HEALTH & LIFESTYLE

హెల్త్ ఇన్సూరెన్స్. తక్కువ ప్రిమియంతో ఎక్కువ ప్రయోజనాలు.!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, యాడ్స్ లో.. స్టార్ హెల్త్, కేర్ హెల్త్, ఆదిత్య బిర్లా అనే పేర్లతో కొన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ లు మనకు తారస పడుతూనే ఉన్నాయి. అతి తక్కువ మంత్లీ ప్రీమియంతో.. ఎక్కువ క్లెయిమ్ పొందేలా వీటిని రూపొందించడం విశేషం! కానీ వయసు పెరిగేకొద్దీ ప్రీమియం అనేది కూడా ఎక్కువే కట్టాల్సి ఉంటుంది.

నిజానికి మధ్య తరగతి కుటుంబాల్లో.. ఒక ఫ్యామిలీ మెంబర్ కి ఏదైనా అనుకోని హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు.. ఉన్నపళంగా లక్షల కొద్దీ డబ్బు కట్టాల్సి వచ్చినప్పుడు అప్పు చేయడం.. లేదా ఉన్న ఇల్లును/ బంగారాన్ని తాకట్టు పెట్టడం చేస్తుంటాం. తీరా అంత ఖర్చు చేసి చూపించినా.. ఆ రోగం నయమైతే పర్వాలేదు.. ఏమైనా జరగరానిది జరిగితే.. చేసిన అప్పు తీర్చేందుకు మరో ఐదేళ్లు పట్టొచ్చు. ఆ ఎఫెక్ట్ జీవిత కాలం చూపొచ్చు.

అలా జరగకుండా ఉండేందుకు ఇప్పుడు చాలావరకు బ్యాంకులు, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఈజీగా, చిటికెలో, వేగవంతంగా ఇన్సూరెన్స్ తీసుకోవడం, ప్రాసెస్ చేయడం, క్లెయిమ్ పొందడంపై ఫోకస్ పెట్టాయి.

ఈ తరుణంలో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి.. దాని వల్ల మనకు వచ్చే లాభాలేంటి?

ఆరోగ్య బీమా(హెల్త్ ఇన్సూరెన్స్) అనేది అత్యవసర పరిస్థితుల్లో మనకు ఆర్థికంగా భరోసా కల్పించేది. 

స్టార్టింగ్ ప్రీమియం ధర సుమారుగా రూ. 500 నుంచి అయితే, అతి తక్కువ ప్రీమియం రూ.243/-తో కూడా ఉంటుంది.

అయితే ఇవి రెగ్యులర్ గా మిస్ అవ్వకుండా కట్టినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో, మనం బీమా ప్రీమియం టైమ్‌కు చెల్లించినా కూడా క్లెయిమ్ ఒక్కోసారి రిజెక్ట్ అవుతుంది. ఇది ఎమర్జెన్సీ సమయాల్లో ఎదురవ్వడమే చాలా డేంజర్! 

అనుకోని అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే రూ. లక్షల్లోనే బిల్లు అవుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటప్పుడు మన కష్టార్జితం మొత్తం హరించుకుపోతుంది. దీనికి సొల్యూషన్ మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడమే! 

గత నాలుగేళ్లుగా వీటిని తీసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ పాలసీ నప్పుతుంది.. దానిని ఎలా ఎంచుకోవాలనేది బేసిక్ ఇన్ఫో.. తెలుసుకోవాల్సినవసరం ఈరోజుల్లో ప్రతి ఒక్కరికీ ఉంది.

చిన్న వయసులో ఉన్నప్పుడే అంటే, బిలో 30 ఇయర్స్ ఉన్నవారు పాలసీ తీసుకోవడం మంచిది. ఈ వయసులో ఉన్నవారికి ముందస్తు వ్యాధులు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉండే అవకాశం చాలా తక్కువ. కాబట్టి, పాలసీలో వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ పాలసీ తీసుకునేముందు బీపీ, షుగర్ లాంటివి ఉన్నా.. వాటికి పాలసీ వీలైనంత తొందరగా వర్తించాలి. అప్పుడే మీకది బెనిఫిషియల్ అవుతుంది. 

కెరీర్ బిగినింగ్ లో.. ఉద్యోగం రాగానే మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ తో వచ్చిన ఇన్కమ్ ను దుబారా చేయకుండా మంచి రాబడి వచ్చేలా ఇన్వెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో.. అదే సూత్రంతో మంచి ఆరోగ్య బీమాను తీసుకోవడం కూడా అంతే ముఖ్యం!

ఉద్యోగరీత్యా.. జాబ్ ట్రాన్స్ఫర్స్ అనేవి కామన్. అలానే ఉండే ప్లేస్ కూడా మారుతుంటారు. కాబట్టి భారత్ లో మీరు ఎక్కడ ఉన్నా.. మీ ఆరోగ్యానికి పాలసీ ఢోకా లేకుండా ఉండాలి. అందుకే, పాలసీని ఎంచుకునేటప్పుడు నెట్వర్క్ ఆసుపత్రుల వివరాలను డెఫినెట్ గా చెక్ చేసుకోవాలి.

అనుకోకుండా అసుపత్రిలో చేరాల్సి వస్తే… క్లెయిమ్ ట్రాన్స్ఫర్ సరిగా జరుగుతుందో లేదో ఒకటికి రెండుసార్లు చూడాలి. 

30-55 ఏళ్ల మధ్య వయసు పెరుగుతున్న కొద్దీ.. హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

అలాంటప్పుడు వెయిటింగ్ పీరియడ్, ప్రీ ఎక్సిస్టెడ్ డిసీజెస్, నెట్వర్క్ హాస్పిటల్స్, సక్సెస్ ఫుల్ క్లెయిమ్స్ వంటి ప్రధాన అంశాలతోపాటు పరిశీలించాల్సిన మరికొన్ని అంశాలు ఏంటంటే..

*చిన్న వయసులో ఉన్నప్పుడు తీసుకున్న పాలసీలు కొన్నాళ్ళు పోయాక లేదా ఇప్పుడు కంప్లీట్ సెక్యూర్డ్ అని చెప్పలేం. 10-50 ఏళ్ల వయసులో బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆసుపత్రి ఖర్చులూ దీనికి అదనపు భారమే అవుతుంది. ఇందుకోసం

ఈ వయసులో ఉన్నవారు కనీసం రూ.10లక్షలకు తక్కువ కాకుండా పాలసీని తీసుకోవడం మంచిది. *ఫ్యామిలీ మొత్తానికి వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఎంచుకోవాలి. పార్టనర్ (భార్య), పిల్లలు, తనపై ఆధారపడిన పేరెంట్స్ కి పాలసీ రక్షణ కవచంలా ఉండాలి.

*పనిచేస్తున్న ఆర్గనైజేషన్ లో యాజమాన్యం అందించే గ్రూప్ పాలసీతో పాటు విడిగా మరో పాలసీ ఉండటం కంపల్సరీ!

దీనికి తోడు సూపర్ టాప్ అప్ ను తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనంతో పాటు ప్రీమియం తక్కువగా ఉంటుంది.

ఉదాహరణకు; మీ ప్రైమరీ పాలసీ వాల్యూ ఒక రూ.10 లక్షల కవరేజ్ తో ఉందనుకుంటే.. ఈ సూపర్ టాప్ అప్ పాలసీని మీరు రూ.కోటి వరకు తీసుకోవచ్చు అది కూడా తక్కువ ప్రీమియంతోనే!

నో క్లెయిమ్ బోనస్: పాలసీ తీసుకున్న తర్వాత క్లెయిమ్ జరగని ప్రతి ఇయర్ మీ బీమా కవరేజ్ ఎక్కడికి పోతుందనే డౌట్ మీకు రావొచ్చు. అలా క్లెయిమ్ అవ్వని మీ కవరేజ్ ప్రతి ఏటా మొత్తం పెరుగుతూ ఉంటుంది. దీనినే ఎన్ సీబీ/ నో క్లెయిమ్ బోనస్ అంటారు.’నో క్లెయిమ్ బోనస్’ రూపంలో కొన్ని ప్రయోజనాలను పొందొచ్చు. 

లాస్ట్ ఇయర్ పాలసీని యుటిలైజ్ చేసుకోకపోతే, పాలసీ మెంబర్ హెల్దీగా ఉండి ఆసుపత్రికి వెళ్లకుండా ఉన్నందుకు.. క్లెయిమ్​ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బు ఖర్చు చేయించకుండా ఉన్నందుకు రివార్డ్ ఇస్తుంది. ఇది మళ్ళీ రెండు రకాలు.

1.ప్రీమియంపై డిస్కౌంట్‌: ఈ రకమైన నో క్లెయిమ్ బోనస్ పాలసీ రెన్యూవల్ టైంలో ప్రీమియంపై తగ్గింపును అందిస్తాయి. కవరేజీలో మాత్రం ఎటువంటి మార్పూ ఉండదు. 

ఉదాహరణకు; మీరు రూ.5,00,000 కవరేజ్ తో పాలసీని తీసుకున్నారు అనుకుందాం. గతేడాది మీరు క్లెయిమ్ చేయనందుకుగానూ మీరు కట్టాల్సిన ప్రీమియంలో 10% డిస్కౌంట్ ఆఫర్​ ఇచ్చిందనుకుంటే, అప్పుడు మీరు చెల్లించే యానివర్సరీ ప్రీమియం రూ.10,000 అయితే.. 10% డిస్కౌంట్ పొందారు. కాబట్టి.. ఈ ఏడాది రూ. 9,000 చెల్లిస్తే సరిపోతుంది.

2.కుమ్యులేటీవ్ బోన‌స్‌: ఈ రకమైన నో క్లెయిమ్ బోనస్ కింద ప్రీమియం తగ్గింపు ఆఫర్ అనేది ఏం ఉండదు. కానీ బీమా క్లెయిమ్ కెపాసిటీ మాత్రం పెరుగుతుంది. 

ఉదాహ‌ర‌ణ‌కు; మీకు 10 శాతం నో-క్లెయిమ్ బోన‌స్ వచ్చిందనుకుందాం. మీ పాలసీ వార్షిక ప్రీమియం రూ.10 వేలు, క‌వ‌రేజీ రూ.5 ల‌క్ష‌లు ఉందనుకుంటే.. మీరు గతేడాది పాల‌సీ క్లెయిమ్ చేయలేదు. కాబట్టి బోన‌స్ కింద ఇచ్చే 10 శాతం క‌లిపి.. నెక్స్ట్ ఇయర్ క‌వ‌రేజీ అనేది రూ. 5ల‌క్ష‌ల 50వేలకు పెరుగుతుంది. రెండో ఏడాది కూడా క్లెయిమ్‌ చేసుకోకపోతే క‌వ‌రేజీ రూ.6 ల‌క్ష‌ల‌కు పెరుగుతుంది. ఇలా.. కవరేజీ అనేది పెరుగుతూ పోతుంది. ప్రీమియంపై డిస్కౌంట్ ఉండదు.

ఎన్​సీబీ ద్వారా కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. ప్లాన్ రెన్యూవల్ టైమ్​లో ప్రీమియం తగ్గి, మీ డబ్బు సేవ్ అవుతుంది. లేదంటే.. పాలసీ కవరేజ్ పెరుగుతుంది. ఈ రెండు కూడా ఒక విధంగా సేవింగ్ అనే చెప్పవచ్చు.

*రిటైర్డ్ ప్లానింగ్ లోనూ హెల్త్ ఇన్సూరెన్స్ కి ఒక్కింత ప్రాధాన్యత ఇవ్వాలి. 55 ఏళ్లు దాటిన తర్వాత బీమా పాలసీలో కేవలం ఆసుపత్రి చికిత్సకే కాకుండా హెల్త్ కి ప్రాధాన్యం కల్పించేలా ఉండాలి. మధుమేహం, బీపీలాంటి వ్యాధులకూ పాలసీలో అంటే ఆసుపత్రిలో చేరడంతోపాటు ఇంటివద్ద ట్రీట్మెంట్ పొందే సందర్భంలోనూ పాలసీ పరిహారం ఇచ్చేలా ఉండాలి. 

టెలీ మెడిసిన్ సేవలకూ ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం కచ్చితంగా ఆసుపత్రికి వెళ్లాల్సినవసరం లేదు. మీరు ఎంచుకునే పాలసీలో ఇలాంటి వెసులుబాటు ఉండేలా ముందే చూసుకోండి. 

తీవ్ర వ్యాధులు లేదా క్రానిక్ ఇల్నెస్ బారిన పడినప్పుడు పరిహారం కోసం క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను ఎంచుకోవడం ఉత్తమం!

క్యాన్సర్, హార్ట్, కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ బారిన పడినప్పుడు చికిత్స ఖర్చుతో నిమిత్తం లేకుండా ఈ పాలసీలు కంపెన్సషన్ ను అందిస్తాయి.

Show More
Back to top button