పీరియడ్స్.. మహిళలకు సహజ ప్రక్రియ. ఈ సమయంలో మహిళలు శారీరక అలసటతో ఉంటారు. పీరియడ్స్ సమయంలో మహిళలు ఎటువంటి నియమాలను పాటించాలనేది వైద్యులు కొన్ని సూచనలు చేశారు. అవి తెలుసుకుందాం
పీరియడ్స్ లో తలస్నానం సరైనదేనా..
సహజంగా నెలసరి సమయంలో మహిళలు మొదటి, మూడు, ఐదు రోజులలో తలస్నానాలు చేస్తారు. మరికొంతమంది ఐదు రోజులూ తలస్నానం చేస్తారు. పీరియడ్స్ సమయంలో ఎక్కువగా తల స్నానం చేయడం వల్ల మహిళలు వంధ్యత్వానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ పై అధిక ప్రభావం చూపడంతో కడుపుబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అదే విధంగా శరీరం నిస్సత్తుగా మారుతుందని చెబుతున్నారు.
పీరియడ్స్ సమయంలో తలస్నానం చేయడం సరైన పద్ధతి కాదని ఈ సమయంలో తలస్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింతగా పెరుగుతుందని దీని వల్ల అనేక సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో తల స్నానం చేయాల్సి వస్తే చల్లటి నీటికి బదులు గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలని చెబుతున్నారు. గోరువెచ్చని నీరు శరీరానికి విశ్రాంతిని కలిగిస్తుందట. పీరియడ్స్ అయిపోయిన తర్వాత మాత్రం కచ్చితంగా తలస్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు ఉత్పత్తి అవుతాయని పీరియడ్స్ అయిపోయిన తర్వాత శరీరం సాధారణ స్థితికి చేరుకుంటుందని అందువల్ల పీరియడ్స్ తర్వాత తలస్నానం చేయాలని చెబుతున్నారు.
అధిక రక్తస్రావం…
పీరియడ్స్ సమయంలో మహిళలను అధికంగా వేధించే సమస్య అధిక రక్తస్రావం, కడుపునొప్పి. అధిక రక్తస్రావంతో పాటు నొప్పి కూడా ఎక్కువగా ఉండడానికి మెనోరీజియా అంటారు. ఈ సమయంలో మహిళలకు రక్తం గడ్డలుగా విడుదల రావడం, ఎక్కువగా శానిటరీ ప్యాడ్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది కడుపునొప్పి ఎక్కువగా రావడం గర్భాశయం జీవక్రియ రేటు మార్పుల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మరికొందరికి గర్భాశయంలో కణితిలు ఉండడం వల్ల కూడా ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుందట. కొందరికి రక్తంలో తెల్ల రక్త కణాలు తగ్గినప్పుడు కూడా అధిక రక్తస్రావం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని.. వాటిలో కూరగాయలు, ఆకుకూరలు, బీట్రూట్ అధికంగా తీసుకోవాలని వైద్యులు అంటున్నారు. వీటితో పాటు శారీరక వ్యాయామం శరీరానికి అలసటను తగ్గిస్తుందని చెబుతున్నారు. వైద్యుల సూచన లేకుండా ఎటువంటి మందులు ఉపయోగించరాదని సూచిస్తున్నారు.
అండాలు విడుదలయ్యే సమయంలో…
మహిళలకు రుతు చక్రం సమయంలో గర్భధారణ గురించి ఎన్నో విషయాల పై అవగాహన ఉండదు. దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే.. మహిళలకు గర్భధారణ జరిగేటప్పుడు నెలసరిని పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా మహిళలు పీరియడ్స్ సమయంలో అండాలు గర్భాశయంలోనే ఉంటాయి. రుతు చక్రం ప్రారంభమయ్యే 12 నుంచి 14 రోజుల ముందు అండాలు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. ఈ సమయంలో శుక్రకణాలు మహిళల శరీరంలోకి ప్రవేశిస్తే 100% వరకు గర్భదాన జరిగే అవకాశం ఉంటుందంట. మహిళల శరీరంలో శుక్రకణాలు దాదాపు 7 రోజులు సజీవంగా ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ సమయంలో పీరియడ్స్ కి 12 నుంచి 14 రోజుల ముందు గర్బంధాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.
నెలసరిలో శృంగారం పై అపోహా…
నెలసరి సమయంలో చాలామంది శృంగార జీవితానికి దూరంగా ఉండాలని చెబుతుంటారు. ముఖ్యంగా భారతదేశంలో దానిని ఒక తప్పులా భావిస్తారు. అయితే.. పాశ్చాత్య దేశాలలో నెలసరి సమయంలో శృంగారం చేయడం శరీరానికి సాంత్వన కలిగిస్తుందని చెబుతారు. ఈ సమయంలో శృంగారంపై మహిళలకు ఎక్కువ ఆసక్తి ఉంటుందట. అంతేకాదు వారు శారీరకంగా అలసటగా ఉన్నప్పుడు శృంగారం చేస్తే ఈ సమయంలో విశ్రాంతినిపొందుతారట. రుతు చక్రం సమయంలో సెక్స్ చేయడంతో ఒక కొత్త అనుభూతి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ సమయంలో చేసే శృంగారం సురక్షితంగా ఉండాలని.. కండోమ్స్ ఉపయోగించాలంటున్నారు. నెలసరి సమయంలో మహిళల నుండి విడుదల అయ్యే రక్తస్రావంలో చెడు బ్యాక్టీరియా ఉండడం వల్ల పురుషుడి అంగానికి నష్టాన్ని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే…
నెలసరి సమయంలో మహిళలు ఎక్కువగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో సంతులిత ఆహారం తీసుకోవడం వల్ల రుతు చక్రం అదుపులో ఉంటుందట. ఇటువంటి సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలని.. త్వరగా జీర్ణం అయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలని.. నీరు ఎక్కువగా సేవించాలని వైద్యులు చెబుతున్నారు.
నెలసరి వాయిదాకు టాబ్లెట్స్ వాడొచ్చా…
నెలసరి వచ్చేముందు అత్యవసరమైనప్పుడు చాలామంది మహిళలు నెలసరిని వాయిదా వేసేందుకు టాబ్లెట్లని వాడుతూ ఉంటారు. నెలసరిని దూరంగా వచ్చేలా టాబ్లెట్ వాడతారు. అయితే ఇది శరీరంపై దుష్ప్రభావాలను కలిగిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ఆ విధంగా టాబ్లెట్ వాడి నెలసరిని ఆపుకోవడం వల్ల శరీరంలో సైడ్ ఎఫెక్ట్ జరిగి గర్భాశయానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుందట. సంతాన సాఫల్యం తక్కువగా ఉంటుందని.. సంతాన ఉత్పత్తికి ఈ టాబ్లెట్స్ అడ్డుపడతాయని వైద్యులు చెప్తున్నారు. ఎంతటి ముఖ్య అవసరమైనప్పటికీ టాబ్లెట్స్ కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత…
నెలసరి సమయంలో మహిళలు పరిశుభ్రతను పాటించాలని వైద్యులు అంటున్నారు. ఈ సమయంలో రోజుకు రెండుసార్లు స్నానం చేయాలని.. సానిటరీ ప్యాడ్స్ ప్రతి 2 గంటలు ఒకసారి మార్చుకోవాలని సూచిస్తున్నారు. శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచితే ఇన్ఫెక్షన్లకు అంత దూరంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. చల్లటి నీరు ని కాకుండా వేడి నీటితోనే స్నానం చేయాలని చెబుతున్నారు.