Telugu News

కన్నుమూసిన కమ్యూనిస్టు యోధుడు..

ఆయన మరణం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు సీపీఎం అగ్రనేత, ప్రముఖ వామపక్ష బావజాలి, బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యార్థి దశలోనే ప్రధాని ఎదుట నిలబడి రాజీనామా చేయాలనీ డిమాండ్ పత్రాన్ని చదివిన బహు ధైర్యశాలి.. సీపీఎం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారామ ఏచూరి. ఆయన మరణ వార్త యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. సీపీఐ (ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతిపట్ల యావత్ దేశం, కమ్యూనిస్టు యోధులు, కమ్యూనిస్టు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

విద్యావేత్తగా ఉన్న ఏచూరి సీపీఎం పార్టీలో చేరి క్రియాశీలంగా నిలిచారు. అనేక ప్రజా, కార్మికోద్యమాలకు నాయకత్వం వహించారు. దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీపీఎం, అనుబంధ ప్రజా సంఘాల్లో ఎన్నో పదవులు చేపట్టి అంచెలంచెలుగా దేశ నాయకుడిగా ఎదిగాడు. బలమైన రాజకీయ నాయకున్ని దేశం కోల్పోయింది. ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు.

దేశ రాజకీయాల్లో సీతారాం ఏచూరి తనదైన శైలిలో పాత్ర పోషించారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు చేసిన ఘనత ఆయనది. విద్యార్థి నేతగా, రాజ్యసభ సభ్యుడిగా అనేక సేవలందించారు. దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు సీతారాం.

కమ్యూనిస్టు యోధుడు  సీతారం ఏచూరి చాలాకాలంగా నిమోనియాతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో  చికిత్స పొందుతూ.. సెప్టెంబర్ 12, 2024 గురువారం ఆయన తుది శ్వాస విడిచారు. 1952లో మద్రాస్ లో జన్మించిన ఆయన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు సర్వేశ్వర సోమయాజి ఏచూరి, తల్లి కల్పకం. వారి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కంద మేనల్లుడు ఏచూరి సీతారాం. ఢిల్లీ ఎస్టేట్ పాఠశాలలో విద్యను అభ్యసించి సీబీఎస్ఈ పరీక్షల్లో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.

సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బిఏ ఆర్థిక శాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలో ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణులయ్యాడు సీతారాం. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టు అయ్యారు. అనంతరం జేఎన్యు పీహెచ్డీలో చేరినప్పటికీ  డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. యువకుడిగా ఉన్నప్పటి నుంచి విప్లవ భావజాలం వైపు ఆకర్షకుడిగా మారిన ఏచూరి చిన్న వయసులోనే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయడం ప్రారంభించారు. 1969 లో తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీ స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఢిల్లీలోనే ఎకనామిక్స్ లో పిహెచ్డి పూర్తి చేశారు. యువకుడిగా ఎస్ఎఫ్ఐతో మొదలైన ఆయన ప్రయాణం సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఆ  పార్టీలో దేశంలోనే అత్యున్నత స్థానం అధిష్టించే వరకు తీసుకువెళ్లింది.

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో  బాధపడుతున్న ఆయన గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి సెప్టెంబర్ 12, 2024న తుది శ్వాస విడిచారు. ఈ దుర్వార్త కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నింపింది.

దేశ రాజకీయాల్లో సీతారాం ఏచూరి తనదైన శైలిలో పాత్ర పోషించారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు చేసిన ఘనత ఆయనది. విద్యార్థి నేతగా, రాజ్యసభ సభ్యుడిగా అనేక సేవలందించారు. దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు సీతారాం.

దేశవ్యాప్తంగా ఉద్యమకారులు, కమ్యూనిస్టు యోధులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు సీతారాం మరణ వార్త విని శోకసంద్రంలో మునిగారు. ఆ మహానేతకు ఆశ్రునయనాలతో నివాళులర్పించారు.

జీవితకాలం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి పేదల పక్షాన దేశ స్థాయిలో గళం వినిపించిన వ్యక్తి ఏచూరి. దేశ రాజకీయాల్లోఆయన లేని లోటు తీర్చలేనిది.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్దిద్దాం..!

Show More
Back to top button