
పెట్టుబడుల్లో అద్భుతమైన ఒక మార్గం స్టాక్ మార్కెట్. ఇందులో పెట్టుబడి సూత్రాలు తెలుసుకుంటే రాజ్యం ఏలవచ్చు అని ఎందరో ఇన్వెస్టర్లు చెప్పారు. అయితే, ఈరోజు మనం ప్రముఖ ఇన్వెస్టర్స్ పాటించే పెట్టుబడి సూత్రాలు ఏంటో తెలుసుకుందాం. మీరు అవి ఫాలో అయ్యి పెట్టుబడుల ప్రయాణం ప్రారంభించండి.
ఒకటో సూత్రం
క్రమశిక్షణ: జీవితంలో ఏది సాధించాలన్నా క్రమశిక్షణ చాలా అవసరం. ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఓపిక చాలా అవసరం. ఎందుకంటే ఇది చిన్న పిల్లల ఆట కాదు. మీరు క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం డబ్బు పొందవచ్చు.
రెండో సూత్రం
రీసెర్చ్ చేయడం: ఎంత రీసెర్చ్ చేసి పెట్టుబడి పెడతారో.. అంత మంచిది. ఎందుకంటే ఒక కంపెనీ ఈక్విటీలో పెట్టుబడులు పెడుతున్నారంటే ఆ కంపెనీలో భాగస్వాములు అవుతున్నట్లు లెక్క. కాబట్టి, మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీ గురించి బాగా రీసెర్చ్ చేయడం అవసరం.
మూడో సూత్రం
తిరస్కరించడం: పెట్టుబడి పెట్టడానికి స్టాక్ మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి. కానీ, అన్నిటిలో ఇన్వెస్ట్ చేయలేము కదా..! మీకు సరైనది అని అనిపిస్తేనే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే డబ్బు కోల్పోవాల్సి వస్తుంది.
నాలుగో సూత్రం
భావోద్వేగాలకు లొంగకపోవడం: చాలామంది ఒక బ్రాండ్ మీద ఇష్టంతో దాని షేర్‌లు కొంటూ ఉంటారు. ఆ కంపెనీ నష్టపోతున్న కూడా దాన్ని షేర్లు అమ్మరు. దీనివల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరైన సమయానికి స్టాక్ కొనడం ఎంత ముఖ్యమో.. అమ్మడం కూడా అంతే ముఖ్యం.
ఐదో సూత్రం
అప్డేటెడ్‌గా ఉండటం: ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం వల్ల స్టాక్ మార్కెట్ ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. వీలైనన్ని పుస్తకాలు, వార్తలు చదవాలని ప్రుముఖ ఇన్వె