HISTORY CULTURE AND LITERATURETelugu Special Stories

అలంపూర్ జోగులాంబ దేవాలయం విశేషాలు

**అలంపూర్ జోగులాంబ దేవాలయం గురించి తెలుసుకుందామా..**

ఆలంపూర్, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ మండలానికి చెందిన గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఇది సమీప పట్టణమైన కర్నూలు నుండి 25 కి. మీ. దూరంలో ఉంది.

జోగుళాంబ దేవాలయం ఆలంపూర్ లో నవబ్రహ్మ ఆలయంతో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబదేవాలయం కూడా ఉంది. హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని ప్రాంతాలను ‘శక్తి పీఠాలు’ అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతారు. కొంత మంది 18 అనీ, 51 అనీ, మరి కొందరైతే 52 అనీ, 108 అనీ ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరెన్ని చెప్పిన 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారన్నది సత్యం.

Alampur Jogulamba Temple Gadwal - History

సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. వాటిలో ఒకటి తెలంగాణలో ప్రసిద్ది చెందినది. ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ -కర్నూల్ నుండి 27కిలోమీటర్ల దూరంలో తుంగ, భద్ర నదులు తుంగభద్రా నదిగా కలిసే ప్రదేశంలో ఉంది. జోగులాంబ దేవాలయం చాలా ప్రాచీన ఆలయం. సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ.

జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయదిశగానెలకొని ఉన్నది. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం ఉంది. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం.

జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు.

అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. బాలబ్రహ్మేశ్వర స్వామి ప్రధాన దైవంగా నవబ్రహ్మాలయాలు నెలకొన్ని ఉన్న పుణ్యక్షేత్రం ఆలంపురం, శిల్పరిత్యా, చరిత్ర రీత్యా పౌరాణిక రిత్యా కూడా ఇది ఒక పవిత్ర క్షేత్రం. ఉత్తర వాహినియై ప్రవహిస్తున్న తుంగభద్రా తీరంలో వెలసిన ఈ క్షేత్రానికి మరొక ప్రశస్తి ఉంది. భారత దేశంలో అత్యంత పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమే ఆలంపురం.

జోగుళాంబాదేవిగా కొలువై ఉన్న అమ్మవారి పేరుతో కూడా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది. పరమేశ్వరుడుని భార్య సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో ఖండించిప్పుడు మన పవిత్ర భారత భూమిపై ఆ శరీరం నుందు పద్దెనిమిది ఖండములు పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి. ప్రసిద్దమైన ఈ శక్తిపీఠాలు మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్నట్లు పురాణ ఆధారాలను బట్టి తెలుస్తున్నది. దేశంలోని అపూర్వశక్తి సంపన్నమైన శక్తి పీఠాలలో ఇది ఒకటి అన్న విషయం తెలిసిందే.

జోగుళాంబా అమ్మవారి ఆలయం అతి ప్రాచీనమైనది. క్రీ.శ 7వ శతాబ్దంలో ఈ ప్రాచీనాలయం నిర్మించారని చారిత్రకుల భావన. 9వ శాతాబ్దంలో శ్రీ శంకర బాగవత్సదుల వారు శ్రీ చక్ర ప్రతిష్ట చేసినట్టు తెలుస్తున్నది. 14వ శతాబ్దంలో జరిగిన ముస్లిం దండయాత్రల కాలంలో ఈ ప్రాచీన ఆలయం ధ్వంసం అవ్వడం చేత అమ్మవారి మూల మూర్తిని బ్రహ్మేశ్వ రాలయంలోని ఒక మూలలో ప్రతిష్టించి పూజలు జరిపించారు.అలాగే ఇంకా ఇతర ఆలయాలు ధ్వంసం కాకుండా విజయనగర చక్రవర్తి రెండో హరిహరరాయల కుమారుడు మొదటి దేవరాయలు తన తండ్రి ఆజ్ఞ పాటించి ఆ ముస్లిం సైన్యాన్ని చెదరగొట్టి దేవాలయాల్ని రక్షించాడు. ఇటీవలె తిరిగి ఆ స్థలంలోని ప్రాచీన ఆలయ వాస్తు రీతిలో నూతన దేవాలయం నిర్మించి తిరిగి అమ్మవారి ప్రతిష్ఠ  జరిపించడం విశేషం.

ఈ నూతన ఆలయం పైకప్పుపై పద్మం, నాగంవంటివి మిగతా ఇక్కడి ఆలయాల్లో ఉన్నట్టే చెక్కడానికి ప్రధాన కారణం నాగం కుండలినీ శక్తికి, పద్మం సహస్రారానికి సంకేతాలు కావడమేనని పెద్దల అభిప్రాయం. ఆలయ స్తంభాలపై అష్టాదశ, శక్తిపీఠాలలో కొలువైన అమ్మవార్ల శిల్పాలు కూడా చెక్కి ఈ శక్తి పీఠ ప్రాశస్త్యాన్ని మరింత శక్తివంతం చేశారు.

జోగులాబ దేవాలయం ఎంతో ప్రాముఖ్యం కలిగినది.ఇక్కడికి ఎక్కడెక్కడి నుండో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు . ఈ అమ్మలగన్న అమ్మ  రాత్రుళ్ళు దేవాలయంలో ఉగ్రరూపంలో సంచరిస్తూ ఉంటారని ప్రతీతి. ఇక్కడ తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుంది.ఈ తుంగభద్ర నది పై వంతెన కట్టారు.కిందికి దిగి చూడలేని వారు పైన ఉన్న మెట్ల మార్గం గుండా వెళ్ళి నది ప్రవాహాన్ని చూడవచ్చు. మనకు నీరు కావాలంటే బాటిల్ ఇస్తే అక్కడి వారు తెచ్చి ఇస్తారు.ఇక్కడి నదిలో స్నానం చేయడం వల్ల రోగాలు హరించి,,ఆరోగ్యం చేకూరతుంది అని భక్తులు విశ్వసిస్తారు.

అయితే అమ్మవారి ఆలయం లోకి మేము వెళ్ళినప్పుడు నిర్మాణం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు గానూ నిర్మాణం చేపట్టారు.కోరిన కోర్కెలు అన్ని తీర్చే శక్తి గల అమ్మవారిని ధనుర్మాస,మాఘ మాసంలో,ప్రత్యేక సందర్భాల్లో అమ్మవారికి విశేష అలంకరణ చేస్తారు.అభిషేకాలు,అర్చనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని అభిషేకాలతో చల్లబరుస్తూ ఉంటారు.

మరి నేను దర్శించుకున్న అమ్మవారు నా కోరికలు నెరవేర్చి,మానసిక ఒత్తిడిని దూరం చేసింది. మీరు కూడా వెళ్లి ప్రశాంతతను, విశేషాలను చూసి తరించండి..

**చివరిగా**

ఇతర పేర్లు: దక్షిణ కాశీ; హలంపురం; హటాంపురం

జిల్లా: జోగులాంబ గద్వాల

దేవాలయాలు మొత్తం సంఖ్య: 9

నిర్మాణ తేదీ: సా.శ. 702

ప్రధాన దైవం: శివుడు

ప్రధాన పేరు: ఆలంపురం

Show More
Back to top button