Telugu Politics

ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జులై 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తాజాగా అమరావతిలో సీఎం నారా చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఎన్నికల ముందు గత వైకాపా ప్రభుత్వం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ఈ నెల 31 వరకు ఉంటుంది.

ముఖ్యంగా ఈ సమావేశంలో ఓటు ఆన్ అకౌంట్ పెట్టాలా? లేకుంటే ఆర్డినెస్స్ పెట్టాలా.. అనే అంశంపై కూడా ఈ భేటీలో కీలక చర్చ జరిగింది. అలాగే జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మూడు రోజుల పాటు ఈ అంసెబ్లీ సమావేశాలు జరగబోతున్నట్లు సమాచారం. గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

ఇక శ్వేత పత్రాల ప్రస్తావనను సైతం అసెంబ్లీలో తీసుకురావాలని కేబినెట్‌లో చర్చ జరిగినట్లు కనిపిస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు రాష్ట్రప్రభుత్వం కొత్త ఇసుక విధానానికి సైతం పచ్చ జెండా ఊపింది. అయితే కొత్త ఇసుక పాలసీపై విధి విధానాలను సాధ్యమైంత త్వరలో రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అదే విధంగా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి సైతం మంత్రి వర్గం ఆమోదించినట్లు సమాచారం. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కూడా కేబినెట్ ఆమోదించారు. ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏయే పథకాలను ఎప్పుడెప్పుడు, ఎలా అమలుచేయాలనే అంశాలపై కసరత్తు చేస్తోంది. కాగా, సెప్టెంబరు నాటికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం సిద్ధం చేయనుంది.

Show More
Back to top button