
కేరళ అంటేనే ప్రకృతికి మున్నార్ మరో పేరు. అక్కడి అందాలను వర్ణించడానికి మాటలు సరిపోవు. అలాంటి అందాల ప్రదేశంలో ఒకటైన మున్నార్ చూడాలని ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అయితే, మున్నార్‌కి ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మున్నార్‌కు వెళ్లడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆలువ రైల్వే స్టేషన్ వరకు వెళ్లి.. అక్కడ నుంచి మున్నార్‌కి వెళ్లవచ్చు. లేదా కొచ్చికి వచ్చి కూడా వెళ్లొచ్చు. ఆలువ రైల్వే స్టేషన్ నుంచి మున్నార్ దాదాపు 105 కి.మీ దూరం ఉంటుంది. అదే కొచ్చి నుంచి మున్నార్‌కు 104 కి.మీ ఉంటుంది. మీ నివాస స్థలం నుంచి కొచ్చికి విమానంలో రావచ్చు. లేదా రైలులో ఆలువ రావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ బడ్జెట్‌ని బట్టి ఎలా రావాలో నిర్ణయించుకోండి.
ఒకవేళ మీరు కొచ్చి వస్తే అక్కడి నుంచి ఆలువ రైల్వే స్టేషన్‌కి దాదాపు 150 మీటర్ల దూరంలో ఉన్న బస్‌స్టాండ్‌కి రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్‌లో ప్రయాణించి మున్నార్ వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం 4 గంటల వరకు ఉంటుంది. నివసించడానికి అక్కడ ఉన్న పల్లివాసల్ అనే గ్రామం మంచి స్థలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది మున్నార్‌కి కేవలం 4 కి.మీ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి మున్నార్‌లో తిరగడానికి టూరిస్ట్ బస్ ఎంచుకోవచ్చు లేదా స్కూటీ, కార్ లాంటివి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ సొంత కార్‌లో వెళ్తే ఇంకా బెటర్. మున్నార్‌కి వెళ్లడానికి సెప్టెంబర్ నుంచి మార్చి వరకు మంచి సమయంగా అక్కడి ప్రజలు చెబుతున్నారు.
మున్నార్‌లో చూడదగ్గ ప్రదేశాలు.
- పునర్జన ట్రెడిషనల్ విలేజ్,
- ఫొటో పాయింట్,
- మట్టు పెట్టి డ్యామ్,
- ఎకో పాయింట్ కుండల లేక్,
- టాప్ స్టేషన్,
- ఎరావికులం నేషనల్ పార్క్,
- పోతమేడు వ్యూ పాయింట్,
- అనైముడి పీక్,
- వాగువరాయి వ్యూ పాయింట్,
- లక్కం వాటర్ ఫాల్స్,
- శాండిల్ వుడ్ ఫారెస్ట్,
- చిన్నార్ వైల్డ్ లైఫ్ సెంచరీ
మొదలగు ప్రదేశాలను సందర్శించవచ్చు. ఇవన్నీ తిరగడానికి కనీసం 3 నుంచి 4 రోజుల వరకు సమయం పడుతుంది. మున్నార్‌లో ఒకరోజు భోజనం ఖర్చు ఒకరికి రూ.400-500 వరకు అవుతుంది. రూమ్ కాస్ట్ రూ.800 నుంచి రూ.1200 వరకు ఉంటుంది. ఇతర ఖర్చులు, తిరగడానికి రూ.400 నుంచి రూ.1800 అవుతాయి. ఒక రోజుకు ఒకరికి రూ.2000 నుంచి రూ.5000 వరకు ఖర్చవుతుంది. కాబట్టి మీ బడ్జెట్ ప్రకారం ట్రిప్‌ని ప్లాన్ చేసుకోండి.