FOOD

బచ్చలి కూరతో బోలెడు లాభాలు

చాలామంది బచ్చలి కూరను ఆకు కూరల్లో రాజు వంటిందని అంటారు. దీనిలో కేలరీలు తక్కువగా ఉండడమే కాకుండా… శరీరానికి అనేక విధాలుగా మేలు చేసే పోషకాలతో నిండి ఉంటాయి. అందుకే వైద్య నిపుణులు వీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే, బచ్చలి కూరను తీసుకోవడంలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దీనిలో ఐర‌న్ పుష్క‌లంగా ఉండడం వల్ల ర‌క్త‌హీన‌త లేదా ఎనిమియా స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఇందులో విట‌మిన్-Aతో పాటు బీటాకెరాటిన్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి కంటి స‌మ‌స్య‌లు దూర‌ం చేసి చూపును మెరుగుపరుస్తుంది. ఇక‌‌ శ‌రీర రోగనిరోధ‌క శ‌క్తి పెంచే విటమిన్-C కూడా బ‌చ్చ‌లి కూర‌లో ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్ప‌డ‌కుండా ర‌క్షిస్తుంది. అదే స‌మ‌యంలో మూత్రవిసర్జనలో ఏవైనా సమస్యలు ఉంటే. వాటి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. త‌ర‌చూ బ‌చ్చ‌లి కూర జ్యూస్ తీసుకుంటే. అందులో ఉండే మెగ్నిషియం, కాల్సియం, పొటాషియం వంటి పోష‌కాలు ఎముకుల‌ను దృఢంగా ఉండేలా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. ఇక ఇందులో సెలీనియం, నియాసిన్ , ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల నరాలు, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Show More
Back to top button