
సాయంత్రం సమయంలో ఏమైనా అశుభం మాట్లాడితే అలా మాట్లాడకూడదు తధాస్తు దేవతలు తదాస్తు అంటారని పెద్దవాళ్ళు అంటారు. ఎప్పుడైనా విన్నారా సాయంత్రం తర్వాత తధాస్తు దేవతలు భూమంతటా సంచరిస్తానని ఆ గడియలలో మనిషి మనసులో ఏది అనుకుంటే అది నిజమయ్యేలా ధీవిస్తారని చాలామంది నమ్ముతారు. ఈ తదాస్తు దేవతలు ఎవరు, పురాణాల్లో వాళ్ళ ప్రాముఖ్యత ఏమిటి వాళ్లకసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం.
సత్య దర్శ అని పిలవబడే అశ్విని కుమారులు సూర్యుడి కవల పిల్లలు. వీరిని అశ్విని దేవతలు మరియు తధాస్తు దేవతలు అని అంటారు. మహాభారతంలోని విష్ణు పురాణం ప్రకారం విశ్వకర్మ కుమార్తె సంధ్య. ఒకరోజు సంధ్య సూర్యుడి నుండి వచ్చే కిరణాలను భరించలేక అతనికి సంబంధించిన పనులు చూసుకోవడానికి తన నీడ ఛాయను అక్కడ ఉంచి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళింది. దానితో ఛాయను సూర్యుడు సంధ్యగా భావించాడు. వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. ఒక సందర్భాల్లో సూర్యుడు తన దివ్యదృష్టితో ఆమె సంధ్య కాదని సంధ్య గాడిద రూపంలో తపస్సు చేస్తుందని గుర్తించాడు. దాంతో సూర్యుడు కూడా ఒక గుర్రం రూపంలో ఆమె దగ్గరికి వెళ్ళాడు. అదే రూపంలో ఉండి వారు సంభోగించినప్పుడు ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇద్దరు అశ్విని కుమారులు, మరొకరు రేవంతులు. మనం తధాస్తు దేవతల ఫొటోస్ చూసినట్లయితే సగం మనిషి రూపం సగం జంతువు రూపంలో ఉన్నట్టు కనిపిస్తుంది.
దేవీ భాగవత పురాణం అశ్విని దేవతలు సుకన్య అనే స్త్రీకి పెట్టిన పరీక్ష గురించి తెలియజేస్తోంది. సుకన్య వైవస్వత మనువుకి మనవరాలు. సర్యాతికి కూతురు. అయితే సరియాతికి నాలుగు వేల మంది అందమైన భార్యలు ఉన్నారు. వారికి పిల్లలు పుట్టలేదు. చివరికి ఒక భార్య సుకన్యకు జన్మనిచ్చింది. అందరికీ కలిపి ఒకే కూతురు ఉండడం వల్ల సుకన్యను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. సర్యాతి భవనం పక్కనే ఒక సరస్సు ఉండేది. ఆ తపోవనంలో ఒక ఋషి చవలా అనేవాడు తిండి లేకుండా చాలాకాలంగా ధ్యానం చేస్తుండడంతో ఆయనపై చెట్లు, పొదలు పెరిగిపోయాయి. ఆ రుషి తన చుట్టూ పెరుగుతున్న మొక్కలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకరోజు రాజ కుటుంబీకులు అంతా ఆనందంగా గడపడానికి ఆ వనానికి వెళతారు.
సుకన్య తన స్నేహితులతో కలిసి తోటలో ఆడుకుంటుంది. అలా చవల ఋషి తపస్సు చేస్తున్న ప్రదేశానికి చేరుకుంది. అక్కడ మెరుస్తూ ఒక కాంతి కనిపించింది. చాలా శక్తిగా చూస్తూ ఉంది. అక్కడ ఒక శబ్దం కూడా వినిపించింది. దయచేసి నన్ను బాధ పెట్టకు నేను ఒక ఋషిని ఇక్కడ తపస్సు చేసుకుంటున్న నేను నీకు ఏ హాని చేయను అని చెప్పినా కూడా సుకన్య ఒక కర్ర తీసుకొని ప్రకాశంగా ఉన్న స్థలంలో కర్రతో కొట్టింది. అది చవులుడికి కళ్ళు అవడంతో అతడు చూపు కోల్పోయి ఎంతో బాధ అనుభవించాడు. కానీ అతడు ఎవరిని శపించలేదు. తర్వాత రాజ్యమంత చాలా సమస్యగా చెడు ప్రభావం చూసింది. ఈ విపత్తు గురించి ప్రజలు వచ్చి రాజు వద్ద మొరపెట్టుకుంటే అతని మంత్రులు ఆందోళన చెందారు. ఎవరో రుషికే హాని చేశారని అనుమానించిన రాజు అందరిని అడిగారు కానీ సమాధానం రాలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎవరు ఏమి చెప్పలేదు. చివరికి సుకన్య తన తండ్రికి జరిగిందంతా చెప్పింది.
చవులుని వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. సుకన్యను తనకు ఇచ్చి వివాహం చేస్తే ఆ తప్పును క్షమిస్తాను అని అరుషి అన్నాడు. ఏకైక కుమార్తెను ఆ ఒక వృద్ధుడికి అందులోనూ కళ్ళు లేని ఋషికి వివాహం చేయాలన్న బాధలో మునిగిన తండ్రి బాధను సుకన్య గుర్తించింది.చవులుడిని వివాహం చేసుకుంటానని చెప్పింది. ఈ పనితో రాజ్య ప్రజలు సురక్షితంగా ఉంటే తన సంతోషాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. రాజు సుకన్యను చవుళుడికి ఇచ్చి వివాహం చేశాడు. సుఖన్య తన భర్తను చూసుకోవడంలో ఎంతగానో జాగ్రత్త వహించేది. రాత్రిపూట అతని కాళ్ళ వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉదయాన్నే అతను చెప్పిన పనులన్నీ చేసేది. సుకన్య ఎప్పుడు తన భర్తలు సంతోష పరచడానికి అతని నమ్మకం నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుండేది.
ఒకరోజు సుకన్య స్నానం చేసి తిరిగి వస్తున్నప్పుడు సాయంత్రం సమయంలో అశ్విని కుమారులు వనంలో ప్రకృతిని చూడ్డానికి వస్తారు. అప్పుడు అక్కడ సుకన్యను చూస్తారు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఇంత అందంగా ఉన్న నువ్వు ఎవరు మేము అశ్విని కుమారులం. నువ్వు ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. అసలు ఇక్కడ ఎందుకు ఉన్నావని అడిగారు. నా పేరు సుకన్య. సరియతి రాజు కూతురిని చవులుడి భార్యను అని జరిగిన కథంతా వివరించింది. అప్పుడు వారు నీకు ఈ ముసలి గుడ్డి ఋషి కంటే మంచి భర్తను పొందే అవకాశం ఉంది. మాలో ఎవరినో ఒకరిని భర్తగా ఎంచుకో అని అన్నారు. కానీ సుకన్య వారిని శపిస్తాను అని హెచ్చరించింది.
అది చూసి ఆశ్చర్యపోయి అశ్విని కుమారులు ఒక వరం ఇచ్చారు. వారిద్దరిలో ఒకరిని భర్తగా ఎంచుకుంటే వారు చవులుడికి చూపుని తిరిగి ఇవ్వగలరు అని చెప్పారు. కానీ సుకన్య ఏ మాత్రం ఇష్టపడలేదు. దానితో తన భర్త దగ్గరికి వెళ్లి ఈ సంఘటనంతా చెప్పింది. అశ్విని దేవతలను తన దగ్గరికి తీసుకు రమ్మని రుషి చెప్పాడు. అప్పుడు అశ్విని కుమారులు చెవులుడిని దగ్గరలోని సరస్సుకు తీసుకువెళ్లి వారి ముగ్గురు మునిగి బయటకు వచ్చారు. ముగ్గురు యువకులుగా అందంగా ఉన్నారు. కానీ వారు ముగ్గురు ఒకే విధంగా ఉన్నారు. ఇక్కడ తన భర్త ఎవరు అన్న తేడా ఆమెకు తెలియదు. ఇక్కడే మొదలైంది అసలైన పరీక్ష. సుకన్య తన భర్తను గుర్తించాలని అశ్విని కుమారులు చెప్పారు. అప్పుడు సుకన్య సాయం కోసం ప్రార్థించింది.
చివరిగా తన చెవులను గుర్తించింది. దీంతో అశ్విని కుమారులు సుకన్య పాతివ్రత్యానికి ఎంతగానో సంతోషించారు. తనకు సాయం చేసినందుకు చవులుడు అశ్విని కుమారులను ఏదైనా వరం అడగమని చెప్పారు. అప్పుడు వారు మేము దేవతల వైద్యులం. ఇంద్రుడు మమ్మల్ని ఆ దివ్యమృతాన్ని తాగనివ్వకుండా అన్యాయంగా పంపించాడు. అమృతంలో ఎంతో కొంత దక్కెటట్టు చేయమని కోరుకుంటున్నాం అని అశ్విని కుమారులు జవాబు ఇచ్చారు. వారి మాటకి చవులుడు సరే అని మాట ఇచ్చారు. తర్వాత సుకన్య కన్నతల్లి ఆశ్రమానికి వచ్చి చవులుడిని యువకుడిగా అందంగా చూసి ఆశ్చర్యపోయింది.
వారి కూతురు నిజాయితీని తెలుసుకున్న తర్వాత చాలా ఆనందించారు. అశ్విని కుమార్లకు తాను ఇచ్చిన మాట చెప్పాడు. ఇక భవనానికి తిరిగి వచ్చిన తర్వాత రాజ్యంలో పెద్ద యాగాన్ని నిర్వహించారు. చౌళుడు పూజారిగా వ్యవహరించారు అశ్విని కుమారులు కూడా యాగానికి వచ్చారు. కానీ ఇంద్రుడికి ఇది ఏమాత్రం నచ్చలేదు. అశ్విని కుమారుడు దేవ వైద్యులు కాబట్టి వారికి అమృతంలో భాగం లేదని కారణం చెప్పారు. చవులుడు మాత్రం అశ్విని కుమార్ల పక్షాన వాదించాడు.
అలా వారి వాదన చాలా పెద్దదయింది. వారి మధ్య యుద్ధం మొదలైంది. ఇంద్రుడు తన వజ్రాయుధం తీసుకొని చవులుడి పై దాడి చేశాడు. అప్పుడు చవులుడు దేవతలను చంపడానికి యజ్ఞం నుంచి మద అనే భయంకరమైన రాక్షసులను పిలిపించాడు. వారందరూ ఆ రాక్షసుడిని చూసి భయంతో పరుగులు తీశారు. కానీ ఇంద్రుడు పరిగెత్త లేకపోయాడు. తన గురువైన బృహస్పతిని సాయం కోసం ప్రార్థించాడు. బృహస్పతి ప్రత్యక్షమై ఇంద్రుని క్షమించమని చవులుడికి చెప్పాడు. ఇంద్రుడు తలవంచి చవులుడిని క్షమాపణ కోరాడు. చవులుడు సంతోషించాడు. అశ్విని కుమారులు అమృతాన్ని తాగే హక్కు పొందారు. దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్లేలా చేశారు. ఇది తధాస్తు దేవతలైన అశ్విని కుమారులకు సంబంధించిన కథ. అశ్విని కుమారులు సాయంత్రం సమయంలో వారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందున వారికి పురాణాలనుండి తధాస్తు దేవతలు అనే పేరు వచ్చింది. అందుకే పెద్దవాళ్లు సాయంత్రం సమయంలో శుభం మాట్లాడాలి అని అంటారు.