Telugu Politics

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంటీడీపీ కంచుకోటను వైసీపీ బద్దలు చేస్తుందా?

1983 నుంచి కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటలా మారింది. 1983 నుంచి 2019 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీనే గెలుస్తూ వస్తోంది. 1983లో రంగస్వామి నాయుడు విజయం సాధించగా.. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019లో నారా చంద్రబాబు నాయుడు గెలిచారు. వరుసగా ఏడు సార్లు గెలిచిన ఆయన ఇప్పుడు మరోసారి బరిలో నిలిచారు. మరోవైపు 2024 ఎన్నికల్లో కుప్పంలో పాగా వేయాలని వైసీపీ వ్యూహాలు రచించింది. కేఎస్ భరత్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.

చంద్రబాబుపై గెలిస్తే భరత్‌కు మంత్రి పదవి ఇస్తామని కూడా వైసీపీ అధినేత జగన్ ఆఫర్ ఇచ్చారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీకి వైసీపీ చెక్ పెట్టింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో వరుసగా 8 సార్లు గెలిచిన టీడీపీ 9వ సారి గెలుస్తుందా లేదా టీడీపీ విజయాలకు వైసీపీ బ్రేక్ వేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Show More
Back to top button