Telugu Featured News

వైజాగ్‌కు గూగుల్.. ఏపీ ప్రభుత్వంతో MOU

సంక్షోభంలో కూడా అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే అసలైన నాయకత్వమని చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ.. ఓ కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా పేరున్న గూగుల్‌ తన కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించబోతుందని, దానికి సంబంధించిన సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చలు తెలిపారు. 

ఇది మంత్రి లోకేష్‌ పట్టుదలతో సాధ్యమైందన్నారు. గూగుల్ ఆఫీస్ యాక్టివిటీస్ ప్రారంభమైతే విశాఖ చరిత్ర మారిపోతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం కాలంలో హార్డ్ వర్క్‌తో సాధ్యం కాని పనులు స్మార్ట్ వర్క్‌తో పూర్తి అవుతున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఈ ఒప్పందంతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తామన్నారు. 

ఇకపోతే రాష్ట్రంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గంజాయి, డ్రగ్స్ మాఫియా కట్టడికి అందరం కలిసి పనిచేయాల్సిందేనని.. జిల్లాల్లో మాఫియాలను పూర్తిగా పెకిలించే పనిలో ఉన్నామన్నారు. గతంలో భూముల్ని మాత్రమే కబ్జా చేసేవాళ్లు, ఇప్పుడు పోర్టులు, సెజ్‌లను కూడా కబ్జా చేసేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2047 విజన్ సాధన కోసం 20కి పైగా పాలసీలను తీసుకువచ్చామన్నారు. త్వరలో వీటిని తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలియజేశారు.

Show More
Back to top button