HISTORY CULTURE AND LITERATURE

మహిమాన్వోపేత అహోబిల శ్రీలక్ష్మి నరసింహుని దేవాలయం వైశిష్టం తెలుసుకుందామా..?

తెలుగు రాష్ట్రాల్లోనే అంత్యంత పురాతనమైన దేవాలయం, శ్రీ లక్ష్మి నరసింహుని దివ్య సన్నిధానం అహోబిలం శ్రీ దివ్య నారసింహుని ఆలయం. శ్రీ మహావిష్ణువు రాక్షసుడైన హిరణ్య కశిపన్ని  సంహారం చేసింది ఈ క్షేత్రం లోనే.  అహోబిలం, కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం. దట్టమైన నల్లమల అడవుల మధ్య కొలువైన ఈ క్షేత్రం.. హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు అలవాలుగా మారింది. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా అంటారు.

నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలం అని పిలుస్తారు. కాల క్రమంలో ఈ దేవాలయాన్ని అహోబిలం అంటారు. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. అహోబిలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చి భక్తులను పునీతుల్ని చేస్తుంది. 

మహిమోపేతమైన ఈ తీర్థంలో ఉగ్రనరసింహస్వామి స్వయంభువుగా వెలసింది. పరమ భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుని సంహరణార్ధం శ్రీ మహావిష్ణువు నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబిలక్షేత్రం. దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం.ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దేవదేవుని స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని ఇక్కడి చరిత్ర చెబుతుంది.

ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు తమ అపురూపమైన సేవలను అందిచించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి భక్తి శ్రద్దలతో పూజించాడు. 

హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత శ్రీమహావిష్ణువు  వీరావేశంతో నల్లమల అడవుల్లో సంచరిస్తుంటాడు. స్వామివారి ఉగ్రత్వం చూతి భీతిల్లిన దేవనాదేవతలు స్వామిని ఎలా శాంతించాలని అని ఆలోచనలో పడతారు. కేవలం ఈ పని శ్రీ మహాలక్ష్మి దేవి మాత్రమే చేస్తారని తలచి ఆమెను వేడుకున్నారు. దీంతో ఆ లోకమాత  చెంచులక్ష్మిగా ఉగ్రనరసింహ స్వామి వారికి కనిపిస్తుంది. ప్రహ్లాదవరదుడు ఆమెను చూసి శాంతిస్తాడు, మనువాడాలని నిర్ణయిస్తాడు. అయితే చెంచులు, స్వామికి తమ ఆడపడుచును ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. పెళ్లి కూతురికి ఓలి (కట్నంగా) ఏమిస్తావని అడిగారు.

‘పారువేటోత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను’ అని స్వామి మాటిచ్చాడు. అలా, తన వివాహ మహోత్సవానికి సమస్త భక్తజనులనూ ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో సంచరిస్తాడు నరసింహుడు. శ్రీ లక్ష్మీ నరసింహుడు స్తంభం నుంచి చీల్చుకొని వచ్చిన ప్రదేశం కూడా ఇక్కడే కావడం విశేషం. అయితే ఈ ప్రదేశము నేటికీ ఇక్కడే ఉంది అని విశ్వసిస్తారు. ఈ స్తంభం నల్లమల కొండల్లో అత్యంత ఎత్తులో ఉంటుంది. దీనిని దర్శించుకునేందుకు గుట్ట పైకి వెళ్లాల్సి ఉంది. సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత నల్లమల అడవులు కీకారణ్యంలో కొండ చివరన స్వామి వారి స్తంభం, స్వామివారి పదాలు దర్శనమిస్తాయి. స్వామివారి స్తంభం అక్కడి ప్రకృతిని చూస్తూ భక్తులు పులకించిపోతారు.  

ఎనిమిది కి మీ ఎత్తున కొండ పైన ఎగువ అహోబిల నరసింహుని చుడవొచ్చు . హిరణ్య కసపుడిని సంవరించి వికట హట్ట్ హాసాలు చేస్తూ అహోబిలమ కొండల్లో తిరుగుతూ తొమ్మిది ప్రదేశాల్లో వివిధ రూపాల్లో వెలసారని అక్కడి చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 

(1)జ్వాల నరసింహ స్వామి

(2)అహోబిల నరసింహ స్వామి

(3)ఉగ్ర నరసింహ స్వామి

(4)మాలోల నరసింహ స్వామి

(5)కారంజ నరసింహ స్వామి

(6)భార్గవ నరసింహ స్వామి

(7)యోగానంద నరసింహ స్వామి

(8)క్షత్రవట నరసింహ స్వామి

(9)పావన నరసింహ స్వామి

ఇక్కడి ఆలయ విశిష్టతలు:

ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇది కాకుండా, ప్రతి నెలా, స్వామి యొక్క నక్షత్రం రోజున, అంటే స్వాతి, గ్రామోత్సవాలు (గ్రామ వేడుకలు) నిర్వహిస్తారు. ఆ రోజున 108 కలశాలతో తిరుమంజన్ సేవ (సేవ) అంగరంగ వైభవంగా జరుగుతుంది. పవిత్రమైన స్వాతి నక్షత్రం రోజున చాలా మంది యాత్రికులు ఆలయాన్ని దర్శించి పునీతులవుతారు. ఈ తొమ్మిది రూపాలలో ప్రతి ఒక్కటి పురాణాలు, ఊహాజనిత ఇతిహాసాలు, ఇతిహాస గాథలతో అల్లబడిన అందమైన కథను కలిగి ఉంటాయి.

ప్రసిద్ధ విశ్వాసం ప్రకారం, స్వామి యొక్క ఒక రూపమైన పవన నరసింహస్వామి, ప్రసాదాన్ని సమర్పించినప్పుడు, నైవేద్యంలో సగం భక్తుడికి తిరిగి వస్తుంది. ఈ క్రమంలో జ్వాలా నరసింహస్వామి క్రూరమైన రూపంగా భావిస్తారు. ఈ రూపం దేవుని సమిష్టి మరియు తీవ్రమైన కోపాన్ని సూచిస్తుంది. జ్వాలా నరసింహస్వామి అసలు ప్రదేశం అగ్నిపర్వత ముఖద్వారం అని, భక్తులకు అందుబాటులో ఉండే ప్రాక్సీ మందిరం మాత్రమేనని  ప్రజల నమ్మకం.ఆంధ్రులు ఈ దేవతలను పూజించడం ద్వారా నవగ్రహాలు గ్రహం అనే శక్తిని పొందాయని విశ్వాసం. ఏ గ్రహం మీద అయినా దుష్ప్రభావం ఉన్నవారు నరసింహుడిని పూజించడం ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చని ప్రజలు విశ్వసిస్తారు.

Show More
Back to top button