Telugu Featured News

ఇండియా లేదా భారత్‌ ప్రతిపక్షాలపై కక్ష సాధింపా..?

ప్రస్తుతం.. దేశమంతట ఒకటే చర్చ జరుగుతోంది.. రాజ్యాంగంలోని ఆర్టికల్-1 ప్రకారం ‘ఇండియా’ లేదా ‘భారత్‌’ అనే పేర్లలో అనే పదాన్ని తొలగిస్తామనడం.

ఈ మార్పునకు కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక కారణం చెబుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం మరో కారణం చెబుతున్నాయి. వీటి వెనుకున్న అసలు కథ గురించి రాజకీయ నిపుణులు ఏం చెబుతున్నారు? ఇది ప్రజలకు అవసరమా..? లేదా అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం..

”అత్యంత బలసంపన్నుడిని అనే భ్రమలో జీవిస్తున్న వ్యక్తికి.. తాను బలహీన పడుతున్నాను.. అనే స్వస్వరూప జ్ఞానం కలిగే కొద్దీ తన నీడను చూసినా భయమేస్తుంది”. ప్రధాని మోదీ పరిస్థితి కూడా ఇలాగే ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

ఇలాంటివే మరిన్ని కారణాలు చూపుతూ.. విపక్షాలు పలు ఆరోపణలు చేస్తున్నాయి.. అవేంటంటే… దీనికి కారణం ప్రతిపక్షాల ఐక్య సంఘటన పేరు “ఇండియా” అని పెట్టడంమేట. భారత్‌ను సంపూర్ణంగా మార్చేస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోలేం అని తెలిసిన తరవాత మోదీ ప్రభుత్వం, రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు పేర్లు మార్చేసే కార్యక్రమం మీద దృష్టి కేంద్రీకరించాయి. రోడ్ల పేర్లు, కొన్ని సంస్థల పేర్లు, వాటి స్వరూపాన్ని కూడా మార్చేశారు. ప్రతిపక్ష సంఘటన ‘ఇండియా’ అని విన్నప్పటి నుంచి బెంబేలెత్తిపోయిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు దేశం పేరునే మార్చేస్తోంది. G-20 సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఇతర దేశాల నాయకులకు ఏర్పాటు చేసిన విందు ఆహ్వానాల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని ఉండాల్సిన చోట ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాసేశారు. ప్రతిపక్ష కూటమి “ఇండియా” మోదీ ప్రభుత్వాన్ని ఎంతగా కలవరపరుస్తోందో దీనివల్ల అర్థం అవుతున్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంతేకాదు RSS అధినేత మోహన్ భగవత్ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ మన దేశాన్ని ఇక మీదట ఇండియా అనకూడదని, భారత్ అనాలని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఇదే పేరు వాడాలని సెలవించ్చారు. రాతలోనూ, మాటలోనూ భారత్ అనే అనాలని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ దానికి అనుణుగుణంగానే పనిచేస్తున్నాయని బలంగా ఆరోపిస్తున్నాయి.

ఇండియా అన్న పేరు ఇంగ్లీషు వాళ్లు, వలసవాదులు పెట్టిన పేరు కాదు. అంతకు ముందు నుంచే ఉంది. భారత్ అన్న పేరూ అనాదిగా వాడుకలో ఉంది. ఈ రెండు పేర్ల మధ్య ఎన్నడూ వైరం లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు.

* సామాన్యులు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు  మార్చాలా..?

అయితే మరోపక్క దీనిపై బీజేపీ ప్రభుత్వం ఏం చెబుతుందంటే.. ఇండియా అనే పదాన్ని బ్రిటీష్ పాలకులు మనకు పెట్టిన పేరుగా అనువాదిస్తున్నారు. కానీ, ఇండియా అన్న పేరు ఇంగ్లీషు వాళ్లు, వలసవాదులు పెట్టిన పేరు కాదు. అంతకు ముందు నుంచే ఉంది. భారత్ అన్న పేరు అనాదిగా వాడుకలో ఉంది. ఈ రెండు పేర్ల మధ్య ఎన్నడూ వైరం లేదని రాజకీయ నిపుణులు అంటున్నారు. మరోపక్క రామాయణం ప్రకారం మనదేశాన్ని భారతముని పరిపాలించే వారని అందుకే దానికి గుర్తుగా పెడుతున్నామని అంటున్నాయి.

అయితే, దీనికి ప్రతీకగా.. ప్రతిపక్షాలు ఏం అంటున్నాయంటే.. మన దేశానికి భారత్ అన్న పేరు ఎందుకు వచ్చిందో మోదీ సలహాదార్లు గ్రహించారా? భరత ముని పరిపాలించిన దేశం గనక భారత్ అన్నారట. రామాయణంలో భరతుడితో భారత్ అన్న పేరుకు సంబంధమే లేదు. భరత ముని వేరు.

అయితే భరత ముని పరిపాలించాడని చెప్పడానికి ఐతిహాసాలు, పురాణ ప్రమాణాలు ఉన్నాయే తప్ప చారిత్రక ఆధారాలేమీ లేవు.

మొన్నటిదాకా “ఓట్ ఫర్ ఇండియా”అన్నది బీజేపీ నేగా! పాస్ పోర్టులు, ఆధార్ కార్డులు మొదలైన వాటిలోనూ భారత్ అని మారుస్తారా? రాజ్యాంగంలో ఇండియా అని కనిపించిన చోటల్లా భారత్ ప్రత్యక్షమవుతుందేమో! అంటున్నాయి.

అంతేకాదు దీనిపై సోషల్ మీడియాల్లో ప్రశ్నల వర్షం కూడా కురుస్తోంది. అవి ఏంటంటే..

ప్రజలు వాడే పాస్ పోర్టులు, ఆధార్ కార్డులు మొదలైన వాటిలోనూ భారత్ అని మారుస్తారా? ఒకవేళ అలా మర్చితే..

నోట్ల రద్దు టైంలో ATMల దగ్గర ప్రజలు నిల్చున్నట్లు ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసలు చూట్టూ నిల్చునే పరిస్థితి వస్తుందా అని నెట్టింట ప్రశ్నలు వేస్తున్నారు.

అంతేకాదు రాజ్యాంగంలో ఇండియా అని కనిపించిన చోటల్లా భారత్ ప్రత్యక్షమవుతుందేమో! అసలు అది సాధ్యమేనా..? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వాలు ఉండకూడదని ప్రతిపక్షాలు అంటున్నాయి.

Show More
Back to top button