
ప్రపంచంలోనే భారత దేశానికి చాగా గొప్ప గౌరవం ఉంది. దానికి మన జ్ఞాన సంపదే కారణం. ఇక్కడి జీవన విధానం, సనాతన ధర్మం పాటించడం, ప్రపంచ దేశాలలో ఎక్కడా లేనటువంటి అపూర్వ జ్ఞానం మన దేశ స్వంతం. జ్ఞానాకి పుట్టినిల్లుగా ఎన్నో ఏళ్ల పాటు ఇండియా విరాజిల్లింది. ఇక్కడ ఉన్న ఎన్నో పురాతన దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు అనంతమైన జ్ఞానానికి ప్రతీకలు. అలాంటి వాటిల్లో అతి ముఖ్యమైనది నలంద విశ్వవిద్యాలయం. నలంద యూనివర్సిటీ ఇది ఐదవ శతాబ్దంలోనే స్థాపించబడిన మొట్టమొదటి యూనివర్సిటీ.
ఆ కాలంలోనే ఈ యూనివర్సిటీ లైబ్రరీలో సైన్స్, మెడిసిన్, అలాగే ఆస్ట్రాలజీకి సంబందించిన 90లక్షల కంటే ఎక్కువగా బుక్స్ ఉండేవి. ఆ కాలంలోనే ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు వచ్చేవారు. అలంటి ఒక గొప్ప యూనివర్సిటీని ఈ భక్తియార్ ఖిల్జీ మొత్తంగా నాశనం చేశారు. అసలు ఈ నలంద యూనివర్సిటీ హిస్టరీ ఏంటి? ఈ యూనివర్సిటీని ఈ భక్తియార్ ఖిల్జీ ఎందుకు నాశనం చేశారు? దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? ఈ నలంద యూనివర్సిటీని నాశనం చేసినప్పుడు అందులోని బుక్స్ 3 నెలల వరకు మండుతూనే ఉన్నాయట. అందులో నిజమెంత ? ఇలాంటి అనేక విషయాల్ని ఈ కథనంలో తెలుసుకుందాం.
అతిప్రాచీనమైనదిగా పేర్కొనబడిన యూనివర్సిటీ ‘నలంద’ ఐదవ శతాబ్దంలో స్థాపించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపురాతనమైన మొట్టమొదటి యూనివర్సిటీ. అన్ని విద్యలకు, సమస్త జ్ఞానానికి ప్రతీక అయిన ఈ యూనివర్శిటీ భారతదేశంలోని అత్యంత తక్కువ అక్షరాస్యత ఉన్న బీహార్ రాష్ట్రంలో ఉంది. ఈ నలంద అనే పేరు సంస్కృతంలోని 3 పదాలతో ఏర్పడింది. అవే: నా, ఆలం, ద. దీని అర్ధం అన్స్టాపబుల్ నాలెజ్ ఫ్లో అని అనగా తెలుగులో ధారాళముగా ప్రవహిస్తున్న జ్ఞానం అని అర్ధం. ఈ నలంద యూనివర్సిటీ గురించి అప్పటి చైనీస్ ట్రావెల్లెర్స్ అయిన హ్యూన్ సాంగ్, ఇట్ సింగ్ (itsing) రాశిని పుస్తకాలలో వివరించారు. ఈ హ్యూన్ సాంగ్ 7వ శతాబ్దంలో మన దేశానికి వచ్చారు. ఆ సమయంలోనే అతను మన నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ నలంద యూనివర్సిటీని 1వ కుమార గుప్తా స్తాపించినట్లు చెబుతారు. ఈ చైనీస్ ట్రావెల్స్ చెప్పిందేమి టంటే ఆ సమయంలోనే ఈ నలంద యూనివర్సిటీలో 10వేల కంటే ఎక్కువగా మాంగ్స్ 1510 మంది ఉపాధ్యాయులు ఉండేవారు. అంటే ఈ నలంద యూనివర్సిటీ రెసిడెంటియల్ యూనివర్సిటీ.
ఎన్నో దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు అక్కడ చదువుకొని, అక్కడే ఉండేవారు. ఆకాలంలోనే నలంద యూనివర్సిటీకి చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా, శ్రీలంక, పర్షియా, టర్కీ నుంచి అనేక మంది విద్యాబ్యాసం చేయడానికి వస్తుండేవారు. ఈ నలంద యూనివర్సిటీలో బుద్ధిజంతో పాటు ఆస్ట్రోనమి, గణితం, తత్వశాస్తం, వైద్యశాస్త్రం సంభందించిన విద్యను నేర్పించేవారు. ఇక్క మరొక్కటి గమయించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ యూనివర్సిటీలో విద్య ఉచితం. ఎవరైనా వచ్చి ఇక్కడ చదువుకోవచ్చు. ఈ యూనివర్సిటీ నుంచి ఎక్కువగా ఉపనిషద్ నుంచి విద్యను తీసుకొని నేర్పించేవారు. భారతదేశ అత్యున్నత గణిత, ఖగోళ శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు ఆర్యభట్ట కూడా ఈ విశ్వవిద్యాలయంలోనే విద్యనభ్యసించారు. ఇతను సా.శ. 426-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిధ్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యాయం, సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్టు పై(π) విలువను సుమారుగా కనుక్కున్నట్లు చెప్తారు.
ఆర్యభట్టతో పాటు హర్షవర్ధన, వాసుబందు, ధర్మపాల్, నాగార్జున, చాణిక్యుడు లాంటి గొప్పగొప్ప జ్ఞానులు కూడా ఈ యూనివర్సిటీలోనే చదివారు. ఆర్యభట్టగారు ఈ యూనివర్సిటీలోనే చదువుకోవడమే కాకుండా ఈ యూనివర్సిటీకే హెడ్ అయ్యారు. దాదాపు 800 సంవత్సరాల వరకు ఈ యూనివర్సిటీ ఎందరో మందికి జ్ఞానాన్ని పంచింది. కానీ 12వ శతాబ్దంలో ఈ యూనివర్సిటీ ఒక దుష్టుడి చేతిలో సంపూర్ణంగా నాశనం అయ్యింది. అయితే ఈ నలంద యూనివర్సిటీ డిస్ట్రాయ్ అవడం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది.
నలందాను నాశనం చేయడం ఎలా?
నలంద యూనివర్సిటీని నాశనం చేయడానికి 3 సార్లు దాడి జరిగింది. ఇలా జరిగిన ప్రతిసారి మళ్ళి పునః వైభవం తీసుకొచ్చి యూనివర్సిటీని నడిపించారు. కానీ 3వ దాడి ఈ విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఈ యూనివర్సిటీపైన మొదటి దాడి 455-467AD కాలంలో జరిగింది. అదికూడా సముద్రగుప్తుడి కాలంలో జరిగింది. అదికూడా అటాక్ చేసింది హ్యూనాస్ తెగకు చెందిన వాళ్ళు. వీళ్లు సెంట్రల్ ఆసియా నుంచి ఖైబర్ పాస్ ద్వారా మన దేశానికి వచ్చారు. అయితే ఆ సమయంలో ఉన్న గుప్త రాజులు ఈ హ్యూనాస్ ట్రైబ్ ని ఓడించి తిరిగి తరిమేశారు. వాళ్ళు ధ్వంసం చేసిన నలంద యూనివర్సిటీని గుప్తా రాజులు పునః నిర్మించడమే కాకుండా మరింత పెద్దగా నిర్మించి దాని గొప్పతనాన్ని పెంచారు. ఇక నలంద యూనివర్సిటీ పైన రెండవ అటాక్ 7వ శతాబ్దంలో గౌదాస్ రాజవంశ అనే బెంగాల్ కు చెందిన రాజు చేశాడు. ఈ దాడి తర్వాత బుద్ధిస్ రాజు అయిన హర్షవర్ధన్ ఈ యూనివర్సిటీకి మరమత్తులు చేసి తిరిగి నిర్మిస్తాడు. ఇక మూడవ అతిక్రూరమైన అట్టాక్ ఇస్లాం మతస్తుడు భక్తియార్ ఖిల్జీ 1193వ సంవత్సరంలో చేశాడు.
భక్తియార్ ఖిల్జీ నలందను ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు?
ఈ భక్తియార్ ఖిల్జీ నలందను ఎందుకు నాశనం చేయాలనుకున్నాడనే కారణం వింటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. అదేమిటంటే ఒకసారి ఈ ఖిల్జీకి ఆ కాలంలోని అతి ప్రమాదకమైన వ్యాధి సోకింది. దాన్ని నయం చేసేందుకు ఇస్లాం మతంలోని అనేక మంది హకీమ్ లు ప్రయత్నం చేశారు. కానీ ఏది సఫలం కాలేదు. అదే సమయంలో ఒక వ్యక్తి ఈ ఖిల్జీ దగ్గరకు వచ్చి నలంద యూనివర్సిటీ ప్రిన్సిపాల్ అయిన రాహుల్ శ్రీ భద్ర ఎటువంటి వ్యాధిని అయినా నయం చేయగలడు, ఒకసారి అతనిని పిలిపిద్దాం అని చెప్తాడు. అయితే ఇస్లాం మతం ప్రకారం వాళ్ళ మతాన్ని నమ్మని వేరే మతస్తులను కాఫిర్స్ గా అంటారు. అంటే వాళ్ళచేత ఎలాంటిఉపయోగకరమైన పనులు చేయించుకోవద్దని వాళ్ళ అభిప్రాయం.
అందుకని ఈ భక్తియార్ ఖిల్జీ రాహుల్ శ్రీ భద్ర పేరు వినగానే.. వాడు మన మతస్తుడు కాదు ఒక కాఫిర్ చేత తాను వైద్యం తీసుకొను అని అతన్ని రిజెక్ట్ చేస్తాడు. కానీ అతని ఆరోగ్యం రోజురోజుకి క్షీణించడంతో వేరే దారిలేక రాహుల్ ని పిలుస్తారు. అతను ఖిల్జీ ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించి మీరు కొన్ని మూలికల్ని వాడాలి అని చెప్తారు. కానీ ఇస్లాం మతానికి చెందిన ఈ ఖిల్జీ.. నేను నీ చేతిద్వారా ఇచ్చే మందును వేసుకోను అని కండిషన్ పెట్టారు. ఈ కండిషన్ ద్వారా ఈ ఖిల్జీ రాహుల్ శ్రీ భద్ర గొప్ప వైద్యుడు కాదని నిరూపిద్దాం అనుకున్నాడు. అంతే కాదు హిందువులను కూడా కించపరుచుదాం అనుకున్నాడు.
ఖిల్జీ ఈ కండిషన్ పెట్టినప్పటికీ రాహుల్ శ్రీ భద్ర గారు చాలా కాన్ఫిడెంట్ గా త్వరలోనే మీ ఆరోగ్యం నయమౌతుంది అని చెప్తాడు. ఆయన తను చెప్పినట్టుగానే ఖిల్జీ ఆరోగ్యం నయమైంది. అది ఎలాగో తెలుసా?? ఈ రాహుల్ శ్రీ భద్ర ఖురాన్ ను తీసుకొని ఆ పేజీల పైన ఒక మెడిసిన్ ని పూశాడు. ఆ మెడిసిన్ ఉన్న ఖురాన్ తీసుకువచ్చి ఖిల్జీకి ఇచ్చి రోజు కూని పేజీలు చదవండి అని చెప్తాడు. ఖిల్జీ ఎలాగో ఇస్లాం మతానికి చెందిన వాడు కాబట్టి రాహుల్ చెప్పినట్లుగానే అతను రోజు ఆ పేజీలను చదువుతాడు. ఈ ఖురాన్ పేజీలపైనా ఖిల్జీ చేతులు పెట్టి చదివేవాడు.
ఆ విధంగా రాహుల్ శ్రీ భద్ర పూసిన మెడిసిన్ అనేది ఖిల్జీ శరీరంలో చేరి అతని ఆరోగ్యం నయమైంది. ఖిల్జీ తన ఆరోగ్యం నయమవడంతో ఆనందపడలేదు. ఈర్ష పడ్డాడు. ఇన్ సెక్యూరిటీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటె ఈ కాఫీల దగ్గర ఈ హిందువుల దగ్గర మా ముస్లింల కంటే కూడా ఎక్కువగా జ్ఞానం ఉందని విపరీతమైన ఈర్షకు గురై హిందువులకు ఈ జ్ఞానం ఎక్కడినుంచి వస్తుంది అనే విషయం తెలుసుకొని దాన్ని మొత్తంగా నాశనం చేయాలనుకున్నాడు. ఆ తరువాతే ఈ ఖిల్జీ నలంద యూనివర్సిటీపై దాడి చేసి మొత్తాన్ని సర్వనాశకం చేశాడు. క్రీస్తుశకం1193 ఈ విశ్వవిద్యాలయంపై దండెతి నాశనం చేశాడు.
నలంద యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకు అంతటి జ్ఞానం ఎక్కడినుంచి వస్తుంది అంటే దానికి ప్రధానమైన సోర్స్ అక్కడ ఉన్న లైబ్రరీ. దానిపేరు ధర్మ గంజ్. ఈ గ్రంధాలయం ఆ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ. ఈ లైబ్రరీ 3 అంతస్తుల్లో ఉండి, ప్రతి ఫ్లోర్ లో రకరకాల బుక్స్ ఉండేవి. ఈ లైబ్రరీ యొక్క ప్రతి ఫ్లోర్ కి ఒక సెపరేట్ పేరు ఉండేది అవే రత్నసాగర్, రథ్నొదరి, రత్నరంజక. ఈ లైబ్రరీ మొత్తంలో దాదాపు 90 లక్షలకు పైగా ఎక్కువగా బుక్స్ ఉండేవి.
ఈ ఖిల్జీకి ఎప్పుడైతే ఈ బుక్స్ ఉండేవని తెలుస్తుందో.. అప్పడు నలంద యూనివర్సిటీపై దాడి చేయాలనుకుంటాడు. ఈ కిరాతకుడైన ఖిల్జీ యూనివర్సిటీపై దాడి చేసి అక్కడున్న విద్యార్థుని అతి కిరాతకంగా చంపేశారు. అక్కడ చదువుకోవడానికి వచ్చిన వేల మంది ప్రజల్ని బతికుండగానే కాల్చేశాడు. అలా అక్కడున్న అందర్నీ హతమార్చిన తర్వాత యూనివర్సిటీ లైబ్రరీ మొత్తానికి నిప్పంటించాడు. ఆ లైబ్రరీలో ఉన్న మొత్తం పుస్తకాలూ దగ్ధం కావడానికి దాదాపు 3 నెలల సమయం పట్టింది. అంటే 90 రోజులపాటు ఆ లైబ్రరీ మొత్తం నిరంతరం అగ్నిజ్వాలలతోనే రగుతుండేది.
ఇక్కడ ఈ ఖిల్జీ కేవలం యూనివర్సిటీని మాత్రమే నాశనం చేయలేదు. పూర్తిగా ఒక సంప్రదాయాన్ని నాశనం చేశారు. దాన్ని తిరిగి నిర్మించడం కూడా అసాధ్యం. ఈ అతి కిరాతకుడైన ఖిల్జీ కేవలం నలంద యూనివర్సిటీనే కాదు బీహార్ లోని విక్రమశిల, అలాగే ఉదంతపురి యూనివర్సిటీని నాశనం చేశాడు. నలంద యూనివర్సిటీని నాశనం చేయడం కేవలం మన భారతదేశానికే కాదు ప్రపంచానికే అతిపెద్ద నష్టం. ఎందుకంటే కేవలం ఒక వ్యక్తి యొక్క ఈర్ష, ఇన్ సెక్యూరిటీ కారణంగా వేల సంవత్సరాలుగా వృద్ధి చెందిన జ్ఞానం మొత్తం ఒక్కసారిగా నాశనం అయిపోయింది.
ఇలా నాశనం చేయబడిన నలందను నిర్మించడం అసాధ్యం. కానీ మన భారతీయ ప్రభుత్వం మళ్ళీ ఎడ్యుకేషన్ హబ్ లాగా డెవలప్ చేయాలనీ భావించింది. ఈ ఆలోచనని మొట్టమొదటి సారిగా 2006లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రతిపాదించారు. ఆ తర్వాత 2010లో భారతీయ ప్రభుతం అక్కడ నలంద యూనివర్సిటీని నిర్మించడం ప్రారంభించింది. ఈ విశ్వవిద్యాలయాన్ని అమర్త్య సేన్ గారిని చైర్మన్ బాడీగా నియమించారు. 2014 నుంచి ఈ కొత్తగా నిర్మించిన నలంద యూనివర్సిటీ లోకి స్టూడెంట్స్ యొక్క అడ్మిషన్స్ కూడా మొదలయ్యాయి.
ఇలా మరుగున పడిపోయిన ఈ జ్ఞాన భాండగారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్వవైభవం తెచ్చే విధంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిహార్ రాష్ట్రంలోని రాజ్‌గిర్‌లో జూన్ 18న నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 17 దేశాల మిషన్స్ హెడ్‌తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అపూర్వ చరిత్రం, జ్ఞానం కలిగిన మన నలంద.. అనేకుల చేతిలో నలిగిపోయింది. దీనికి పూర్వవవైభవం తెస్తూ ప్రధాని చేస్తున్న కృషి అభినందనీయం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే మన చరిత్రను వెలికితీస్తూ.. జ్ఞానాన్ని కాపాడుకుందాం. జై భారత్.. జై హింద్..!!