
మెనోపాజ్ అనేది మహిళల జీవితంలో ఓ ముఖ్యమైన దశ. సాధారణంగా ఇది 45 నుంచి 55 ఏళ్ల మధ్య వస్తుంది. నెలసరి పూర్తిగా ఆగిపోవడమే కాకుండా, శరీరంలో హార్మోన్ లెవల్స్‌లో భారీ మార్పులు మొదలవుతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ స్థాయి బాగా తగ్గిపోతుంది. దీని ప్రభావం శరీరంపై, మానసికంగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్నల్ చేంజెస్ స్పష్టంగా కనిపిస్తాయి
మెనోపాజ్ సమయాల్లో నెలసరి ముందుగా వస్తుంది. తర్వాత పూర్తిగా ఆగిపోతుంది. ఆ సమయంలో హాట్ ఫ్లషెస్ అనే లక్షణం చాలామందిలో కనిపిస్తుంది. అంటే ఒక్కసారిగా వేడి పెరిగిన ఫీలింగ్ వస్తుంది. చెమటలు వస్తాయి. చర్మం పొడిబారుతుంది. నిద్ర గందరగోళంగా మారుతుంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువవుతాయి. కొన్ని సందర్భాల్లో డిప్రెషన్‌కి దగ్గరగా వెళ్లేలా మార్పులు జరుగుతుంటాయి.
ఎనర్జీ తక్కువగా ఉంటుంది
మెమొరీ వీక్ అవుతుంది
లైబిడో తగ్గుతుంది
జాయింట్లలో నొప్పులు
బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది
మెనోపాజ్ తర్వాత రిస్క్ ఎక్కువ
ఈ దశ తర్వాత గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, యూరినరీ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ టైంలో జీవనశైలిని చాలా కేర్‌ఫుల్‌గా ఫాలో కావాలి. ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. స్ట్రెస్‌ను కంట్రోల్ చేయాలి. అవసరమైతే డాక్టర్ సలహాతో హార్మోన్ థెరపీను పరిగణనలోకి తీసుకోవచ్చు.










