HISTORY CULTURE AND LITERATURE

‘జ్ఞానవాపి మసీదు కాదు.. హిందూ దేవాలయం’.. నివ్వెరపోయే సంచలన నిజాలు మీకోసం..!

దేశ వ్యాప్తంగా గత కొంతకాలంగా సంచలనంగా మారిన పేరు జ్ఞానవాపి. ఇది కేవలం వివాదమే కాకుండా, భారతదేశ అస్తిత్వానికి సంబంధించి విషయం. ఉత్తర ప్రదేశ్ వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు సర్వే (ఏఎస్ఐ) అధికారులు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గతంలో ఉన్న భారీ హిందూ దేవాలయాన్ని కూల్చి వేసి మసీదు నిర్మించారని ఏఎస్‌ఐ సర్వేలో తేల్చినట్టు వెల్లడైంది. జ్ఞానవాపి మసీదు స్థానంలో విశ్వేశ్వర లింగం ఉన్నది అని చెప్పడానికి ఇక్క అనేక ఆధారాలను పొందుపరుస్తున్నాం. నిశితంగా పరిశీలించండి.  

 జ్ఞానవాపి గురించి క్లుప్తంగా చెప్పాలంటే భారతదేశంలో వారణాసి లేదా కాశి అనేటువంటి ఈ పవిత్ర స్థలం సర్వోత్క్రుష్ట మైనటువంటి పుణ్యక్షేత్రం. గత 1000 సంవత్సరాలలో కుతుబుద్దీన్ ఐబక్ నుండి ఔరంగ జేబు వరకు ఎంతో మంది పైశాచిక మతోన్మాదులు కాశీలో ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసి వాటి స్థానాల్లో మసీదులు నిర్మించారు. వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది కాశి విశ్వేశ్వరుడి గుడిని ధ్వంసం చేసి నిర్మించినట్లు వంటి జ్ఞానవాపి మసీదు. ఈ రోజు జ్ఞానవాపి మసీదుగా పిలువబడుతుంది ఔరంగ జేబు కాశి విశ్వేశ్వరుని ఆలయం ధ్వంసం చేసి దానిపైన నిర్మించిన మసీదు. కాబట్టి న్యాయంగా ధర్మముగా ఆ స్థలం కాశి విశ్వేశ్వరుడు ఇదివరకు ఉండే గుడి ఉన్న స్థలం కాబట్టి.. అక్కడ ఆదివిశ్వేశ్వరుని జ్యోతిర్లింగ మందిరాన్ని పునరుద్ధరించాలని కొన్ని వందల సంవత్సరాలనుండి హిందువులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ముస్లింల వాదన వింటే కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ తాము నమాజు చేసుకుంటున్నాము. కాబట్టి ఈ మసీదును మేము వదిలివెళ్ళలేము అనేటువంటిది వాళ్ళ వాదన. క్లుప్తంగా చెప్పాలంటే ఇది జ్ఞానవాపి యొక్క వివాదం. 

అయితే నూటికి 98 మంది ఈ వివాదాన్ని ఒక హిందూ – ముస్లిం వివాదంగా చూస్తున్నారు. అది పెద్ద పొరపాటు. ఇది  హిందూ – ముస్లిం వివాదం కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఔరంగ జేబు లాంటి ఒక పైశాచిక ఉగ్రవాది భారతదేశం మీద, భారతదేశ సంస్కృతి మీద ఘోరాతి ఘోరమైన ఒక అన్యాయాన్ని సరిచేయడం. ఔరంగజేబుకు, ఇవాళ దేశంలోని ముస్లింలకు ఏమాత్రం సంబంధం లేదు. ఈ దేశంలో ఉన్న ముస్లింలు కానీ హిందువులు కానీ, వేరే ఏ మతస్తులు అయినా సరే.. అందరూ కలిసిమెలిసి ఒకదేశంలో ఒక కుటుంబంలా నివసించడం.. ఇంత డైవర్సిటీతో ఒకే ఒక్క దేశంలో నివసించడం ప్రపంచంలో భారతదేశంలో తప్ప మరెక్కడా జరుగదు. సరే.. వెనక్కి వెళ్లి జ్ఞానవాపి గురించి వస్తే నూటికి 99.999 శాతం మందికి తెలియని విషయాన్ని కొన్ని ఈ కథనంలో చెప్పబోతున్నాము.  

మనకు తెలుగులో హీనమైన మాట ఒకటి ఉంది. అది పుక్కిటి పురాణాలు అని తక్కువ చేసి మాట్లాడటం. పురాణాలను ఒక మైథాలజీ అనడం చేస్తుంటాం. పురాణాలు అనగానే పుక్కిటిపురాణాలు అనే హేయమైన, నీచమైన ధోరణి ఒకటి ఈరోజు మన సమాజంలో ఉంది. ఇది మన మూర్ఖత్వానికి, మౌఢ్యానికి, అజ్ఞానానికి చిహ్నం. పురాణాల యొక్క ఆధ్యాత్మిక విలువల గురించి మాట్లాడటం ఇక్కడ నా ఉదేశ్యం కాదు. ఒక పురాణానికి ఎంత శక్తి ఉందే హేతుబద్ధంగా మనందరికీ ఒక్క విషయంలో చాలా స్పష్టంగా తెలుస్తోంది. అదే రామజన్మభూమి మీద సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఒక్కసారి రామజన్మ భూమి వర్దిక్ట్ అని గూగుల్ లో సెర్చ్ చేయండి. సుమారు 1000 కి పైగా పేజీలు ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్ వస్తుంది. సుప్రీం కోర్టు పబ్లిక్ డొమైన్ లోనే పెట్టింది. స్కంధపురాణం, అయోధ్య అనేటువంటి ఈ స్థలానికి రాముడు ఇక్కడే పుట్టాడు అని నిరూపించడానికి ఒక బలమైనటువంటి సాక్షిగా నిలబడింది స్కంద పురాణం. ఈరోజు రాముడి గుడి అయోధ్యలో కట్టబడుతుంది అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం స్కంద పురాణం. 

కాశి విషయానికోస్తే..  స్కంద పురాణం ఈ సందర్భంలో జ్ఞానవాపి గురించి మనకు ఏం చెబుతుంది. వ్యాసుడు రచించినటువంటి స్కంద పురాణం.. ఆయన రచించిన 18 పురాణాలలోకెల్లా అతిపెద్ద పురాణం. సుమారు ఇందులో లక్షకు పైగా శ్లోకాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యుడి పేరుమీద రచించారు కాబట్టి దీనికి స్కంద పురాణం అని పేరు వచ్చింది. ఈ పురాణంలో 7 ఖండాలు ఉంటాయి. ఇందులో ఒకటైన కాశీఖండం.. కాశీ యొక్క పురాతన చరిత్ర గురించి తెలిపే అత్యంత పురాతనమైన గ్రంథం. కాశీ గురించి సుబ్యహ్మణ్యుడు, అగస్య మహర్షి మధ్య జరిగిన సంభాషణ అంతా కలిపితే కాశీఖండం. ఈ కాశీఖండంలో క్షేత్రాన్ని ఎలా వివరించారో ఈ రోజుకు కూడా అలాగే ఉంది. సందర్భానుచితంగా జ్ఞానవాపి గురించి ఈ పురాణం ఏం చెబుతుంది, మనందరం తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

1). కాశీనగరానికి గల పేరు:

మనం అసలు కాశీ నగరాన్ని కాశీ అని ఎందుకు పిలుస్తామో చూద్దాం. మనకు వచ్చిన ఈ ప్రశ్నే అగస్య మహర్షికి కూడా వచ్చింది. దీంతో సుభ్రహ్మణ్యుడిని కాశి అని ఎందుకు పిలుస్తామో చెప్పండి అని అడుగుతారు. దీంతో అగస్య మహర్షికి కాశి క్షేత మహత్యాన్ని తెలుపుతాడు. మనం జ్ఞానవాపికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించిన అంశాలనే తీసుకుందాం. వారణాసిని కాశి, అవిముక్త క్షేత్రంగా అంటారు. కాశి అనే పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం.. ముఖ్యంగా మనం మణికర్ణికా ఘాట్ అని అంటున్నామో ఆ ప్రదేశం వర్ణనాతీతమైనటువంటి జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఏ భూభాగమైతే సర్వోత్క్రుష్టమైనటువండి జ్ఞానాన్ని ప్రకాశిస్తూ ప్రసాదిస్తుందో ఆ భూభాగాన్ని కాశి అంటారు. కాశి అనే పదం కాష్ అనే పదం నుండి వచ్చింది. కాష్ అంటే సంస్కృతం ప్రకారం వెలుతురుని ప్రసరింపజేసేది అని అర్ధం. ఇక రెండవ క్షేతంగా అవిముక్త క్షేత్రం. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే.. ముక్తి అంటే ఒకచోటు నుండి విడిపోయి మరొక చోటుకి చేరడం. అవిముక్త అంటే ఒక చోటును వదిలిపెట్టకుండా అక్కడే ఎప్పటికి ఉండటం. పార్వతీ పరమేశ్వరులు ఎట్టి పరిస్థితులలో కూడా ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టరని ఆ పేరు పెట్టారు. అయితే మనం ఈ రెండు పేర్లను మాత్రమే ఇక్కడ ఎందుకు తీసుకున్నాం అనేది చూద్దాం. 

2). కాశీ క్షేత్ర భౌతిక వర్ణన: 

అగస్యునికి స్కందుడు వారణాసి క్షేత్రాన్ని వివరిస్తూ ఉంటాడు. ఇందులో వారణాసి యొక్క భౌతిక మైనటువండి వివరాలను కూడా స్పష్టంగా వివరించాడు. ఇందులో 3 ముఖ్య విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. 

1). ఈశ్వరుడు స్వయంభువుగా లింగ రూపంతో ఇక్కడ వెలిసి ఉన్నాడు.

2). అవిముక్తం అనే ఈ క్షేత్ర స్థలం యొక్క పరిమాణం 5 క్రోసులు (1 క్రోసు 3.5కిమీ) 

3). ఈ పంచక్రోస కాశీలో ఎక్కడ నుంచి చూసినా సరే.. ఈ విశ్వేశ్వర లింగం స్పష్టంగా కనిపిస్తుంది. 

ఈ మూడు పాయింట్లు అగస్యునికి స్కందుడు కాశీ క్షేత్రాన్ని వివరిస్తూ చెప్పాడు.  ఇక్కడ మూడవ పాయింట్ ని మనం గమనిస్తే.. ఏ ప్రదేశం నుంచి చూసిన శివలింగం కనిపించాలనంటే.. ఎంత పెద్ద శివలింగ మై ఉండాలి. 

మరి ఇప్పుడు ఇది కాశీలో ఎక్కడా లేదు. స్కంద పురాణంలో చెప్పేటువంటి ఈ సమాచారాన్ని ఎంత లాజికల్ గా తీసుకోవచ్చు అనే డౌట్ అందరికి వస్తుంది.  ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఎందుకంటే.. స్కందపురాణంలో ఎక్కడ ఏయే ఆలయాలు ఎక్కడెక్కడ ఉండాలో చెప్పినట్లే ఇప్పడు అక్కడ ఆ ఆలయాలే ఉన్నాయి. మీరు కాశీఖండాన్ని పక్కన పెట్టుకొని కాశిని చూస్తే మీకే అర్ధం అవుతుంది. మరి ఈ పెద్ద శివలింగం ఏమైంది? ఈ ప్రదేశం ఏమైంది? ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం లేదు కానీ, కొంత వరకు మనకు సమాధానం దొరికే అవకాశం ఉంది. 

3). జ్ఞానవాపి అంటే ఏమిటి?

మూడవ ముఖ్యమైన విషయం అసలు జ్ఞానవాపి అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. అగస్యునికి సుబ్రహ్మణ్యుడు కాశీ క్షేత్ర మహత్యాన్ని తెలుపుతూ ఒక బావి దగ్గరికి వచ్చి ఆగుతాడు. అప్పుడు స్కంద…ఈ భావి యొక్క విశిష్టత ఏంటి? అని అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం సుబ్రహ్మణ్యుడు చెప్తూ.. అగస్య మహర్షి! జ్ఞానవాపి అనేటువంటి ఈ బావి నేను మీకు చెబుతాను. అని చెప్పి జ్ఞానవాపి మహత్యాన్ని 300 శ్లోకాలలో చెప్తాడు. ఇందులో ముఖ్యమైనవి చెప్పుకుందాం. భ్రహ్మ, విష్ణు ఎవరు గొప్ప ? అన్న కథలో శివుడి లింగరూపమైన నా ఆది అంత్యాలను గుర్తించండి అని పరీక్షా పెడుతాడు. ఈకథ మీకు తెలిసే ఉంటుంది. అయితే జ్వాలతో రగులుతున్న జ్యోతిర్లింగ అంది అంత్యాలను ఎవరూ గుర్తించలేక పోతారు. దీంతో వారు పరమశివా మీరు శాంతించండి అని వేడుకుంటారు. శాంతించిన శివుడు.. జ్యోతిర్లింగాన్ని శాంతిప జేయాలని భూమిపైనా తన త్రిశూలంతో ఒక్క వేటు వేస్తారు. అక్కడ కుండం ఏర్పడి గంగాజలం బయటికి వస్తుంది. ఆ నీటితో లింగాన్ని అభిషేకించి చల్లబరుస్తారు. గంగ వచ్చిన చోటు భావి ఏర్పాటుతుంది. ఆ భావియే జ్ఞానవాపి. అని అగస్యునికి స్కందుడు వివరంగా చెప్తాడు. 

4). జ్ఞానవాపి అనే భావి వారణాసిలో ఎక్కడ ఉంది?

లింగోధ్బవ ఘట్టమైన ఎంతో ఉగ్రంగా ఉన్న ఈశ్వరుడు తనను తాను శాంతిపజేసుకోవడానికి త్రిశూలంతో వారణాసిలో విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి దక్షిణం వైపు త్రిశూలంతో ప్రచండమైన వేగంతో భూమిపై కొట్టడం వల్ల గంగ బయటికి వచ్చింది. ఈ స్థలమే జ్ఞానవాపి. ఇక్కడే శివలింగం ఉన్న దేవాలయం ఉందని ఆధారాలు చెబుతున్నాయి. ఈ పాయింట్ లో చూసినట్లయితే.. విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి జ్ఞానవాపి దక్షిణం వైపు ఉన్నది అని స్కందపురాణంలో కాశీఖండంలో ఉంది. ఈ రోజు మనం మ్యాప్ తీసి చూసినట్లయితే.. జ్ఞానవాపి విశ్వేశ్వర లింగానికి దక్షిణాన కాకుండా.. ఉత్తరం వైపు ఉంటుంది. ఎందుకంటే.. ఈరోజు మనం పూజలు చేస్తున్న విశ్వేశ్వర జ్యోతిర్లింగ మందిరం ఏదైతే ఉందొ ఈ దేవాలయాన్ని 4-5 వందల సంవత్సరాల క్రితం నిర్మించారు. అసలైన విశ్వేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం జ్ఞానవాపికి ఉత్తరాన.. సుమారు ఈ జ్ఞానవాపి మసీదు ప్రాంతాల్లో ఉండేది. ఆ విశ్వేశ్వర క్షేత్రాన్ని స్కంద పురాణం వర్ణిస్తూ.. ఆ లింగానికి దక్షిణాన జ్ఞానవాపి వెలిసింది అని చెప్పారు. అలాగే చారిత్రాత్మకంగా కూడా మనం పరిశీలిస్తే.. ఔరంగ జేబు విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో మసీదులు నిర్మించాడు.

ఔరంగ జేబు ఆలయ ధ్వంసం చేయడం:

 No.1  స్కంద పురాణం చెప్పిన ప్రకారంగా జ్ఞానవాపి యొక్క ప్రదేశం.. జ్ఞానవాపి – విశ్వేశ్వర లింగానికి దక్షిణాన  ఉన్నది అన్నది ఒక వివరణ అయితే..  No.2 చారిత్రాత్మకంగా చూసిన ఔరంగ జేబు ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో మసీదును నిర్మించారు అన్నది రెండవ వివరణ .  No.3 ఇప్పటికి కూడా విశ్వేశ్వర ఆలయంలో ఉన్నటువంటి నంది మసీదు వైపు చూస్తూ ఉండటం ఇది మూడవ వివరణ. ఇలా మూడు.. ఇంకా అనేక ఆధార భట్టి అసలు జ్యోతిర్లింగ క్షేత్రం వారణాసిలో ఈ మసీదు ప్రాంతంలోని ఉందని తెలుస్తోంది. దీనిపై సుప్రీం కోర్టులో కేసులు నడుతున్నాయి. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కేసుపై పూర్వాపరాలను పరిశీలించింది సనాతన హైందవులకు అనుకూలంగా తీర్పునిచ్చి అక్కడ మన సర్వేశ్వర జ్యోతిర్లింగాన్ని ప్రతిష్టించుకునేలా అందరం కోరుకుందాం. ముస్లింలకు ఆరాద్యమైన ఆ మసీదును మరొక చోట వైభవంగా కట్టించి ప్రార్థనలు చేసుకునేలా కోరుకుందాం. హిందూ ముస్లింలము అందరం ఐకమత్యంగా మెలుగుదాం.. సర్వే జనా సుఖినోభవంతు.. జై హింద్.. జై భారత్..

Show More
Back to top button