అనుముల రేవంత్ రెడ్డి అనే నేను. అంటూ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొని, ఎంతో కృషి పట్టుదలతో శ్రమించి,అవరోదాలను ఎదుర్కొంటూ తనకు ఒక అవకాశం వస్తుందనే ఆశతో ఎదురుచూసిన క్షణాలు ఈ రోజుకు నిజమయ్యాయి.ఈ విజయాన్ని సోనియమ్మకు జన్మదిన సందర్భంగా కానుకగా ఇస్తున్నానని వారు తెలిపారు.
ఏ రోజు రేవంత్ రెడ్డి గారు అధైర్య పడకుండా తానపై వచ్చిన ఆరోపణలు అన్ని ఎదుర్కొంటూ, కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపుతూ వచ్చారు.*మనిషి జీవితంలో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు** కాని దానికి ఓపిక,సహనం,సమయం,సందర్భం ముఖ్యమే** అని ఓపికగా ఉంటూ యువతకు సందేశం తన నడవడిక ద్వారా నిరూపించారు.
ఎవరెన్ని విధాల తనను ఏమార్చాలని చూసినా, జైలుకు పంపినా ఎదుర్కొని నిలబడి,తప్పు చేయని వారు దేనికి భయపడరు,స్పందించరు అంటూ చేతల్లో చేసి చూపించిన రేవంత్ రెడ్డి గారు యువతకు ఎంతో స్ఫూర్తి దాయకం అయ్యారు.
ఈ రోజు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామని చెప్పారు.అలాగే తన ప్రసంగంలో అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని,నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.ఇన్నాళ్ళు ఉన్న కంచు కోటను తొలగించి ప్రజల్లో ఉన్న నిరాశను తొలగించారు.
ఈ రోజు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ లపై తొలి సంతకం చేసిన ఆయన,తన దగ్గరికి వచ్చి ఉద్యోగం అడిగిన దివ్యంగురాలు రజనీ కి ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చి తన ప్రమాణ స్వీకారం అనంతరం తను ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆమెకు నియామక పత్రాన్ని అందచేశారు.
తదుపరి కృతజ్ఞత సభలో మాట్లాడుతూ ఇన్నేళ్ళ రాక్షస పీడ వదిలిందని, ప్రజలకు రెక్కలు వచ్చి,స్వేచ్చా విహంగాల గాలి పిల్చుకోవచ్చు అని, ఇక మీదట ప్రగతి భవన్ కాదని, ప్రజా దర్భార్ అని పేరు పెడుతూ,రేపటి నుండే ప్రజా దర్భార్ మొదలౌతుంది ,గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి,మీ కోసం ఎల్లవేళలా పని చేసే సేవకుడిని అంటూ తెలిపారు.సోనియమ్మా ఇచిన తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని,ప్రజలు స్వేచ్చగా తమ హక్కుల్ని అనుభవించాలని కోరారు.
రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకరానికి సోనియాగాంధీ,రాహుల్,ప్రియాంక,థాక్రే,ఖర్గే, కర్ణాటక సిఏం సిద్దరామయ్య లాంటి ప్రముఖులు వచ్చి ఆశీర్వదించారు.తర్వాత సచివాలయంలో పొలిసు గౌరవ వందనం స్వీకరించి,సచివాలయంలోని ఆరో అంతస్తులో తన ఛాంబర్ లో వేద పండితుల ఆశీర్వచనాలతో ముఖ్యమత్రిగా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ లో నూతన ప్రభుత్వం ఏర్పాటు అయినందుకు రేవంత్ రెడ్డి గారిని పలువురు ప్రముఖులతో పాటూ ప్రధాని మోడీ కూడా అభినందిస్తూ, ప్రజల సంక్షేమం కోసం తమ సహాయసహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.పవన్ కళ్యాణ్, చిరంజీవి, హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.
తన అధిష్టానంలో మహిళలకు మంత్రి పదవులు ఇచ్చి,వారికి తగిన శాఖలు అందించి తానూ మహిళా అభివృద్దికి ఇంత విలువ ఇస్తారో చేతల్లోనే చూపారు. ఇక మామూలు మహిళలకు ఎల్లుండి అంటే డిసెంబర్ 9 అనగా సోనియా గాంధీ పుట్టిన రోజున బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించబోతున్నారు. ఇక మీదట కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణలో మహిళలకు పెద్దపీట వేయబోతున్నారని చెప్పకనే చెప్పారు.
ఈ రోజు తానూ సాధించిన ఈ విజయాన్ని ప్రజలకు,అమర వీరులకు అంకితం చేశారు.ప్రమాణ స్వీకార సమయంలో కూడా వారు మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనించదగిన విషయం.
ఇక ముందు కూడా వారి పాలనలో ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని,ఉంటారని,ఉండాలని మహిళలకు ఎలాంటి కష్టనష్టాలు రాకుండా చూసుకుంటారు అనే అభిప్రాయాన్ని కలిగించిన రేవంత్ రెడ్డి గారికి మనః పూర్వక అభినందనలు.