Telugu News

కాసుల వర్షం కురిపిస్తోన్న నల్లకోడి..!

నల్లకోడి కాసుల వర్షం కురిపిస్తోంది. నల్ల కోడి కాసుల వర్షం కురిపించడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నల్ల కోళ్లని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. అక్కడి ఆదివాసీల జీవనాధారం ఈ కోళ్ల పెంపకం. ఈ నల్ల కోళ్ళని కడక్ నాథ్ కోళ్లు అంటారు. ఎన్నో తరాల నుంచి అక్కడ నల్ల కోళ్ళను పెంచుతారు. రంగులో నలుపుగా ఉన్న ఈ కోళ్లు చాలా డిమాండ్. కేవలం ఈ కోళ్ల వ్యాపారం చేస్తూ లక్షాధికారులైన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ నల్ల కోళ్ళకి అంత డిమాండ్ ఎందుకు? అదే విషయం తెలుసుకుందాం.

ఝాబువా, అలీరాజ్ పూర్..

ఈ రెండూ మధ్యప్రదేశ్లో వెనకబడిన ప్రాంతాలు. వర్షాలు లేక పంటలు పండక, అంతా పట్టణబాట పట్టేవారు. ఇటీవల ఆ వలస ఆగింది. కారణం ఝఝాబువా కృషివిజ్ఞాన కేంద్రమే. దాని సహకారంతో స్థానిక ఆదివాసీ రైతులంతా నల్లకోళ్ల పెంపకాన్నే వృత్తిగా మలచుకుని, దేశవిదేశాలకు కోళ్లనీ మాంసాన్నీ ఎగమతి చేస్తూ ఆదాయాన్ని పొందుతు న్నారు. దాంతో చుట్టుపక్కల ప్రాంత రైతులు కూడా నల్లకోడి పేరునే పలవరిస్తున్నారు.

భీల్, బిలాలా తెగ ప్రజలు అక్కడి వాతావర ణాన్ని తట్టుకుని జీవించే నల్లకోడిని వందల ఏళ్ల నుంచీ పెంచుతున్నారు. ఒళ్లంతా కారు నలుపులో ఉండటంతో దీన్ని వాళ్లు ‘కలి మసి’ అంటారు. రుచితోబాటు దాని ప్రత్యేకమైన రంగు కారణంగా అందులో ఎన్నో ఔషధగు ణాలు ఉన్నాయని వాళ్లు నమ్మేవారు. ఆ విష యాన్ని మైసూర్లోని కేంద్ర పరిశోధన ఆహార పరిశోధనా సంస్థ పరిశీలించి చెప్పడంతో ఇది ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. పైగా ఇండో షియా, బాలి దీవుల్లోని ఆయమ్ సెమనీగా పిలిచే నల్లకోళ్లూ, చైనాలోని సిల్కీ… రకాల్లోకే ఇదీ చెందుతుందనీ అవన్నీ ఆరోగ్యానికీ మంచి ధన్న కార ణంతో ఆయా దేశాల్లో వాటి ధర సెల్లోనూ లక్షల్లోనూ పలకడంతో ఈ స్వదేశీ కోళ్లకు డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకుంది, ఎందుకో అంత డిమాండ్?

అంత డిమాండ్ ఎందుకు..? సహజంగానే నాటుకోడి రుచి అయితే.. నల్లకోడి యమా రుచి అట. పైగా ఇతర కోళ్లతో పోలిస్తే ప్రొటీన్ల శాతం ఇందులో చాలా ఎక్కువ. సాధారణ కోళ్లలో ప్రొటీన్ 18-20 శాతం ఉంటే, కడక్నాథ్ 25 శాతం ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతం తెల్లకోళ్లలో 13 – 25 శాతం ఉంటే, ఈ నల్లకోడిలో కేవలం 0.73-1.05 . 21, 22, 26, బి12, సి, ఇ, నియాసిన్, కాల్షియం, ఫాస్ఫరస్, నికోటినిక్ ఆమ్లం… వంటివన్నీ కడక్నాథ్ పుష్కలంగా ఉంటాయట. మామూలు కోళ్లలో కన్నా ఐరన్ శాతం పదిరెట్లు ఎక్కువ.

నరాలవ్యాధిని తగ్గించే హోమియో మందుల తయారీకి అవసరమైన గుణాలూ ఇందులో ఉన్నాయట. గుండెజబ్బు, క్షయ, ఆస్తమాలతో బాధపడేవారికీ, తీవ్రమైన తల నొప్పి, ఫిట్స్ రోగులకీ కూడా ఈ కోడి మాంసం మంచిదనీ; ఈ గుడ్డులోని ప్రోటీన్ బీపీ, కొలెస్ట్రాల్తో బాధపడేవాళ్లకీ మేలనీ చెబుతున్నారు. దీని రక్తాన్ని ఆదివాసీలు దీర్ఘ కాలిక వ్యాధులకు మందుగానూ మాంసాన్ని శృంగారప్రేరితంగానూ వాడుతుంటారు.

వయాగ్రా లేదా సిల్దనాఫిల్ సిట్రేట్ల మాదిరిగానే ఇందులోని మెలనిన్ గుండెకు రక్త సరఫరాను పెంచుతుందని నిపుణులు సైతం చెప్పడంతో ఈ చికెన్ కు డిమాండ్ పెరిగింది. కిలో మాంసం 1000 నుంచి నుంచి, గుడ్డు ధర నలభై నుంచి యాభై రూపాయలు ఉంటుంది.

ఆ నల్ల రంగెలా వచ్చింది.. ?

ఈ కోళ్లలో కేవలం ఈకలే కాదు, కాలిగోళ్ల నుంచి లోపలి ఎముకల వరకూ అన్నీ నలుపే. వీటిల్లో ఉండే ఓ జన్యువు కారణంగా కణజాలాల్లో మెలనిన్ అనే వర్ణద్రవ్యం, అధికంగా పేరు కుంటుంది. ఈ స్థితినే ఫైబ్రోమెలనోసిస్ అంటుంటారు. అయితే గుడ్లు గోధుమరంగులోనే ఉంటాయి. పిల్లలు నీలం, నలుపూ తెలుపూ చారలతో ఉండి, క్రమంగా నలుపెక్కుతాయి.

గతంలో ఆదివాసీ మహిళలు సంప్రదాయ పద్ధతిలో పెంచడం, సరైన వ్యాధినివారణ చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాలవల్ల అవి అంతరించిపోసాగాయి. ఆ విషయాన్ని గుర్తించిన జబువా కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు అక్కడ పర్యటించి ఆ కోళ్ల పెంపకంపట్ల శాస్త్రీయ అవగాహన కలిగించారు. భారతీయ వ్యవసాయ పరిశో ధనా మండలికి చెందిన జాతీయ వ్యవసాయ ఆవిష్కరణ ప్రణాళిక సంస్థ అందుబాటులో ఉన్న వనరులతో తక్కువ ఖర్చుతోనే కోళ్ల ఫారాలను ఏర్పాటుచేసింది. కృషివిజ్ఞానకేంద్రం ప్రతినెలా ఐదువేల కోడిపిల్లల్ని ఉత్పత్తి చేసి, రైతులకు అందిస్తోంది.

కడక్నాథ్ కోళ్లు ఐదునెలలకు అమ్మకానికి వస్తాయట. జాగ్రత్తగా పెంచితే ఒక్కో రైతుకీ వంద కోళ్లకి ఏడాదికి లక్ష రూపాయలు మిగు లుతుందట. ఝాబువా జిల్లా వాసులు సాధిం చిన ఈ విజయాన్ని చూసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆదివాసీలే కాదు, ఉత్తరాది, దక్షిణాది రైతులు సైతం వీటిని పెంచేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారంటే నల్లకోడి అందరినీ ఎంతగా చవులూరిస్తోందో తెలుస్తోంది..!

ముదురు నలుపు రంగులో ఉండే కడక్నాథ్ కోళ్లలో వెంట్రుకలు, చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నల్లగానే ఉంటుంది. ఈ కోళ్ళను కాలామాసి అని కూడా పిలుస్తారు. అంటే నల్ల మాంసం అని అర్థం. అరుదుగా, కొన్ని పుంజులు నలుపుతో పాటు బంగారు రంగు ఈకలు కలిగి ఉంటాయి. ఈ కోడి పిల్లలు నీలం రంగు మొదలుకొని నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. అయితే ఇదే జాతి కోడి మరో రెండు రంగుల్లోనూ లభిస్తుంది. కడక్ నాథ్ కోళ్ళకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. ఈ జాతి కోళ్ళలో పొదుగుడు లక్షణం తక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి.

వీటి పెంపకం ఖర్చుతో కూడుకున్నదే..!

కడక్ నాథ్ కోళ్ల పెంపకం సాధారణ కోళ్ల పెంపకం కంటే  ఖర్చు ఎక్కువగా ఉంటుంది.  సాధారణంగా కోళ్ల ఫారంలలో పెంచే బ్రాయిల‌ర్ కోళ్లు 45 రోజుల్లో దాదాపు రెండున్నర కేజీల బరువు పెరుగుతాయి. ఐతే కడక్‌నాథ్ కోళ్లు మాత్రం 6 నెలల కాలానికి ఒకటిన్నర కేజీ బరువు పెరుగుతుంది. అంటే వీటి పెరుగుదల నిదానంగా ఉంటుంది. అంతేకాకుండా వీటికి వేసే ఆహారం కూడా భిన్నంగా ఉంటుంది. దీంతో వాటిని పెంచేందుకు ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది. లేయర్‌ కోళ్లతో పోల్చితే కడక్‌నాథ్ కోళ్లు గుడ్లు కూడా చాలా తక్కువ పెడతాయి. వాటిల్లో చాలా తక్కువ గుడ్లు మాత్రమే పిల్లలవుతాయి.

అందువల్ల ఒక్కో గుడ్డు ధర రూ. 40 నుంచి రూ. 50 వరకు ఉంటుంది. ఒక్కో కోడి పిల్ల ధర  రూ.70లకు పైనే ఉంటుంది. కడక్‌నాథ్ కోళ్లను మాంసం కోసమే ఎక్కువగా పెంచుతారు. ఎందుకంటే సాధార‌ణ కోళ్లతో పోలిస్తే ఈ కోళ్ల మాంసంలో పోష‌క విలువలు అధికంగా ఉంటాయి. ఈ కోళ్ల మాంసం కేజీ ధ‌ర రూ.1000 నుంచి రూ.1200 వ‌ర‌కు ప‌లుకుతుంది.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కోళ్ల పెంపకం బాగానే సాగుతోంది.

Show More
Back to top button