Telugu Featured NewsTelugu Politics

ఒకే దేశం- ఒకే ఎన్నిక లాభామా? నష్టమా?

ముంబయిలో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి మూడో సమావేశం జరుగుతుండగా, ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ సాధ్యాసాధ్యాలపై పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. కమిటీ విధివిధానాలు, అందులో ఉండే నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా ఇండియా కూటమి సమావేశాల్లో తీరిక లేకుండావున్న విపక్షాలకు ఇది ఊహించని పరిణామం.

అసలు ఒకే దేశం-ఒకే ఎన్నిక అంటే ఏమిటి? దీనివల్ల లాభం జరుగుతుందా?

నిపుణులు దీని పట్లు ఏం అంటున్నారో వివరంగా తెలుసుకుందాం. దేశంలో ఐదు ఏళ్లకు ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికలతోపాటు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించడం కోసం “ఒకే దేశం –ఒకే ఎన్నిక”లను అనే భావాన్ని తీసుకొచ్చారు. అయితే,  ‘ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ అన్న నినాదం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ వినిపిస్తోంది. అంతక్రితం 2003లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఈ విషయంలో కొంత ప్రయత్నం చేశారు.

అప్పటి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో ఆయన చర్చించారు. అయితే, ఎందుకనో తదుపరి చర్యలేమీ లేవు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని సీరియస్‌గా తీసుకుని ముందుకు నడిపిస్తుంది. ఇక దీనిలో లాభ, నష్టాల గురించి రాజకీయ నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది.. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలనీ, అందువల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందనీ కొందరు అంటుంటే.. తరచు ఎన్నికల వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నదని కూడా వారి వాదన. కానీ, ఈ రకమైన వాదనలను కొట్టి పారేస్తున్నవారు కూడా కొందరు ఉన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం ఏర్పడిందో చూపాలని సవాలు చేస్తున్నారు. కాకపోతే ఓటర్లను ప్రలోభ పెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉద్దేశించే పథకాలను మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రకటించకుండా ఆపుతున్నారు. అందువల్ల జనం నష్టపోయారని చెప్పడానికి ఎటువంటి దాఖలాలూ లేవు.

ఇలా అయితే రాష్ట్రాలు తమ ప్రాధాన్యత కొల్పోతాయట..!

అయితే, ఈ ఒకే దేశం- ఒకే ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణలు చేపట్టాలి. అందుకోసం రాష్ట్రాల అసెంబ్లీల అనుమతి తప్పనిసరి.

ఇప్పటికే జీఎస్టీలతో దెబ్బతిన్న రాష్ట్రాలు జాతీయపార్టీలను తమ భుజాలపై మోస్తాయని అనుకుంటానికి వీలులేదు. దీంతో ఇది చట్టం రూపం దాల్చే అవకాశమూ లేకపోవచ్చు.

ఇంతేకాదు కొందరు రాజకీయ నిపుణులు మరో వాదన కూడా చేస్తున్నారు.

అది ఏంటంటే.. ఈ చట్టాన్ని తీసుకొస్తే  జాతీయపార్టీలు దేశసమస్యలను చర్చిస్తాయి.

అప్పుడు స్థానిక సమస్యలకు ప్రాధాన్యత తగ్గడంతోపాటు ఎన్నికల ప్రచారం ప్రణాళిక ప్రకారం జరుగుతుంది కాబట్టి స్థానిక పార్టీలు (అసెంబ్లీ) జాతీయ పార్టీలతో పోటీపడలేవు అంటున్నారు.

దీంతో స్థానిక సమస్యలు మరుగున పడిపోతాయి. అంటే రాష్ట్ర ఎన్నికలు తమ ప్రాధాన్యతను కోల్పోతాయట.

రాష్ట్ర పార్టీలు తమను తాము ప్రమోట్ చేసుకునే అవకాశాలు కోల్పోతాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు మధ్య అగాధం ఏర్పడుతుంది.

అందువల్ల రాష్ట్రాలు , స్థానిక పార్టీలు ఒకే ఎన్నికలను వ్యతిరేకిస్తాయి.

ఏదేమైనా జమిలి ఎన్నికల విధానంపై(ఒకే దేశం- ఒకే ఎన్నికల) విస్తృతమైన చర్చకు చోటిచ్చి, అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలను.

పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగులు వేయాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Show More
Back to top button