తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.అసలు తెలంగాణ ఇవ్వడానికి,రావడానికి ప్రధాన కారణమైన సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్9 .ఈ కాంగ్రెస్ విజయాన్ని సోనియాకు అంకితం అంటూ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా,ఇంతకీ సోనియాగాంధీ అంటే ఎవరు?కేవలం రాజీవ్ గాంధీ భార్యగా కాకుండా ఆమెకున్న ప్రత్యేకతలు ఏమిటి?అసలు రాజీవ్ గాంధీ అమెనేందుకు పెళ్ళి చేస్సుకున్నాడు? ఆమెకు ఉన్న ఆస్తులు ఏమిటో అనేది మనం తెలుసుకుందాం పదండి…
**బాల్యం**
బాల్యంలో ఆమెకు ఫుట్‌బాల్ ఆటపట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. తన ఇంటి చుట్టు పక్కల పిల్లలతో కలిసి ఫుట్‌బాల్ ఆడేవారు. పెళ్లి కాకముందు ఆమె వెల్లింగ్‌టన్ క్రిసెంట్ హౌజ్‌లోని బచ్చన్స్‌తో కలిసి నివసించేవారు. జనవరి 26, 1968 లో రాజీవ్ గాంధీ మరియు సోనియాల నిశ్చితార్థ జరిగింది. అదే ఏడాది ఫిబ్రవరి 25 వసంత పంచమి రోజున ఈ జంటకు వివాహాం జరిగింది. దశాబ్ధాల క్రితం రాజీవ్ గాంధీ తల్లిదండ్రులయిన ఇంధిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీల వివాహం కూడా ఇదే రోజున జరగడం విశేషం. పెళ్లికి ఒక రోజు ముందు ఏర్పాటు చేసే మెహందీ కార్యక్రమం బచ్‌జన్స్ ఇంటిలో జరిగింది. వివాహం కాక ముందు ఆమె ఫ్రెంచ్ భాషలో అనర్గళంగా మాట్లాడేవారు. పెళ్లి తర్వాత ట్యూటర్ సాయంతో మరియు ఇనిస్టిట్యూట్‌లో చేరి హిందీ నేర్చుకున్నారు. రాజీవ్ మరియు రాజీవ్ ప్రపంచం పేరిట ఆమె రెండు పుస్తకాలను రాశారు. 1922 నుంచి 1964 మధ్య పండిట్ జవహర్ లాల్ నెహ్రు మరియు ఇంధిరా గాంధీల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను “ఫ్రీడమ్స్ ఆఫ్ డాటర్” మరియు “టూ ఎలోన్, టూ టుగెదర్” పేరిట రెండు వాల్యూంలుగా అనువదించారు.
పర్యావరణం, మహిళలు మరియు పిల్లల సాధికారత, సంక్షేమం వంటి విషయాల పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువ. ఇవేగాక దేశంలో సమకాలీన అంశాలు, దేశ సంసృతి మరియు గిరిజన కళలు, దేశ చేతి వృత్తులు, చేనేత కళలను అధ్యయనం చేయడం మరియు సాంప్రదాయ సంగీతంతో పాటు జానపద సంగీతం పట్ల కూడా ఆమెకు ఆసక్తి ఎక్కువ. ఆయిల్ పెయింటింగ్స్‌కు సంబంధించి న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నుంచి ఆమె డిప్లొమా కూడా పొందారు. రాజకీయ కాలక్రమం (పొలిటికల్ టైమ్ లైన్) 2014 2014 లోక్‌సభ ఎన్నికలలో, రాయ్‌బరేలీ నుంచి నాలుగో సారి నెగ్గి పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. 2009 2009 లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌బరేలీ నుంచి ఆమె మూడోసారి ఎన్నికయ్యారు. 2006 ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి మరోమారు ఎన్నికయ్యారు. 2004 2004 సాధారణ ఎన్నికల్లో ఆమె రాయ్‌బరేలీ నుంచి గెలిచారు. మే 16, 2004 లో 15 పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) ప్రభుత్వ నాయకురాలిగా ఎన్నుకోబడ్డారు. 1999 13 వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1999 ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ మరియు రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన ఆమె రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. 1998 కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు. 1997 భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.
. 2004 నుంచి 2014 మధ్య దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా వివిధ పత్రికల చేత గుర్తింపు పొందారు. 2. 2013 లో ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో 21 వ స్థానాన్ని, మహిళా నాయకుల్లో 9 వ స్థానాన్ని సాధించారు. 3. 2007 లో అదే పత్రిక రూపొందించిన ప్రపంచ శక్తివంతమైన నాయకుల్లో 6 వ స్థానాన్ని, మహిళల్లో 3 వ స్థానాన్ని సాధించారు. 4. 2010 లో ఫోర్బ్స్ వారి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుల జాబితాలో 9 వ స్థానాన్ని శ్రీమతి గాంధీ అందుకున్నారు. 2012 అదే సంస్థ రూపొందించిన శక్తిమంతుల జాబితాలో 12 వ ర్యాంకుని కైవసం చేసుకున్నారు. 5. 2007 మరియు 2008 సంవత్సరాలలో టైమ్ రూపొందించిన అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా శ్రీమతి సోనియా గాంధీ నిలిచారు. 2010 లో న్యూస్టేట్స్‌మన్ వారు చేపట్టిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తుల్లో సోనియా గాంధీ 29 వ స్థానంలో నిలిచారు. 6. 2008 లో మద్రాసు విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. 7. బ్రస్సెల్స్ విశ్వవిద్యాలయం 2006 లో ఆమెకు గౌరవ డాక్టరేట్ పట్టాను అందజేసింది. 8. 2006 లో బెల్జియం ప్రభుత్వం ఆమెకు ఆర్డర్ ఆఫ్ కింగ్ లియోఫోల్డ్ ను ప్రధానం చేసింది.
**పెళ్ళి తర్వాత జీవితం**
సోనియా గాంధీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు. ఆమె యునైటెడ్ ప్రొగ్రెసివ్ కూటమి ప్రభుత్వంలో సంకీర్ణ పార్టీల సమన్వయ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. శ్రీమతి గాంధీ డిసెంబరు 9, 1946 లో జన్మించారు. పాఠశాల చదువు పూర్తయిన తర్వాత ఇంగ్లీషు, రష్యా మరియు ఫ్రెంచ్ భాషలు నేర్చుకోవడం కోసం ఆమె విదేశీ భాషలు నేర్పించే స్కూలులో చేరారు. కేంబ్రిడ్జ్‌లో ఇంగ్లీషు భాషా కోర్సు చదువుతున్న సమయంలోనే రాజీవ్ గాంధీతో ఆమెకు పరిచయమేర్పడింది. అనంతరం 1968 లో న్యూఢిల్లీలో వారు పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఒక కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక మరియు మనవడు, మనవరాలు ఉన్నారు. శ్రీమతి గాంధీ తన వైవాహిక జీవితంలో ఎక్కువ భాగం ఒక మామూలు వ్యక్తిగా తన కుటుంబానికే సమయం కేటాయించారు. తన అత్తగారైన ఇందిరాగాంధీ గారి అధికారిక విధులలోనూ ఆమె చేదోడువాదోడుగా ఉన్నారు.
తన భర్త రాజీవ్ గాంధీ 1984 నుంచి 1991 మధ్య ప్రధానమంత్రి మరియు విపక్షనేతగా ఉన్న సమయంలో కొంతకాలం ఆమె ప్రజా సేవ చేశారు. తన భర్త దేశ, విదేశీ పర్యటనలలో ఆయన వెన్నంటే ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని తన భర్త నియోజకవర్గం అమేథీలో ఆరోగ్య సంరక్షణ క్యాంపులు ఏర్పాటు చేయడం మరియు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టారు.
1991 మేలో తన భర్త హత్యకు గురయిన తర్వాత ఆయన స్మారకార్థం రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి అనుబంధంగా మేధోపరమైన మరో సంస్థ రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంటెంపరరీ స్టడీస్‌ను ఆమే ఏర్పాటు చేశారు. ఈ సంస్థల ఛైర్‌పర్సన్‌గా తన భర్త ఆశయాలను కొనసాగించే కార్యక్రమాలను ఆమె చేపట్టారు. ఇవేగాక మరెన్నో స్వచ్ఛంధ సంస్ధలను ముందుండి నడిపించారు.
1998 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోని నాయకుల డిమాండ్ల మేరకు ఆమె ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. పార్టీ ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్న ఆమె 1998 ఏప్రిల్‌లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు.
శ్రీమతి గాంధీ తొలిసారిగా 1999 ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార కార్యక్రమాలను ఆమె తలకెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లను గెలుచుకుంది. ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో ఆమె రాయ్‌బరేలీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
ఎన్నికల అనంతరం పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని పదవి కూడా చేపడతారన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే ఆమె ఆ పదవికి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ప్రతిపాదించి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నడిపించాల్సిందిగా కోరారు. యూపీఏ ఛైర్‌పర్సన్ గానే గాక పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఆమె వ్యవహరించారు.
*ప్రస్తుతం**
సామాజిక-ఆర్థిక ప్రాధాన్యతలతో ప్రభుత్వానికి వివిధ సూచనలు సలహాలు అందించే జాతీయ సలహా కమిటీ(ఎన్ఏసీ) ఛైర్‌పర్సన్‌గానూ మే 2006 వరకు ఆమె వ్యవహరించారు. ఆమె నేతృత్వంలోని జాతీయ సలహా కమిటీ అందించిన సూచనల మేరకే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, మధ్యాహ్న భోజన పథకం, జవహర్ లాల్ నెహ్రు పట్టణ రూపాంతరీకరణ మిషన్ మరియు జాతీయ పునరావాస విధానం వంటీ ఎన్నో కీలక పథకాలు అమల్లోకి వచ్చాయి.
*చివరగా*
ప్రస్తుతం సోనియాగాంధీ వయోభారంతో తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ,అప్పుడప్పుడు రాజకీయంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ,విశ్రాంతిలో ఉన్నారు.
*మరికొన్నివిశేషాలు*
పూర్తి పేరు సోనియా గాంధీ పుట్టిన తేదీ 09 Dec 1946 (వయస్సు 77)
పుట్టిన ప్రాంతం విసెంజా, ఇటలీ
పార్టీ పేరు Indian National Congress
విద్య :అన్ని భాషల్లో ఆరితేరిన సోనియా చదివింది ప్లస్ టూ మాత్రమే , వృత్తి రాజకీయ నాయకురాలు
తండ్రి పేరు స్టెఫానో మైనో , తల్లి పేరు పావొలా మైనో
జీవిత భాగస్వామి పేరు దివంగత శ్రీ రాజీవ్ గాంధీ, జీవిత భాగస్వామి వృత్తి మాజీ ప్రధాన మంత్రి
సంతానం 1 కుమారులు 1 కుమార్తెలు
Religion : హిందూ