Telugu Featured News

కియాను వరించిన ‘కార్ ఆఫ్ ది ఇయర్’..!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీగా పేరు గాంచిన కియా.. ఇప్పుడు “ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023” అవార్డును సొంతం చేసుకుంది.


ఈ సంస్థ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక మోడల్ కారెన్స్ కారుకు లభించిన అత్యుత్తమ అవార్డు..
ఈ ఏడాదిలో గెలుచుకున్న రెండో అవార్డు కూడా ఇదే. ఈవీ6 ఐసీఓటివై “గ్రీన్ కార్ అవార్డ్ 2023” కియా తన ఖాతాలో ఇదివరకే వేసుకోగా, ఇప్పుడు తాజాగా “ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్”ను గెలుచుకుంది.. దీంతో ఒకే సంవత్సరంలో రెండు ఐసీఓటివై అవార్డులను గెలుచుకున్న మొదటి బ్రాండ్‌గా కియా ఆటోమొబైల్స్ చరిత్రలో నిలిచింది. ఈ సందర్భంగా కియాను ఏపీకి తీసుకురావడానికి విశేష కృషి చేసిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా కియాకు అభినందనలు తెలియజేశారు. కావున ఈ కియా అసలు కథా కమామీషు ఎంటో మనం ఈరోజు చూసేద్దామా…

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్లాంట్ కేంద్రంగా తయారైన కియా కారెన్స్ మోడల్ కార్ కు అవార్డు లభించడం ఆంధ్రప్రదేశ్ కే తలమానికం!

ఏపీలోకి కియా…


దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ అనుబంధ సంస్థ ఈ కియా మోటార్స్.. అనంతపురం జిల్లా పెనుగొండలో 650 ఎకరాల విస్తీర్ణంలో, రూ.13,500 కోట్ల పెట్టుబడితో కియా కార్ల ప్లాంట్ ఏర్పాటైంది.
చంద్రబాబు హయాంలో, 2017లో ప్లాంట్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. 2018 ఫిబ్రవరి 22న కియా మోటార్స్ చీఫ్ పార్క్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఫేమ్ ఇన్‌స్టలేషన్ కార్యక్రమం జరిగింది. కొన్నాళ్లకు 2019 జనవరి 19న తొలి కారును టెస్ట్ ట్రాక్‌లో నడిపారు చంద్రబాబు.


ఏ రకంగా చెప్పుకున్న, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఏపీలో కియా కార్ల కంపెనీ కొలువుదీరింది. ‘కియా మోటార్స్’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం కేంద్రంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను నెలకొల్పడమైంది. అప్పట్లో ఇక్కడ కియా సంస్థ ఏర్పాటుకు కావాల్సిన ప్రతి ప్రోత్సాహకంలో చంద్రబాబు నాయుడు ముఖ్యభూమిక పోషించారు. అంతేకాక ఎన్నో రాయితీలను ప్రకటించి, కియా తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను పక్క రాష్ట్రాలను కాదని ఇక్కడ నెలకొల్పేలా కృషి చేశారు. దీంతో ఇప్పుడు ఆ కంపెనీ కేంద్ర అవార్డు గెలుచుకోవడంతో ఆయన ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్లాంట్ ఏర్పాటు మొదలు విస్తరణతోపాటు కొత్త రకం మోడళ్ల తయారీలోనూ ముందుంది. అలా చేపట్టిన మోడల్ లో ఈ కారెన్స్ ఒకటి. ఈ కారు అత్యుత్తమ పనితీరు కనబరిచి.. నేడు ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ గా రికార్డు కొట్టింది. దీంతో మరిన్ని సంస్థలు ఏపీలో కొలువుదీరెందుకు మార్గం సుగమమైంది.

కియా కారెన్స్…
నిజానికి ఈ ఆటోమొబైల్ కంపెనీ దక్షిణ కొరియాది. హ్యుండాయ్ కి అనుబంధ సంస్థగా వచ్చింది.
కియా కారెన్స్ కారు విషయానికొస్తే, ఇదొక ఎస్‌యూవీ. స్పోర్టినెస్ అలానే లగ్జరీ దీని ప్రత్యేకత. సౌకర్యవంతంగా ఉండటమే కాక మూడు వరుసల సీటింగ్ కెపాసిటితో విలాసవంతంగా ఉంటుంది. ఇందులో నెక్స్ట్- జెన్ కియా కనెక్ట్‌తోపాటు హెచ్ డి టచ్‌స్క్రీన్ నావిగేషన్, 8 స్పీకర్లతో కూడిన బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లున్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

Kia the 'Indian Car of the Year 2023
Kia the ‘Indian Car of the Year 2023

ప్రస్తుతం ఇది స్మార్ట్ స్ట్రీమ్ 1.5 పెట్రోల్, 1.4 టి-జిడిఐ పెట్రోల్, 1.5 సిఆర్ డిఐ విజిటి డీజిల్ వంటి మూడు ఎంపికలతో డిజైన్ చేయబడింది. 6-సీటర్, 7-సీటర్ ఎంపిక కూడా ఉంది.

ఆటోమొబైల్ రంగానికి సంంధించి ఆటోమోటివ్ అవార్డులు అనేవి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనవి.. ఆటోమోటివ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏజెఏఐ) ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రక్రియ జరిగింది. ఈ అవార్డులను భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ఆస్కార్‌గా భావిస్తోంది. అనుభవజ్ఞులైన జ్యూరీ సభ్యులు ఇందులో న్యాయనిర్ణేతలుగా ఉండి, విజేతను ఎంపిక చేస్తారు. ఆ ప్రకారం, ప్రధానంగా
ప్రొడక్ట్ విలువ, ఇంధన సామర్థ్యం, పనితీరు, నడిపే సౌలభ్యం, భద్రతా, ప్రాక్టికాలిటీ, సాంకేతికత పనితీరు.. భారతీయ డ్రైవింగ్ పరిస్థితులకు అనుకూలత వంటి ప్రమాణాలను ఆధారంగా చేసుకొని ఎంపిక ఉంటుంది.

ఇతారాంశాలు…


ఈ అవార్డును ప్రకటించిన తర్వాత, కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ తే-జిన్ పార్క్..
ఇది కియా బ్రాండ్ కు తగిన గుర్తింపుగా తాము భావిస్తున్నట్లు చెప్పారు. ముందుగా కియా ప్లాంట్‌ను గుజరాత్‌లోనే పెట్టాల్సిందిగా నేరుగా ప్రధాని కార్యాలయం నుంచి ఆ సంస్థ యాజమాన్యంపై ఒత్తిడి వచ్చింది. కియో మోటార్స్ కోసం అప్పట్లో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలు తెగ పోటీ పడ్డాయి. కానీ కియా నిర్వాహకులు మాత్రం ఏపీవైపే మొగ్గుచూపడం విశేషం. ప్రారంభంలో రూ.13,500 కోట్ల పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందని దానితో పాటు అనేక అనుబంధ పరిశ్రమలు సైతం వచ్చాయన్నారు చంద్రబాబు.


భారత్‌లో అత్యంత ప్రాచుర్యం కలిగిన ఐదో బ్రాండ్ కియా మోటార్స్… అంతేకాకుండా మూడు లక్షల యూనిట్లను తయారు చేయాలని కియా భవిష్యత్తు లక్ష్యంగా పెట్టుకుందట.


కియా సంస్థ ఏడాదికి 3 ల‌క్ష‌ల కార్లు త‌యారు చేస్తుంద‌ని, రాబోయే రోజుల్లో 10 ల‌క్ష‌ల కార్లు త‌యారు చేసే అవ‌కాశం ఉంది. కంపెనీ ఇక్క‌డ ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల 4 వేల మందికి శాశ్వ‌త, 7 వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలు లభించాయి.
ఈ పరిశ్రమలో భాగంగా పనులు శరవేగంగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, భూములిచ్చిన రైతుల పాత్ర ఉంది. ఈ విషయం తెలిశాక ఏపీకి చెందిన రాజకీయ నేతలు, ప్రభుత్వ పెద్దలు కూడా కియాను అభినందిస్తున్నాయి.

Show More
Back to top button