ చాణిక్యుడు ఏమయ్యాడని ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలోనే నాలుగు దిక్కులో ఉన్న పర్వతకుడికి, చంద్రగుప్తునికి, పురుషోత్తముడికి, విజయవర్మకు, ఆంధ్ర రాజులకు లేఖలు అందాయి.

అందరూ లేఖలు తెరిచి చదివారు. దానిలో ‘నేస్తమా! సమయం ఆసన్నమైంది. భారతవంశానికి నంద వంశపు పీడ కాసేపట్లో వదలబోతుంది. మరికొన్ని క్షణాలలో పాటలీపుత్ర నాలుగు దిక్కులో ఉన్న 64 ద్వారాలు తెరుచుకోబడుతాయి. ఆ ద్వారాలనుండే లక్షలాది మంది సైనికులు మీపై దాడి చేస్తారు. వారిలో వీలైనంత తక్కువ మందిని మీరు చంపండి. ఎందుకంటె వల్లే మనకు రేపటి సైనికులు. భారత మాత ఆశీస్సులు ఎప్పటికి మనతోనే ఉంటాయి. యుద్ధానికి సిద్ధం కండి విజయోస్తు..ఇట్లు ఆర్య! చాణిక్య’ అని రాసి ఉంది. ఆ లేఖ చదివిన అందరు రోజుల్లో సరికొత్త ఉత్సాహం ఉంది. కొన్ని క్షణాల్లో కోటగోడలు తెరుచుకుంటాయన్న విషయం చాణిక్యునికి ఎలా తెలుసు? ఇంతకీ చాణిక్యుడు కోట లోపల ఉన్నాడా అని అందరూ ఆశ్చర్య పోయారు. ఆ లేఖలో రాసి ఉన్నట్లే కొద్ది క్షణాలలో 64 ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ ద్వారాల నుండి లక్షలాది మంది మగధ సైన్యం గట్టిగా అరుచుకుంటూ.. చంద్రగుప్తుని సైన్యంతో యుద్ధం చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చి చంద్రగుప్తుని సైన్యాన్ని ఢీ కొట్టారు.

రెండవ రోజుకూడా మగధ సైన్యం చంద్రగుప్తుని సైన్యంపై దాడి చేయలేదు. ఈ విషయం ఘానానందునికి తెలిసి ఎంతో సంతోషించాడు. అప్పుడే జీవసిద్ధి ఘనానంద! ఇప్పటివరకు నేను చెప్పిందే జరిగింది. ఇకపై కూడా నేను చెప్పేదే జరగబోతుంది. నా దివ్య దృష్టికి ఈ యుద్ధంలో నీ విజయం కనిపిస్తుంది. విజయం రావాలంటే.. యుద్ధం ముగియాలి ఆపని మనమే చేయాలి. యుద్ధం ముగించడానికి రేపు ఉదయమే రణభేరి మ్రోగించిన వెంటనే పాటలీపుత్రానికి 4 దిక్కుల్లో ఉన్న 64 ద్వారాలు ఒక్కసారిగా తెరుచుకోవాలి. ఆ ద్వారాల్లో నుంచి లక్షలాది మగధ సైనికులు ఒక్కసారిగా చంద్రగుప్తుని సైన్యం పై మెరుపుదాడి చేయాలి అని చెప్పాడు. అప్పటికే జీవసిద్ధిని పూర్తిగా నమ్మిన ఘనానందుడు మీ ఆదేశం ప్రకారమే చేస్తాను స్వామి.. అని మూడవ రోజు ఉదయం తలుపుల్ని తెరిపించాడు. యుద్ధం మొదలైతే ఇలా 3 వ రోజు మగధ ద్వారాలన్నీ ఘనానందుని చేత తెరిపించాలని ఇప్పుడు కాదు 6 నెలల క్రితమే జీవసిద్ధితో వ్యూహం పన్నాడు. దానిప్రకారమే 3వ రోజు 64 ద్వారాలు తెరుచుకున్నాయి. వాటిలోనుండి లక్షలాది సైన్యం చంద్రగుప్తుని సైన్యానికి ఎదురు నిలుచున్నారు.

ఉత్తర దిక్కున మగధ సర్వ సైన్యాధ్యక్షుడు బద్రభటుడు దాడి చేయండి అని ఆరువబోతుంటే.. అతని ముందు 2 గుర్రాలు వచ్చి ఆగాయి. వాటిలో ఒక గుర్రంపైన చాణిక్యుడు, మరొక గుర్రంపైన చంద్రగుప్తుడు ఉన్నారు. అప్పుడు చాణిక్యుడు మగధ సైన్యాన్ని ఉద్దేశించి.. మగధ సైనికులారా! నేను మీలో ఒకన్ని. మాకు మీతో ఎలాంటి శత్రుత్వం లేదు. నేను భారత జాతిని ఐక్యం చేయడానికి వచ్చాను. మగధ ప్రజల కన్నీళ్లు తుడవడానికి వచ్చాను. నాతో మీరు చేయికలిపితే.. ఎలాంటి రక్తపాతం లేకుండా మగధను జయించవచ్చు. దయచేసి మీ సహకారం మాకు అందించండి అని అడిగాడు. వెంటనే చంద్రగుప్తుడు సైనికులారా! నాకు తెలుసు. మీరు మీ వృత్తిని బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తున్నారు. మీరు మాకు శత్రువులు కాదు. నేను ఒక పరదేశస్తుడిని కాదు. నా దగ్గర మీరు ప్రాణాలు విడవల్సిన అవసరం లేదు. రాచరికం ముసుగులో జరిగిన ఈ యుద్ధం కోసం మీరు మీ కుటుంబాలకు దూరం కాకూడదు. మనందరం కలిసి భారతజాతిని రక్షించుకోవాలి ఆలోచించండి.. నదులకు ద్రోహం చేస్తారా? లేదా దేశానికి ద్రోహం చేస్తారా? అని అడిగాడు.

ఉత్తర దిక్కుల్లో చాణిక్య చంద్రగుప్తులు.. మగధ సైనికులకు ఇచ్చిన సందేశాన్ని అన్ని దిక్కులో చంద్రగుప్తుని సైన్యాధిపతులు మగధ సైనికులందరికి ఒకే సమయంలో చెప్పారు. చాణిక్య చంద్రగుప్తుల మాటల వల్ల మగధ సైనికుల్లో ఆలోచన మొదలైంది. అది గమనించిన భద్రబటుడు ఇక ఆలస్యం చేస్తే సైనికుల మనస్సులు మారుతాయని వెంటనే దాడి చేయండి అని ఆదేశించాడు. మగధ సైనికులు అందరూ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి చంద్రగుప్తుని సైన్యాన్ని ఢీకొన్నారు. ఇరువురి సైన్యం మధ్య ఘోర యుద్ధం మొదలయింది. ఆ యుద్దానికి భూమి అదురుతుంది. దుమ్ములేచి ఆకాశాన్ని అంటుతోంది. సైనికులందరు వివిధ ఆయుధాలతో భీకరంగా పోరాడుతున్నారు. కానీ, చరిత్రలో ఇప్పటివరకు ఏ యుద్ధంలో జరుగని ఒక కొత్త విషయం ఈ యుద్ధంలో జరుగుతుంది. అదే చంద్రగుప్తుని సైన్యంలోని ఒక సైనికుడు మగధ సైన్యంలోని సైనికుణ్ణి ఓడించి కింద పడేసినప్పుడు.. ఆ మగధ సైనికుడి మెడ మీద కత్తిపెట్టి ఓ వీర సైనికా నందులకు ద్రోహం చేస్తావా? దేశానికి ద్రోహం చేస్తావా? నీవు నందులకు ద్రోహం చేయాలనుకుంటే.. ఈ కత్తులను తీసుకొని మాతో పోరాడు. లేదా దేశానికి ద్రోహం చేయాలనుకుంటే చెప్పు. నేను నీ చేతులను కట్టేస్తాను వెనక్కి తిరిగి చూడకుండా ఈ యుద్ధాన్ని విడిచి పారిపో. ఎక్కడికైనా పోయి ప్రాణాలతో బ్రతుకు అని ఒక చివరి అవకాశం ఇస్తున్నారు.

ఆ మాటలకూ మగధ సైనికులు ఆశ్చర్యపోయారు. ఒక సైనికుడికి ఇంత గౌరవం ఇవ్వమని చెప్పిన వీళ్ళ రాజు చంద్రగుప్తుడి పాలన ఎంత వైభవంగా ఉండబోతుందో గుర్తించి ఎంతో మంది మగధ సైనికులు.. చంద్రగుప్తుని సైన్యంతో చేయికలిపి మగధ సైనికులపై దాడి చేస్తున్నారు. ఇలా ప్రతిఒక్క చంద్రగుప్తుని సైనికుడు కనీసం ఒక్క మగధ సైనికుడిని అయినా వారితో చేయి కలిపేలా చేస్తున్నారు. నాలుగు దిక్కులనుండి యుద్ధం హోరాహోరీగా సాగుతుంది. ఇంతలో సర్వ సైన్యాధక్షుడు ఐన భద్రబటుడు పురుషోత్తముని ఎదురవుతాడు. పురుషోత్తముడు ఏనుగుమీద నుంచి దిగి అతనికి ఎదురుగా నిల్చున్నాడు. భద్రబటుడు మాట్లాడుతూ.. పురుషోత్తమ మహారాజ! అలెగ్జాండర్ ను ఓడించి మన భరత వీరుల సత్తాను చాటిన నీతో యుద్ధం చేస్తున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఈ పోరాటంలో నిన్ను నేను చంపినా నీ చేతుల్లో నేను చచ్చినా నాకు గౌరవమే. నా కీర్తి అనంతం అవుతుంది అని చెప్పి పురుషోత్తముడితో యుద్ధం మొదలుపెట్టాడు. భీకరంగా వీరిద్దరి పోరాటం జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు సమఉజీలే. ఇంతలో ఒకవైపు యుద్దభూమి మధ్యలో చంద్రగుప్తునికి సూచనలు ఇస్తున్న చాణిక్యుడిని 15 మంది మగధ సైనికులు చూసి.. వీణ్ణి ఒక్కడిని చంపితే చాలు. చంద్రగుప్తుణ్ణి సగం గెలిచినట్టే అని వాళ్ళ గుర్రాలపైన వేగంగా వస్తున్నారు. అది గమనించిన చాణిక్యుడు.. నేను ఇక్కడే ఉంది సైనికులతో పోరాడితే ఆ పక్కనే వీరోచితంగా పోరాడే చంద్రగుప్తుని దృష్టి యుద్ధం నుండి నన్ను కాపాడాలని నాపై పడుతుంది అను కొని అక్కడి నుండి గుర్రంపై బయల్దేరుతాడు. వెంబడించిన సైనికులు.. కొంత దూరంలోనే చాణిక్యుని చుట్టుముట్టారు.

అప్పుడు చాణిక్యుడు తన గుర్రం దిగి తన చుట్టూ ఉన్న సైనికుల్ని చూస్తూ తన ఒరలోనుండి ఒక చిన్న కత్తిని తీశాడు. అది చూసిన ఆ సైనికులు.. ఈ చిన్న కత్తితో మమ్మల్ని నరికేదామని అనుకుంటున్నావా! అని అపహాస్యం చేశాడు. చాణిక్యుడు తన నడుముకి కట్టిఉన్న ఒక తువ్వాలు లాంటి పొడవాటి గుడ్డను విప్పి దాని మొనని చేతిలో ఉన్న కత్తిపిడికి కడుతున్నాడు. అదిచూసిన మగధ సైనికుల్లో ఒకడు.. ఏరా బడుగు బాపడు! ఆ తువ్వాలతో ఉరివేసుకొని చద్దామనుకుంటున్నావా? ఏంటి? అని హాస్యంగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకంటే చాణిక్యుని చేతిలో ఉండాల్సిన కట్టి వాని గొంతులో దిగింది. ఆ కత్తికి కట్టిన గుడ్డ యొక్క మరో చివర చాణిక్యుని చేతిలో ఉంది. అలా ఒక రకమైన ఆయుధాన్ని తయారు చేసిన చాణిక్యుడు ఉన్నచోట నుండి ఆ గుడ్డను వేగంగా తన చుట్టూ తిప్పుతూ నలుగురి సైనికుడి గొంతులు కోసేశాడు. ఇంతలో ఒక సైనికుడు చాణిక్యుని కటి గుడ్డను తన కత్తితో తెంపేశాడు. ఆ మిగిలిన 10 మంది సైనికులు వాళ్ల గుర్రాలు దిగి ఒక్కరిగా కాకుండా 10 మంది ఒకేసారి దాడి చేయాలనీ సైగ చేసుకున్నారు.

అది గమనించిన చాణిక్యుడు.. తన మరో ఒరలో ఉన్న ఇంకో చిన్నకత్తిని తీసుకొని.. ఒక గుడ్డతో తన కాలికి ఆ కత్తిని కట్టాడు. ఇది గమనించిన సైనికులు చాణిక్యునిపై ఒక్కసారిగా దూకాడు. దాంతో చాణిక్యుడు కిందకు వంగి తన కుడికాలు పైకి లేపి కాలుని అత్యంత వేగంగా గుండ్రంగా తిప్పాడు. ఆ కత్తి 10 మంది పొట్టలను చీలిచి పేగులన్ని కింద పడేలా చేశాయి. వారందరు కిందపడి కొనఊపిరితో కొట్టుకుంటుంటే చాణిక్యుడు మరలా యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు. మరోవైపు పురుషోత్తముడికి, భద్రభటుడికి యుద్ధం కొనసాగుతూనే ఉంది. వారి చేతిలోకి కత్తులు వేడెక్కుతున్నాయి. వీళ్ళ పోరాటం ఇద్దరిలో ఎవరో ఒక్కరు చస్తేనే గాని ఆగేలా లేదు. నెమ్మదిగా భద్రబటుడిలో అలసట మొదలయింది. నెమ్మదిగా పురుషోత్తముడిది పైచేయిగా మారి తాను కొట్టిన దెబ్బకు భద్రబటుడి కత్తి రెండుగా చీలిపోయి కింద పడిపోయాడు. వెంటనే పురుషోత్తముడు అతని మెడపై కత్తి పెట్టి భద్రభట! నీలాంటి మానవ వీరుణ్ణి ఇప్పటివరకు చూడలేదు. అలెగ్జాండర్ కూడా నీ ముందు కుర్రవాడే. ఎందుకంటె అతను నీలో సగకాలం కూడా నాతో పోరాటం చేయలేకపోయాడు. నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని అభినందించాడు.

ఆ మాటలకు బద్రభటుని మనస్సు ప్రశాంతంగా అయింది.ఒక మహావీరుడు నన్ను మెచ్చుకోవడం నాకు మహా ఆనందంగా ఉంది. ఒక వీరుడికి ఇంతకన్నా ఏం కావాలి. మీరు నా తల నరికి నాకు వీర మరణం ప్రసాదించండి అని అడిగాడు. దానికి పురుషోత్తముడు.. నీలాంటి మహావీరుడు చేయాల్సింది ప్రాణత్యాగం కాదు.. దేశ సేవ. ఇప్పుడు చెప్పు నదులకు ద్రోహం చేస్తావా.. దేశానికి ద్రోహం చేస్తావా అని అడిగాడు. దానికి భద్రభటుడు.. పురుషోత్తమ! ఈ లక్షలాది మంది మగధ సైన్యం నన్ను చూసే ఈ యుద్దానికి వచ్చారు. ఇప్పుడు నేను మీతో చేయికలిపి వారిని మోసం చేయలేను. కాబట్టి నేను ఈ యుద్ధం నుండి పూర్తిగా విరమించుకుంటున్నాను అని అన్నారు. దీంతో పురుషోత్తముడు.. సైనికులారా! ఇతనిని బందించి కారాగారంలో హింసించి తలనరికి చంపండి అని ఆదేశించాడు. ఈ విషయం తెలుసుకున్న సగం మగధ సైనికులకు ఉత్సాహం తగ్గింది. ఓటమి దగ్గర్లోనే ఉందని అర్ధం అయింది. భద్ర భటుణ్ణి బందించి తీసుకువెళ్తున్న సైనికున్ని ఒకణ్ణి చూసి పురుషోత్తముడు చిన్న సైగ చేశాడు. దానికి అర్ధం ఇతన్ని బందించండి కానీ చంపవద్దు అని.

ఇంతలో చంద్రగుప్తునికి ఎదురుగా ఎంతో ఆవేశంగా ఒక పొడవైన కత్తిని పట్టుకుని ఒకవ్యక్తి నిలుచొని ఉన్నాడు. ఓరి కుర్రకుంకా నీ వల్ల నా బలం పోయింది. గౌరవం పోయింది. మనశ్శాంతి పోయింది. ఈ రోజు నిన్ను చంపి నా మనశాంతిని తిరిగి తెచ్చుకుంటాను. ప్రధానమంత్రి రాక్షసుడు అంటే నిజంగా రాక్షసుడే అని నీ చావుతో నా కీర్తి నాలుగు దిక్కులా వ్యాపించేలా చేస్తా అని చంద్రగుప్తుని పైకి రక్షకుడు కత్తి దూశాడు. అనుకున్నట్టుగానే రాక్షసుడు వీరోచితంగా పోరాడుతున్నాడు. రాక్షసుని శక్తికి చంద్రగుప్తుడు తట్టుకోలేక పోతున్నాడు. అతన్ని గెలవడం అసాధ్యమని చంద్రగుప్తునికి అనిపిస్తుంది. ఎందుకంటె రాక్షసుని శక్తి అనుభవం అపారం. కానీ చంద్రగుప్తునికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదే అతను యవ్వనస్తుడు అవడం వలన ఇతనికి అతివేగం, ఎక్కువ సత్తువ ఉంది. ఇలా ఇధ్దరు పోరాడుతూ ఇద్దరు నెట్టుకొని దూరంగా పడిపోయారు. ఇప్పడు ఇద్దరి చేతుల్లో కత్తులు లేవు. అది గమనించిన రాక్షసుడు.. వెంటనే తన పక్కన ఉన్న విల్లు బాణం తీసుకొని చంద్రగుప్తుని వైపు బాణం వేశాడు. అప్పటికి చంద్రగుప్తుడు తనకు దొరికిన ఒక కత్తిని పట్టుకొని గాల్లోకి పైకి ఎగిరి తన వైపు వస్తున్నా బాణాన్ని తన కత్తితో రెండుగా చీల్చాడు.అలా చీల్చిన బాణాల్లో ఒక ముక్క అతని నుదుటున తాకి రక్తం చిందింది. అలా ముందుగా రాక్షసుని ముందుగా పడి అతని మీద చివరి అంచుల్లో కత్తిని ఆపాడు. అది చూసిన రాక్షసుడు ఎరా కుర్రకుంకా! నాకు ఒక అవకాశం ఇస్తున్నావా. నేను దేశానికి ద్రోహం చేస్తాను గాని, నందులకు ద్రోహం చేయను. నన్ను చంపెయ్ అని అన్నాడు. దానికి చంద్రగుప్తుడు.. ఏరోజు నన్ను ఏమి ఎరుగని మా గురువుగారు చాణిక్యుల వారు.. మొట్టమొదటి సరిగా నన్ను ఒక మాట అడిగారు. అది ఎట్టి పరిస్థితుల్లో నిన్ను చంపకూడని.. నీకు ప్రాణ భిక్ష వేస్తున్నాను.. పో బ్రతికిపో అని చంద్రగుప్తుడు అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

దీంతో రాక్షసుడు ఆలోచనలో పడుతాడు.. చాణిక్యుడు ఎందుకని నన్ను చంపద్ధన్నాడు. బహుశా తన ప్రేయసి సుహసినిని వేశ్యగా చేసినందుకు అతను నాపై పగబట్టి తానే స్వయంగా నన్ను చంపుదామని అనుకున్నాడా. అలా జరుగనివ్వను. ఎలాగో సగం సైన్యం చంద్రగుప్తుని సేనతో కలిసిపోయింది. ఈ యుద్ధంలో మగధ సేన ఓడిపోయే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేను ఓడిపోయే ముందు చాణిక్యుని చంపాలి అనుకోని తను పైకి లేచి తన కత్తిని తీసుకొని చాణిక్యుని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇంతలో కొంత దూరంలో రాక్షసుడికి చాణిక్యుడు కనిపించాడు. అక్కడ గాయలహాతో పడిఉన్న సైనికులకు చాణిక్యుడు వైద్య సహాయం అందిస్తున్నాడు. కింద పడిఉన్న ఒక సైనికుడికి ఆవైపు తిరిగి గుడ్డ కడుతున్న చాణిక్యుడి వైపు రాక్షసుడు పరుగెత్తుకుంటూ వెళ్లి తన కత్తిని ఎత్తి చాణిక్యుని మెడ చివరి అంచులవరకు అతని కత్తిని తీసుకొని వచ్చాడు.

ఇంతలోఘల్ అనే ఒక శబ్దం వినిపించింది. రాక్షసుడు కత్తి ఎత్తిన ప్రతిభింభం చాణిక్యునికి ఎదురుగా ఉన్న ఒక ఇత్తడి వస్తువులో కనిపించింది. చాణిక్యుడు అప్రమత్తమై తన కత్తితో రాక్షసుడి కత్తిని అడ్డుకున్నాడు. తర్వాత రాక్షసుని కత్తిని చాణిక్యుడు తన కత్తితో గట్టిగా కొట్టాడు. దీంతో రాక్షసుడి కత్తి కింద పడిపోయింది. చాణిక్యుడు రాక్షసుడితో మరీ ఇంతలా దిగజారి పోయావా రాక్షస. నందులకి విశ్వాస పాత్రులుగా నీ జీవితకాలం అంతా ఆ సింహాసనానికి సేవ చేశావు. కానీ చివరకి వెనకనుండి దొంగదెబ్బ తీసే పిరికివాడివి అని అపకీర్తిని మూటగట్టుకున్నావు. దేనికోసం ఇదంతా ఇప్పుడు నేను ఏం చేయాలి. నీ తల నరికి చంపాలా? లేదా ప్రాణ భిక్ష వేయాలా? అని అడిగాడు. దానికి రాక్షసుడికి నోటా మాట రాలేదు. కనీసం మనసులో ఈరోజు ఎలాగైనా చాణిక్యుడు తనను చంపేస్తాడు అనే భయంతో వణుకుతున్నాడు. అది గమనించిన చాణిక్యుడు.. మగధ రాజ్యానికి ప్రధానమంత్రిగా వర్థిల్లిన నువ్వు.. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిలా ప్రాణ భయంతో వణుకుతున్నావు. సగం వచ్చిన పాములాంటి నిన్ను.. నేను చంపను అని తన చేతిలోని కత్తిని కింద పడేసి ఆ పక్కనే వీరోచితంగా పోరాడుతున్న చంద్రగుప్తుణ్ణి చూపిస్తూ చూశావా రక్షసా.. ఆ యువకిశోరాన్ని అతనే మగధకు కాబోయే చక్రవర్తి. ఇకనైనా ప్రజల కోసం నిలబడే అలంటి రాజుగా సహాయపడే ఒక మంత్రిగా జీవిస్తావని నమ్ముతూ నీకు ప్రాణ భిక్ష వేస్తున్నాను. అని చాణిక్యుడు అన్నాడు. అప్పుడు రాక్షసుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. అప్పుడు చాణిక్యుడు.. నాకు ఒక సహాయం చేస్తావా ! రాక్షసా అని అడిగాడు. నా సుహాసిని ఎక్కడుంది అసలు ప్రాణాలతో ఉందా? అని అడిగాడు.

దానికి రాక్షసుడు తన తలను తిప్పి కోటకు ఎడమవైపు ఉన్న ఒక భవనం వైపు చూపించి.. అది గైరికుడి చెరసాల అని చూపించాడు. ఇంకా చాణిక్యుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. వెంటనే గుర్రం పైకి ఎక్కి చెరసాల వైపు వెళ్ళాడు. సుహాసిని ఆలోచనలు, తాను ఎలావుందో అని ఆలోచించుకుంటూ చెరసాలకు వెళ్ళాడు. చాణిక్యుడు ఆ చెరసాలలోకి ప్రవేశించి మెట్లు దిగే కొద్దీ చిమ్మచీకటి అలుముకుంది. ఆ పక్కన ఉన్న కాగడా తన చేతికి పట్టుకొని చాణిక్యుడు ముందుకు కదులుతున్నాడు. అక్కడ నెల అంతా చీము నెత్తురుతో జిగురుజిగురుగా ఉంది. తాను ముందుకు వెళ్తుంటే.. ఇరువైపుల్లో ఉన్న గదుల్లోంచి ఖైదీల ఏడుపులు మూలుగులు వినిపిస్తున్నాయి. అలా వెళ్తుండగా .. ఒకగదిలో చాణిక్యునికి భీకర దృశ్యం కనిపించింది. అక్కడ వాలుగా ఉన్న ఒక బండ రాయిపైన ఒక వ్యక్తి కట్టబడి ఉన్నాడు. అతని చాతిపైన ఉన్న చర్మం మొత్తం వలువబడి ఆ ఛాతీమీద 3 ఎలుకలు ఆ వ్యక్తి మాంసం తింటున్నాయి. అది చూసిన చాణిక్యుడు వెంటనే తన కత్తిని చూసి అతని గొంతుని కోశేశాడు. కొన్ని క్షణాల్లో అతను చనిపోయాడు. ఆవ్యక్తి కళ్ళు చాణిక్యున్నే చూస్తున్నాయి. చనిపోయిన ఆ వ్యక్తి కళ్ళు.. ఈ నరకం నుండి విముక్తి కలిగించినందుకు మీరు కృతజ్ఞతలు అని చెప్తున్నట్లు చూస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన చాణిక్యుడునికి సుహాన్సీని విషయంతో ఇంకా భయం పెరిగిపోతుంది.

అలా ముందుకు సాగుతున్న చాణిక్యునికి కత్తి నూరుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వినిపిస్తున్న గదిలోకి చాణిక్యుడు వెళ్ళాడు. ఆ గదిలో కాగడాల వెలుగులో పెళ్ళికూతురిలా అలంకరించిన సుహాసిని కనిపించింది. తన పక్కనే కత్తి నూరుతున్న గైనికుడు.. చాణిక్యుల వైపు చూసి చాణిక్య! విష్ణుగుప్తా! నువ్వు వస్తావని నాకు తెలుసు. నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నీ చెరసాల నుండి తప్పించుకొని పారిపోయిన రోజునుండి రాజాజ్ఞ మేరకు నీ ప్రేయసి సుహాసినిని ప్రతిరోజు పెళ్ళికూతురిలా అలంకరిస్తూ.. నివ్వు తిరిగి వచ్చిన రోజున తన కళ్ళముందే నిన్ను చంపి అప్పుడు దీనికి మరోసారి నందులకు వేశ్యగా చేయాలని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. నాకు నీ శరీరము పై ఎంతో ఆశ ఉంది. నీకు నరకయాతన రుచి చూపించాలని ఉవ్విళ్లూరుతున్నాను అని అంటూ తన కత్తిని తీసుకుని గైనికుడు చాణిక్యునిపై యుద్ధానికి వెళ్తాడు.ఘోర యుద్ధం జరుగుతుంది. కాసేపయ్యాక గైనికుడితో చాణిక్యుడు పోరాడలేక పోతున్నాడు. సుహాసిని కళ్ళలో చాణిక్యుడు ఓడి పోతున్నాడు అని భయం కనిపించింది.

కొన్ని క్షణాల తర్వాత చాణిక్యుడు చేతిలోని కత్తిని గైనికుడు లాక్కొని అతని గుండెల పైన గట్టిగా తన్నాడు. చాణిక్యున్ని గైనికుడు ఒక గోడకు గట్టిగా నొక్కి పెట్టి రెండు కత్తులు చాణిక్యుని మెడకు ఇరువైపులా పెట్టి అతని మెడను కొయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. చాణిక్యునికి ఊపిరి ఆడట్లేదు. అతను నిస్సహాయుడు అయ్యాడు. ఏదైనా ఆయుధం కోసం వెతుకున్న చేతికి గోడకు నిలబెట్టి ఉన్న ఒక కాగడా దొరికింది. దానితో గైనకుడిని గూబపైన చాణిక్యుడు ఒక్క బాదుడు బాదాడు. ఆ చమురు గైనకుడి ముఖం అంతా అంటుకొని గైనకుడి ముఖం కాలిపోయింది. అదే అదనుగా భావించిన చాణిక్యుడు.. ఆ గదిలో ఉన్న కాగడాలు అన్ని తీసుకొని ఒక్కో దానితో గైనకుడి తలమీద కొడుతూ ఉన్నాడు. ముఖం అంతా కాలుతున్న గైనకుడు నొప్పితో మూలుగుతున్నాడు. వెంటనే చాణిక్యుడు సుహాసిని చేతికి ఉన్న కట్లు విప్పి గైనకుడు కుడికాలు పట్టుకొని ఆ చెరసాల మధ్యలోకి ఈడ్చుకుని వచ్చాడు. చాణిక్యుడు సుహాసిని అక్కడున్న బందీలను విడిపించారు.

అప్పుడు చాణిక్యుడు మిత్రులారా! చేయని తప్పుకుండా.. రాజు దుర్మార్గపు పాలనకు ప్రశ్నించారన్న కారణంగా మిమ్మల్ని చిత్ర హింసలకు గురి చేసారు. ఇన్ని రోజులుగా మిమ్మల్ని క్రూరంగా హింసించిన ఈ గైనికుడి శరీరాన్ని మీకు ఇస్తున్నాను. వీని చావుతో మీ ఆకలి తీర్చుకొని అన్నాడు. దీంతో ఆ బందీలంతా గైనకుడిని పళ్లతో పీక్కుతిన్నారు. గోరమైన నొప్పిని భరిస్తూ.. గైనికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చాణిక్యుడు బందీలందిరితో పాటు చెరసాల బయటికి వచ్చాడు. ఎన్నో నెలల తరువాత సూర్యకాంతిని చూసిన బందీలందరూ స్వేచ్ఛ వాయువులను పీల్చుకున్నారు. అందరూ చాణిక్యుడికాళ్లపై పడి కృతజ్ఞతలు తెలిపారు. సుహాసిని గుండెల్లో పట్టలేనంత ఆనందం వచ్చింది. సుహాసినిని చూస్తున్న చాణిక్యునికి పట్టరానంద సంతోషం లభించింది. సుహాసిని చాణిక్యుని కౌగిలించుకోవాలని అనుకుంది. చాణిక్యుడు కూడా అదే కురుకుంటూ ఒక అడుగు ముందుకు వేశాడు. దీంతో సుహాసిని పక్కకు ఒక అడుగు వేసి.. ఇక వెళదాం పద చాణిక్య! నా జీవితానికి ఇక ఇలాంటి కాలంలో చోటులేదు అని ముందుకు నడుస్తుంది.

సుహాసినినితో సుఖంగా సంతోషముగా ఇకపై జీవిద్దామనుకున్న చాణిక్యుడినికి ఆమె మాటలు అర్ధం కాలేదు. రాజతంత్రాన్ని సైతం క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న చాణిక్యునికి ఒక ఆడదాని మాటలు అర్ధం కాలేదు. ఏం చేయాలో అర్ధం కానీ చాణిక్యుడు.. చేయాలనుకున్నా చేయలేని సుహాసిని ఇద్దరు యుద్ధరంగం వైపు బయలుదేరుతున్నారు. ఇంతలో పాటలీపుత్ర రాజకోటలో ఉన్న నందుల దగ్గరికి ఒక భటుడు పరుగెత్తుకుంటూ వచ్చి ప్రభు! పరిస్థితి విషమించింది. ఉత్తరదిక్కున ఉన్న మన సైన్యాన్ని పురుషోత్తముడి సైన్యం ఓడించింది. పడమర దిక్కున ఉన్న మన సైన్యాన్ని పర్వతకుడి సైన్యం తరిమి తరిమి కొట్టింది. దక్షిణ దిక్కున ఆంధ్ర, కళింగుల సైన్యం మన సైన్యం అంతటిని బంధించింది. ఇక తూరుపు దిక్కున కేవలం కొంత సైన్యం మాత్రమే చంద్రగుప్తుని సైన్యంతో పోరాడుతుంది. కాసేపట్లో వారిని కూడా ఆవీరుడు ఓడించేస్తారు. మీరు ఇక్కడేఉంటే వారు అంతా కోటలో ప్రవేశించి మిమ్మల్ని ముక్కలముక్కలుగా నరుకుతారు. ఎక్కడికైనా పారిపోయి మీ ప్రాణాలను రక్షించుకొంది ప్రభు! అని సలహా ఇచ్చాడు.

నందులకు గుండెలో భయం మొదలయింది. అందరి ముఖాలతో ప్రాణభయం కనిపిస్తుంది. అందులో ఒకరు ఘణానందునితో అన్నయ మనం ఏం చేద్దాం! పక్క రాజ్యాలకు వెళ్లిపోదామా.. లేదా అడవుల్లో తల దాచుకుందామా! లేదా మనం వేషం మార్చుకొని ప్రజల్లో కలిసిపోదామా. మనకు సమయం లేదు. ఏం చేద్దామో చెప్పు అన్నయ్య అని అడిగాడు. దానికి ఘనానందుడు మనం తల దాచుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్తే.. ప్రజలే మనల్ని నరికేస్తారు. ఇన్ని రాజభోగాలు అలవాటు పడిన మనం అడవుల్లో ఒక్కరోజు కూడా ఉండలేము. పోనీ పక్క రాజ్యాల్లోకి వెళ్లినా కూడా.. వాళ్లకు మనపై కోపం పీకల దాకా ఉంది. ఇవన్నీ సరైన మార్గాలు కావు.. ఇప్ప్పుడు మనం చేయాల్సింది. ఊరి చివరన ఉన్న జీవసిద్ధి గారి ఆశ్రమానికి వెళ్లడం.. నాకు ఆయనపైన నమ్మకం ఉంది.. కాసేపట్లో శత్రుంజయ యాగం పూర్తి అవుతుంది.. రహస్య మార్గం ద్వారా అయన దగ్గరికి వెళదాం పదా అని గణానందుడు అన్నాడు.

అక్కడినుంచి జీవసిద్ధి ఆశ్రమానికి వెళ్ళాడు. ఇంతలో తూర్పు దిక్కున దాదాపు మగధ సైన్యం ఓడిపోయింది. కేవలం కొంత మంది మగధ సైనికులు మాత్రమే చంద్రగుప్తుని సైనికులతో పోరాడుతున్నాడు. ఇంతలో ఒక సైనికుడు చంద్రగుప్తుని దగ్గరకు వచ్చి.. నందులు పారిపోతున్నారు ప్రభు! అని చెప్తాడు. దీంతో చంద్రగుప్తుడు.. ఆఆఆఆఆఆఆఆ అని గట్టిగా అన్నాడు. అది విన్న సైన్యం ఒక్కసారిగా యుద్ధం చేయడం ఆపేశారు. చంద్రగుప్తుడు తన గుర్రం ఎక్కి మాట్లాడుతూ.. మిత్రులారా! మగధ సైనికులారా! నేను మీ శతువుని కాదు. రేపటినుండి మీరే నా సైన్యం. ఉత్తర, దక్షిణ, పడమర దిక్కుల్లో మగధ సైనికులు అందరూ మాతో చేతులు కలిపారు. మీ సర్వసైన్యాధ్యక్షుడు బద్రభటుడు.. ఎప్పుడో మాకు లొంగిపోయాడు. మీ రాజు దొడ్డి దారిన పారిపోతున్నాడు. ఇప్పడు మీరు ఎవరికోసం యుద్ధం చేస్తున్నారు. ఇకనైనా మాకు లొంగిపోండి. మీకు శిక్షలు, రాజ్య బహిష్కరణ, ఉద్యోగం తీసివేయడం ఉండదు. మీరే మా సైన్యం. ఇదే మీకు చివరి అవకాశం. నందులకు ద్రోహం చేస్తారా? లేదా దేశానికి ద్రోహం చేస్తారా? అని అన్నాడు. ఒక్క క్షణం యుద్దభూమి అంతా నిశ్శబ్దంగా మారింది. ఇంతలో ఒక మగధ సైనికుడు తన చేతిలోని కత్తిని కింద పడేశాడు. అది చూసిన మరో మగధ సైనికుడు తన ఆయుధాన్ని కింద పడేశారు. ఇలా ఒకరిని చూసి ఇంకోకరు.. అక్కడున్న మగధ సైన్యం అంతా ఆయుధాన్ని త్యజించి యుద్ధం విరమించారు. వాళ్లంతా మోకాళ్ళ మీద నిల్చొని జయాయో.. చంద్రగుప్త మహారాజ్ జయహో!! అని గట్టిగ అన్నారు. అలా గుర్రం మీద నిల్చొని ఉన్న చంద్రగుప్తునికి లక్షలాది మగధ సైన్యం చేస్తున్న ఈ నినాదాలు వినిపించాయి. ఇక్కడినుంచే భారతదేశ స్వర్ణయుగం మొదలవుతుంది.

చాణిక్యుడు – సుహాసిని తమ గుర్రాలపై జీవసిద్ధి ఆశ్రమానికి వెళ్లారు. ఆశ్రమం బయట వాళ్ళ గుర్రాలు దిగి ఒకరినొకరు చూసుకున్నారు. సుహాసిని ఎందుకు నన్ను దూరం పెడుతుంది. నాతో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదా? లేదా తనకు నేను నచ్చలేదా? ఇలా అనేక ఆలోచనలతో ఇద్దరు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆమె ఏం అనుకుంటుందో ఆమెతో మాట్లాడబోతుంటే.. ఒక్క పెద్ద గుర్రపు షకిలింపు వినిపించింది. ఎదురుగా చూస్తే 8 గుర్రాలైన 8 మంది నందులు ఉన్నారు.వీరంతా జీవసిద్ధి ఆశ్రమానికి వస్తున్నారు. వారి వెనుక నంధుల్ని అంతం చేయడానికి చంద్రగుప్త మౌర్యుడు తన గుర్రంపై వస్తున్నాడు.

నంద వంశాన్ని మృత్యువు కబళిస్తున్నట్లు ఆ దృశ్యం కన్పించింది. నంధసోదరులు చాణిక్యుని దగ్గరికి వచ్చి ఆగారు. ఘనానందుడు తన గుర్రం దిగి చాణిక్య ఎట్టకేలకు నీ ప్రియురాలిని చెరసాల నుండి విడిపించావు. కానీ ఇప్పుడు మీరు నానుండి తప్పించుకోలేరు. ఈరోజు మీకు నరకం అంటే ఏమిటో నేను చూపిస్తా అని ఘణానందుడు తన ఒరలో నుంచి కత్తిని బయటకు తీశాడు. దానికి చాణిక్యుడు అపహాస్యంగా నాకు మృత్యువును చూపిస్తావా? అదిగో వస్తున్నాడు చూడు నా శిష్యుడు చంద్రగుప్తుడు. నీ కోసం నేను తయారు చేసిన నీ మృత్యువు. రేపటివరకు మీ నంద సోదరుల్లో ఒక్కరైనా బతికున్నా లేదా మీ నంద సోదరుల్లోఏ ఒక్కరైనా చంద్రగుప్తుని తల నరికి ఆ కత్తిని నాకు చూపించినా నేనే నా తలను మీకు కానుకగా ఇస్తానని చాణిక్యుడు శపథం చేస్తాడు.

వెంటనే నందసోదరులలో ఒకడు అన్న! వీడితో మాటలు ఏంటి అన్నా! ఇప్పుడే ఈ బ్రాహ్మణుడి తల నరికి శత్రుంజయ యాగం కోసం మండుతున్న హోమంలో పడేస్తాను అని అన్నాడు. దానికి సుహాసిని ఫక్కున వెటకారంగా నవ్వింది. ఆ నవ్వుకి ఘనానందునికి పట్టరానంత కోపం వచ్చింది. తమ్ముళ్లు ముందు చాణిక్యున్ని కాదురా! వీడికన్నా ముందు వీని కళ్ళముందే వీడి ప్రేయసిని, వీడి శిష్యుణ్ణి అంతం చేసి వీని ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టాలి. నేను వీడిముందే సుహాసిని చంపుతాను. మీ ఏడుగురు వస్తున్న చంద్రగుప్తుని తలని నరికి తీసుకురండి అని చెప్పి సుహాసినిపై ఘనానందుడు కత్తి దూస్తాడు. చాణిక్యుడు వెంటనే తన ఒరలో ఉన్న కత్తిని తీసి ఘననందునితో యుద్ధం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య పోరాటం హోరాహోరీగా సాగుతుంది. ఇంతలో ఒక తల దొర్లుకుంటూ ఘనానందుని కాళ్ళ దగ్గరికి వచ్చి పడింది. ఇదిగో నీ శిష్షుని తల అని ఆ తలని జుట్టు పట్టుకొని పైకి లేపాడు. ఆ తల ఎవరిదో కాదు.. ఘనానందుని చిన్నతమ్ముని తల. దానికి ఘనానందుని కళ్ళల్లో తన జీవితంలో మొట్టమొదటి సరిగా నీళ్లు తిరిగాయి. వాళ్ళ తమ్ముళ్ల వైపు ఒక్కసారి తలతిప్పి చూశాడు. అక్కడ తల లేని తన తమ్ముడి శరీరం గతితప్పి ఒక్కోఅడుగు అటు ఇటు వేస్తూ తన చేతిలోని కత్తిని ఊపుతూ అలా నేలమీద పడిపోయింది. ఆ శరీరానికి ఎదురుగా రక్తంతో తడిసిన ఒక కత్తితో గంభీరంగా చంద్రగుప్తుడు నిలబడి ఉన్నాడు. మిగిలిన నంద సోదరులు ఆరుగురితో చంద్రగుప్తుడు యుద్ధం చేస్తున్నాడు. ఒరేయ్.. తమ్ములు ఒక్కొక్కరిగా కాదురా అందరూ ఒకేసారి దాడి చేయండి అని ఆజ్ఞాపించాడు ఘనానందుడు. ఆ మాట విన్న నంధసోదరులు చంద్రగుప్తుణ్ణి చుట్టుముట్టారు. చంద్రగుప్తుడు తన ఒంటిపై ఉన్న కవచాన్ని తీసి దూరంగా విసిరేసి తన చేతిలోని కత్తి గట్టిగ తిప్పుడు ఆరుగురు నంధసోదరులతో యుద్ధం చేస్తున్నాడు.

ఇంతలో ఘనానందుడు చాణిక్యుడుపై కత్తితో యుధం చేస్తున్నాడు. చాణిక్యుడు తన కత్తితో సమానంగా యుద్ధం చేస్తున్నాడు. ఒకానొక సమయంలో చాణిక్యునిదే పైచేయిగా మారి ఘనానందుని చేతిలోని కత్తిని దూరంగా విసిరి పారేసి ఘనానందుని మెడపై కత్తి పెట్టాడు. అదే అతనికి చివరి క్షణం అని సుహాసిని అనుకుంది. కానీ చాణిక్యుడు ఘనానందుడిని చంపలేదు. అటు చూడు ఘనానంద అని చాణిక్యుడు! చంద్రగుప్తుణ్ణి చూపిస్తూ.. వాడే భారతదేశ భవిషత్తు కాబోయే చక్రవర్తి, నీ చావు నా చేతుల్లో కాదు.. వాడి చేస్తుల్లోనే చావాలి అని చాణిక్యుడు అన్నాడు. ఘనానందుడు చూస్తుండగానే ఆరుగురు నంద సోదరుల తలల్ని చంద్రగుప్తుడు నరికి చంపేశాడు. ఆ ఆరు తలల్ని వాళ్ళ జుట్లతో ముడివేసి చంద్రగుప్తుడు తన చేతితో వాటిని పట్టుకొని తీసుకొని వచ్చి ఘనానందుని ముందు పడేశాడు. ఘనానందునికి ఆ క్షణం వేదన అంటే ఏంటో నరకం అంటే ఏంటో, మృతువు అంటే ఎంతో, వేదన అంటే ఏంటో అర్ధం అయింది.

ఘనానందునికి ఆవేశం కట్టలు తెంచుకుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి కింద పడిఉన్న అతని కత్తిని తీసుకొని వెళ్లి.. నా తమ్ముళ్ళని చంపుతావురా అని చంద్రగుప్తునిపై దాడి చేశాడు. వీరిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కానీ అప్పటికే వేదనతో, ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఘనానందుడి ఛాతీని చంద్రగుప్తుడు తన కత్తితో చీల్చేశాడు. నొప్పిని తట్టుకోలేదా ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ అని ఘననందుడు గట్టిగా అరిచాడు. దానికి చంద్రగుప్తుడు ఈ దెబ్బ నీ రాజ్యంలోని పిల్లలకు సరైన విద్య నేర్పించకుండా.. వారి భవిష్యత్తును భ్రష్టు పట్టించినందుకు అని అన్నాడు. మళ్ళీ యుద్ధం చేస్తూ అతని తొడని చీల్చాడు. ఈ దెబ్బ ప్రజలకు సరైన నిత్యావసరాలు ఇవ్వకుండా వాళ్ళను భిక్షగాళ్ళను చేసినందుకు, గణానందుని వీపుని చీల్చి ఈ దెబ్బ వ్యాపారుల్ని పన్నుల పేరుతో వారి రక్తం తాగినందుకు అని అన్నాడు. ఇంతలో చంద్రగుప్తుడు చేసిన గాయాల నొప్పిని ఓర్చుకోలేక.. ఆగు చంద్రగుప్త! నువ్వు నేను రాజపుత్రులమే కానీ చాణిక్యుడు క్షతియుడు కాదు. అయితే మగధ రాజ్యం నీది అవ్వాలి లేదా నాది అవ్వాలి. నేనే నీకు ఈ రాజ్యాన్ని ఇస్తున్నాను. ఎప్పటికి ఈ రాజ్యంపై కన్నెత్తి కూడా చూడను. ఈ శేష జీవితాన్ని తీర్థయాత్ర లతో ముగిస్తాను నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు అని అన్నాడు. దానికి చంద్రగుప్తుడు! నువ్వు క్షత్రియుడివా! ఆయన బ్రాహ్మణుడా! మా గురువు గారు బ్రాహ్మణుడు అయినా అతనికి క్షాత్ర విద్యలు అన్నీ తెలుసు. క్షాత్రం తెలిసిన ప్రతి ఒక్కడు క్షత్రియుడే. ఆయన కన్నా గొప్ప క్షత్రియుడు నాకు ఎవ్వరు తెలియదు. పుట్టుక కాదురా నీ వర్ణాన్ని నిర్ణయించేది. నువ్వు ఆలోచిస్తున్న బుద్ధి, జీవిస్తున్న జీవితం ఇవే నీ వర్ణనను నిర్ణయిస్తాయి. నా దృష్టిలో నీ కన్నా హీనమైన వాడు వేరొకడు ఉండడు. నీలాంటి హీనులకు ఈ భూమిపై బ్రతికే అర్హత లేదు. అని చంద్రగుప్తుడు అన్నాడు.

వెంటనే ఘణానందుడు చాణిక్యుని కాళ్ళమీద పడి ఇదేం ధర్మం. ప్రజలను సరిగ్గా పాలించలేదని రాజును వధించడం ఏ శాస్త్రంలో ఉంది. దానికి చాణిక్యుడు నువ్వు ఒక విషయం మర్చిపోయావు గనానంద. నువ్వు రాజువు అయ్యావు కాబట్టి నీకోసం ప్రజలు పుట్టలేదు. ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్లకోసం సేవ చేయాలి కాబట్టి నువ్వు రాజు అయ్యావు. కానీ నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించలేదు. ఇప్పుడు ప్రజలే నీ చావునుకోరుకుంటున్నారు. ప్రజలకు హితమయ్యేదే రాజు చేయాలి. అదే ధర్మం. చంద్రగుప్త నువ్వు కానియ్యు అని అన్నాడు. చంద్రగుప్తుడు గణానందుని జుట్టుపట్టుకుని ఒక్క వేటుతో ఘనానందుని తల నరికాడు. ఆ తలను తీసుకువచ్చి.. చాణిక్యుని కాళ్ళ దగ్గర పెట్టి.. గురుదేవ! ఇది నేను మీకు ఇస్తున్న గురుదక్షిణ అని అన్నాడు. చాణిక్యుడు అప్పటివరకు ముడివేయని తన కురులను పట్టుకొని ఆనందంతో గర్వంతో తన కురులను ముడివేశాడు.

చంద్రగుప్తా అదిగో చూడు.. నేను నీకు కానుకగా ఇస్తున్న మగధ రాజ్యం. దానిలోని సింహాసనం ఇక నీ సొత్తు. మానవజాతి ఉన్నంతవరకు భారతదేశపు స్వర్ణయుగం అంటే.. అది చంద్రగుప్తుడు పరిపాలించిన కాలమే అని చెప్పుకునేంత రీతిలో నీ పరిపాలన కొనసాగించాలి. విజయోస్తు అని ఆశీర్వదించాడు. అప్పుడే అక్కడికి గుర్రమీద రాక్షసుడు వచ్చాడు. తన జీవితంలో ఎప్పుడు చూడలేను అనుకున్న ఒక దృశ్యాన్ని రాక్షసుడు చూశాడు. ఘననందుడితో సహా 7 మంది నంద సోదరుల తలలు జీవసిద్ధి బయటపడి ఉండటం. అదే సమయానికి జీవసిద్ధి ఆశ్రమంలో నుండి బయటకు వచ్చి చంద్రగుప్తుణ్ణి చూసి భవాని మాత ఆశీర్వాదం వల్ల ఎటువంటి విఘ్నం లేకుండా శత్రుంజయ యాగం విజయవంతం అయింది అని చాణిక్యునితో చెప్పి అతన్ని ఆనందంతో కౌగిలించుకున్నాడు. అది చూసిన రాక్షసుడికి ఏం చేయాలో ఏం మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు. అసలైన ఓటమి అంటే ఇదే కదా అని రాక్షసుడు అనుకుంటూ తలదించుకున్నాడు.

అది గమనించిన చాణిక్యుడు.. రాక్షస! నంధుల్ని కాపాడలేకపోయినందుకు యుద్ధంలో మగధ సేన ఓడిపోయినందుకు నువ్వు చింతించవద్దు. ఒక విష్యం నువ్వు గుర్తుంచుకోవాలి. నీవు మగధ సింహాసనానికి బద్దుడివే తప్ప.. నందులకి తొత్తువు కాదు. ఇప్పడు మగధ సింహాసనం చంద్రగుప్తుడిది కావున నీవు ఇకపై చంద్రగుప్తునికి బద్ధుడిగా ఉండాలి. రాజ్యం పరిపాలనతో నిత్యం చంద్రగుప్తునికి అండగా ఉండాలి. నీ నూతన చక్రవర్తికి శుభాలు పలుకు అని అన్నాడు. రాక్షసుడు ఒక్కసారిగా ఆశ్చ్యర్యపోయి.. చాణిక్యుడు చెప్పింది నిజమే కదా అనుకున్నాడు. చంద్రగుప్తుడు అంటే అతనికి ఇష్టం లేకపోయినా సింహాసనానికి అతను బద్ధుడు కాబట్టి రాక్షసుడు చంద్రగుప్తుని చేతులు పట్టుకొని మగధ నూతన మహారాజుకు జయము జయము అని కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు జీవసిద్ధి రాక్షసా! నంధుల్ని కాపాడటానికి నీవు ఎంతో ప్రయత్నించావు. అదినేను కళ్లారా చూశాను. వాళ్ళను నీవు కాపాడలేకపోయిన వాళ్ళకోసం నువ్వు ఎంతో పరితపించినందుకు నీకు అభినందనలు అని అన్నాడు. దానికి రాక్షసుడు! మీరు 3 రోజులుగా శత్రుంజయ యాగం చేస్తున్నారు. ఇప్పడు అది విజయవంతంగా పూర్తి అయిందని చెప్తున్నారు. ఈ యాగం పైనే నందులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. శత్రుంజయ యాగం చేసిన వారికీ ఓటమి ఉండదని అంటారు. కానీ, మా నందులు ఓడి పోయారు. దానికి మీ సమాధానం ఏంటి అని అడిగాడు.

దానికి జీవసిద్ధి! నీవు అన్నది నిజమే రాక్షసా! కానీ నేను యాగం చేసింది నందుల తరఫున కాదు. చాణిక్య – చంద్రగుప్తుని తరఫున. అందుకే నందులు నశించారు. చాణిక్య- చంద్రగుప్తులు జయించారు అని బదులిచ్చాడు. ఎంత పన్నాగం పన్నావు చాణిక్య అని రాక్షసుడు మనసులో అనుకున్నాడు. అప్పుడు చాణిక్యుడు రాక్షసా! ఇక ఆలస్యం చేయకుండా వెంటనే నగరంలోకి వెళ్లి కాసేపట్లో మహారాజులవారు నగరంలోకి ప్రవేశిస్తున్నారు అని చాటింపు వేయించండి. నూతన మహారాజుకు స్వాగత, సత్కారాలు సిద్ధం చేయండి. ఇక చేసేది ఏం లేక చంద్రగుప్తుని రాక కొరకు రాక్షసుడు తన గుర్రం పైకి ఎక్కి పాటలీపుత్ర వైపు వెళ్ళాడు.

అప్పుడు చంద్రగుప్తుడు సుహాసిని దగ్గరకు వచ్చి.. మాత! మీరు సుహాసిని దేవి గారు కదా అని అడిగాడు. అవును కుమార అని ఆమె సమాధానం ఇచ్చింది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. ఈమే మా గురువు గారితో కలిసి జీవించబోయే స్త్రీ అని తలచి నన్ను ఆశీర్వదించండి అని ఆమె కాళ్ళ మీద పడ్డాడు. చంద్రగుప్తుణ్ణి ఆశీర్వదించి పైకిలేపి.. నీ శిష్ష్యులకి వేశ్యలకు కాళ్ళకు కూడా మొక్కమని నేర్పించావా చాణిక్యా! అని అంది. ఆ మాటకి అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా దిగ్బ్రాంతి చెందారు. వెంటనే చాణిక్యుడు ఎందుకు అలా మాట్లాడుతున్నావు సుహాసిని. నీవు వేశ్యవు కాదు.. నందుల అరాచకానికి బలైన ఒక బాధితురాలివి మాత్రమే. నీవు ఒప్పుకుంటే నేటి నుండి మగధ సామ్రాజ్యపు మహారాజు రాజగురువైన చాణిక్యుని భార్య అనే హోదాతో సకల వైభోగాలతో జీవిస్తావు. నీ నోటా ఇకపై ఇలాంటి మాటలు రానివ్వద్దు అని అన్నాడు. దానికి సుహాసిని! నాకు ఏ హోదాలు వద్దు చాణిక్య! ఏ గుర్తింపు అవసరం లేదు. నీ వల్ల స్వేచ్ఛ స్వాతంత్య్రాలు నాకు దొరికాయి. దానికి నేను రుణపడి ఉంటాను. కానీ, నీ అర్ధాంగి స్థానాన్ని నేను తీసుకోలేను. దానికి నాకు అర్హత లేదు. నా అంతరాత్మ ఒప్పుకోదు. దయచేసి ఈ విషయంలో నన్ను ప్రలోభపెట్టవద్దు.

నేను ఇకపై నా తండ్రి గారితో కలిసి జీవిస్తాను. తక్షణమే నా తండ్రిగారు షత్తర్ తో తక్షశిల వెళ్లి అక్కడ వేద విద్యను అభ్యసించి జీవితాన్ని అక్కడే అదుపుతాను. ఇదే నా తుది నిర్ణయం అని అంది. సుహాసిని మాటలకు చాణిక్యుడు ఎలా స్పందించాలో తెలియలేదు. నోట మాట రావట్లేదు. కళ్ళు చెమ్మగిల్లాయి. చాణిక్యుని చూస్తున్న జీవసిద్ధికి, చంద్రగుప్తునికి చాలా బాధ అనిపించింది. అప్పుడు చాణిక్యుడు ఇకపై నేను నిన్ను ప్రలోభపెట్టదలుచుకోలేదు. నీవన్నట్టుగానే జరుగుతుంది. కానీ, నాదొక విన్నపం కనీసం చంద్రగుప్తునికి పట్టాభిషేకం జరిగేంతవరకైనా పాటలీపుత్రలో ఉండు అని అడిగాడు. దానికి ఆమె సరే అని ఒప్పుకుంది. ఇంతలో ఒక రాజా భటుడు వేగంగా చంద్రగుప్తుని దగ్గరకు వచ్చి..ప్రభు! నీకు ఒక అత్యవసర సందేశాన్ని పురుషోత్తమ మహారాజు పంపించారు. అదేంటంటే.. అక్కడ పర్వతకుడికి మగధ సింహాసనం పైన ఆశ పుట్టింది. అసలు చంద్రగుప్తునికి ఎందుకని సింహాసనం ఇవ్వాలి. వయసులో పెద్దవాడైన నాకు కదా సింహాసనం ఇవ్వాలి. కావాలంటే.. నన్ను మహారాజుగా ప్రకటించి అతన్ని యువరాజుగా ప్రకటించండి. నా తదనంతరం చంద్రగుప్తుణ్ణి మహారాజుని చేయండి. దీనికి ఒప్పుకొక పోతే చాణిక్య చంద్రగుతుణ్ణి సైతం అంతం చేయాలనీ రహస్య పన్నాగాలు పన్నుతున్నారని గూఢచారుల ద్వారా సమాచారం వచ్చింది ప్రభు అని అన్నాడు. ఆ సమాచారాన్ని అందరూ ఆశ్చర్యపోయారు. చాణిక్యుడు మాత్రం ఒక నవ్వు నవ్వి.. నేను ఊహించిందే జరిగింది. అంతర్యుద్ధం మొదలయింది అని అన్నాడు.

ఘననందునితో సహా నందసోదరులందరిని చంపిన తర్వాత చాణిక్య చంద్రగుప్తులు పాటలీపుత్ర రాజకోట వైపు వెళ్లారు. ఆ కోట బయట చాణిక్యుడు తన గుర్రాన్ని ఆపి అదిగో చంద్రగుప్త! నేను నీకు కానుకగా ఇస్తున్న మగధ రాజ్యం.. ధర్మంగా పరిపాలించు అని అన్నాడు. దీనికి సంతోషించిన చంద్రగుప్తుడు.. మీ వాక్కు అక్షరం పొల్లుపోకుండా ఈ నాటి నుండి ప్రజలను శాసించే ఒక నియంతలా కాకుండా వాళ్లకి ఒక సేవకుడిగా ఉంటూ ఆదర్శప్రాయమైన పరిపాలన చేస్తానని.. మీకు మాటిస్తున్నాను గురుదేవ! అని అన్నాడు. చాణిక్య చంద్రగుప్తులు తమ గుర్రాలపైనే కోటలోకి అడుగుపెట్టగానే.. చంద్రగుప్త మహారాజ్ కి జయహో.. ఆర్య! చాణిక్యుల వారికి జయహో! అని ప్రజలు గట్టిగా అరుస్తూ లక్షలాది పూలను వారిపై జల్లుతున్నారు.

ఇంతలో ప్రధానమంత్రి సలహాదారుడైన ఒక బ్రాహ్మణుడు.. రాక్షసుని చెవిలో ఒక మాట చెప్పారు. అది విని చిన్న నవ్వు నవ్వి పరుగెత్తుకుంటూ చాణిక్య చంద్రగుప్తునికి అడ్డు వచ్చి చాణిక్య! ఇప్పుడే మా రాజ పురోహితులు ఒక మాట చెప్పారు. ఇంతటి విజయం సాదించి రాజుగా పట్టాభిషిక్తుడు కావాల్సిన చంద్రగుప్తుడు తమ పరివారం అంతా రాజకోటలో ప్రవేశించడానికి ఇది మంచి సమయం కాదు. మంచి ముహూర్తం కుదిరేంత వరకు మీరు రాజుకోటలో ప్రవేశించకూడదని రాజ పురోహితులు సలహా ఇచ్చారు అని అన్నాడు. అది విన్న చంద్రగుప్తుడు చాణిక్యుల వైపు చూశాడు. అప్పుడు చాణిక్యుడు రాక్షసుడు ఏం చెప్పిన మన మంచికోసమే. అతను చెప్పినట్లే మంచి ముహూర్తం వచ్చేవరకు మనం రాజకోటలోకి ప్రవేశించవద్దు చంద్రగుప్తా అని అన్నాడు. వీరందరిని వందలాది గదులున్న మగధ అతిథి గృహంలో ఏర్పాటు చేశారు. సాయంత్రం అయింది. రాక్షసుడు తన ఇంటికి వెళ్ళాడు. ఎలాగైనా చంద్రగుప్తునికి పట్టాభిషేకం ఆపాలని ఏం చేయాలి అని మనసులో రగిలిపోతున్నాడు.

ఇంతలో తనకు ఒక ఆలోచన వచ్చిన ముసుగువేసుకొని తన ఇంటి కిటికీనుండి దూకి సువర్ణ నదీ తీరంలో ఒక చిన్న పడవ ఎక్కి ఆ అర్ధరాత్రి వేళ దీపం వెలిగించుకుని తాను ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. ప్రజలంతా ఆ రాత్రివేళ సంబరాల్లో మునిగిపోయారు. ఒక గదిలో పర్వతకుడు తన సేనాధిపతితో ఈ యుద్ధంలో ఎక్కువ మంది సైనికులు చనిపోయింది నా సేనలోనే. ఈ విజయం దక్కడానికి నేనే మూలకారణం. అలంటి నేను ఈరోజు ఒక సేవకుడిలా చంద్రగుప్తుని ముందు చేతులు కట్టుకొని నిల్చోలేను. ఈ మగధకు రాజును అయ్యే అర్హత నాకు ఒక్కడికే ఉంది. రేపు ఎలాగైనా నా గొంతు విప్పి.. ఆ సింహాసనం నేను దక్కించుకోవాలి అనిఅన్నాడు. అటు చంద్రగుప్తులు చాణిక్యుడు మాట్లాడుకుంటూ.. గురుదేవ! నాకెందుకనో రాక్షసుడు మనల్ని రాజకోటలోకి ప్రవేశించకుండా ఆపడానికే మంచి ముహూర్తం లేదని అబద్ధం చెప్పాడేమో అని అనిపిస్తుందని అన్నాడు. దానికి చాణిక్యుడు.. చంద్రగుప్త! మంచిముహూర్తం లేదని పండితుడితో రాక్షసునికి చెప్పించింది నేనే అని అన్నాడు. ఆ మాటకి చంద్రగుప్తుడు ఆశ్చర్యపోయి.. అలా ఎందుకు చెప్పించారు గురుదేవా అని అన్నాడు. దానికి చాణిక్యుడు.. చంద్రగుప్త! యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. అంతర్యుద్ధం జరుగుతుంది.

యుద్ధానికి ముందు నీకు గానానందుడు ఒక్కడే శత్రువు కానీ ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్లలో సగం మంది నీ శత్రువులే. ఈ శత్రువులంతా అంతం అయేంత వరకు శత్రుశేషం పూర్తిగా నశించేంత వరకు మనం రాజ భవనం లోకి ప్రవేశించకూడదు అని అన్నాడు. అక్కడికి ఒక గూడాచారి వచ్చి గురుదేవ! కాసేపటి క్రితం రాక్షసుడు తన ముఖానికి గుడ్డను కట్టి ఒక దొంగలా సువర్ణ నదిలో ఒక చిన్న పడవపైన ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. అతడి ఎక్కడికి వెళ్ళిపోతున్నదో నాకు తెలియదు అని అన్నాడు. అప్పుడు చాణిక్యుడు నేను అనుకున్నదే నిజం అయితే అతను సర్వార్థసిద్ధికి కబురు పంపి ఉండాలి. అతనే కనుక మగధకు వస్తే.. మళ్ళి కథ మొదటికి వస్తుంది అలా జరుగకూడదు అని అన్నాడు. ఇంతకీ ఆ సర్వర్ధ సిద్ది ఎవరు గురుదేవ! అని చంద్రగుప్తుడు అన్నాడు. దానికి చాణిక్యుడు.. గణానందని తండ్రి పద్మనందుడే బౌద్ధ మతం తీసుకొని పేరు మార్చుకొని సర్వార్థ సిద్ద అయ్యాడు. అయినా ఖంగారు పడకు ఆయన సంగతి నేను చూసుకుంటాను అని చెప్పాడు. మరుసటి రోజు తెల్లారింది.

ఒక భటుడు ఒక బంగారు పళ్లెంలో మేలిమైన పండ్లను తీసుకొని వచ్చి మహారాజ! ఈ పళ్ళని రాక్షసుల వారు మీకోసమే ప్రత్యేకంగా పంపించారు అని అన్నాడు. అప్పుడు పక్కెనే ఉన్న చాణిక్యుడు.. రాక్షసుడు ప్రత్యేకంగా మా కోసమే ఈ పళ్ళను పంపించాడా అని అడిగాడు. అవును ప్రభు అని సమాధానం ఇచ్చాడు. అదే సమయంలో ఇద్దరు మరుగుజ్జులు మరొక వెండి ఖంచంలోని పళ్ళను తీసుకొని వచ్చి మహారాజ ఈ పళ్ళని పిప్పిలివనం నుండి మీ తల్లిగారు మురాదేవి మీ విజయానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పంపించారు అని అన్నారు.వెంటనే చాణిక్యుడు తన పక్కనే ఉన్న భటుడి చేత బంగారు పళ్లెంలో ఉన్న పండ్లని… వెండి పళ్లెంలోకి, వెండి పళ్లెంలో ఉన్న పండ్లని బంగారు పళ్లెంలోకి తారుమారు చేపించి ఆ భటుడి చెవిలో ఏదో చెప్పాడు. అతను ఆ వెండిపళ్లెంలో ఉన్న రాక్షసుడు పంపించిన పళ్ళను తీసుకొని వెళ్ళిపోయాడు. కాసేపటికి రాక్షసుడు.. చాణిక్యులు – చంద్రగుప్తుడు ఉన్న గదిలోకి వచ్చాడు.

అప్పుడు చాణిక్య చంద్రగుప్తుడు బంగారు పళ్లెంలో ఉన్న పండ్లను తింటూ కనిపించాడు. అది చూసిన రాక్షసుని ముఖంలో నవ్వు వచ్చింది. తన మనసులో ఈ రోజుతో చాణిక్య చంద్రగుప్తుని కథ ముగుస్తుంది అని అనుకున్నాడు. రాక్షసుని రాకను గమనించిన చాణిక్యుడు.. రండి రండి రాక్షసుల వారు! మీ గురించే మాట్లాడుకుంటున్నం. మీరు పంపిన ఈ పళ్ళు అమృతంలా ఉన్నాయి. మీరు ఒక పండు తినండి అని అన్నాడు. కానీ ఆ పళ్ళను రాక్షసుడు తీసుకోకుండా.. ఇవి మీ కోసమే మగధ నలుమూలల గాలించి మేలిమైన పళ్ళను తెప్పించాను. మరల అవి మాకే ఇస్తే ఎలా? అని నవ్వుతు అన్నాడు. వీరిద్దరూ ఈ పళ్ళను తిని ఎప్పుడు రక్తం కక్కుకొని చస్తారా? అని రాక్షసుడు వేచిచూస్తున్నాడు. కానీ, వాళ్లలో ఏ మాత్రం చలనం లేదు. రాక్షసా మీకు ఇక్కడ ఏదైనా పని ఉందా అని చాణిక్యుడు అడిగాడు. దానికి రాక్షసుడు ఆబ్బె అలాంటిది ఏమి లేదు.. ఇక సెలవు తీసుకుంటానని అక్కడినుంచి నిరుత్సాహంగా వెళ్ళిపోయాడు.

రాక్షసుడు వెళ్లిపోతుంటే.. అప్పుడే ఆ గదిలోకి పర్వతకుడు వచ్చేశాడు. చాణిక్య! మగధను జయించడంలో మేమె ముఖ్యమై పాత్రను పోషించాం. ఎక్కువగా మా సైన్యమే నశించింది కానీ మీరేమో ఒక బాలున్ని తీసుకొని వచ్చి మా అందరి నెత్తిమీద కూర్చొబెడతాను అంటున్నారు. ఇతనిలో మీకు చక్రవర్తి ఎలా కనిపిస్తున్నాడో నాకు అర్ధం కావట్లేదు అని అన్నాడు. నా దృష్టిలో చంద్రగుప్తుడు ఈ మగధకు సరిగ్గా పాలన చేయలేడు.. అదే నేను ఈ మగధకు రాజును అయితే.. అని అనబోతుంటే అక్కడికి పురుషోత్తముడు వచ్చాడు. తన ఖడ్గాన్ని అక్కడ ఉన్న బల్లపై పెట్టి ఆసనంపై కూర్చున్నాడు. మీరంతా ఏదో చర్చిస్తున్నారు అని పురుషోత్తముడు అడిగాడు. దానికి చాణిక్యుడు.. పర్వతకుల వారు మగధ సింహాసనం తనకే అని చెప్పబోతుంటే.. పర్వతకుడు అడ్డు మాట్లాడుతూ అయ్యో అలాంటిది ఏమి లేదు. చంద్రగుప్తునికి పరిపాలన గురించి చెప్తున్నా అంతే అని అన్నాడు. మా అందరిలో అనుభవంలో మీరే దిట్ట. చంద్రగుప్తునికి అన్నీ మీరే నేర్పించాలి సుమీ అని పురుషోత్తముడు అన్నాడు. ఖచ్చితంగా నేర్పిస్తాను.. ఇక సెలవు అని అక్కడినుంచి వెళ్ళిపోయాడు. తన ఏకాంత మందిరానికి వెళ్లిన పర్వతకుడు.. కోపంతో రగిలిపోతున్న్నాడు. తన సేనాధిపతిలో ఇక్కడ మన మాటలు చెల్లవు సేనాధిపతి.. పురుషోత్తముడు కానీ, చంద్రగుప్తుడు కానీ చాణిక్యుడు కానీ ఏ ఒక్కరు బ్రతికున్న నేను మగధకు మహారాజుని కాలేను కాబట్టి ఈ ముగ్గురు చావాలి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కడు బ్రతికుండకూడదు. ఈ రాత్రికే వారు చావలి. పథకం సిద్ధం చేయి సేనాధిపతి అని అన్నాడు.మరో పక్క రాక్షసుడు తన ఇంట్లో ఓ గూఢచారిని పిలిచి చంద్రగుప్తుడు లేకపోతే చాణిక్యుడు తెలివి దేనికి పనికిరాదు. వెంటనే చంద్రగుప్తుని చంపాలి. వెంటనే విషకన్యను సిద్ధం చేయి అని అన్నాడు.

ఆ సాయంత్రం వేళ పర్వతకుడు తన ఏకాంత మందిరంలో ఎలంగైనా చంద్రగుప్తుణ్ణి చంపి మగధ సామ్రాజ్యానికి చక్రవర్తి అవ్వాలని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇంతో ఆ గదిలోకి పర్వతకుడి సేనాదిపతి వచ్చిప్రభు! మీరు చెప్పినట్లే ఆ చాణిక్యుని, చంద్రగుప్తుణ్ణి, పురుషోత్తముని చంపడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. ఈరోజు 1 కి ముందుగా మన సేనలోని ఐదుగురు వీరులు నల్ల ముసుగులు వేసుకొని నిద్రపోతున్న చాణిక్యుని గదిలోకి ప్రవేశించి అతన్ని కత్తులతో పొడిచిపొడిచి చంపుతారు. చాణిక్యుని చంపినా వెంటనే కోటపైన వారిలో ఒక సైనికుడు తన కాగడాతో రెండు సార్లు గాలిలో ఊపుతాడు. అది చూసిన వెంటనే 10 మంది వీరు ఇక్కడినుంచి బయల్దేరి చంద్రగుప్తుని గదిలోకి వెళ్లి అతన్ని చంపుతారు. చంద్రగుప్తుణ్ణి చంపినా తర్వాత ఆ వీరుల్లో ఒకడు కోట పై బాగాన నిల్చొని తన కాగడాతో 4 సార్లు గాలిలో ఊపుతాడు. ఆ తరువాత ఇక మిగిలించి పురుషోత్తముడే.

అప్పుడు పురుషోత్తమున్ని చంపడానికి 20 మంది వీరులు వెళ్తారు. అతన్ని చంపినా తర్వాత మన వీరుల్లో ఒకరు తన కాగడాలతో కోట గోడలపైన ఆరు సార్లు గాలిలో ఊపుతాడు. అలా మన శత్రుశేషం ఈరోజుతో పూర్తి అవుతుంది ప్రభు అని చెప్పాడు. అలా సాయంత్రం గడిచిపోయి అర్దరాత్రి అయింది. నేపాల సైన్యాధిపతి సైగ చేశాడు. వెంటనే తన పక్కన ఉన్న ఐదుగురు నల్లముసుగులు ధరించి దొంగతనంగా కోటలోకి ప్రవేశించారు. వారు చాణిక్యుడి గదిలోకి ప్రవేశించినపుడు వారిలో ఒక్కడు.. మనం దైర్యం చేసి చాణిక్యుని చంపడానికి వచ్చాము. ఒకవేళ ఈ విషయం చాణిక్యునికి తెలిసిన, చాణిక్యుడు మరణించినా.. మనకు వేసే మరణ శిక్ష అత్యంత క్రూరంగా ఉంటుంది. కాబట్టి తప్పిదం జరుగకుండా ఈరోజు మనం చాణిక్యుని చంపాలని అనుకుంటూ చాణిక్యుడి గదిలోకి ప్రవేశించారు. అక్కడ నిద్రపోతున్న చాణిక్యుని ఈ ఐదుగురు తమ కత్తులతో పొడిచి పొడిచి చంపారు.

చాణిక్యుని మరణవార్త కోసం కోట పైభాగాన ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పర్వతకుడికి ఆ కోటపైన ఒక సైనికుడు నిల్చొని తన కాగడాని గాలిలో 2 సార్లు ఊపారు. వెంటనే పర్వతకుడు సంతోషంతో చంద్రగుప్తుని చంపడానికి మరో 10 మంది వీరులను పంపించాడు. కొంత సేపైనా తర్వాత ఒక సైనికుడు కోటపైన జండాను 4 సార్లు ఊపాడు. దానితో పర్వతకుడు చాణిక్య చంద్రగుప్తుడు ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకొని ఎంతో సంతోషించాడు. ఇక పురుషోత్తముణ్ణి చంపడం ఒక్కటే ఉందని మరో 20 మందిని పురుషోత్తమున్ని చంపడానికి పంపించాడు. ఆ 20 మంది పురుషోత్తముణ్ణి చంపడానికి ప్రవేశించి అతని మంచం చుట్టూ నిల్చున్నారు. వాళ్ళు కత్తులు ఎత్తి దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న పురుషోత్తముని కసితీరా పొడిచి చంపారు. కానీ ఏదో అనిపించి దుప్పటి తీసి చూశారు. ఆ దృశ్యం చూసిన నిందితులకు వెన్ను వణికింది. ఆ మంచంలో 15 మంది వీరుల తలలు ఉన్నాయి. చాణిక్య చంద్రగుప్తుణ్ణి చంపడానికి పంపించిన 15 మంది వీరులను చంపి ఆ మంచంపై పెట్టారు.

అక్కడి 20 మందికి ముచ్చెమటలు పడుతుండగా.. రక్తంతో ఉన్న కత్తులను పట్టుకొని చాణిక్య చంద్రగుప్తులు వెనక నుండి వచ్చారు. చాణిక్యున్ని చంపడం అంత తేలిక అనుకున్నార్రా! మీరు ఇలా వస్తారని మాకు తెలుసు. పర్వతకుడిని ఇలా పథకం వేయాలని చెప్పినవాళ్ళో మా గూఢచారి ఉన్నాడు. ఈ పథకానికి రూపకర్తే నేను అని అన్నాడు. ఆ మాటలకు బయపడి ముచ్చెమటలతో ఉన్న 19 మంచి చంద్రగుప్తుడు చంపేశాడు. మిగితా ఒక్కన్ని 34 చనిపోయిన తలల్ని ఒక రథంలో పెట్టుకొని పర్వతకుడి దగరకు వచ్చాడు. ప్రభు ప్రభు! చాణిక్య – చంద్రగుప్తుడు మీరు పంపిన 35 మందిలో 34 మందిని చంపి.. నన్ను ఒక్క్కని ప్రాణాలతో మిగిల్చాడు. ఈ తాళాలను మీ దగ్గరకు చేరవేయమని.. నా తలకు బదులుగా మిమ్మల్ని పంపించిన వాడి తలను చంపుతామని నాకు చెప్పి పంపించారు.. మీరు జాగ్రత్తగా ఉండండి ప్రభు అని చెప్పాడు.

జరిగింది తెలుసుకున్న పర్వతకుడికి గొంతు మింగుడు పడట్లేదు. రేపు ఏమౌతుందా అని ఆ రాత్రి భయంతో వనుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారింది. చంద్రగుప్తుడు ఆ కోట గోడపై నిల్చొని అప్పుడే ఉదయించబోతున్న సూర్యుని వైపు చూస్తున్నాడు. తన ముఖంలో ఏదో అసంతృప్తిని గమనించిన చాణిక్యుడు.. చంద్రగుప్త! ఎందుకని విశ్రాంతి తీసుకోకుండా.. ఇలా విచారంగా ఇక్కడ కూర్చున్నావు అని అడిగాడు. దానికి చంద్రగుప్తుడు గురుదేవ! నేను కల్లో కూడా ఊహించని దాన్ని మీ దయవల్ల నేను సాధించాను. ఈ విజయానందాన్ని పంచుకోవడానికి నా తల్లి మురాదేవి, నా భార్య శాంతవతి ఇప్పుడు నాతో ఉండి ఉంటే ఎంతో బాగుండేది కదా అని అనిపిస్తుంది అని అన్నాడు. దానికి చాణిక్యుడు.. ప్రస్తుతం మగధకు నీ రక్షణే మొదటి బాధ్యత.. ఇప్పుడు శత్రువులు నీ చావుకోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మన బంధువులే మనకు బలహీనత అవుతారు. ఇంకో రెండు రోజుల్లో నీ పట్టాభిషేకానికి నీకు ముహూర్తం నిర్ణయించాను. నువ్వు పూర్తి సురక్తితంగా ఉంటావని నమ్మకం కలిగిన తర్వాతే నీతల్లి నీ భార్య నీవద్దకు వస్తారు. అప్పటివరకు నీవు ఓపికగా ఉండు అని అన్నాడు. దానికి చంద్రగుప్తుడు నాకు మీపై పూర్తి విశ్వాసం ఉంది గురుదేవ అని అన్నాడు. చంద్రగుప్తా! ఇక నువ్వు విశ్రాంతి తీసుకో అని చాణిక్యుడు అన్నాడు. ఈరోజు నీ శత్రుశేషం అంతమయ్యే రోజు.. అలాగే ఇవాళే నీ పట్టాభిషేకం ప్రకటిస్తాను.. దానివల్ల అయిన నువ్వు కాస్త సంతోషిస్తావు అని అన్నాడు.

ఇంతలో సాయంత్రం అయింది. రాజ్యసభలో ఎల్లుండి మధ్యాహ్నం చంద్రగుప్తునికి మహారాజుగా పట్టాభిషేకం ముహుర్తాన్ని నిర్ణయించాను. అని చాణిక్యుడు అందరి సమక్షంలో వెల్లడించాడు. అది విన్న అందరూ ఆనందించారు ఒక్క పర్వతకుడు రాక్షసుడు తప్ప. పర్వతకుడు బాధతో ఎక్కువ మద్యాన్ని తాగేస్తున్నాడు. ఇంతలో ఒక గూఢచారి సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు! ఒక శుభవార్త! ఘనానందుని తండ్రి అయినా మహాపద్మనందుడు అంటే సర్వసిద్ధుడు తన కొడుకుల మరణాల గురించి తెలిసి ఈ సింహాసనాన్ని కైవసం చేసుకోవడం కోసం మగధకు బయల్దేరాడు అని చెప్పాడు. అది విన్న రాక్షసుడు తన మనసులో హమ్మయ్య నేను పంపిన కబురు సర్వసిద్ధునికి అందిందన్న మాట.. ఇక నా పథకం ప్రకారమే జరుగుతుంది అని మనసులో ఆనందపడ్డాడు. ఆ భటుడు చెప్పింది విన్న చంద్రగుప్తుడు దీనిలో శుభవార్త ఏముంది సైనికా ఇది దుర్వార్త కదా అని అన్నాడు. దానికి ఆ సైనికుడు.. మాకు వచ్చిన ఆ సమాచారం ప్రకారం ఆ మహాపద్మనందుడు దారి మధ్యలోనే రక్తం కక్కుకొని చనిపోయాడు ప్రభు అని చెప్పాడు. అది విన్న రాక్షసుడు నివ్వెరపోయాడు. మహాపద్మనందుడు ఎలా చనిపోయాడని లోతుగా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆ భటుడు ఆ రక్తం కక్కుకొని చనిపోయేలా చేసింది ఎవరో కాదు ప్రభు మన రాక్షసుల వారేనట. వారు పంపిన విషం కలిపిన పండ్ల వల్లే ఆయన చనిపోయారని మాకు సమాచారం వచ్చింది ప్రభు అని చెప్పాడు. రాక్షసుడు ఇంకా ఆశ్చర్యపోయి.. నేను చంద్రగుప్తుణ్ణి చంపడానికి పంపిన విషం కలిపిన పళ్ళు మహా పద్మనందుని దగ్గరకు ఎలా వెళ్లాయి అని ఆలోచిస్తూ చాణిక్యుల వైపు చూశాడు. అప్పుడు చాణిక్యుడు రాక్షసుణ్ణి చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. దానికి రాక్షసుడు తన మనసులో ఇదంతా నీ పనా చాణిక్య అని అనుకున్నాడు. చాణిక్య! నిన్ను గెలవడం అసంభవమే. అయినా నా చివరి అస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగిస్తాను అని మనసులో అనుకున్నాడు.

ఇంతలో అతని పక్కనే ఉన్న పురుషోత్తముడు.. ఇది కదా అసలైన శుభవార్త ఇప్పుడు నిజంగా సంబరాలు జరుపుకోవాల్సిన సమయం అని అన్నాడు. ఇంతలో రాక్షసుడు అవును.. ఇది సంబరాలు జరుపుకోవాల్సిన సమయం. చంద్రగుప్త మహారాజ! నేను మీకోసం ఎంతో విలువైన బహుమానాన్ని ఏరికోరి తెచ్చాను. ఇదిగో స్వీకరించండి అని ఒక వ్యక్తిని తీసుకోండి అని వచ్చి తన పైన ఉన్న మేలిముసుగును తీశాడు. ఆమె అత్యంత సౌదర్యవతి తన గాజు కళ్ళు చూస్తుంటే అందరికి మత్తెక్కి పోతుంది. అప్పుడు రాక్షసుడు ఈమె పేరు మధు షాలిని. ఈమే ఆటపాటలతో మనల్ని మైమరపింప జేస్తుంది. ఇక మొదలుపెట్టు మధుశాలిని అని అన్నాడు. ఆమె ఆడి పాడటం మొదలుపెట్టింది. ఆమె ఆటకు పాటకు అందరూ మంత్రముగ్ధులై పోతున్నారు. ఇంతకన్నా సౌదర్యవతి ఈ భూ ప్రపంచంలో ఉండదేమో అన్నంత సౌందర్యంగా ఆమె నాట్యం చేస్తుంది. ఆమె నాట్యం చేస్తుంటే.. చంద్రగుప్తునికి ఆమెలో తన భార్య శాంతవతి కనిపిస్తుంది. ఆమె అలా నాట్యం చేస్తూ ఒక పాత్రలో మద్యం పోసి అటువైపు తిరిగి తన నోట్లో ఉన్న నల్ల జలాన్ని ఊసింది.ఆ పాత్రను తీసుకొని వచ్చి ఆ మద్యాన్ని చంద్రగుప్తునికి ఇచ్చింది. ఆమే నాట్యం చూస్తూ చంద్రగుప్తుడు ఆ మద్యం తాగడం మొదలుపెట్టాడు. ఆ మధుశాలిని ఎవరో కాదు రాక్షసుని చివరి అస్త్రం.. విషకన్యే. అసలు విషకన్య అనే వారిని ఎలా తాయారు చేస్తారు అంటే.. ముందు రాజ్యంలో ఉన్న 5 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్న బాలకుల్ని సేకరించి వాళ్ళందరికి పాములలో నుండి తీసిన విషాన్ని వాళ్ళ రక్తంలోకి ఎక్కిస్తారు. అలా ఎక్కించినప్పుడు ఆ వందలాది అమ్మాయిల్లో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే అమ్మాయిలు బ్రతికుంటారు. అలా ఆ విషాన్ని తట్టుకొని బ్రతికిన అమ్మాయిల శరీరంలోకి కొద్దీ కొద్దిగా రోజురోజుకి ఆ విషం మోతాదుని పెంచుతూ వాళ్ళ శరీరంలోకి ఎక్కించి పూర్తిగా ఒక విషకన్యలాగా మారుస్తారు. అలా యుక్తవయసు వచ్చే సరికి ఆ విషకన్య కళ్ళు పాము కళ్లులాగా గాజు రంగులోకి మారుతాయి. వారి గోరు గుచ్చుకున్న, వారి ఎంగిలి తగిలినా, వారితో సంగమించినా మరణమే ఎందుకంటె వాళ్ల శరీరం అంతా విషమయమై ఉంటుంది. అలంటి విషకన్యను రాక్షసుడు చంద్రగుప్తుని పైకి పంపించాడు.

విషకన్య ఇచ్చిన మద్యాన్ని తాగిన చంద్రగుప్తునికి తల తిరిగినట్లుగా అనిపించింది. తను లేచి ఇక మీరు సంబరాలు కొనసాగించండి. నేను కొంత విశ్రాంతి తీసుకుంటానని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే.. రాక్షసుడు చంద్రగుప్తుణ్ణి ఆపి.. అయ్యయ్యో మహారాజ! ఈ సౌందర్యవతిని మీరు మర్చిపోయారు. మీ కోసమే ఈమెను నేను తీసుకొని వచ్చాను. ఈ రాత్రి ఈమెతో గడిపి మీ అలసటను తీర్చుకోండి అని విషకన్య చేతిని చంద్రగుప్తుని చేతిలో పెట్టాడు. మద్యం మత్తులో ఉన్న చంద్రగుప్తునికి ఆ విషకన్యే తన భార్య శాంతవతిలా అనిపించి ఆమెను తీసుకొని తన గదికి బయల్దేరాడు.

ఇది గమనించిన ఆర్య! చాణిక్యుడు.. పథకం ద్వారా విషకన్యనుండి చంద్రగుప్తుణ్ణి విడిపించాడు. ఆ విషకన్య ఎంతో ప్రమాదకరమని తెలిసి చంపించేశాడు. చివరికి పర్వతకుడు,రాక్షసుని ఒక్కొక్క పన్నాగం నుండి చంద్రగుప్తుణ్ణి రక్షించాడు. తెల్లవారే సరికి చంద్రగుప్తుణ్ణి స్వస్థపరిచాడు. మరునాడు ఉదయం అయింది. చంద్రగుప్తమౌర్యని పట్టాభిషేకం మహోత్సవం సందర్భంగా రాజ్యమంతా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాజ్యాల రాజులు మగధకు చేరుకున్నాడు. ఇక ఎలాంటి అనర్ధం జరుగక ముందే చంద్రగుప్తుణ్ణి పట్టాభిషేకం జరుగాలని చాణిక్యులు పండితులను పట్టాభిషేక మహోత్సవాన్ని ప్రారంభించామని కోరారు. పండితులు వేద మంత్రాల నడుమ.. అంగరంగ వైభవంగా చాణిక్యుని పట్టాభిషేకం పూర్తి అయ్యింది. చాణిక్యుడు మగధ సింహాసనాన్ని అధిష్టించాడు. ఆరోజంతా ఆనందోత్సవాల నడుమ మగధలో సంబురం నెలకొంది. ప్రజల కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఇక రాజ్యపాలనే ధ్యేయంగా చంద్రగుప్తుని పాలన కొనసాగుతుంది. రాజ్యంలోని రక్తపాతాన్ని సమూలంగా నిర్మూలించి.. శాంతి రాజ్యాంగ తీర్చిదిద్దాడు. చాణిక్యుని ఆదేశాలతో అర్థశాస్త్రం లోని రాజనీతిజ్ఞతలో పరిపాలన చేస్తున్నాడు. మహాజనపదాలుగా ఉన్న ఒక్కొక్క రాజ్యాన్నిఏర్పాటు చేసి అఖండ భారతాన్ని స్థాపించాడు. ఇక మీదట భారత దేశం అంతటా ఒకే సంప్రదాయం, ఒకే రాజశాసనలు, చట్టాలు ఉంటాయి. అద్భుత పరిపాలన చేస్తూ.. తన తల్లి మురా పేరుమీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుని సామ్రాజ్యం దాదాపు భారతదేశం అంతటా విస్తరింపజేశాడు. దక్షిణాది ప్రాంతాలైన తమిళనాడు, కేరళ, కళింగ ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది. భారతదేశంలో ఎక్కువగా భాగాన్ని ఏకం చేసిన తరువాత చంద్రగుప్తుడు చాణిక్యుడు ఇద్దరు కలిసి ఆర్థిక రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చారు. చంద్రగుప్తుడు పాటలీపుత్ర నగరాన్ని రాజధానిగా చేసుకొని బలమైన కేంద్ర పరిపాలనను స్థాపించాడు. చంద్రగుప్తుని పరిపాలన సమర్థవంతమైనఅత్యంత వ్యవస్తీకృతమైన నిర్మాణాన్ని కలిగిఉంది. ఈ సామ్రాజ్యంలో నీటి పారుదల దేవాలయాలు గనులు రహదారులు వంటి మౌలిక సదుపాయాలను నిర్మించారు. ఇది బలమైన ఆర్థిక వ్యవస్థకు దారి తీసింది.

చంద్రగుప్తుని పాలనలో ఆయన రాజవంశం సమయంలో బౌద్ధ మతం, జైన మతం, ఆజీవక బ్రాహ్మణిజం సంప్రదాయాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. భారత దేశంలో అనేక మతాలు అభివృద్ధి చెందాయి. చంద్రగుప్త మౌర్య పాలనలో అంతర్గత బాహ్య వాణిజ్యం వ్యవసాయం, దేవాలయాలు, ఆర్థిక కార్య కలాపాలు వర్థిల్లాయి. ఆర్థిక పరిపాలన భద్రత కలిగిన ఏకైన శక్తిగా సమర్ధవంతమైన ఏకైక శక్తిగా సృష్టించి దక్షిణాసియా అంతటా అభివృద్ధి చెందుతూ తన సామ్రాజ్యం విస్తరించింది. మౌర్య రాజవంశం ఆసియా పురాతన సుధీర్గ వాణిజ్య వ్యవస్థకు అనుకూలంగా ఉన్న గ్రాండ్ ట్రంక్ రహదారిని నిర్మించింది. ఇది భారత ఉపఖండాన్ని మధ్య ఆసియాతో కలుపుతోంది. కళింగ యుద్ధం తరువాత అశోక చక్రవర్తి ఆధ్వర్యంలో సామ్రాజ్యం దాదాపు అర్ధ శతాబ్దంలో కేంద్రీకృత పాలనను అబుభవించింది. చంద్రగుప్త మౌర్య జైన మతాన్ని స్వీకరించడం వలన దక్షిణాసియా అంతటా సామాజిక మత సంస్కరణలు మొగ్గతొడిగాయి. ఈ సామ్రాజ్యం జనాభా సుమారు 50-60 మిలియన్ల ఉండేదని అంచనా. దీనివల్ల మౌర్య సామ్రాజ్యం పురాతన జనాభా కలిగిన రాజ్యాల్లో ఒకటిగా మారింది. చంద్రగుప్త మౌర్యుడు చేసిన దండయాత్రల వలన మౌర్య సామ్రాజ్యం పశ్చిమాన పర్షియా నుండి తూర్పు బీహార్ వరకు, దక్షిణాన తిరునల్వేలి జిల్లా నుండి హిమాలయాల వరకు విస్తరించింది. భారత దేశంలో అధిక భాగాలను ఒకే సామ్రాజ్య పరిధిలోకి తీసుకొని వచ్చిన ఘనత చంద్రగుప్త మౌర్యునికే దక్కింది. అందువల్ల భారత దేశ చరిత్రలో చంద్రగుప్త మౌర్యుణ్ణి జాతీయ పరిపాలకుడిగా భావిస్తారు. అయితే ఇంతటి ఘన చరిత్రను కలిగిన చంద్రగుప్త మౌర్యుడు జైనమతం ఆచారాల ప్రకారం ఆహారం తీసుకోవడం మానేసి ఆకలితో కర్ణాటక – శ్రావణ బెళగొళ అనే ప్రదేశంలో తుది శ్వాస విడిచారు. చంద్రగుప్తుని మరణం తరువాత ఆయన కుమారుడు బిందుసారుడు రాజుగా పట్టాభిషిక్తుడు అవుతాడు. చంద్రగుప్తుని మార్గదర్శకాలతో బిందుసారుడు సుభిక్షంగా రాజ్య పరిపాలన కొనసాగించాడు.

Chanakya Biography