
ఆఖరి మొగల్ చక్రవర్తిగా… ఎన్నో తిరుగుబాట్లను, యుద్ధాలను, ప్రత్యర్థులను.. ఎదుర్కొన్న ఔరంగజేబు…1658 నుంచి 1707 వరకు రాజ్యాధికారం చేశాడు. దాదాపు 50 సంవత్సరాలపాటు మొగల్ రాజ్యచక్రవర్తిగా సుదీర్ఘకాలం కొనసాగాడు. ఈయన కాలంలో మొగల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం చెందింది. అందుకే ఆయన్ను ఆలంగీర్ (ప్రపంచాధినేత)గా కూడా పిలుస్తారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే..
ఈ ఆరవ మొగల్ చక్రవర్తి భారతదేశాన్ని ఏలిన వారందరిలోకెళ్ల అత్యంత వివాదాస్పదమైన, క్రూరమైన వ్యక్తిగా, మతఛాందసవాదిగా పేరు తెచ్చుకున్నాడు. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నప్పటికీ.. ఇతర మతాలవారిని తెగ ఇబ్బందులకు గురి చేశాడు. అన్యాయంగా హిందూ దేవాలయాలను కూల్చివేశాడు. ప్రజల్ని ఇస్లాం మతంలోకి మారమంటూ ప్రలోభాలకు గురి చేశాడు. తండ్రిని జైల్లో వేసి, బాధపెట్టాడు. రాజ్యాధికారం కోసం వెంపర్లాడాడు. ఇందుకు సొంత తోబుట్టువులను చంపేందుకూ వెనుకాడలేదు.
అతడికన్నా ముందు పరిపాలించిన మొగల్ చక్రవర్తులు.. సాధారణంగా సర్వమత సామరస్యాన్నే పాటించారు. దీంతో తమ సామ్రాజ్యాన్ని తిరుగుబాటుదారుల నుంచి కాపాడుకున్నారు. కానీ ఔరంగజేబు అలా కాదు. వారికి విరుద్ధంగా తన మతమే పాటించాలనే ఉద్దేశంతో.. ఇతర మతాల వారిని నానాకష్టాలు పెట్టి, ఆఖరికి రాజ్యపతనం చెంది.. మరణించాడు. ఇంతకీ ఈ ఔరంగజేబు ఎవ్వరూ.. ఆయన పాలన క్రమం, పాటించిన విధానాలు, వ్యక్తిగత, రాజకీయ జీవిత విశేషాలను ఇప్పుడు చూద్దాం:
భారతదేశపు మొగల్ చక్రవర్తుల్లో ఆరవవాడు. ‘ఆలంగీర్’గా పిలువబడిన ఇతడు 1658 నుంచి 1707 వరకు భారతదేశాన్ని పరిపాలించాడు. 1618 నవంబరు 3న గుజరాత్‌లోని దాహోద్‌లో జన్మించాడు ఔరంగజేబు. తండ్రి షాజహాన్, తల్లి ముంతాజ్ మహల్. వీరికి నలుగురు సంతానం. వారిలో మూడోవాడే ఈ ఔరంగజేబు.. చిన్ననాటి నుంచి ఖురాన్, పర్షియన్, అరబిక్ వంటి భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఇతడి పాలనలో మొగల్ భారతదేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా పేరుగాంచింది. దాదాపు 50 సంవత్సరాలపాటు నిర్విరామంగా పరిపాలించాడు. వాస్తవానికి ఔరంగజేబు గొప్ప దైవభక్తుడు.
మతాచారాలను తు.చ. తప్పకుండ పాటించేవాడు. అతడు పాటించే మతవిశ్వాసాల ప్రకారం.. ముస్లింలు కానీవారిపై జిజియా పన్ను విధించాడు. నిజానికి ఇస్లాం మతశాస్త్రాల ప్రకారం ముస్లింల నుంచి జకాత్, ముస్లిమేతరుల నుంచి జిజియా పన్ను వసూలుచేసే సంప్రదాయం ఉంది. అయినప్పటికీ అతడి పూర్వీకులు జిజియా పన్నును వసూలు చేయలేదు. ఔరంగజేబు మాత్రం ఇద్దరినుంచి పన్నులు వసూలు చేసి.. చెడ్డపేరు తెచ్చుకొని, ఆఖరికి ప్రజావ్యతిరేక విధానాలను అవలంబించి.. మొగల్ సామ్రాజ్యం పతనానికి కారకుడయ్యాడు.
1526లో బాబర్ తో మొదలైన మొగల్ వంశంలో ఆరో చక్రవర్తి ఈ ఔరంగజేబు… మొగల్ చక్రవర్తుల్లోని అక్బర్.. ఔరంగజేబుకు ముత్తాత. ఈయన కాలంలో కాస్త లౌకికవాదాన్ని పాటించాడు. తమ మతాన్ని పాటిస్తూనే ఇతర మతాలను గౌరవించాడు. హిందూ, బౌద్ధ, జైనమతాల పట్ల సహనం పాటించాడు. అక్బర్ కాలానికి భారతదేశంలో జనాభా.. 60 మిలియన్లు (6 కోట్లు) కాగా ఆయన కాలంలో ప్రజల అవసరాలను నిత్యం తెలుసుకొని.. సామరస్యంగా పాలన చేశాడు. అయితే తన ముత్తాత పాటించిన ఈ విధానాన్ని తప్పుబట్టి.. ఇలా ప్రజలకు అనుకూలంగా ఉండటం.. వారిని స్వేచ్ఛగా బతకనీయడం, పిరికితనానికి చిహ్నం లాంటిందని భావించి తనకు తోచినట్లుగా ఉండటం.. మొదలుపెట్టాడు.
ఇకపోతే ఔరంగజేబు తన అన్నను కాదని అధికారంలోకి రావడం… రాజ్యాధికారం కోసం సొంత అన్నదమ్ములనే ప్రాణభయంతో బతికేలా చేసి, చంపడం.. చూస్తే నీచుడని, క్రూరుడని అనలేకుండా ఉండలేం. తండ్రి షాజహాన్ సైతం అనారోగ్యం పాలైనప్పుడు.. రాజ్యంలో చక్రం తిప్పి, అన్ని వ్యవస్థలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తిరిగి తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తండ్రికి తన రాజ్యాన్ని ఇవ్వకపోగా.. జైల్లో వేసిన ఘనత కొడుకుగా తనకే దక్కింది. దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఆగ్రా కోటలోని జైలులో మగ్గి, మరణించాడు షాజహాన్. ఇలా తన కుటుంబసభ్యుల పట్ల దయాదాక్షిణ్యాలు కనబరచకుండా ఇంత వివక్ష చూపిన ఈ చక్రవర్తి ఇక ప్రజల పట్ల ఇంకెంత క్రూరంగా ప్రవర్తించి ఉంటాడో ఊహించండి.
ఔరంగజేబు హయాంలో ప్రజలు నానాకష్టాలు పడ్డారు. చావు అంచులవరకు వెళ్ళినవారు ఉన్నారు. ఇదే క్రమంలో దేవాలయాలు ప్రజల నుంచి వెల్లువెత్తే తిరుగుబాటు ఆలోచనలను మరింత రేకెత్తిస్తాయని నమ్మాడు. దీంతో భారతదేశంలోని అనేక దేవాలయాలను కూల్చివేశాడు. సోమనాథ్ ఆలయం, కృష్ణజన్మభూమి ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం, విశ్వేశ్వర్ ఆలయం, గోవింద్ దేవ్ ఆలయం, విజయ్ ఆలయం, భీమాదేవి ఆలయం, మదన్ మోహన్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, ఎల్లోరా, త్రయంబకేశ్వర్.. ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 15 పెద్ద దేవాలయాలను, మరికొన్ని ఇతర ఆలయాలను ధ్వంసం చేశాడు. అంతేకాక “భవనాలు శాశ్వతంగా ఉండలేవు” అని పేర్కొంటూ, పాత ప్రార్థనా గృహాలు, దేవాలయాల పునర్నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. కొత్త దేవాలయాలు, చర్చిలు, ప్రార్థనామందిరాలు మొదలైన వాటి నిర్మాణానికి ఎక్కడ కూడా అనుమతించలేదు.
జ్యోతిష్యులను పంచాంగాలు తయారు చేయకుండా నిషేధించాడు. ఎంతసేపూ ఇలా తనకు నచ్చిన రీతిలో ఇష్టానుసారం పాలన సాగిస్తూ.. ప్రజలను ఇబ్బంది పెట్టాడు. నిజానికి, ఇస్లాం ప్రాథమిక సూత్రాలను ప్రజల్లో నాటడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ అది సాధ్యపడలేదు. ఔరంగజేబు తన పాలనలో ఇస్లామిక్ కాలిగ్రఫీని ప్రేరేపించాడు. ఆ సమయంలో నస్ఖ్ శైలిలో ఖురాన్ మాన్యుస్క్రిప్ట్‌లు ప్రాచుర్యం పొందాయి. ఔరంగజేబ్ నస్ఖ్ శైలిలో నైపుణ్యం పొందాడు. కాలిగ్రాఫర్ కూడా. ఖురాన్‌ను కంఠస్థం చేశాడు.. పైగా ఇస్లాంకి చెందిన ప్రతి ఆచారాన్ని ఆచరించాడు. తన హయాంలో ఔరంగాబాద్‌లోని బీబీ కా మక్బారా, లాహోర్‌లోని బాద్షాహి మసీదును నిర్మించాడు. ఇది భారత ఉపఖండంలోనే అతిపెద్ద మసీదు.
సోమనాథ్ ఆలయాన్ని పడగొట్టిన సమయంలో మరాఠాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు ఔరంగజేబు. అతను మరాఠా అధినేత అయిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో విభేదించాడు. శివాజీతో యుద్ధంలో పాల్గొని ఓడిపోయాడు. ఆ సమయంలో 1966లో మొగలులు అతడిని సయోధ్య కోసం ఆహ్వానించారు. అందుకు శివాజీ అంగీకరించలేదు. దీంతో ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యాన్ని నియంత్రించడానికి తొలుత గోల్కొండ, బీజాపూర్‌లను జయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయంతో 1986లో ఔరంగజేబు నేతృత్వంలోని మొగల్ సైన్యం బీజాపూర్ పాలకుడైన సికందర్ అలీషాను ఓడించి, బీజాపూర్ కోటను స్వాధీనం చేసుకుంది.
ఏడాది తర్వాత, గోల్కొండ కోటను స్వాధీనం చేసుకోవడానికి కుతుబ్ షాహీలకు వ్యతిరేకంగా భారీ మొగల్ సైన్యాన్ని నడిపించాడు. ఇదే సమయంలో ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల గనుల్లో ఒకటైన కొల్లూరు గనులు విజయానంతరం మొగలుల వద్దకు చేరాయి. అనంతర పరిస్థితులు మరాఠాలతో ఘర్షణకు దారితీశాయి.
సామంత రాజులను, మామూలు రాజులను, సాధారణ ప్రజలను ఇస్లాం మతంలోకి మారమని వేధించడంతోపాటు వేలాది హిందూ ఆలయాలను కూల్చి వేయించాడు. కూల్చిన అదే ఆలయాలపై మసీదులను నిర్మించాడు. తర్వాత ముస్లిం రాజులంతా ఇదే విధానాన్ని అనుసరించారు. అతడికి ఎదురుతిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయడం.. లేదంటే ప్రాణభయంతో బతికేలా చేసేవాడు. అడ్డూఅదుపు లేని తన మత విధానాల వల్ల తన జీవితం మొత్తం తిరుగుబాట్లు, యుద్దాలతోనే గడిచిపోయింది. దేశవ్యాప్తంగా ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు మొదలయ్యాయి.
తన ఆఖరి 27 సంవత్సరాలు దక్కన్ లో యుద్ధాలు చేస్తూ గడిపాడంటే అతిశయోక్తి కాదు. అప్పట్లో ఏటా లక్షమంది మొగల్ సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం 2.5 మిలియన్ల సైనికులు చనిపోయారు. ప్రజలు కూడా కరవు, ప్లేగు వ్యాధి కారణంగా దాదాపు రెండు మిలియన్ల మందిదాకా చనిపోయారు. ముసలితనంలో 5 లక్షల మంది సైన్యాన్ని తీసుకోని యుద్దానికి వెళ్లాల్సి వచ్చింది ఔరంగజేబు.. ఈ క్రమంలో మరాఠాలు, రాజపుత్ లు, శివాజీ, తన కొడుకు శంభాజీలు అలుపెరగని పోరాటం చేశారు. ఈ పోరాటంలో మొగల్ సామ్రాజ్యం సర్వనాశనమైంది. ఔరంగజేబు తర్వాత శివాజీ మహారాజ్ వల్ల మరాఠా సామ్రాజ్యం విస్తరించింది.
ఔరంగజేబు 1707 మార్చి 3న, అహ్మద్‌నగర్ సమీపంలో.. తన 88 ఏళ్ల వయసులో కూలిపోతున్న తన మొగల్ సామ్రాజ్యాన్ని కళ్లారా చూస్తూ.. శివాజీ సృష్టించిన మరాఠా రాజ్యం ఎగురవేసిన కాషాయపు హిందూ జెండాను చూస్తూ అలానే చనిపోయాడు. ఆయన మరణానంతరం సమాధి మహారాష్ట్రలో ఖుల్దాబాద్ గ్రామంలో ఉంది.
భారతదేశ చరిత్రహీనుడు.. నీచుడు.. అత్యంత క్రూరుడు… ధర్మాన్ని ప్రవచించిన తానే హిందూధర్మాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అతడొక పరాయి పాలకుడు. తాను నమ్మిన ఇస్లాం మతం తప్ప భూమి మీద ఏ మతం ఉండకూడదని అనుకోవడమేకాక హిందూ మతాన్ని టార్గెట్ చేశాడు. ప్రజలను తమ మతంలోకి మార్చడానికి తాను బతికున్నంతకాలం ప్రయత్నించిన మూర్ఖపు మతచాంధసవాది. హిందూమతాన్ని అడ్డుకునేందుకు పవిత్ర ప్రముఖ దేవాలయాలను కూల్చివేయించి..
ఆభరణభూషితమైన విగ్రహాలను ఆగ్రాకు తరలించి, అక్కడ నవాబ్ బేగం సాహిబ్ మసీదుకు వెళ్లే మెట్ల కింద తొక్కేందుకు వీలుగా వేయించిన దుర్మార్గుడు… జిజియా పన్నును కట్టలేక ఔరంగజేబుకు తమ బాధను విన్నవించుకుందామని వచ్చిన హిందువులను చెదరగొట్టేందుకు ఏనుగులను వారిపైకి వదిలి వందలాదిమందిని చంపించి, వారిపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పన్నుల పేరుతో మోయలేని భారం మోపాడు. ఈ పర్యవసానాలన్నిటికి బుద్ధి చెప్పేందుకు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యం ఒక ప్రళయంలా వచ్చి.. కీచక చక్రవర్తి పాలనను, అతని కథను అంతం చేసింది.