
అవి విదేశీ దురాక్రమము దారులైన మొగలులు దేశాన్ని పాలిస్తున్న రోజులు. ధర్మాభిమానానికి, వీరత్వానికి పేరైన రాజపుత్ర రాజులు సైతం క్రమంగా తమ ధర్మ నిష్టను వదులుకొని మొగలాయిలతో స్నేహం చేసేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది అయితే తమ కుమార్తెలను మొగల్ చక్రవర్తులకు ఇచ్చి పెళ్లి చేసి తాము గొప్ప స్థాయికి ఎదిగామని భ్రమ పడ సాగారు. ఇలా పతనమంచుల్లో ఉన్న హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు సిక్కుల గురువులు ఎందరో ఎంతగానో ప్రయత్నించారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ధర్మరక్షణకు శ్రీకారం చుట్టారు. అలా ప్రాణ త్యాగం చేసిన వారిలో ఐదవ గురువు అర్జున్ దేవ్ ఒకరు. 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో మొగలాయులు విజయం సాధించింది మొదలు వారంతా హిందువుల శ్రద్ధా కేంద్రాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఏదో ఒక కారణం చెప్పి దేవాలయాలను ధ్వంసం చేసేవారు. ఈ దురాగతాలు మొగల్ పాలనలో నిత్య కృత్యమయ్యాయి.
గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం లేదా ‘షహీదీ దివస్’ ఈ సంవత్సరం మే 30న జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం సిక్కు క్యాలెండర్‌లో మూడవ నెల అయిన జెత్ నెల 24వ రోజున జరుగుతుంది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు గొప్ప మతపరమైన విలువను కలిగి ఉన్న రోజుగా చెప్పవచ్చు. గురు అర్జున్ దేవ్ జీ సిక్కు మతం యొక్క మొదటి అమరవీరుడుగా పేరొందాడు. ప్రజలు ఈ రోజున మతపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు. “శ్రీ గురు గ్రంథ్ సాహిబ్” చదువుతారు. వారు ‘గురుద్వారా’ యొక్క ‘లంగర్స్’లో కూడా ఆహారాన్ని పంపిణీ చేస్తారు. ఇది సందర్శకులందరికీ ఉచిత ఆహారాన్ని అందించే కమ్యూనిటీ భోజన పద్ధతి.
గురు అర్జున్ దేవ్ జీ ఏప్రిల్ 1563లో భారతదేశంలోని గోయింద్వాల్‌లో జన్మించారు. ఆయన తండ్రి గురు రాందాస్, తల్లి మాతా భాని. ఆయన తండ్రి మరణం తరువాత, ఆయన 1581లో 18 సంవత్సరాల వయసులో పది మంది సిక్కు గురువులలో ఐదవవాడు అయ్యాడు.
ఆ కాలంలో మొఘలులు దేవాలయాల సంపాదన దోచుకెళ్లేవారు. అయినప్పటికీ హిందువులు మొఘలుల దాడులను ఎదుర్కొని దేవాలయాలను కాపాడుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండేవారు. సాధారణ శకం 1605 లో అక్బర్ కుమారుడు జహంగీర్ మొగల్ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. అప్పటికే మత దురాహంకారం మొదలైంది. హిందూధర్మం నశించి పోతే ఈ దేశం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అలాగే ధార్మిక స్వాతంత్రాన్ని కూడా కోల్పోతుంది. అప్పుడే భారత్ మొత్తాన్ని సంపూర్ణంగా ఇస్లామిక్ దేశంగా మార్చేయడం సాధ్యమవుతుంది అని మొగలాయిలు నిరంతరం బోధించేవారు. అయితే పంజాబ్ ప్రాంతంలో హిందూ ధర్మానికి రక్షణకు కవచంల నిలిచింది సిగ్గు సాంప్రదాయం. గురు నానక్ దేవ్ జీ తదనంతరం కూడా గురు పరంపర కొనసాగింది. ఆయన శిష్యులు ఈ సాంప్రదాయాన్ని ఎంతో నిష్టతో కొనసాగించారు. వారిలో గురు అర్జున్ దేవ్ జీ కూడా ఒకరు.
గురు అర్జున్ దేవ్ సిక్కుల 5వ గురువుగా కొనసాగారు. కత్తాపూర్లో సౌకర్యాలను మెరుగుపరిచారు. సిక్కు సాంప్రదాయం ప్రభావంపై గట్టి బోధనలు చూపించిన సాధుసంతుల సంకలనం చేసి ఒక పవిత్ర గ్రంథం ఆయన రూపకల్పన చేశారు. గురుద్వారాలు, సామూహికంగా వండుకునే వంటశాలలైన లాంగర్ల నిర్మాణాలు చేశారు. సిక్కు ప్రజలను ఏకం చేసి మొగలుల ఆటను కట్టించారు. ఇస్లామిక్ దేశంగా భారతదేశాన్ని మార్చాలనే మొగలుల ఆలోచనకు అడ్డుకట్ట వేశారు. ఇది స్థానిక ఉల్లాలు, మొగలలకు కంటగింపుగా మారింది. అర్జున్ దేవ్ సింగ్ పై లేనిపోని అభియోగాలు మోపారు. 1606 లో మే మాసంలో క్రూరుడైన మొగల్ పాలకుడు జహంగీర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో గురు అర్జున్ దేవ్ ని బంధించి లాహోర్లోని కోటకు తీసుకువచ్చారు.
రెండు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని అప్పుడే విడుదల చేస్తామని జహంగీర్ ప్రకటించారు. పరిహారం చెల్లించేందుకు గురు అర్జున్ దేవ్ ఒప్పుకోలేదు. నేరమే చేయనప్పుడు పరిహారం ఎందుకు చెల్లించాలని ప్రశ్నించాడు. దీనిని సాకుగా తీసుకొని గురు అర్జున్ దేవుని కఠినంగా శిక్షించాలి అనుకున్నాడు జహంగీర్. గురు అర్జున్ దేవుని కాలుతున్న పెనం మీద కూర్చోబెట్టి శిక్షించాలని ఆజ్ఞాపించాడు. వెంటనే ముస్లిం సైనికులు పెద్ద పెనం తెచ్చి కింద మంట పెట్టారు. ఆ పెనం మీద గురు అర్జున్ దేవుని కూర్చోబెట్టారు. పెనం క్రమంగా వేడెక్కింది. గురు అర్జున్ శరీరం కాలుతుంది. అయినా అర్జున్ దేవ్ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. చర్మం కాలిన వాసన విలువడుతుంది అయినా ఆయన ముఖంలో ప్రశాంతత ఏ మాత్రం తగ్గలేదు. అంతటితో ఆగకుండా గోమాంసం తినిపించాలని జహంగీర్ ముస్లిం సైనికులను ఆదేశించాడు. గురు అర్జున్ దేవ్ కి గోవులు అంటే ఎంతో భక్తి. ఆయన మనసు ఎంతో వ్యాకులత చెందింది. అప్పుడు తనకు ఒక చివరి కోరిక ఉందన్నారు. మరణానికి ముందు రావి నదిలో స్నానం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. కోటకు దగ్గరలోనే రావినది ప్రవహిస్తోంది. గురు అర్జున్ దేవ్ నదిలోకి దిగి మునక వేశారు. అలా మునిగిన గురుదేవ్ మరల పైకి రాలేదు. హిందూ ధర్మ రక్షణ కోసం ఆయన చూపిన ధర్మ నిష్ట, త్యాగనిరతి దేశ ప్రజలు ఎప్పుడూ మరిచిపోరాదు.
1606లో మొఘలుల చేతిలో ఆయన అకాల మరణం తరువాత, ఆయన కుమారుడు ఆరవ గురువు అయ్యాడు. ఆయన కుమారుడి వారసత్వం చాలా వివాదాలకు దారితీసింది. ఆయన చిన్న కుమారుడు అర్జన్‌ను వారసుడిగా ఎంచుకోవడం సిక్కుల మధ్య అనేక వివాదాలకు, విభజనలకు దారితీసింది. పృథి చంద్ గురు అర్జన్‌ను తీవ్రంగా వ్యతిరేకించి ఒక వర్గ విభాగాన్ని సృష్టించాడు. గురు అర్జన్ అనుచరులు మినాస్‌ను ఏర్పరచుకున్నారు.
అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయం లేదా హర్మందిర్ సాహిబ్‌ను నిర్మించడానికి ఆయన చొరవ తీసుకున్నందుకు ప్రసిద్ధి చెందారు. గురుద్వారాలోని నాలుగు ద్వారాలను కూడా ఆయన రూపొందించారు. తనపై విశ్వాసం అన్ని కులాల ప్రజలకు చెందినదని ప్రకటించారు. ఆయన “గురు గ్రంథ్ సాహిబ్”ను సంకలనం చేశారు, ఇది గత గురువులందరి రచనలను ఒకే పుస్తకంలో కలిగి ఉంది. గురు రామ్ దాస్ ప్రారంభించిన మసంద్స్ వ్యవస్థను ఆయన అనుసరించారు, ఇది సిక్కులు తమ ఆదాయంలో కనీసం పదోవంతును గురుద్వారాలు మరియు లాంగర్‌ల నిర్మాణానికి నిధులు సమకూర్చే సిక్కు సంస్థ ‘దస్వంద్’కు విరాళంగా ఇవ్వాలని సూచించింది. కొన్నేళ్లకు ఆయనను లాహోర్ కోటలో ఖైదు చేసి, మొఘల్ చక్రవర్తి జహంగీర్ హింసించి ఉరితీశారు.