దేశంలో 18వ లోక్సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీతోపాటు.. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో షెడ్యూల్ను ప్రకటిచింది. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు ఉంటుందని వెల్లడిచారు. కాగా, ఎన్నికల ఫలితాలను జూన్ 4 ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఎన్నికలు ఏడు దశలో జరగనున్నాయి. వాటికి సంబంధిచిన డీటియల్స్ ఈ క్రింది విధంగా చూడవచ్చు.
లోక్సభ: తొలి దశ
నోటిఫికేషన్: 20 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి
నామినేషన్ల పరిశీలన: 28 మార్చి
ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19
లోక్సభ : రెండో విడత
నోటిఫికేషన్: 28 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 04
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 5వ తేదీ
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 8
పోలింగ్ తేదీ: ఏప్రిల్ 26
లోక్సభ: మూడో దశ
నోటిఫికేషన్: ఏప్రిల్ 12, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 20
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 22
పోలింగ్ తేదీ: మే 7
లోక్సభ: నాలుగో విడత
నోటిఫికేషన్: ఏప్రిల్ 18, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 26
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ: మే 13
లోక్సభ: ఐదో విడత
నోటిఫికేషన్: ఏప్రిల్ 26, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3
నామినేషన్ల పరిశీలన: మే 4
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 6
పోలింగ్ తేదీ: మే 20
లోక్సభ: ఆరో విడత
నోటిఫికేషన్: ఏప్రిల్ 29, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 6
నామినేషన్ల పరిశీలన: మే 7
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 9
పోలింగ్ తేదీ: మే 25
లోక్సభ: ఏడో విడత
నోటిఫికేషన్: మే 7, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 14
నామినేషన్ల పరిశీలన: మే 15
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 17
పోలింగ్ తేదీ: జూన్ 1