ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యం పేరుతో చాలా ఖర్చు చేస్తున్నారు, ఒక వయసు వచ్చాక కాని ఆరోగ్యం పై దృష్తి పెట్టలేకపోతున్నారు. నేను ఏమంటానంటే, విచ్చలవిడి గా తిని ఒళ్ళు పెంచుకుని అస్పతురుల చుట్టూ ఆ ఒళ్ళు కరిగించుకోవడానికి తిరిగే బదులు మనం ముందే ఒక ప్లాన్ తో ఉంటె మంచిదని నా అభిప్రాయం.
*ఎలా కంట్రోల్ చేసుకోవాలి*?
అవును నిజమే ఆహారాన్ని తినకుండా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం, ఎందుకంటే పిజ్జాలు, బర్గర్లు , బయట నాన్, పాని పూరి, వేడి వేడి బజ్జీలు రారామ్మని పిలుస్తూ ఉంటాయి. అవి అంతగా పిలిచినప్పుడు మనం వెళ్ళాక పోతే బాగుండదు అనే ఉద్దేశ్యం తో వెళ్ళి కడుపారా అవన్నీ ఆరగిస్తాం, తర్వాత ఓ రాత్రి కడుపులో మంట మొదలై ఈనో నో లేదా కూల్ డ్రింక్స్ తో ఉపశమనం పొందాలని అనుకుంటాం.
అలాగే చేస్తాం కూడా , అయితే ఇవన్ని తినడం, తాగడం వల్లనే మన ఆరోగ్యాలు పాడవుతాయి, అలాగే స్థూలకాయం కూడా వస్తుంది, కాబట్టి ఏదైనా లిమిట్ గా తింటే మన శరీరాన్ని మనం అదుపులో ఉంచుకోగాలిగితే మనకు ఎలాంటి రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు,
నలుగురు స్నేహితులు కలవగానే ఎదో అకేషన్ తో పార్టీలు చేసుకోవడం కద్దు, అలాంటి పార్టీ లో మనకు తెలియకుండానే మనం చాలా తినేస్తాం, అయితే ఎంత తిన్నా మనకు ఎం కాకూడదు అంటే ఏమి చేయాలో మనమిప్పుడు తెలుసుకుందాం.
ఎంత తిన్నా మీరు స్లిమ్ గా ఉండాలి అంటే అంటూ నేనేం అన్ని సలాడ్స్ తినండి, లేదా జిమ్ కు వెళ్ళండి అంటూ చెప్పను, కాకపోతే కాస్త ఆయిల్ పుడ్స్ తగ్గించి, నాలుగు మిర్చిలు తినే దగ్గర రెండు, నాలుగు పురిలు తినే దగ్గర ఒక్క పూరి తో సరిపెట్టుకోవాలి, ఇక అసలు విషయానికి వస్తే పొద్దున్న లేవగానే బ్రెష్ చేసిన తర్వాత ఒక చెంబుడు లేదా గ్లాస్ తో రెండు గ్లాస్ లా గోరువెచ్చటి నీళ్ళు తాగండి, తర్వాత నడుస్తూ ఒక గంట వాకింగ్ తర్వాత మీకు నచ్చిన టిఫిన్ ఆయిల్ కాకుండా ఇడ్లీ,ఉప్మా ,ఒకవేళ తప్పదు అనిపిస్తే పూరి,బొండా లాంటివి రెండుకన్నా ఎక్కువ కాకుండా తీసుకోండి, ఒక ముఖ్య విషయం ఏమిటంటే అల్పహరాలు అంటే టిఫిన్ చేయకుండా అస్సలు ఉండకూడదు, కాబట్టి ఆయిల్ పుడ్ స్థానం లో రాగిజావ కాని ,లేదా ఓట్స్ కాని తినండి,తర్వాత లంచ్ లో కడుపునిండా లంచ్ చేయండి, లంచ్ అయ్యాక కాసేపు నడక, తర్వాత డిన్నర్ లో చాలా లైట్ గా పుల్కా కాని లేదా చపాతీ కాని తక్కువ క్వాంటిటీ గా తీసుకోవాలి.
అయితే ఇవన్ని చేయడానికి మొదట్లో కాస్త కష్టంగా అనిపిస్తాయి, ఒక్కోసారి కొందరి శరీరానికి ఇలాంటివి పడకపోవచ్చు. కాబట్టి ముందుగా మీకు మీరుగా ఒక రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత నేను చెప్పినట్టు చేయండి. ముందుగా అలవాటు కావడానికి కొంత సమయం పట్టొచ్చు, కాని ఒక్కసారి అలవాటు అయితే మీరు , మీ శరీరంలో వచ్చే మార్పును చూస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే గోరు వెచ్చని నీరు పొద్దున్నే కాకుండా రాత్రి నిధ్రించే ఒక అద్దగంట ముందు తాగినట్లయితే మీలో ఉన్న కొవ్వు కరగడానికి తోడ్పడుతుంది.
ఆరోగ్యమే మహా భాగ్యం కాబట్టి స్థూల కాయులు, లేదా ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ద తీసుకునే వారు ఇవన్ని తప్పక పాటించి చూడండి, తేడా మీకే అర్ధం అవుతుంది. కాబట్టి ఆరోగ్యమే మహా భాగ్యం అని తెల్సుకున్న వారు ఇవన్ని పాటిస్తే మీ ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదని నేను హామీ ఇస్తున్నాను.ఇవన్నిటికీ మీరు పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి లైఫో సెక్షన్ లాంటివి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో మీ ఆరోగ్యాన్ని మీరే మీ చేతులతో కాపాడుకోవచ్చు,ఎవరో డాక్టర్ల చేతిలో పెట్టి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఎంతకైనా లేదు. మరి ఇంతగా చెప్తున్నా ఇంకా ఎదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీకు అనిపిస్తుంది కదా, అవును ఆరోగ్యాన్ని, లేదా బరువు తగ్గాలి అనుకునే వారికీ ఎన్నో రకాల వైద్యాలు, చిట్కాలు మనింట్లోనే ఉన్నాయి కాకపోతే అవెలా వాడాలి, ఎలా తినాలి, ఎంత మోతాదులో తినాలి అనేవి చాలా వరకు తెలియని విషయాలే అలాగే ఏవి ఎంత మోతాదులో తీసుకోవాలి అనే సందిగ్ధత చాలా మందిలో కలుగుతుంది కాబట్టి అవన్నీ ఎలా వాడాలి? ఇంట్లో ఉన్న ఆ రహస్యాలు ఏమిటి? అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం…
1.అవిసెలు: ఇవి రోజూ పొద్దున్నే ఒక స్పూన్ తినాలి.లేదా తినలేక పోతే పొడిలా చేసుకుని అన్నంతో తినొచ్చు.
2.కొర్రలు; ఇవి కూడా అన్నంలా ఉడికించి తింటే కొవ్వు కరుగుతుంది.
3.రాగులు: రాగి సంగటి లా కాకుండా రాగి జావా పులిసిన మజ్జిగతో తాగాలి. రోజంతా తాగినా నష్టం లేదు.నీటికి బదులు ఇదే తాగొచ్చు.
4.జొన్నలు: జొన్న రొట్టెలు ఇవి అందరికీ తెలుసు,రాత్రుళ్ళు కొన్నరొట్టే తినడం వల్ల కొవ్వు కరుగుతుంది.
5. సజ్జలు; ఇవి కూడా పిండి చేసుకుని రొట్టె చేసుకుని తినొచ్చు.
ఇంకొక మార్గం ఉంది. వీటన్నిటితో పాటు గోధుమలు కూడా దగ్గర ఉండి మరాడించి,చపాతీలా చేసుకుని తింటే స్థూల కాయం కొన్ని రోజుల్లోనే తగ్గుతుంది.ఇవి తినడానికి, నింద్రించడానికి ముందు ఖచ్చితంగా గోరు వెచ్చని నీరు తాగడం తప్పని సరి.
ఇవన్నీ పాటించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ