
రూ. 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు
- * 1.7కోట్ల గ్రామీణ రైతుల లబ్ధి కోసం గోదాములు, నీటిపారుదల, రుణ సౌకర్యాలు
- * జల్ జీవన్ మిషన్‌కు భారీగా నిధులు, 100శాతం మంచినీటి కుళాయిలకు ఏర్పాట్లు
- * బీమా రంగంలో FDI 74 శాతం నుంచి 100శాతానికి పెంపు.
- * కృత్రిమ మేధ అభివృద్ధికి రూ.500 కోట్లతో మూడు సెంటర్లు
- * చిన్న స్థాయి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్
- * మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేలా మరింత ఈజీగా వీసా
- * కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3లక్షల నుంచి 5 లక్షలకు పెంపు. 7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి.
- * పత్తి రైతుల కోసం జాతీయ పత్తిమిషన్
- * పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం
- * MSMEలకు ఇచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు.
- * స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు
- * బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం
- * ఈ – శ్రమ్ పోర్టల్ ద్వారా గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా
- * రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు
- * కొత్త ఉడాన్ పథకంతో 10 ఏళ్ళలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం. బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్.
- * క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం
- * రూ.30వేల లిమిట్‌తో పట్టణాల్లో ఉండే పేదలకు UPI లింక్డ్ క్రెడిట్ కార్డులు.
- * వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75వేల కొత్త మెడికల్ సీట్లు
- * క్యాన్సర్ సహా 36 రకాల మెడిసిన్స్‌పై కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
- * త్వరలో జన విశ్వాస్ 2.0 బిల్లు
- * షిప్ బిల్డింగ్ కోసం కొత్త ఎకో సిస్టమ్ ఏర్పాటు