
సొంతింటి కల నెరవేర్చుకోవడానికి చాలామంది మధ్య తరగతి వారు కష్టపడుతుంటారు. ఇల్లు కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి ఉంటుంది. దీనికోసం లోన్ తీసుకుని కొన్ని సంవత్సరాల వరకు EMIలు చెల్లిస్తుంటారు. అయితే, మధ్యతరగతి వారి సొంతింటి కలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్యంతో 2022 మార్చి 31 వరకు దీన్ని అమలు చేశారు. ఆ తర్వాత 2024లో PMAY-అర్బన్ 2.0గా పేరు మార్చి ఇదే పథకాన్ని మళ్లీ అమలు చేస్తున్నారు. దీని ద్వారా 2030 నాటికి కోటి ఇళ్ల నిర్మాణానికి రూ.10 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఇందులో భాగంగా ఇంటి రుణం తీసుకునే వారికి రూ.1.8 లక్షల సబ్సిడీని అందించనున్నారు.
ఈ పథకానికి అర్హులెవరంటే..
ఇంటిలోని అందరికీ వార్షిక ఆదాయం రూ.9 లక్షలు దాటకూడదు.
ఇంతకు ముందు వారి పేరు మీద ఎలాంటి ఇల్లు ఉండకూడదు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
ఆఫ్‌లైన్‌లో సమీప HUDCO/HFCL బ్రాంచ్ లేదా మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లవచ్చు. పోర్టల్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్లో pmaymis.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం మీ ఆధార్, పాన్, ఆదాయ ప్రమాణ పత్రాలతో రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్రూవల్ తర్వాత 15 రోజుల్లో సబ్సిడీ క్రెడిట్ అవుతుంది.










