TRAVEL ATTRACTIONS

ఈ సీజన్లలో అడవి అందాలు కోసం ప్లాన్ చేయండిలా..!

వానాకాలంలో ప్రకృతి అందాలు చూడాలంటే అడవులను సందర్శించాల్సిందే. ఈ సమయంలో ప్రకృతి ఒడిలో.. చెట్ల మధ్యలో సమయాన్ని గడిపితే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. మీరు ఇలాంటి అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా అందర్బన్ అడవికి వెళ్లాల్సిందే. ఇది మహారాష్ట్రలోని పింప్రి ప్రదేశంలో ఉంది. ఇది 13 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న అడవి.. అయినప్పటికీ ఇక్కడి అందాలు చూసిన వారు మంత్రముగ్ధులు కావాల్సిందే.

ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మంచి సమయంగా ప్రయాణికులు చెబుతున్నారు. ట్రెక్కింగ్ చేయడానికి మాత్రం అక్టోబర్ నుంచి జనవరి వరకు మంచి సమయంగా చెప్పవచ్చు. ట్రెక్కింగ్ చేయడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ఇక ఈ ప్రదేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లడానికి ఏయే మార్గాలు ఉన్నాయి. ఎలా వెళ్లాలి..? టూర్ బడ్జెట్ ఎంత అనే విషయాలు మీ కోసం. 

ఎలా చేరుకోవాలి..?

రోడ్డు మార్గం:  బస్సులో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి లోనావాలా చేరుకోవాలి. లోనావాలా నుంచి అందర్బన్ అడవి దాదాపు 48 కి.మీ దూరంలో ఉంటుంది. లోనావాలా చేరుకున్న తర్వాత అందర్బన్ చేరుకోవడానికి లోకల్ బస్సులు అందుబాటులో ఉంటాయి. లేదా క్యాబ్ కూడా బుక్ చేసుకోవచ్చు.

రైలు మార్గం: వైజాగ్ నుంచి లోనావాలాకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. దీని వివరాలు IRCTCలో చెక్ చేసుకోండి. అక్కడి నుంచి బస్సు, క్యాబ్ అందర్బన్‌కు అందుబాటులో ఉంటాయి. 

విమాన మార్గం: విమానంలో చేరుకోవడానికి ముందుగా హైదరాబాద్ నుంచి ముంబై లేదా పూణే లేదా సోలాపుర్‌కు విమానంలో చేరుకుని అక్కడి నుంచి రైలులో లోనావాలా చేరుకోవాలి. అక్కడి నుంచి అందర్బన్ చేరుకోవచ్చు. 

అందర్బన్‌లో చూడాల్సిన ప్రదేశాలు..!

*టైగర్స్ లీప్

*ఆంబీ వ్యాలీ

*లోనావాలా లేక్

*కార్లా కేవ్స్

*బాజ కేవ్స్

*బూశి డ్యామ్

*అమృతాంజన్ పాయింట్

*వాల్వాన్ డ్యామ్

> టూర్ బడ్జెట్..

*మీరు ఎంచుకున్న రవాణా ప్రకారం మీ ప్రయాణ ఖర్చు ఉంటుంది. 

*రూం ధర వచ్చేసి రోజుకు దాదాపు రూ.2500 వరకు ఉంటుంది. 

*భోజన విషయానికి వస్తే రోజుకు ఒక్కొక్కరికి రూ.500 వరకు అవుతుంది.

*ట్రెక్కింగ్ కాస్ట్ రూ.1500 అవుతుంది. 

*వివిధ ఎంట్రీ టిక్కెట్లు దాదాపు రూ.2 వేల వరకు కావచ్చు.

*మీ షాపింగ్‌కి అదనపు డబ్బు తప్పనిసరి.

Show More
Back to top button