
ప్రస్తుతం మనకు ఎండలు తెగ మండిపోతున్నాయి కదా…! అయితే, ఇది మీకు తెలుసా? ఈ సీజన్‌లో డయాబెటిస్ రోగులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయని..! కాబట్టి వీరు తప్పకుండా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
సింపుల్‌గా చెప్పాలంటే.. కిడ్నీలు మన శరీరంలో అదనంగా ఉన్న చక్కెర(షుగర్)ను మూత్రం ద్వారా బయటికి పంపిస్తాయి. కానీ వేసవిలో తగినన్ని నీళ్లు తాగకపోతే కిడ్నీలు సరిగ్గా పని చేయలేవు. ఫలితంగా రక్తంలో చక్కెర నిలిచిపోతుంది. అప్పుడు ఏమైతుందంటే… శరీరంలో షుగర్ శాతం బాగా పెరుగుపోతుంది. అయితే కొంతమందిలో ఈ వేడి వల్ల శరీరంలో రక్త నాళాల పరిమాణం పెరుగుతుంది. ఇలా అవ్వడం వల్ల ఇన్సులిన్ అనే హర్మోను రక్తంలో ఉన్న చక్కరలను భారీగా తగ్గించేస్తుంది. దీంతో హైపోగ్లైసీమియా అనే సమస్యకు దారిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలను మేనేజ్ చేసుకోవడానికి తప్పకుండా కొన్ని టిప్స్ ఫాలోకావాలండి. అవి ఏంటంటే..
* డయాబెటిస్ ఉన్నవారికి శరీరంలో తగినంత నీటి శాతం ఉండాలి. కాబట్టి, నీరు మరియు ఉప్పు నీరు, పండ్ల రసాలు తాగుతూ ఉండాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా ఆల్కహాల్, కాఫీ, డ్రింక్స్ తాగవద్దు. ఎందుకంటే ఆల్కహాల్‌లో ఉండే.. కొన్ని రకాల షుగర్స్ మరియు కాఫీ, డ్రింక్స్‌లో ఉండే.. కెఫిన్ వంటి పదార్థం రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు గురిచేసేలా చేస్తుయి. కాబట్టి ఆల్కహాల్, డ్రింక్స్, కాఫీ వంటి జోలికి పోవద్దు.
* వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎందుకంటే.. వేడి వాతావరణంలో వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే.. శరీరానికి గాలి బాగా తగులుతుంది. అప్పుడు బాడీ కూల్ అవుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు సౌకర్యవంతమైన దుస్తులు ధరిస్తే వేసవి నుంచి ఉపశమనం పొందవచ్చు.