
కొన్ని రోజులుగా సరిహద్దు కాల్పులతో అట్టుడికిన థాయ్‌లాండ్-కంబోడియా తక్షణమే, షరతుల్లేని కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. ఈ విషయాన్ని సోమవారం మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు.
సరిహద్దులో కాల్పులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఈ రెండు దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. చర్చల కోసం సోమవారం మలేసియాలో భేటీ అవతామని ఇరువురు నాయకులు నిర్ణయించుకున్నారు. దాంతో సానుకూల పరిణామం బయటపడింది. థాయ్ సైనికులు మందుపాతర మీద నడవడంతో ఐదుగురు గాయపడటం, అదే సమయంలో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం తేలికపాటి ఆయుధాలు, శతఘ్నులు, రాకెట్లతో దాడులు జరపడం ఈ ఘర్షణకు కారణమయ్యాయి.
బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురి మృతి ఈ ఉద్రిక్తతల మధ్య, థాయ్‌లాండ్‌లోని కంబోడియా రాయబారిని వెనక్కు పిలుపుతో పాటు, థాయ్ ప్రభుత్వం తమ దేశంలో ఉన్న కంబోడియా రాయబారిని పంపించివేసింది. తర్వాత పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. సరిహద్దు కాల్పుల్లో 30 మందికి పైగా చనిపోగా, దాదాపు రెండు లక్షల మంది తమ ప్రాంతాలు వదిలి వెళ్లిపోయారు.
ఈ పరిస్థితుల్లో ట్రంప్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఇప్పటికే కొన్నిటిని తాను ఆపినట్లు చెప్పిన ఆయన, థాయ్‌లాండ్-కంబోడియా ఘర్షణను కూడా తన విజయాల లిస్టులో చేర్చుకున్నారు. ఆయన కల్పించిన చర్చల వేదికతో ఈ కాల్పుల విరమణ సాధ్యపడినట్లు అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.






