FOOD

పొన్నగంటి ఆకుకూర ప్రయోజనాలు తెలిస్తే.. షాక్ అవాల్సిందే..!

ఆకుకూరలు ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి వాటిని మనం రోజూ తీసుకుంటే.. అనేక ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను దరిచేరనీయకుండా చేస్తాయి. అందుకే డాక్టర్లు ప్రతిరోజు ఆకు కూర కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా పొన్నగంటి ఆకుని కూర చేసుకుని తినడం వల్ల B6,C,A విటమిన్లతోపాటు రైబోఫ్లవిన్, ఫొలేట్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా అందుతాయి.

అంతేకాదు, ఇది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెంచడంతోపాటు గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సాహాన్ని ఇస్తుంది. బ్రాంకైటిస్, ఆస్తమాలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు పొన్నగంటి రసంలో తేనెను కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి. ఎముకల ఎదుగుదలకు ఇందులో లభించే కాల్షియం ఎంతో సహాయపడుతోంది. అలాగే ఆస్టియోపోరోసిస్ సమస్య ఉన్న వాళ్లకి పొన్నగంటి కూర దూరం చేస్తుంది. అంతేకాదు అండోయ్.. బరువును నియంత్రించడంతోపాటు క్యాన్సర్ కారకాలను కూడా నయం చేస్తుంది.

వీటితోపాటు లైంగిక సామర్థ్యలోపం ఉన్న పురుషులు ఈ కూర రోజు తీంటే.. కావల్సిన శక్తి సమకూరుతుంది. ఈ కూర వల్ల వారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. జీవక్రియలోని ఉండే లోపాలను కూడా సరిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలికంగా వేధించే దగ్గు తగ్గుతాయి. నరాల్లో నొప్పికి, వెన్ను నొప్పి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

Show More
Back to top button