
‘ఆపరేషన్ సింధూర్’ తరువాత యావత్ ప్రపంచదేశాల చూపు ఒక్కసారిగా ఇండియా వైపు చూసేలా చేశారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తరువాత శత్రువులు సంబరాలు చేసుకునే లోపు ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో కేవలం ఉగ్రవాదులు ఉండే ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసి మట్టుబెట్టారు. అక్కడి అమాయక ప్రజలకు ఎలాంటి హానీ చేయకుండా ఈ ఆపరేషన్ పూర్తి చేసిన తీరును చూసి కేవలం మూడు దేశాలు మినహా మిగిలిన అన్నీ దేశాలు స్వాగతించాయి.
ఆపరేషన్ సింధూర్ కి పూర్తి మద్ధతు తెలిపాయి. ఉగ్రవాదులకు ఇలాగే దీటుగా సమాధానం చెప్పాలని ముక్తకంఠంతో నినదించాయి. మోదీ యుద్ధ వ్యూహాలను చూసి ప్రపంచ మిలటరీ అధినేతలు కూడా నివ్వేరపోయారు. ప్రధాని అంటే ఇలాగే ఉండాలి. తమ దేశ పౌరుల జోలికి వస్తే శత్రువులు ఎంత దూరంలో ఉన్న.. టార్గెట్ ఎన్ని కిలోమీటర్లో ఉన్నా.. గురి తప్పకుండా వాళ్ల గుండెలను చీల్చి తమ దేశ పౌరుల చావుకు కారణం అయిన వారిపై ప్రతీకారం తీర్చుకున్న తీరును వారు ప్రశంసించారు.
ప్రధాని యుద్ద వ్యూహంతో పాక్ కు చుక్కలు
నరేంద్ర మోదీ ప్రధానిగా అధికారం చేపట్టాక దేశ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశ సరిహద్దుల్లో ముఖ్యంగా అటు పాకిస్థాన్ ఇటు చైనా ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా దీటుగా సమాధానం చెప్తున్నారు అనడానికి ఉదాహరణలు సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్. యూరీ ఘటన తరువాత ప్రపంచ దేశాలు ప్రధాని మోడీ ఏం నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠగా ఎదురు చూశారు. మన దేశ ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీటన్నింటికి ప్రధాని మోడీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెక్ పెట్టారు. ఎవరు ఊహించని విధంగా ఓకే రాత్రిలో సర్జికల్ స్ట్రైక్ చేసి తొమ్మిది ఉగ్రస్థావరాలను నాశనం చేశారు. ఆ తరువాత పహల్గామ్ దాడికి ప్రతీకారంగా వెంటనే ఆపరేషన్ సింధూర్ ప్రకటించి మెరుపు దాడి చేయించారు.
పాకిస్థాన్ సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కిక్కురమనలేదు. పైగా అది అంతా అబద్దం అని ప్రకటించుకుంది. ఇంకా ఏం చేయలేక తోక ముడుచుకుంది. అయితే ఈసారి ఆపరేషన్ సిందూర్ తరువాత చైనా అండ చూసుకుని రెచ్చిపోవాలనుకుంది. ఈసారి కూడా దాని పప్పులు ఉడకలేదు. వాళ్లు ప్రయోగిస్తున్న మిస్సైల్స్ ని మన ఆర్మీ గడ్డిపూచ లాగా తీసిపారేసింది. మన దగ్గర ఉన్న అడ్వాన్స్‌డ్ క్షిపణులు, జెట్ విమానాలు, రఫెల్ యుద్ద విమానాలతో పాటు రష్యా నుంచి కొనుగోలు చేసిన అత్యాధునిక ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధాటికి పాక్ కుయ్యో మోర్రో అంటూ మోత్తుకుంది. ఇంకోసారి పాక్ కవ్వింపు చర్యలకు, ఉగ్రదాడులకు పాల్పడితే ఇలాగే చావు దెబ్బకొట్టాం.
మన జోలికి వస్తే ఇదే సమాధానం
మోదీ హయాంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్ ని పాక్ కేవలం ప్రతీకార చర్యగానే చూస్తుంది. అయితే మోదీ మాత్రం ఇటు పాకిస్థాన్ కు అటు చైనాతో పాటు ఇతర ప్రపంచ దేశాలకు గట్టి సందేశమే ఇచ్చారు. మా దేశం జోలికి వస్తే మేము ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వెంటనే గట్టిగా బుద్ది చెబుతాం అని హెచ్చరించినట్లు అయ్యింది. భారత త్రివిధ దళాలు ఎంత బలంగా ఉన్నాయో ఈ ఆపరేషన్ సిందూర్ తో ప్రపంచ దేశాలు ఒక అంచనాకు వచ్చినట్లు చేశారు. మనతో యుద్దం చేస్తే శత్రు దేశాలకు ఎంత ప్రమాదమో తెలిసేలా చేశారు.
శత్రువుల మిస్సైల్స్ మన దేశ సరిహద్దులోకి రాక ముందే తునా తునకలు చేయగల అడ్వాన్స్‌డ్ క్షిపణులు ఉన్నాయని తేటతెల్లం చేశారు. యుద్దం వస్తే మన దేశ సైనికులు ఎలా పని చేస్తారో.. మన ఆయుధ సంపత్తి ఎంత ఉందో అవి ఎంత కచ్చిత్వంతో పని చేస్తాయో యావత్ ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఒకవేళ ఏ దేశంతో అయిన యుద్ధం చేయాల్సి వస్తే మనం ఎంత సన్నద్దంగా ఉన్నామో ఈ ఆపరేషన్ సింధూర్ దాడితో ప్రపంచ దేశాలు ఒక అంచనాకు వచ్చేలా చేశారు మన ప్రధాని నరేంద్ర మోదీ. ఇవన్నీ చూశాక మన శత్రు దేశాలు మన దేశ పౌరుల జోలికి రావాలంటే గజ్జున వణికేలా చేశారు.










