
“నాకు షుగర్ ఉంది… నేను రక్తం ఇవ్వలేను” అనేది చాలామంది నమ్మకం. కానీ ఇది నిజంగా నిజమా? మనం రక్తదానం చేయడం వల్ల ఎవరికైనా హాని కలుగుతుందా? లేక శరీరంలో షుగర్ ఉన్నా మనం ఎలాంటి జాగ్రత్తలతో సేఫ్‌గా డోనేట్ చేయచ్చా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో షుగర్ స్థాయిలు సాధారణంగా ఉన్నపుడు, డయబెటిస్ ఉన్నవాళ్లు కూడా రక్తం ఇవ్వవచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయబెటిస్ ఉన్నవారు, ఇన్సులిన్ కాకుండా మాత్రలతో షుగర్‌ను కంట్రోల్ చేస్తున్నవారైతే వాళ్లు ఆరోగ్యంగా ఉన్నంతవరకూ డోనేట్ చేయొచ్చు.
సాధారణంగా రక్తం ఇచ్చినప్పుడు మన రక్తంలో ఉన్న షుగర్ రిసీవర్‌కు ఎలాంటి సమస్యలు కలిగించదు. ఎందుకంటే రిసీవర్ రక్తం తీసుకున్న తర్వాత, దాన్ని శరీరం వేగంగా మార్చేసేస్తుంది. అంతే కాదు, శరీరంలో ఉన్న కిడ్నీలు కూడా హై షుగర్‌ను ఫిల్టర్ చేస్తాయి.
అయితే బ్లడ్ డోనేట్ చేసే వ్యక్తికి ఒక షరతు అయితే ఉంది. అదేంటంటే ఆ రోజు డోనర్‌కు షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉండాలి (Fasting < 130mg/dL, Post-meal < 180mg/dL). దీంతోపాటు కిడ్నీ, హార్ట్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండకూడదు.