FOOD

గోంగూర చికెన్, రుచికే కాదు.. ఆరోగ్యానికి కూడా మంచిదే..!

గోంగూర చికెన్ ఈ పేరు వింటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు నోరూరుతుంది. ఇది రుచికి మాత్రమే కాదు ఆరోగ్య పరమైన విషయాలకి కూడా బాగా సహాయపడుతుంది. గోంగూరలో అధిక శాతం పీచు పదార్థాలు ఉండడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఇందులో విటమిన్స్ A, B1, B9, C. కార్బోహైడ్రేట్ అధికంగా ఉండటం వలన కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.  

గోంగూరని చికెన్‌తో కర్రీ చేసుకుని తినడం వల్ల ఖనిజ లవణాలు ఎక్కువగా అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీంతో ఖనిజ లవణాలు ఎక్కువగా అందుడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరుగుతూ రక్త పోటుని తగ్గిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్న రోగాలను తగ్గించడంలో ఈ కర్రి సహాయపడుతుంది. అంతేకాదు గోంగూర రోగనిరోధకశక్తిని పెంచుతుంది. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్‌లను దరిచేరనివ్వకుండా చూస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? దీని తయారీ విధానంపై ఒక లుక్ వేద్దాం పదండి?

* గోంగూర చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ – అరకిలో, ఉల్లిపాయలు –3, గోంగూర – రెండు కట్టలు, పచ్చి మిరపకాయలు -3, అల్లం వెల్లుల్లి పేస్ట్ -2 స్పూన్లు, దాల్చిన చెక్క కొంచెం ముక్క, ధనియాలు ఒక టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, గసగసాలు ఒక టీ స్పూన్, లవంగాలు – 4, యాలకులు – 2, పసుపు – కొంచెం, కారం – సరిపడా, నూనె –సరిపడా, ఉప్పు – రుచికి తగినంత.

Show More
Back to top button