HISTORY CULTURE AND LITERATURE

మిస్టరీలకు నిలయం పశుపతినాథ్ దేవాలయం

శివుడు సర్వాంతర్యామి. ఒక్కోచోట ఒక్కో పేరుతో పూజింపబడుతూ భక్తుల పాలిట ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్నాడు. మహిమాన్విత సైవధామంగా విరాచుల్లుతున్న ఆలయం పశుపతినాథ్ దేవాలయం.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. మహా శివుని ఆరాధించే భక్తుల సంఖ్య ఎక్కువే. ప్రపంచంలోని అన్ని దేవాలయాల్లో ఉన్న శివలింగాలు కంటే భిన్నంగా శివలింగానికి ఐదు ముఖాలు ఉన్న ఏకైక క్షేత్రం పశుపతినాథ్ దేవాలయం. ఈ దేవాలయం నేపాల్ లోని ఖాట్మండు ప్రాంతంలో ఉంది. ఇక్కడ పరమశివుడు పశుపతినాథ్ గా కొలువై ఉన్నాడు.

నేపాల్ లోని పశుపతి దేవాలయంలో చాలా విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అఖండ జ్యోతి. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ అఖండ జ్యోతి ఆరిపోకుండా అలాగే వెలుగుతూనే ఉంటుంది. ఈ దేవాలయంలో ఉన్న నంది విగ్రహం ఎల్లప్పుడూ గర్భగుడిలోని శివునికి ఎదురుగా చూస్తూ ఉంటుంది. దాని కన్నుల్లో శివలింగం యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనబడుతుంది. ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా ఈ దేవాలయం చెక్కుచెదరకుండా కొన్ని వేల సంవత్సరాల నుండి అలాగే ఉంది. ఇన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా దేవాలయం చెక్కుచెదరకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుందో సైంటిస్టులు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ దేవాలయంలోని గర్భగుడిలోకి కేవలం నలుగురు పూజారులు మాత్రమే వెళతారు. సాధారణ వ్యక్తులకు ఈ గర్భగుడిలోకి ప్రవేశం లేదు. ఈ నలుగురు పూజారులకు మాత్రమే ఆ గర్భగుడిలోకి ఎందుకు అనుమతి లభించింది? ఈ దేవాలయంలో శివలింగాన్ని దర్శించుకుని తమ చివరి శ్వాసను విడిచిన వారికి మోక్షం లభిస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది. అసలు ఈ దేవాలయం యొక్క రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ దేవాలయం ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే..

పశుపతి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అనే విషయంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అన్ని కథలలో ఒక కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ విన్నవారిలో శివుని భక్తులకు భక్తిని మరింత పెంచుతుంది. ఈ కథ ప్రకారం పురాతన కాలంలో పశు ప్రేక్షుడు అనే ఓ రాజు నేపాల్ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతను గొప్ప శివ భక్తుడు. ఎల్లప్పుడూ ఆ మహాదేవుని పూజిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఎప్పటికైనా ఆ పరమేశ్వరుని దివ్య దర్శనాన్ని పొందడమే లక్ష్యంగా ధ్యానం చేస్తుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓ జింక రూపంలో మారి అడవిలో తిరుగుతున్నాడు. ఆ జింక శరీరం దగదగా మెరిసిపోతోంది. దాని కళ్ళు చాలా అందంగా, విశాలంగా ఉన్నాయి. శివ స్వరూపమైన ఆ జింకను చూసి క్రూర మృగాలు కూడా ప్రశాంతంగా ఆడుకున్నాయి. అక్కడకు సమీపంలో ఉన్న భాగవతి నది సంతోషంతో ఉరకలేస్తున్నట్లుగా ఉంది. చెట్లు తమ తలలను ఊపుతున్నట్టుగా ఉన్నాయి.

పక్షుల కిలకిలా రావాలతో ఆ ప్రదేశం కోలాహలంగా మారింది. యాదృచ్ఛికంగా అదే రోజు పశు ప్రేక్షడు ఆ ప్రదేశానికి వేటాడడానికి వచ్చాడు. అతని కన్ను అక్కడ ఉన్న జంతువులను చూస్తూ జింక రూపంలో ఉన్న శివుని మీద పడింది. అంత అడవి ప్రదేశంలో ఆ జింక ఎంతో మనోహరంగా అనిపించింది. ఆ జింకా ఆ రాజు కి ప్రత్యేకంగా కనిపించింది. ఆ జింకా సాధారణమైనది కాదని సాక్షాత్తు మహా శివుని స్వరూపమని ఆ రాజు భావించాడు. వెంటనే తన రథం మీద నుండి కిందకు దిగి ఆ జింకకు నమస్కరించాడు. వెంటనే శివుడు తన నిజ స్వరూపంతో దర్శనమిచ్చాడు. ఆ దివ్యమైన తేజోవంతమైన రూపాన్ని చూసి పశుపేక్షడు భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలయ్యాయి.

తన్మయత్వంతో ఆ మహా దేవునికి నమస్కారం చేశాడు. అప్పుడు శివుడు ఆ రాజుని ఏం వరం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు ఆ రాజు ఈ ప్రదేశంలోనే కొలువై ఉండమని మీ ఆశీర్వాదం చల్లని చూపు ఇక్కడ ప్రజలపై ఉండాలని అడిగాడు. అతని నిష్కల్మషమైన భక్తికి మెచ్చి మహాశివుడు అలాగే అనే వరమిచ్చాడు. నువ్వు కోరుకున్నట్టుగా ఈ ప్రదేశంలో శివలింగం రూపంలో కొలువై ఉంటాను అని అంటాడు. ఇక్కడకు వచ్చి నన్ను దర్శించుకున్న వారికి ధర్మార్థ కామ మోక్ష మొహాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే ఈ దేవాలయం పశుపతినాథ్ దేవాలయంగా ప్రసిద్ధి చెందుతుంది అని చెబుతారు.

ఆ మహా శివుని మాట ప్రకారం పశుపేక్షుడు అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. గర్భగుడిలో శివలింగాన్ని ప్రతిష్టించాడు. నిత్యం శివుని పూజిస్తూ ఆయన పాదాల వద్ద తన జీవితం మొత్తాన్ని గడిపాడు. అతని తర్వాత ఆ ప్రదేశాన్ని పరిపాలించిన ఇతర రాజులు కూడా ఆ దేవాలయాన్ని సంరక్షించారు. ఆలయం చుట్టూ పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతూ ఆలయ ప్రాంగణాన్ని విస్తరించారు. దీనివల్ల ఈ దేవాలయం భారీ రూపాన్ని సంతరించుకోవడంతోపాటు సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని సొంతం చేసుకుంది. నేపాల్, భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తప్పకుండా దర్శించుకోవలసిన పవిత్రమైన ఆలయం ఈ పశుపతినాథ్ దేవాలయం.

ఇక్కడ శివలింగం విశిష్టత 

ఈ శివలింగం ఇతర దేవాలయాల్లోని శివలింగాల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ శివలింగం నాలుగు ముఖాలను కలిగి ఉంటుంది. ఈ నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను సూచిస్తూ ఉంటాయి. ఈ నాలుగు ముఖాలు ఆధ్యాత్మిక, దైవిక ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అందువల్ల దీనిని ముఖ లింగం అని అంటారు. ఈ శివలింగం మీద ఉన్న ఒక్కొక్క ముఖం మానవ జీవనానికి అవసరమైన ఒక్కొక్క విషయాన్ని సూచిస్తుంది. తూర్పు వైపు చూస్తున్న మొఖం మతాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తి తప్పకుండా ఒక మతాన్ని అనుసరించడం అవసరం. అది వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మతాన్ని అనుసరించడం జీవనానికి ఆధారం. అది లేకుండా ప్రపంచం మనుగడ కూడా అసాధ్యం. మతాన్ని అనుసరించడం జీవితంలో శాంతిని స్థిరత్వం కలిగిస్తుంది.

దక్షిణం వైపు చూస్తున్న శివుని ముఖం సంపదను సూచిస్తుంది.

సంపదను సంపాదించడం వల్ల భౌతిక శ్రేయస్సు ఆర్థిక శ్రేయస్సుతోపాటు ప్రాపంచిక విజయం చేకూరుతుంది. జీవన మనుగడ కొనసాగించడానికి సంపాదన సమకూర్చుకోవడం అవసరం. అయితే సంపాదన సంపాదించడం మతంతో ముడిపడిన అంశం.

పడమర వైపు చూస్తున్న ముఖం కామాన్ని సూచిస్తుంది. కామం అంటే భౌతిక కోరికలు మాత్రమే కాదు మానసిక కోరికలు జీవన మనుగడకు కావలసిన అవసరాలు సమకూర్చడం. తమకు నచ్చినట్టుగా జీవించడం ఇవన్నీ కామానికి చిహ్నం. అవసరమైనప్పుడు కోరికలను తీర్చుకోవడమే కాదు సరైన సందర్భంలో ధర్మార్ధాల విషయంలో కొన్నిసార్లు కోరికలను తీర్చుకోవడంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలని లేకపోతే మనిషి పతనం వైపు ప్రయాణిస్తాడని ఈ ముఖం సూచిస్తుంది.

ఉత్తరం వైపు చూస్తున్న నాలుగో ముఖం మోక్షాన్ని సూచిస్తుంది. మోక్షం అంటే ధర్మార్థ, కామాలను వదిలేసి జీవన చక్రం నుండి విముక్తులవ్వడం. ఆత్మను పవిత్రంగా మార్చుకొని పరమాత్మలో కలిసిపోవడం. అలా మోక్షం పొందగలిగిన వారు మళ్లీ పుట్టి ఈ ప్రాపంచిక సమస్యలను బాధలను భరించాల్సిన అవసరం లేదు. ఉత్తరం వైపు చూస్తున్నా ముఖం శివుని దయగల రూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది మనిషిని మోక్షం వైపు ప్రయాణించేలా ప్రేరేపిస్తుంది. ఈ నాలుగు ముఖాలతో పాటు కనపడని ఐదో ముఖం ఉందని, ఇది సృష్టిని రూపొందించిన బ్రహ్మని సూచిస్తుందని నమ్ముతారు.

ఆ విధంగా ఈ ముఖ శివలింగం మానవ జీవితంలోని అన్ని విషయాలను సూచిస్తుంది. ఇది ప్రతి ఒక్క భక్తుని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తోంది. ఈ శివలింగాన్ని దర్శించుకున్న వారు తన్మయత్వంతో ముగ్దలవుతారు.

ఈ దేవాలయంలోకి నలుగురు పూజారులు మాత్రమే ఎందుకు వెళతారు 

ఈ దేవాలయంలో శివలింగాన్ని ప్రతిష్టించిన గర్భగుడిలోకి ప్రత్యేకంగా నియమించిన నలుగురు పూజారులు మాత్రమే శివలింగాన్ని పూజిస్తారు. సాధారణ భక్తులతో పాటు ఆలయంలోని ఇతర పూజారులకు కూడా ఈ గర్భగుడిలోకి వెళ్లే అవకాశం లేదు. దీనికోసం ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన పూజారులను మాత్రమే నియమిస్తారు. వారిని భట్ పూజారులు అని పిలుస్తారు. వీరి నియామకంలో చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. గర్భగుడిలోని శివలింగం యొక్క పవిత్రతను కాపాడుతూ ఆ మహా శివుని ఎలా పూజించాలో వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది.  ఆ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. వీటిని ఎవరు ఉల్లంఘించలేరు. ఇలా ప్రత్యేకమైన పూజారులను నియమించే పద్ధతి చాలా కాలం నుండి అనుసరించబడుతుంది. ఆ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ నేటికీ అనుసరిస్తున్నారు.

నిత్యం వెలిగే అఖండ జ్యోతి 

దేవాలయంలో నిత్యం వెలుగుతున్న అఖండ జ్యోతి ఈ దేవాలయం రహస్యాలలో ఒకటి. దీనిని పురాతన కాలంలో వెలిగించారని అప్పటినుండి నేటి వరకు ఇది ఎప్పుడు ఆరిపోలేదని చెబుతారు.  అలా నిరంతరాయంగా వెలుగుతున్న ఈ దీపం ఆ మహా శివుని నిజస్వరూపంగా భావిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తులు ఈ దీపం వెలుగును చూస్తే ఏదో దివ్య శక్తిని చూసిన అనుభూతి కలుగుతుందని చెబుతారు. ఈ దీపాన్ని చూసిన వారికి వారిలో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా నశించి పాజిటివ్ ఎనర్జీ వచ్చినంత ఫీలింగ్ కలుగుతుంది. ఈ నిరంతర జ్యోతిని చూడడానికి దాని శక్తిని అనుభూతి చెందడానికి ప్రపంచ నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు వస్తారు.

పవిత్ర నది భాగవతి 

ఇక్కడ ప్రవహించే భాగమతి నది ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం శివుడు భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన సంకల్పం ద్వారా భాగమతి నది ఉద్భవించిందని తెలుస్తోంది. అందువల్ల ఈ నదిలో ప్రవహించే నీరు ఆ మహా శివుని ప్రసాదమై ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, రోగాలు నయమైపోతాయని భక్తులు భావిస్తారు. నేపాల్ దేశం రాజధాని కాట్మండు గుండా  ప్రవహిస్తున్న ఈ భాగవతి నది నేపాల్ దేశంలోని గంగా నదిగా పేర్కొంటారు. ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు ఈ నదిలో స్నానం చేసి నది ఒడ్డున పూజలు చేస్తారు. పశుపతి నది దేవాలయానికి దగ్గరలో ఉన్న ఘాట్లలో చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారం. చనిపోయిన వారి బూడిదలు ఈ నదిలో కలపడానికి వారి ఆత్మలను పవిత్రం చేస్తుందని వారి ఆత్మలు పరమశివుడు ఐక్యం చేస్తుందని నమ్ముతారు.

పశుపతినాథ్ దేవాలయం పవిత్రతతో పాటు దాని దృఢమైన నిర్మాణం వల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వేల సంవత్సరాల క్రితం నుండి ఈ దేవాలయం ఇక్కడ ఉన్నప్పటికీ ఎన్ని తుఫానులు, భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినా కూడా ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ దేవాలయం చుట్టూ ఉన్న ఇతర పెద్ద పెద్ద భవనాలు మాత్రం కూలిపోయాయి. కానీ ప్రధాన దేవాలయం, శివలింగాన్ని ప్రతిష్టించిన గర్భగుడి ఇప్పటికి దృఢంగా నిలిచాయి. 2015లో సంభవించిన భారీ భూకంపం సమయంలో కూడా ఈ దేవాలయం దృఢంగా నిలిచింది. ఇది కచ్చితంగా ఆ పరమశివుని శక్తి కారణంగానే సాధ్యపడిందని భక్తులు నమ్ముతారు.

ఇప్పుడు ఈ దేవాలయంలోని ప్రత్యేకమైన నంది గురించి తెలుసుకుందాం 

ఆలయ ప్రవేశ ద్వారం వద్ద శివుని మహా భక్తుడు, శివుని వాహనమైనటువంటి నందీశ్వరుని విగ్రహం ప్రతిష్టించబడింది. ఈ విగ్రహం ధ్యాన భంగిమలో కూర్చొని ఉంటుంది. ఇక్కడ నంది నిరంతరం తన స్వామి మహాశివుని ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు. ఈ నంది ముందు నిలబడి లేదా కూర్చుని తమ కోరికలను కోరుకుంటే అవి నేరుగా శివుని వరకు చేరుతాయని భక్తుల విశ్వాసం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ నంది కళ్ళల్లో మహా శివుని రూపం స్పష్టంగా కనబడుతోంది. భక్తుడు నిజమైన భక్తితో నంది కళ్ళల్లోకి చూస్తే వారికి తప్పకుండా ఈ ప్రతిబింబం కనబడుతోంది. ఇది పరమశివుని పట్ల నిజమైన భక్తి, విశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ దేవాలయంలో శివుని దర్శించుకున్న తర్వాత ఈ పరిసర ప్రాంతాల్లో వారికి మరణం సంభవిస్తే వారు కచ్చితంగా మోక్షాన్ని పొందుతారని భక్తులు నమ్ముతారు.

Show More
Back to top button