HEALTH & LIFESTYLE

ఆవు నెయ్యి VS గేదె నెయ్యి 

భారతదేశంలో నెయ్యి‌కి ప్రత్యేక స్థానం ఉంది. పూజలు మొదలుకొని రోజువారీ వంటలలో నెయ్యిని వాడుతుంటారు. అంతేకాదు, ఆయుర్వేదంలో కూడా నెయ్యికి గొప్ప స్థానం ఉంది. అలాగే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులో కరిగే విటమిన్లు ఎ, ఇ & డి పుష్కలంగా ఉంటాయి. అలాంటి నెయ్యిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఆవు నెయ్యి.. మరొకటి గేదె నెయ్యి. మరి ఈ రెండింటిలో ఏది మంచిది..? ఏ నెయ్యి తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..? అనే విషయాన్ని తెలుసుకుందామా..?

ఆవు నెయ్యిలో కాల్షియం చాలా ఎక్కువ ఉండటం వల్ల ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. అంతేకాకుండా, ఇందులో ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా దొరుకుతాయి. కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. బరువు, ఉబకాయం తగ్గడానికి, కాల్షియం లోపం ఉన్న వాళ్లకు ఆవు నెయ్యి మంచిది.

గేదె నెయ్యి తెలుపు రంగులో ఉంటుంది. ఇందులో ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇందులో కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. ఆవు నెయ్యితో పోలిస్తే ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. జలుబు, దగ్గు, కఫంను గేదె నెయ్యి తగ్గించగలదు. యాంటీ ఏజింగ్ గుణాలు మెండుగా ఉంటాయి. కీళ్ల సమస్యలను తగ్గించడంలో బాగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగాలి అనుకునే వారికి గేదె నెయ్యి సహకరిస్తుందని పలు పరిశోధనల్లో నిరూపితమైంది.

Show More
Back to top button